< I Kronik 3 >
1 Cić są synowie Dawidowi, którzy mu się urodzili w Hebronie: Pierworodny Ammon z Achynoamy Jezreelitki; wtóry Danijel z Abigaili Karmelitki;
౧దావీదుకు హెబ్రోనులో పుట్టిన కొడుకులు వీళ్ళు: పెద్దకొడుకు పేరు అమ్నోను. ఇతని తల్లి అహీనోయము. ఈమెది యెజ్రెయేలు పట్టణం. రెండవ వాడు దానియేలు. ఇతని తల్లి పేరు అబీగయీలు. ఈమెది కర్మెల్ గ్రామం.
2 Trzeci Absalom, syn Maachy, córki Tolmaja, króla Giessur; czwarty Adonijasz, syn Haggity;
౨మూడవ వాడు అబ్షాలోము. ఇతని తల్లి పేరు మయకా. ఈమె గెషూరు దేశానికి రాజు తల్మయి కూతురు. నాలుగో వాడు అదోనీయా. ఇతని తల్లి పేరు హగ్గీతు.
3 Piąty Sefatyjasz z Abitaili; szósty Jetraam z Egli, żony jego.
౩అయిదోవాడు షెఫట్య. ఇతని తల్లి పేరు అబీటలు. ఆరోవాడు ఇత్రెయాము. ఇతని తల్లి ఎగ్లా.
4 Tych sześć urodziło mu się w Hebronie, kędy królował przez siedm lat, i przez sześć miesięcy; a trzydzieści i trzy lata królował w Jeruzalemie.
౪ఈ ఆరుగురూ అతనికి హెబ్రోనులో పుట్టారు. ఇక్కడ దావీదు ఏడు సంవత్సరాల ఆరు నెలలు పరిపాలించాడు. యెరూషలేములో అతడు ముప్ఫై మూడు సంవత్సరాలు పరిపాలించాడు.
5 A ci urodzili mu się w Jeruzalemie; Samna, i Sobab, i Natan, i Salomon, cztery synowie z Betsui, córki Ammielowej;
౫యెరూషలేములో అతనికి అమ్మీయేలు కూతురు బత్షెబ వల్ల షిమ్యా, షోబాబు, నాతాను, సొలొమోను అనే నలుగురు కొడుకులు పుట్టారు.
6 I Ibchar, i Elisama, i Elifet;
౬దావీదుకి కలిగిన మిగిలిన తొమ్మిదిమంది కొడుకుల పేర్లు ఏమిటంటే, ఇభారు, ఎలీషామా, ఎలీపేలెటు,
7 I Noge, i Nefeg, i Jafija;
౭నోగహు, నెపెగు, యాఫీయ,
8 I Elizama, i Elijada, i Elifelet, dziewięć synów.
౮ఎలీషామా, ఎల్యాదా, ఎలీపేలెటు అనే వాళ్ళు.
9 A cić wszyscy są synowie Dawidowi, oprócz synów z założnic; a Tamar była siostra ich.
౯వీళ్ళంతా దావీదు కొడుకులు, అతని ఉంపుడుకత్తెల వల్ల కలిగిన సంతానం కాదు. వీళ్ళందరికీ సోదరి తామారు.
10 Syn Salomonowy Roboam; Abiam syn jego, Aza syn jego, Jozafat syn jego.
౧౦సొలొమోను కొడుకు రెహబాము, రెహబాము కొడుకు అబీయా. అబీయా కొడుకు ఆసా. ఆసా కొడుకు యెహోషాపాతు.
11 Joram syn jego, Ochozyjasz syn jego, Joaz syn jego;
౧౧యెహోషాపాతు కొడుకు యెహోరాము. యెహోరాము కొడుకు అహజ్యా. అహజ్యా కొడుకు యోవాషు.
12 Amazyjasz syn jego, Azaryjasz syn jego, Joatam syn jego;
౧౨యోవాషు కొడుకు అమజ్యా. అమజ్యా కొడుకు అజర్యా. అజర్యా కొడుకు యోతాము.
