< لاویان 10 >

ناداب و ابیهو پسران هارون، برخلاف امر خداوند، آتش غیر مجاز بر آتشدان خود نهاده، بر آن بخور گذاشتند و به حضور خداوند تقدیم کردند. 1
నాదాబు అబీహులు అహరోను కొడుకులు. వీళ్ళు తమ ధూపం వేసే పాత్రల్లో నిప్పులు ఉంచి వాటిపై ధూప ద్రవ్యాన్ని వేశారు. యెహోవా ఆదేశించని వేరే అగ్నిని ఆయన సమక్షంలోకి తీసుకు వచ్చారు.
ناگاه آتش از حضور خداوند بیرون آمده، آنها را سوزاند و آنها در همان جا، در حضور خداوند مردند. 2
దాంతో యెహోవా సమక్షంలో నుండి మంటలు వచ్చి వాళ్ళని కాల్చి వేశాయి. యెహోవా సమక్షంలోనే వాళ్ళు చనిపోయారు.
آنگاه موسی به هارون گفت: «منظور خداوند همین بود وقتی فرمود: کسانی که مرا خدمت می‌کنند باید حرمت قدوسیت مرا نگاه دارند تا تمام قوم، مرا احترام کنند.» پس هارون خاموش ماند. 3
అప్పుడు మోషే అహరోనుతో “నాకు సమీపంగా ఉన్నవారికి నా పవిత్రతని చూపిస్తాను. ప్రజలందరి ముందూ నేను మహిమ పొందుతాను అని యెహోవా చెప్పిన మాటకి అర్థం ఇదే” అన్నాడు. అహరోను ఏమీ మాట్లాడకుండా ఉన్నాడు.
بعد موسی، میشائیل و الصافان (پسران عُزّیئیل، عموی هارون) را صدا زد و به ایشان گفت: «بروید و اجساد را از داخل خیمۀ ملاقات بردارید و به خارج از اردوگاه ببرید.» 4
అప్పుడు మోషే అహరోను బాబాయి ఉజ్జీయేలు కొడుకులు మీషాయేలునూ, ఎల్సాఫానునూ పిలిపించి వాళ్ళకిలా చెప్పాడు. “మీరు ఇక్కడికి రండి. ప్రత్యక్ష గుడారం ఎదుట నుండి మీ సోదరులను శిబిరం బయటకు తీసుకుపొండి.”
آنها رفتند و همان‌طور که موسی گفته بود ایشان را که هنوز پیراهنهای کاهنی خود را بر تن داشتند، از اردوگاه بیرون بردند. 5
వాళ్ళింకా యాజకుల అంగీలు వేసుకునే ఉన్నారు. అలాగే మోషే ఆదేశించినట్టు వాళ్ళు వచ్చి శిబిరం బయటకు వీళ్ళని మోసుకు వెళ్ళారు.
آنگاه موسی به هارون و پسرانش العازار و ایتامار گفت: «عزاداری ننمایید، موهای سرتان را باز نکنید و گریبان لباس خود را چاک نزنید. اگر عزاداری کنید خدا شما را نیز هلاک خواهد کرد و خشم او بر تمام قوم اسرائیل افروخته خواهد شد. ولی بنی‌اسرائیل می‌توانند برای ناداب و ابیهو که در اثر آتش هولناک خداوند مردند، عزاداری نمایند. 6
అప్పుడు మోషే అహరోనుతో అతని కొడుకులైన ఎలియాజరు, ఈతామారులతో “మీరు చావకుండా ఉండాలన్నా, యెహోవా ఈ సమాజం పైన కోపగించుకోకుండా ఉండాలన్నా మీరు మీ తలల పైని జుట్టు విరబోసుకోకూడదు. మీ బట్టలు చింపుకోకూడదు. అయితే యెహోవా వారిని కాల్చివేసినందుకు వారి కోసం మీ సోదరులు, ఇశ్రాయేలు సమాజమంతా ఏడవవచ్చు.
