< Jana 1 >
1 Na początku było Słowo. Było ono u Boga i było Bogiem.
౧ప్రారంభంలో వాక్కు ఉన్నాడు. ఆ వాక్కు దేవుడి దగ్గర ఉన్నాడు. ఆ వాక్కు దేవుడే.
2 Od samego początku było razem z Bogiem.
౨ఆ వాక్కు ప్రారంభంలో దేవుడితో ఉన్నాడు.
3 Ono powołało wszystko do istnienia. I nic, co zostało stworzone, nie zaistniało bez Niego.
౩సృష్టి అంతా ఆ వాక్కు ద్వారానే కలిగింది. ఉనికిలో ఉన్న వాటిలో ఏదీ ఆయన లేకుండా కలగలేదు.
4 W Nim było życie, a życie jest dla ludzi światłem.
౪ఆయనలో జీవం ఉంది. ఆ జీవం సమస్త మానవాళికీ వెలుగుగా ఉంది.
5 To Światło świeci w ciemnościach, a mrok nie był w stanie Go pochłonąć.
౫ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది. చీకటి ఆ వెలుగును లొంగదీసుకోలేక పోయింది.
6 Bóg posłał swojego człowieka, imieniem Jan,
౬దేవుని దగ్గర నుండి వచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు యోహాను.
7 aby powiedział ludziom o prawdziwym Świetle i aby dzięki niemu wszyscy uwierzyli.
౭అందరూ తన ద్వారా ఆ వెలుగును నమ్మడం కోసం అతడు ఆ వెలుగుకు సాక్షిగా ఉండడానికి వచ్చాడు.
8 Sam Jan nie był Światłem, lecz miał o Nim opowiedzieć.
౮ఈ యోహానే ఆ వెలుగు కాదు. కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు.
9 I nadeszło prawdziwe Światło, które oświeca każdego człowieka, przychodzącego na świat.
౯లోకంలోకి వస్తున్న నిజమైన వెలుగు ఇదే. ఈ వెలుగు ప్రతి వ్యక్తినీ వెలిగిస్తూ ఉంది.
10 Pojawiło się na świecie, który dzięki Niemu powstał, ale świat Go nie rozpoznał.
౧౦లోకం అంతా ఆయన ద్వారానే కలిగింది. ఆయన లోకంలో ఉన్నాడు. అయినా లోకం ఆయనను తెలుసుకోలేదు.
11 Przyszło do swojej własności, ale swoi Go nie przyjęli.
౧౧ఆయన తన సొంత ప్రజల దగ్గరికి వచ్చాడు. కానీ వారు ఆయనను స్వీకరించలేదు.
12 Tym jednak, którzy Je przyjęli, i uwierzyli Mu dało prawo stać się dziećmi Bożymi,
౧౨తనను ఎవరెవరు అంగీకరించారో, అంటే తన నామంలో నమ్మకం ఉంచారో, వారికందరికీ దేవుని పిల్లలు అయ్యే హక్కును ఆయన ఇచ్చాడు.
13 które narodziły się nie fizycznie —w wyniku namiętności czy ludzkich planów—ale z Boga.
౧౩వారంతా దేవుని వలన పుట్టినవారే గాని, వారి పుట్టుకకు రక్తమూ, శరీర వాంఛలూ, మనుషుల ఇష్టాలూ కారణం కానే కావు.
14 Słowo stało się ciałem i jako człowiek zamieszkało wśród nas. Ujrzeliśmy więc Jego chwałę—chwałę, jaką Ojciec obdarzył swojego jedynego Syna, pełnego łaski i prawdy.
౧౪ఆ వాక్కు శరీరంతో మన మధ్య కృపా సత్యాల సంపూర్ణ స్వరూపంగా నివసించాడు. తండ్రి నుండి వచ్చిన ఏకైక కుమారునికి ఉండే మహిమలాగా ఉన్న ఆయన మహిమను మేము చూశాము.
15 Jan Chrzciciel powiedział o Nim, wołając do zebranych wokół niego ludzi: —To właśnie o Nim mówiłem: „Nadchodzi ktoś większy ode mnie, bo istniał wcześniej niż ja!”.
౧౫యోహాను ఆయనను గురించి పెద్ద స్వరంతో ఇలా సాక్ష్యం చెప్పాడు, “నా వెనుక వచ్చేవాడు నాకు ముందే ఉన్నవాడు కాబట్టి ఆయన నాకంటే గొప్పవాడు, అంటూ నేను ఎవరిని గురించి చెప్పానో ఆయనే ఈయన.”
16 Z Jego bogactwa wszyscy otrzymaliśmy wiele łask.
౧౬ఆయన సంపూర్ణతలో నుండి మనమందరం కృప తరువాత కృపను పొందాం.