13 Achaz syn jego, Ezechyjasz syn jego, Manases syn jego;
౧౩యోతాము కొడుకు ఆహాజు. ఆహాజు కొడుకు హిజ్కియా. హిజ్కియా కొడుకు మనష్షే.
14 Amon syn jego, Jozyjasz syn jego;
౧౪మనష్షే కొడుకు ఆమోను. ఆమోను కొడుకు యోషీయా.
15 A synowie Jozyjaszowi: Pierworodny Johanan, wtóry Joakim, trzeci Sedekijasz, czwarty Sellum.
౧౫యోషీయా కొడుకులెవరంటే పెద్దవాడు యోహానాను, రెండోవాడు యెహోయాకీము, మూడోవాడు సిద్కియా, నాలుగోవాడు షల్లూము.
16 A synowie Joakimowi: Jechonijasz syn jego, Sedekijasz syn jego.
౧౬యెహోయాకీము కొడుకు యెకొన్యా. అతని కొడుకు సిద్కియా ఆఖరి రాజు.
17 A synowie Jechonijasza więźnia: Salatyjel syn jego.
౧౭యెకొన్యా కొడుకులు అసీరు, షయల్తీయేలు,
18 A salatyjelowi: Malchiram, i Fadajasz, i Seneser, Jekiemija, Hosama, i Nadabija.
౧౮మల్కీరాము, పెదాయా, షెనజ్జరు, యెకమ్యా, హోషామా, నెదబ్యా.
19 A synowie Fadajaszowi: Zorobabel, i Semej; a syn Zorobabelowy Mesollam, i Hananijasz, i Selomit, siostra ich.
౧౯పెదాయా కొడుకులు జెరుబ్బాబెలు, షిమీ. జెరుబ్బాబెలు కొడుకులు మెషుల్లాము, హనన్యా. వీళ్ళ సోదరి షెలోమీతు.
20 A Mesollamowi: Hasuba, i Ohol, i Barachyjasz, i Hazadyjasz Josabchesed, pięć synów.
౨౦అతనికి ఇంకో ఐదుగురు కొడుకులున్నారు. వాళ్ళు హషుబా, ఓహెలు, బెరెక్యా, హసద్యా, యూషబ్హెసేద్.
21 A syn Hananijaszowy: Faltyjasz, i Jesajasz; synowie Rafajaszowi, synowie Arnanaszowi, synowie Obadyjaszowi, synowie Sechenijaszowi.
౨౧హనన్యా వారసులు పెలట్యా, యెషయా, రెఫాయా కొడుకులు, అర్నాను కొడుకులు, ఓబద్యా కొడుకులు, షెకన్యా కొడుకులు.
22 A synowie Sechenijaszowi: Semejasz; a synowie Semejaszowi: Chattus, i Igal, i Baryja, i Naaryjasz, i Safat; sześć synów.
౨౨షెకన్యా కొడుకుల్లో షేమయా అనేవాడున్నాడు. షెమయాకు ఆరుగురు కొడుకులున్నారు. వాళ్ళెవరంటే, హట్టూషు, ఇగాలు, బారియహూ, నెయర్యా, షాపాతు.
23 A synowie Naaryjaszowi: Elijenaj, i Ezechyjasz, i Esrykam, trzej synowie.
౨౩నెయర్యాకు ముగ్గురు కొడుకులున్నారు. వాళ్ళు ఎల్యోయేనై, హిజ్కియా, అజ్రీకాము.
24 A synowie Elijenajego: Hodawijasz i Elijasub, i Felejasz, i Akkub, i Jochanan, i Dalajasz, i Anani, siedm synów.
౨౪ఎల్యోయేనైకి ఏడుగురు కొడుకులున్నారు. వాళ్ళు హోదవ్యా, ఎల్యాషీబు, పెలాయా, అక్కూబు, యోహానాను, దెలాయా, అనానీ.