شما از در خیمۀ ملاقات بیرون نروید مبادا بمیرید، چون روغن مسح خداوند بر شماست.» ایشان طبق دستور موسی عمل کردند. 7
యెహోవా అభిషేకపు నూనె మీపైన ఉంది. కాబట్టి మీరు మాత్రం ప్రత్యక్ష గుడారం నుండి బయటకి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్తే మీరు చనిపోతారు” అని చెప్పాడు. వాళ్ళు మోషే మాట ప్రకారం చేశారు.
آنگاه خداوند به هارون گفت: 8
తరువాత యెహోవా అహరోనుతో మాట్లాడి ఇలా చెప్పాడు.
«وقتی به خیمۀ ملاقات می‌روید، هرگز شراب یا نوشیدنیهای مست کنندهٔ دیگر ننوشید مبادا بمیرید. این فریضه‌ای است ابدی برای تو و پسرانت و تمام نسلهای آینده‌ات. 9
“నువ్వూ నీతో ఉండే నీ కొడుకులూ ప్రత్యక్ష గుడారంలోకి ప్రవేశించే సమయంలో ద్రాక్ష మద్యాన్ని గానీ, ఇంకే మత్తు పానీయాలు గానీ తాగవద్దు. అలా చేస్తే మీరు చనిపోతారు.
شما باید فرق بین مقدّس و نامقدّس، و نجس و طاهر را تشخیص دهید. 10
౧౦మీ రాబోయే తరాల్లో ఇది మీకు శాశ్వతమైన శాసనం. ప్రతిష్ట చేసిన దాన్ని లౌకికమైన దాని నుండీ, పవిత్రమైన దాన్ని అపవిత్రమైన దాని నుండీ వేరు చెయ్యాలి.
باید تمام دستورهای مرا که توسط موسی به قوم اسرائیل داده‌ام، به ایشان بیاموزید.» 11
౧౧యెహోవా మోషే ద్వారా ఆదేశించిన శాసనాలను ఇశ్రాయేలు ప్రజలందరికీ మీరు బోధించాలి.”
سپس موسی به هارون و دو پسر بازمانده‌اش، العازار و ایتامار گفت: «باقیماندهٔ هدیهٔ آردی را که بر آتش به خداوند تقدیم شده است بردارید و از آن، نان بدون خمیرمایه پخته، در کنار مذبح بخورید زیرا این هدیه، بسیار مقدّس است. 12
౧౨అప్పుడు మోషే అహరోనుతోనూ, మిగిలి ఉన్న అతని కొడుకులు ఎలియాజరు ఈతామారులతోనూ మాట్లాడాడు. “యెహోవాకు అర్పించిన దహనబలి నుండి మిగిలిన నైవేద్యాన్ని తీసుకుని పొంగజేసే పదార్ధం లేకుండా దాన్ని తినండి. ఎందుకంటే అది అతి పరిశుద్ధమైంది.
همان‌گونه که خداوند به من فرموده است باید این را در جای مقدّسی بخورید، زیرا این سهم شما و پسرانتان از هدیه‌ای است که بر آتش به خداوند تقدیم می‌شود. 13
౧౩దాన్ని మీరు ఒక పరిశుద్ధ స్థలం లో తినాలి. ఎందుకంటే యెహోవాకు చేసిన దహనబలి అర్పణల్లో అది నీకూ, నీ కొడుకులకూ రావాల్సిన భాగం. మీకు ఈ సంగతి చెప్పాలనే ఆజ్ఞ నేను పొందాను.
شما و پسران و دخترانتان می‌توانید سینه و ران هدیهٔ مخصوص را که در حضور خداوند تکان داده می‌شود، در مکان طاهری بخورید. این هدایا که سهم شما از قربانی سلامتی قوم اسرائیل می‌باشد به شما و فرزندانتان داده شده است. 14
౧౪తరువాత కదలిక అర్పణగా పైకెత్తిన రొమ్ము భాగాన్నీ, యెహోవాకు ప్రతిష్ట చేసిన తొడ భాగాన్నీ దేవుడు అంగీకరించిన ఒక పవిత్రమైన స్థలంలో మీరు తినాలి. వీటినీ నువ్వూ, నీ కొడుకులూ, నీ కూతుళ్ళూ తినాలి. ఎందుకంటే అవి ఇశ్రాయేలు ప్రజలు అర్పించే శాంతిబలుల్లో నీకూ, నీ కొడుకులకూ రావాల్సిన భాగం.
