< I Tesaloniczan 3 >
1 Przeto nie mogąc dłużej znosić, upodobało się nam, abyśmy sami w Atenach zostali.
౧కాబట్టి ఇక ఆగలేక ఏతెన్సులో మేము ఒంటరిగానైనా ఉండడం మంచిదే అని నిశ్చయించుకుని
2 I posłaliśmy Tymoteusza, brata naszego i sługę Bożego, i pomocnika naszego w Ewangielii Chrystusowej, aby was utwierdził i napominał z strony wiary waszej.
౨ఈ హింసల మూలంగా మీలో ఎవరూ చెదరిపోకుండా విశ్వాసం విషయంలో మిమ్మల్ని ఆదరించడానికీ బలపరచడానికీ మన సోదరుడూ క్రీస్తు సువార్త విషయంలో దేవుని సేవకుడూ అయిన తిమోతిని మీ దగ్గరికి పంపించాం.
3 Aby się żaden nie poruszał w tych uciskach; gdyż sami wiecie, żeśmy na to wystawieni.
౩ఈ కష్టాలు అనుభవించాలని దేవుడే నియమించాడని మీకు తెలుసు.
4 Albowiem gdyśmy byli u was, opowiadaliśmy wam, żeśmy mieli być uciśnieni, jakoż się też to stało, i wiecie o tem.
౪మేము మీ దగ్గర ఉన్నప్పుడు “మనం హింసలు పొందాలి” అని ముందుగానే మీతో చెప్పాం కదా! మీకు తెలిసినట్టుగానే ఇప్పుడు అలా జరుగుతూ ఉంది.
5 Dlatego i ja, nie mogąc tego dłużej znosić, posłałem go, abym się dowiedział o wierze waszej, by was snać nie kusił ten, co kusi, a nie była daremna praca nasza.
౫అందుకే ఇక నేను కూడా ఉండబట్టలేక ఒకవేళ దుష్ట ప్రేరకుడు మిమ్మల్ని ప్రేరేపించాడేమో అనీ, మా ప్రయాస అంతా వ్యర్థమైపోయిందేమో అనీ మీ విశ్వాసం ఎలా ఉందో తెలుసుకోడానికి తిమోతిని పంపాను.
6 Lecz teraz Tymoteusz od was do nas przyszedł i zwiastował nam wesołą nowinę o wierze i miłości waszej, a iż nas zawsze dobrze wspominacie, żądając nas widzieć, tak jako i my was.
౬ఇప్పుడు అతడు మీ దగ్గర నుండి తిరిగి వచ్చి క్రీస్తు పట్ల మీ విశ్వాస ప్రేమలను గురించీ, మేము మిమ్మల్ని చూడాలని ఆశ పడుతున్నట్టే మీరు కూడా మమ్మల్ని చూడాలని ఆశ పడుతున్నారనీ, మమ్మల్ని ఎప్పుడూ ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటున్నారనీ మీ గురించి సంతోషకరమైన వార్త అతడు తీసుకుని వచ్చాడు.
7 Dlatego pocieszeni jesteśmy, bracia! z was w każdym utrapieniu i potrzebie naszej przez wiarę waszę;
౭అందుచేత సోదరులారా, మీ విశ్వాసం చూసి మా ఇబ్బందులన్నిటిలో హింసలన్నిటిలో ఆదరణ పొందాం.
8 Bo teraz my żyjemy, jeźli wy stoicie w Panu.
౮ఎందుకంటే మీరు ప్రభువులో నిలకడగా ఉంటే మా జీవితం సార్థకం అయినట్టే.
9 Albowiem jakież dziękowanie możemy Bogu oddać za was za wszelkie wesele, którem się weselimy dla was przed Bogiem naszym?
౯మీ గురించీ, దేవుని ఎదుట మీ విషయంలో మాకు కలిగే ఆనందం గురించి దేవునికి మేము ఏమని కృతజ్ఞతలు చెల్లించగలం?
10 W nocy i we dnie bardzo się gorliwie modląc, abyśmy oglądali oblicze wasze i dopełnili niedostatków wiary waszej.
౧౦మీ ముఖాలు చూడాలనీ, మీ విశ్వాసంలో కొరతగా ఉన్నవాటిని సరిచేయాలనీ రాత్రింబగళ్ళు తీవ్రంగా ప్రార్థనలో వేడుకుంటున్నాం
11 Lecz sam Bóg i Ojciec nasz, i Pan nasz, Jezus Chrystus, niech wyprostuje drogę naszę do was;
౧౧మన తండ్రి అయిన దేవుడూ, మన ప్రభు యేసూ మమ్మల్ని మీ దగ్గరికి ఎలాంటి ఆటంకం లేకుండా తీసుకువస్తాడు గాక!
12 A was Pan niech pomnoży i obfitującymi uczyni w miłości jednego ku drugiemu, i ku wszystkim, jako i nas ku wam,
౧౨మీ పట్ల మా ప్రేమ ఎలా అభివృద్ధి చెందుతూ వర్ధిల్లుతూ ఉన్నదో అలాగే మీరు కూడా ఒకరిపట్ల ఒకరు, ఇంకా, అందరి పట్ల కూడా ప్రేమలో అభివృద్ధి చెంది వర్ధిల్లేలా ప్రభువు అనుగ్రహించు గాక.
13 Aby utwierdzone były serca wasze nienaganione w świętobliwości przed Bogiem i Ojcem naszym, na przyjście Pana naszego, Jezusa Chrystusa, ze wszystkimi świętymi jego.
౧౩మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో కలిసి వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయాలు పరిశుద్ధత విషయంలో నిందారహితంగా ఉండేలా ఆయన స్థిరపరచు గాక!