17 Mojżesz dał nam Prawo, natomiast dzięki Jezusowi Chrystusowi nadeszła łaska i prawda.
౧౭మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కృప, సత్యం యేసు క్రీస్తు మూలంగా కలిగాయి.
18 Boga nikt nigdy nie widział, a pokazał Go nam Jedyny Syn—Bóg, który stanowi jedno z Ojcem.
౧౮దేవుణ్ణి ఇంతవరకూ ఎవరూ చూడలేదు. తండ్రిని అనునిత్యం హత్తుకుని ఉండే దేవుడైన ఏకైక కుమారుడే ఆయనను వెల్లడి చేశాడు.
19 Żydowscy przywódcy z Jerozolimy wysłali do Jana Chrzciciela kapłanów i ich pomocników z pytaniem: —Kim właściwie jesteś?
౧౯యెరూషలేము నుండి యూదులు, “నువ్వు ఎవరు?” అని యోహానును అడగడానికి యాజకుల నుండీ లేవీయుల నుండీ కొందరిని పంపించారు. అప్పుడు అతడు ఇదే సాక్ష్యం ఇచ్చాడు.
20 Wtedy on jednoznacznie i dobitnie odpowiedział: —Nie jestem Mesjaszem!
౨౦అతడు, “నాకు తెలియదు” అనకుండా, “నేను క్రీస్తును కాదు” అంటూ ఒప్పుకున్నాడు.
21 —No to kim? Eliaszem?—pytali. —Nie. —To może prorokiem? —Też nie—odpowiedział Jan.
౨౧కాబట్టి వారు, “అయితే నువ్వు ఎవరివి? ఏలీయావా?” అంటే అతడు, “కాదు” అన్నాడు. “నువ్వు ప్రవక్తవా?” అని అడిగితే కాదని జవాబిచ్చాడు.
22 —Kim więc jesteś? Co mamy powiedzieć tym, którzy nas wysłali? Co możesz o sobie powiedzieć?—dopytywali go.
౨౨దాంతో వారు, “అయితే అసలు నువ్వు ఎవరివి? మమ్మల్ని పంపిన వారికి మేమేం చెప్పాలి? అసలు నీ గురించి నువ్వేం చెప్పుకుంటున్నావ్?” అన్నారు.
23 —Jak powiedział prorok Izajasz: „Jestem głosem wołającego na pustyni: Przygotujcie Panu drogę!”—odrzekł Jan.
౨౩దానికి అతడు, “యెషయా ప్రవక్త పలికినట్టు నేను, ‘ప్రభువు కోసం దారి తిన్నగా చేయండి’ అని అరణ్యంలో బిగ్గరగా కేక పెట్టే ఒక వ్యక్తి స్వరాన్ని” అన్నాడు.
24 Niektórzy wysłannicy, należący do ugrupowania faryzeuszy,
౨౪అలాగే అక్కడ పరిసయ్యులు పంపిన కొందరున్నారు.
25 zapytali go: —Dlaczego więc chrzcisz, skoro nie jesteś ani Mesjaszem, ani Eliaszem, ani prorokiem?
౨౫వారు, “నువ్వు క్రీస్తువు కావు, ఏలీయావు కావు, ప్రవక్తవూ కావు. అలాంటప్పుడు మరి బాప్తిసం ఎందుకు ఇస్తున్నావు?” అని అడిగారు.
26 —Ja zanurzam tylko w wodzie—odparł Jan. —Lecz niebawem nadejdzie ktoś, kto już jest wśród was, ale na razie nie dał się wam poznać. Ja nie jestem nawet godzien zdjąć Mu butów!
౨౬దానికి యోహాను, “నేను నీళ్లలో బాప్తిసం ఇస్తున్నాను. కాని మీ మధ్య మీరు గుర్తించని వ్యక్తి నిలిచి ఉన్నాడు.
౨౭నా వెనుక వస్తున్నది ఆయనే. నేను ఆయన చెప్పుల పట్టీ విప్పడానికి కూడా యోగ్యుణ్ణి కాదు” అని వారితో చెప్పాడు.
28 Miało to miejsce po drugiej stronie Jordanu, w Betanii, gdzie Jan udzielał ludziom chrztu.
౨౮ఈ విషయాలన్నీ యొర్దాను నదికి అవతల వైపు ఉన్న బేతనీలో జరిగాయి. ఇక్కడే యోహాను బాప్తిసం ఇస్తూ ఉండేవాడు.
29 Następnego dnia Jan ujrzał nadchodzącego Jezusa i rzekł: —Oto Baranek, którego Bóg złoży w ofierze, aby usunąć grzech świata!
