< پیدایش 5 >
این است شرح پیدایش آدم و نسل او. هنگامی که خدا خواست انسان را بیافریند، او را شبیه خود آفرید. | 1 |
౧ఆదాము వంశక్రమం ఇది. దేవుడు మనిషిని సృష్టించిన రోజున వాళ్ళను తన సొంత పోలికలో చేశాడు.
او آنها را مرد و زن خلق فرموده، برکت داد و از همان آغاز خلقت، ایشان را انسان نامید. | 2 |
౨వారిని పురుషులుగా, స్త్రీలుగా సృష్టించాడు. వాళ్ళను సృష్టించిన రోజున ఆయన వాళ్ళను ఆశీర్వదించి వాళ్లకు మనుషులు అని పేరు పెట్టాడు.
آدم: وقتی آدم ۱۳۰ ساله بود، پسرش شیث به دنیا آمد. او شبیه پدرش آدم بود. بعد از تولد شیث، آدم ۸۰۰ سال دیگر عمر کرد و صاحب پسران و دختران شد. آدم در سن ۹۳۰ سالگی مرد. | 3 |
౩ఆదాముకు నూట ముప్ఫై సంవత్సరాల వయస్సులో అతని పోలికగా అతని స్వరూపంలో కొడుకు పుట్టాడు. ఆదాము అతనికి షేతు అని పేరుపెట్టాడు.
౪షేతు పుట్టిన తరువాత ఆదాము ఎనిమిది వందల సంవత్సరాలు బ్రతికాడు. అతనికి ఇంకా కొడుకులు, కూతుళ్ళు పుట్టారు.
౫ఆదాము తొమ్మిది వందల ముప్ఫై సంవత్సరాలు బ్రతికాడు.
شیث: وقتی شیث ۱۰۵ ساله بود، پسرش انوش به دنیا آمد. بعد از تولد انوش، شیث ۸۰۷ سال دیگر عمر کرد و صاحب پسران و دختران شد. شیث در سن ۹۱۲ سالگی مرد. | 6 |
౬షేతుకు నూట ఐదు సంవత్సరాల వయస్సులో ఎనోషు పుట్టాడు.
౭ఎనోషు పుట్టిన తరువాత షేతు ఎనిమిది వందల ఏడు సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
౮షేతు తొమ్మిది వందల పన్నెండు సంవత్సరాలు బ్రతికాడు.
انوش: وقتی انوش نود ساله بود، پسرش قینان به دنیا آمد. بعد از تولد قینان، انوش ۸۱۵ سال دیگر عمر کرد و صاحب پسران و دختران شد. انوش در سن ۹۰۵ سالگی مرد. | 9 |
౯ఎనోషుకు తొంభై సంవత్సరాల వయస్సులో కేయినాను పుట్టాడు.
౧౦కేయినాను పుట్టిన తరువాత ఎనోషు ఎనిమిది వందల పదిహేను సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
౧౧ఎనోషు తొమ్మిది వందల ఐదు సంవత్సరాలు బ్రతికాడు.
قینان: وقتی قینان هفتاد ساله بود، پسرش مهللئیل به دنیا آمد. بعد از تولد مهللئیل، قینان ۸۴۰ سال دیگر عمر کرد و صاحب پسران و دختران شد. او در سن ۹۱۰ سالگی مرد. | 12 |
౧౨కేయినానుకు డెబ్భై సంవత్సరాల వయస్సులో మహలలేలు పుట్టాడు.
౧౩మహలలేలు పుట్టిన తరువాత కేయినాను ఎనిమిది వందల నలభై సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
౧౪కేయినాను తొమ్మిది వందల పది సంవత్సరాలు బ్రతికాడు.
مهللئیل: وقتی مهللئیل شصت و پنج ساله بود، پسرش یارد به دنیا آمد. پس از تولد یارد، مهللئیل ۸۳۰ سال دیگر عمر کرد و صاحب پسران و دختران شد. او در سن ۸۹۵ سالگی مرد. | 15 |
౧౫మహలలేలుకు అరవై ఐదు సంవత్సరాల వయస్సులో యెరెదు పుట్టాడు.