«بنی‌اسرائیل باید ران و سینه را هنگام تقدیم چربی بر آتش، بیاورند و به عنوان هدیهٔ مخصوص در حضور خداوند تکان دهند. آن ران و سینه همیشه به شما و فرزندانتان تعلق خواهد داشت، همان‌طور که خداوند فرموده است.» 15
౧౫కదలిక అర్పణగా పైకెత్తిన రొమ్ము భాగాన్నీ, యెహోవాకు ప్రతిష్ట చేసిన తొడ భాగాన్నీ దహనబలిగా అర్పించిన కొవ్వుతో పాటు వాళ్ళు తీసుకురావాలి. వాటిని యెహోవా ఎదుట పైకెత్తి కదిలించే అర్పణగా తీసుకు రావాలి. యెహోవా ఆజ్ఞాపించినట్టు అవి శాశ్వతంగా నీకూ నీ కొడుకులకూ చెందిన భాగం. ఇది ఎప్పటికీ నిలిచి ఉండే చట్టం.”
موسی سراغ بز قربانی گناه را گرفت، ولی پی برد که سوزانده شده است. پس بر العازار و ایتامار خشمگین شده، گفت: 16
౧౬అప్పుడు మోషే పాపం కోసం బలి కావాల్సిన మేకను గూర్చి అడిగాడు. కానీ అది అప్పటికే దహనమైపోయిందని తెలుసుకున్నాడు. కాబట్టి అతడు తక్కిన అహరోను కొడుకులు ఎలియాజరు, ఈతామారులపై కోప్పడ్డాడు.
«چرا قربانی گناه را در مکان مقدّس نخوردید؟ این قربانی، بسیار مقدّس می‌باشد و خدا آن را به شما داده است تا گناه قوم اسرائیل را در حضور خداوند کفاره نمایید. 17
౧౭“మీరు పాపం కోసం బలి అయిన పశువు మాంసాన్ని పవిత్ర స్థలం లో ఎందుకు తినలేదు? అది అతి పరిశుద్ధం కదా. సమాజం పాపాలను తీసివేయడానికీ, ఆయన ఎదుట పరిహారం చేయడానికీ యెహోవా దాన్ని మీకు ఇచ్చాడు కదా.
چون خون آن به داخل عبادتگاه برده نشد، باید حتماً آن را در محوطهٔ خیمۀ ملاقات می‌خوردید، به طوری که به شما دستور داده بودم.» 18
౧౮చూడండి, దాని రక్తాన్ని పరిశుద్ధ స్థలం లోకి తీసుకు రాలేదు. నేను ఆజ్ఞాపించినట్టే మీరు దాని మాంసాన్ని పరిశుద్ధ స్థలం లో కచ్చితంగా తినాల్సిందే” అని మందలించాడు.
ولی هارون به موسی گفت: «با وجودی که ایشان قربانی گناه و قربانی سوختنی خود را به حضور خداوند تقدیم کردند این واقعهٔ هولناک برای من پیش آمد. حال اگر از گوشت قربانی گناه می‌خوردیم، آیا خداوند خشنود می‌شد؟» 19
౧౯అప్పుడు అహరోను మోషేతో “చూడు, ఈ రోజు వీళ్ళు పాపం కోసం తమ బలులూ, దహన బలులూ యెహోవా ఎదుట అర్పించారు. అయినా ఈ రోజే నాకు ఈ విపత్తు జరిగింది. పాపం కోసం చేసిన బలిమాంసం నేను తింటే యెహోవా దృష్టికి అది సరైనదవుతుందా?” అన్నాడు.
موسی وقتی این را شنید، قانع شد. 20
౨౦మోషే ఆ మాట విని ఒప్పుకున్నాడు.

< لاویان 10 >