౨౯మరుసటిరోజు యేసు యోహాను దగ్గరికి వచ్చాడు. ఆయనను చూసి యోహాను ఇలా అన్నాడు, “చూడండి, లోకపాపాన్ని తీసివేసే దేవుని గొర్రెపిల్ల!
30 To Jego miałem na myśli mówiąc, że „nadchodzi ktoś większy ode mnie, bo istniał wcześniej niż ja!”.
౩౦‘నా వెనక వచ్చేవాడు నాకు ముందే ఉన్నవాడు కాబట్టి ఆయన నాకంటే గొప్పవాడు’ అంటూ నేను ఎవరి గురించి చెప్పానో ఆయనే ఈయన.
31 Nie wiedziałem, że to On, ale po to właśnie przyszedłem i zacząłem chrzcić ludzi, aby ogłosić Izraelowi Jego nadejście.
౩౧నేను ఆయనను గుర్తించలేదు, కానీ ఆయన ఇశ్రాయేలు ప్రజలకు వెల్లడి కావాలని నేను నీళ్ళలో బాప్తిసం ఇస్తూ వచ్చాను.”
32 Jan kontynuował: —Widziałem Ducha, który zstąpił na Niego z nieba jak gołąb.
౩౨యోహాను ఇంకా సాక్షమిస్తూ, “ఆత్మ ఒక పావురంలా ఆకాశం నుండి దిగి వచ్చి ఆయనపై నిలిచి పోవడం చూశాను.
33 Nie wiedziałem, że to On, ale Bóg, który mnie posłał, abym zanurzał ludzi w wodzie, powiedział: „Ten, na którego zstąpi Duch i spocznie na Nim, będzie zanurzał ludzi w Duchu Świętym”.
౩౩నేను ఆయనను గుర్తు పట్టలేదు. కాని ‘ఎవరి మీద ఆత్మ దిగివచ్చి నిలిచిపోవడం చూస్తావో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చేవాడు’ అని నీళ్ళలో బాప్తిసం ఇవ్వడానికి నన్ను పంపినవాడు నాకు చెప్పాడు.
34 Widziałem to i dlatego oświadczam, że On jest Synem Boga!
౩౪ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకున్నాను, సాక్షం ఇచ్చాను.”
35 Następnego dnia Jan stał z dwoma uczniami.
౩౫మరుసటి రోజు యోహాను తన శిష్యులు ఇద్దరితో నిలబడి ఉన్నాడు.
36 Gdy zobaczył idącego Jezusa, powiedział: —Oto Baranek, którego Bóg złoży w ofierze!
౩౬అప్పుడు యేసు అక్కడ నడిచి వెళ్తుంటే యోహాను ఆయన వైపు చూసి, “ఇదిగో, చూడండి, దేవుని గొర్రెపిల్ల” అన్నాడు.
37 Obaj uczniowie usłyszeli to i poszli za Jezusem.
౩౭అతడు చెప్పిన మాట విని ఆ యిద్దరు శిష్యులు యేసు వెనకే వెళ్ళారు.
38 On obejrzał się i widząc, że za Nim idą, zapytał: —Czego szukacie? —Rabbi! (to znaczy: „Nauczycielu!”). Gdzie się zatrzymałeś na nocleg?—zapytali.
౩౮యేసు వెనక్కి తిరిగి, వారు తన వెనకాలే రావడం చూసి, “మీకేం కావాలి?” అని అడిగాడు. వారు, “రబ్బీ, (రబ్బీ అనే మాటకు బోధకుడు అని అర్థం) నువ్వు ఎక్కడ ఉంటున్నావ్?” అని అడిగారు.
39 —Chodźcie i zobaczcie—odpowiedział Jezus. Poszli więc z Nim, a ponieważ było już około czwartej po południu, zostali u Niego do końca dnia.
౩౯ఆయన, “వచ్చి చూడండి” అన్నాడు. వారు వచ్చి ఆయన ఉంటున్న స్థలం చూశారు. అప్పటికి సాయంత్రం నాలుగు గంటలైంది. దాంతో వారు ఆ రోజుకి ఆయనతో ఉండిపోయారు.
40 Jednym z nich był Andrzej, brat Szymona Piotra.
౪౦యోహాను మాట విని ఆయన వెనకాల వెళ్ళిన ఇద్దరిలో ఒకరు అంద్రెయ. ఇతడు సీమోను పేతురు సోదరుడు.