౧౬యెరెదు పుట్టిన తరువాత మహలలేలు ఎనిమిది వందల ముప్ఫైసంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
౧౭మహలలేలు ఎనిమిదివందల తొంభై ఐదు సంవత్సరాలు బ్రతికాడు.
یارد: وقتی یارد ۱۶۲ ساله بود، پسرش خنوخ به دنیا آمد. بعد از تولد خنوخ، یارد ۸۰۰ سال دیگر عمر کرد و صاحب پسران و دختران شد. یارد در سن ۹۶۲ سالگی مرد. | 18 |
౧౮యెరెదుకు నూట అరవై రెండు సంవత్సరాల వయస్సులో హనోకు పుట్టాడు.
౧౯హనోకు పుట్టిన తరువాత యెరెదు ఎనిమిది వందల సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
౨౦యెరెదు తొమ్మిది వందల అరవై రెండు సంవత్సరాలు బ్రతికాడు.
خنوخ: وقتی خنوخ شصت و پنج ساله بود، پسرش متوشالح به دنیا آمد. بعد از تولد متوشالح، خنوخ ۳۰۰ سال دیگر با خدا زیست. او صاحب پسران و دخترانی شد و ۳۶۵ سال زندگی کرد. خنوخ با خدا میزیست و خدا او را به حضور خود به بالا برد و دیگر کسی او را ندید. | 21 |
౨౧హనోకుకు అరవై ఐదు సంవత్సరాల వయస్సులో మెతూషెల పుట్టాడు.
౨౨మెతూషెల పుట్టిన తరువాత హనోకు మూడు వందల సంవత్సరాలు దేవునితో సహవాసం చేస్తూ కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
౨౩హనోకు మూడువందల అరవై ఐదు సంవత్సరాలు బ్రతికాడు.
౨౪హనోకు దేవునితో కలసి నడిచాడు. దేవుడు అతణ్ణి తీసుకువెళ్ళాడు గనుక అతడు కనబడలేదు.
متوشالح: وقتی متوشالح ۱۸۷ ساله بود، پسرش لمک به دنیا آمد. بعد از تولد لمک، متوشالح ۷۸۲ سال دیگر زندگی کرد و صاحب پسران و دختران شد. متوشالح در سن ۹۶۹ سالگی مرد. | 25 |
౨౫మెతూషెలకు నూట ఎనభై ఏడు సంవత్సరాల వయస్సులో లెమెకు పుట్టాడు.
౨౬మెతూషెలకు లెమెకు పుట్టిన తరువాత ఏడు వందల ఎనభై రెండు సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
౨౭మెతూషెల తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికాడు.
لمک: وقتی لمک ۱۸۲ ساله بود، پسرش نوح به دنیا آمد. لمک گفت: «این پسر، ما را از کار سختِ زراعت که در اثر لعنت خداوند بر زمین، دامنگیر ما شده، آسوده خواهد کرد.» پس لمک اسم او را نوح (یعنی «آسودگی») گذاشت. بعد از تولد نوح، لمک ۵۹۵ سال دیگر عمر کرد و صاحب پسران و دختران شد. او در سن ۷۷۷ سالگی مرد. | 28 |
౨౮లెమెకుకు నూట ఎనభై రెండు సంవత్సరాల వయస్సులో ఒక కొడుకు పుట్టాడు.
౨౯“భూమిని యెహోవా శపించినందువల్ల కలిగిన మన చేతుల కష్టం విషయంలో, మన పని విషయంలో ఇతడు మనకు విశ్రాంతి ఇస్తాడు” అని, అతనికి నోవహు అని పేరు పెట్టాడు.
౩౦లెమెకుకు నోవహు పుట్టిన తరువాత ఐదు వందల తొంభై ఐదు సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
౩౧లెమెకు ఏడువందల డెబ్భై ఏడు సంవత్సరాలు బ్రతికాడు.
نوح: نوح در سن ۵۰۰ سالگی صاحب سه پسر به نامهای سام، حام و یافث بود. | 32 |
౩౨ఐదు వందల సంవత్సరాలు బ్రతికిన నోవహుకు షేము, హాము, యాపెతు అనే ముగ్గురు కొడుకులు పుట్టారు.