< یوشع 17 >

قسمتی از زمینهایی که در غرب رود اردن بود به قبیلهٔ منسی (پسر بزرگ یوسف) داده شد. به خاندان ماخیر (پسر بزرگ منسی و پدر جلعاد) قبلاً زمین جلعاد و باشان (در سمت شرقی رود اردن) داده شده بود، زیرا آنها جنگجویانی شجاع بودند. 1
మనష్షే యోసేపు పెద్ద కుమారుడు కాబట్టి అతని గోత్రానికి, అంటే మనష్షే పెద్ద కుమారుడు గిలాదు దేశాధిపతి అయిన మాకీరుకు చీట్ల వలన వంతు వచ్చింది. అతడు యుద్ధవీరుడు కాబట్టి అతనికి గిలాదు బాషాను వచ్చాయి.
پس زمینهای کرانهٔ غربی رود اردن به بقیهٔ قبیلۀ منسی یعنی خاندانهای ابیعزر، هالک، اسرئیل، شکیم، حافر و شمیداع داده شد. 2
మనష్షీయుల్లో మిగిలిన వారికి, అంటే అబీయెజెరీయులకూ హెలకీయులకూ అశ్రీయేలీయులకూ షెకెమీయులకూ హెపెరీయులకూ షెమీదీయులకూ వారి వారి వంశాల ప్రకారం వంతు వచ్చింది. వారి వంశాలను బట్టి యోసేపు కుమారుడు మనష్షే మగ సంతానమది.
صَلُفحاد پسر حافر، حافر پسر جلعاد، جلعاد پسر ماخیر و ماخیر پسر منسی بود. صلفحاد پسری نداشت. او تنها پنج دختر داشت به نامهای: محله، نوعه، حُجله، ملکه و ترصه. 3
మనష్షే మునిమనుమడూ మాకీరు ఇనుమనుమడూ గిలాదు మనుమడూ హెపెరు కుమారుడూ అయిన సెలోపెహాదుకు కూతుర్లే గాని కుమారులు పుట్టలేదు. అతని కూతుర్ల పేర్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా.
این پنج دختر نزد العازار کاهن، یوشع و بزرگان اسرائیل آمده، گفتند: «خداوند به موسی فرمود که ما هم می‌توانیم هر کدام به اندازهٔ یک مرد از زمین سهم داشته باشیم.» 4
వారు యాజకుడైన ఎలియాజరు, నూను కుమారుడు యెహోషువ, ప్రధానుల దగ్గరికి వచ్చి “మా సోదరుల మధ్య మాకు స్వాస్థ్యమివ్వాలని యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు” అని చెప్పారు. కాబట్టి, యెహోషువ యెహోవా సెలవిచ్చినట్టుగా వారి తండ్రి సోదరులతో బాటు వారికి స్వాస్థ్యం ఇచ్చాడు.
پس چنانکه خداوند به موسی امر فرموده بود، این پنج دختر مانند مردان قبیله‌شان، صاحب زمین شدند. بدین ترتیب قبیلهٔ منسی علاوه بر زمین جلعاد و باشان که در شرق رود اردن بود، صاحب ده سهم دیگر از زمینهای غرب رود اردن شدند. 5
కాబట్టి యొర్దాను అవతల ఉన్న గిలాదు బాషానులు కాక మనష్షీయులకు పదివంతులు హెచ్చుగా వచ్చాయి.
6
ఎందుకంటే మనష్షీయుల స్త్రీ సంతానం వారి పురుష సంతానం స్వాస్థ్యం పొందాయి. గిలాదు దేశం మిగతా మనష్షీయులకు స్వాస్థ్యం అయింది.
مرز قبیلهٔ منسی از سرحد اشیر تا مکمیته که در شرق شکیم است، امتداد می‌یافت؛ و از آنجا به طرف جنوب کشیده شده، به ناحیه‌ای که اهالی عین تفوح در آن زندگی می‌کردند می‌رسید. 7
మనష్షీయుల సరిహద్దు ఆషేరు నుండి షెకెముకు తూర్పుగా ఉన్న మిక్మెతావరకూ దక్షిణాన ఏన్తప్పూయ నివాసుల వైపుకు వ్యాపించింది.
(سرزمین تفوح متعلق به منسی بود، اما خود شهر تفوح که در مرز سرزمین منسی قرار داشت به قبیلهٔ افرایم تعلق می‌گرفت.) 8
తప్పూయ భూభాగం మనష్షీయులది. అయితే మనష్షీయుల సరిహద్దు లోని తప్పూయ పట్టణం ఎఫ్రాయిమీయులది అయింది.
سپس سرحد قبیلهٔ منسی به طرف وادی قانه کشیده می‌شد و به دریای مدیترانه می‌رسید. (چند شهر در جنوب وادی قانه در خاک منسی واقع شده بودند که در واقع متعلق به افرایم بودند.) 9
ఆ సరిహద్దు కానా వాగు వరకూ ఆ వాగుకు వ్యాపించింది. వాగుకు దక్షిణాన ఉన్న మనష్షీయుల పట్టణాలు దగ్గరి ప్రాంతం ఎఫ్రాయిమీయులకు సంక్రమించింది. అయితే మనష్షీయుల సరిహద్దు ఆ వాగుకు ఉత్తరంగా సముద్రం వరకూ వ్యాపించింది.