41 Odszukał on później Szymona i powiedział: —Znaleźliśmy Mesjasza! (to znaczy: „Chrystusa”).
౪౧ఇతడు అన్నిటికంటే ముందు తన సోదరుడైన సీమోనును వెతికి పట్టుకుని, అతనితో, “మేము మెస్సీయను (మెస్సీయ అంటే క్రీస్తు అని అర్థం) కనుక్కున్నాం” అని చెప్పాడు.
42 I zaprowadził go do Jezusa, a On spojrzał na niego i rzekł: —Ty jesteś Szymon, syn Jana. Ale od teraz będziesz się nazywał Kefas (to znaczy: „Piotr”—„skała”).
౪౨యేసు దగ్గరికి అతణ్ణి తీసుకుని వచ్చాడు. యేసు అతణ్ణి చూసి, “నువ్వు యోహాను కొడుకువి, నీ పేరు సీమోను. నిన్ను ఇక కేఫా అని పిలుస్తారు” అన్నాడు (కేఫా అనే మాటకి పేతురు (రాయి) అని అర్థం).
43 Następnego dnia Jezus postanowił pójść do Galilei. Po drodze spotkał Filipa i rzekł do niego: —Chodź ze Mną.
౪౩మర్నాడు యేసు గలిలయకు వెళ్ళాలని బయలుదేరినప్పుడు ఫిలిప్పును చూశాడు. ఫిలిప్పుతో, “నా వెనకే రా” అన్నాడు.
44 Filip pochodził z Betsaidy, rodzinnego miasteczka Andrzeja i Piotra.
౪౪ఫిలిప్పు సొంత ఊరు బేత్సయిదా. అంద్రెయ, పేతురుల సొంత ఊరు కూడా అదే.
45 Spotkał on później Natanaela i powiedział mu: —Znaleźliśmy Tego, o którym pisał Mojżesz i prorocy! To Jezus, syn Józefa z Nazaretu!
౪౫ఫిలిప్పు నతనయేలును చూసి, “ధర్మశాస్త్రంలో మోషే, ప్రవక్తలూ ఎవరి గురించి రాశారో ఆ వ్యక్తిని మేము చూశాం. ఆయన నజరేతు వాడూ, యోసేపు కుమారుడూ అయిన యేసు” అని చెప్పాడు.
46 —Z Nazaretu?!—zdziwił się Natanael. —Czy stamtąd może pochodzić coś dobrego? —Sam się przekonaj!—odrzekł Filip.
౪౬దానికి నతనయేలు, “నజరేతులో నుండి మంచిదేమన్నా రాగలదా?” అన్నాడు. ఫిలిప్పు, “నువ్వే వచ్చి చూడు” అన్నాడు.
47 Gdy zbliżali się do Jezusa, On zobaczył Natanaela i powiedział: —Oto prawdziwy Izraelita, w którym nie ma fałszu.
౪౭నతనయేలు తన దగ్గరికి రావడం యేసు చూసి, “చూడండి. ఇతడు నిజమైన ఇశ్రాయేలీయుడు. ఇతనిలో ఎలాంటి కపటమూ లేదు” అన్నాడు.
48 —Skąd mnie znasz?—zdumiał się Natanael. —Widziałem cię pod drzewem figowym, zanim spotkał cię Filip—odrzekł Jezus.
౪౮అప్పుడు నతనయేలు, “నేను నీకెలా తెలుసు?” అన్నాడు. అందుకు యేసు, “ఫిలిప్పు నిన్ను పిలవక ముందు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను” అన్నాడు.
49 —Nauczycielu! Jesteś Synem Boga! Jesteś Królem Izraela!
౪౯దానికి నతనయేలు, “బోధకా, నువ్వు దేవుని కుమారుడివి! ఇశ్రాయేలు రాజువి నువ్వే” అని ఆయనకు బదులిచ్చాడు.
50 —Wierzysz w to, ponieważ powiedziałem, że widziałem cię, gdy byłeś pod drzewem figowym?—odparł Jezus. —Ujrzysz jeszcze więcej!
౫౦అందుకు యేసు, “ఆ అంజూరు చెట్టు కింద నిన్ను చూశానని చెప్పినందుకే నువ్వు నమ్మేస్తున్నావా? దీని కంటే గొప్ప విషయాలు చూస్తావు” అన్నాడు.
51 Zapewniam was: Zobaczycie otwarte niebo i aniołów Boga wstępujących i zstępujących na Mnie, Syna Człowieczego.
౫౧తరువాత యేసు ఇలా అన్నాడు, “నేను కచ్చితంగా చెప్పేదేమంటే, ఆకాశం తెరుచుకోవడం, దేవుని దూతలు మనుష్య కుమారుడి మీదుగా ఎక్కడం, దిగడం చేస్తూ ఉండడం మీరు చూస్తారు.”