< Psalms 137 >
1 KIT momoder ni kailan pilap en Papel o janejan, ni ni tamanda Jion.
౧మనం బబులోను నదుల దగ్గర కూర్చుని ఏడుస్తూ సీయోనును జ్ఞాపకం చేసుకున్నాం.
2 Kit lanadar at arp akan nin tuka kan, me mi waja o.
౨అక్కడ ఉన్న నిరవంజి చెట్ల కొమ్మలకు మన తంతివాయిద్యాలు తగిలించాం.
3 Pwe me jali kit edi inda, jen kaul, o jen pereperen ni at mamaiei: Komail wiai on kit kaul apot duen Jion.
౩మనలను బందీలుగా పట్టుకుని హింసిస్తున్నవాళ్ళు సీయోను కీర్తనల్లో ఒక పాట పాడండి, మేము విని ఆనందిస్తాం అన్నారు.
4 Iaduen at pan kak wiada kaul nil leowa nan jap en men wai?
౪మనం అన్యుల దేశంలో ఉంటూ యెహోవా కీర్తనలు ఎలా పాడగలం?
5 Ma i pan monoke uk ala Ierujalem, pa i pali maun ap pil pun monokinokla.
౫యెరూషలేమా, నేను నిన్ను మరచిపోతే నా కుడి చెయ్యి తన నైపుణ్యాన్ని కోల్పోతుంది గాక.
6 Lo i pan paj on pan natanat ai, ma i jolar pan taman uk adar, ma i jolar pan peren kida Ierujalem mon meakaroj.
౬నేను నిన్ను జ్ఞాపకం ఉంచుకోకపోతే, నాకున్న మహానంద కారణాలకు మించి యెరూషలేమును ప్రాముఖ్యమైనదిగా ఎంచకపోతే నా నాలుక నా అంగిటికి అంటుకుంటుంది గాక.
7 Main leowa, kom kotin tamanda en men Edom ar lokolokaia ni ran apwal en lerujalem Kawela, kawela lao Iel on nan pwel!
౭యెహోవా, ఎదోము ప్రజలు ఏమి చేశారో జ్ఞాపకం చేసుకో. యెరూషలేము పాడైపోయిన రోజులను జ్ఞాపకం చేసుకో. దాన్ని నాశనం చేయండి, సమూలంగా ధ్వంసం చెయ్యండి, అని వాళ్ళు చాటింపు వేశారు గదా.
8 Toun Papel, morjued koe, re meid pai, me pan wiai on uk duen me koe wiadar!
౮నాశనం అయ్యేందుకు సిద్ధంగా ఉన్న బబులోను కుమారీ, నువ్వు మా పట్ల జరిగించిన దుష్ట క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేయబోయేవాడు ధన్యుడు.
9 Meid pai ir, me pan koledi noum jeri pwelel o kajuk pajan nin takai!
౯నీ పసిపిల్లలను పట్టుకుని బండ కేసి కొట్టేవాడు ధన్యుడు.