زمین جنوب وادی قانه تا دریای مدیترانه برای افرایم تعیین شد و زمین شمال وادی قانه تا دریای مدیترانه به قبیلهٔ منسی داده شد. مرز منسی از شمال به سرزمین اشیر و از سمت شرق به سرزمین یساکار محدود بود. 10
౧౦దక్షిణ భూమి ఎఫ్రాయిమీయులకు ఉత్తరభూమి మనష్షీయులకు వచ్చింది. సముద్రం వారి సరిహద్దు. ఉత్తరం వైపున అది ఆషేరీయుల సరిహద్దుకు, తూర్పు వైపున ఇశ్శాఖారీయుల సరిహద్దుకు అనుకుని ఉంది.
شهرهای زیر که در خاک یساکار و اشیر واقع شده بودند به قبیلهٔ منسی داده شدند: بیت‌شان، یبلعام، دُر، عین دُر، تعناک، مَجِدو (که سه محلۀ کوهستانی داشت)، و روستاهای اطراف آنها. 11
౧౧ఇశ్శాఖారీయుల ప్రదేశంలో ఆషేరీయుల ప్రదేశంలో బేత్ షెయాను, దాని గ్రామాలూ ఇబ్లెయాము, దాని గ్రామాలూ దోరు నివాసులు, దాని గ్రామాలూ ఏన్దోరు నివాసులు, దాని గ్రామాలూ తానాకు నివాసులు, దాని గ్రామాలూ మెగిద్దో నివాసులు, దాని గ్రామాలూ అంటే మూడు కొండల ప్రదేశం మనష్షీయులకు వచ్చింది.
اما قبیلهٔ منسی نتوانست کنعانیهایی را که در این شهرها و روستاها ساکن بودند بیرون کند، پس آنها در آن سرزمین باقی ماندند. 12
౧౨కనానీయులు ఆ దేశంలో నివసించాలని గట్టిగా ప్రయత్నించారు కాబట్టి మనష్షీయులు ఆ పట్టణాలను స్వాధీనపరచుకోలేక పోయారు.
حتی هنگامی که بنی‌اسرائیل نیرومند شدند، باز آنها را بیرون نکردند بلکه ایشان را به بردگی خود گرفتند. 13
౧౩ఇశ్రాయేలీయులు బలవంతులైన తరువాత వారు కనానీయులతో వెట్టిచాకిరి చేయించుకున్నారు కాని వారి దేశాన్ని మాత్రం పూర్తిగా స్వాధీనపరచుకోలేదు.
سپس دو قبیلهٔ یوسف نزد یوشع آمده، به او گفتند: «چرا از این زمین فقط یک سهم به ما داده‌ای، و حال آنکه خداوند ما را برکت داده و جمعیت ما را زیادتر از قبایل دیگر گردانیده است؟» 14
౧౪అప్పుడు యోసేపు వంశంవారు యెహోషువతో “మాకు ఒక్క చీటితో ఒక్క వంతే స్వాస్థ్యంగా ఇచ్చావేంటి? మేము గొప్ప జనం గదా? ఇంతవరకూ యెహోవా మమ్మల్ని దీవించాడు” అని మనవి చేశారు.
یوشع پاسخ داد: «اگر جمعیت شما زیاد است و زمین کوهستانی افرایم برای شما کافی نیست، می‌توانید جنگلهای وسیع فَرِزی‌ها و رفائی‌ها را نیز بگیرید و برای خود صاف کنید.» 15
౧౫యెహోషువ వారితో “మీరు గొప్ప జనం కాబట్టి ఎఫ్రాయిమీయుల కొండ ప్రాంతం మీకు ఇరుకుగా ఉంటే మీరు అడవికి పోయి అక్కడ పెరిజ్జీయులు రెఫాయీయులు ఉన్న ప్రదేశానికి వెళ్లి అడవి నరుక్కొని అక్కడ ఉండండి” అన్నాడు.
آنها گفتند: «کنعانیهایی که در دشتها ساکنند، چه آنهایی که در بیت‌شان و روستاهای اطراف آن، و چه آنهایی که در درهٔ یزرعیل هستند، ارابه‌های آهنین دارند، و ما از عهدهٔ آنها بر نمی‌آییم.» 16
౧౬అందుకు యోసేపు వంశం వారు “ఆ కొండ ప్రాంతం మాకు చాలదు, లోయ ప్రాంతంలో ఉంటున్న కనానీయులందరికీ అంటే బేత్ షెయానులో, దాని గ్రామాల్లో యెజ్రెయేలు లోయలో ఉన్న వాళ్లకు ఇనుప రథాలు ఉన్నాయి” అన్నారు.
یوشع به خاندان یوسف یعنی به افرایم و منسی گفت: «جمعیت شما زیاد است و شما قوی هستید. پس بیش از یک سهم به شما تعلق خواهد گرفت. 17
౧౭అప్పడు యెహోషువ యోసేపు సంతతి వారైన ఎఫ్రాయిమీయులను, మనష్షీయులను చూసి “మీరు ఒక గొప్ప జనం,
کوهستان جنگلی نیز از آن شما خواهد بود. این جنگل را صاف کنید و سراسر آن را تصرف نمایید. من یقین دارم که شما می‌توانید کنعانی‌ها را از آنجا بیرون کنید، گرچه آنها ارابه‌های آهنین دارند و قوی می‌باشند.» 18
౧౮మీది గొప్ప బలం. మీకు ఒక్క వాటా మాత్రమే ఉండకూడదు. ఆ కొండ మీదే, అది అడవి కాబట్టి మీరు దాన్ని నరికి స్వాధీనం చేసుకోవాలి. కనానీయులకు ఇనుప రథాలున్నా, వాళ్ళు బలవంతులైనా మీరు వారిని వెళ్ళగొట్టగలరు” అన్నాడు.

< یوشع 17 >