< پیدایش 35 >

خدا به یعقوب فرمود: «حال برخیز و به بیت‌ئیل برو. در آنجا ساکن شو و مذبحی بساز و آن خدایی را که وقتی از دست برادرت عیسو می‌گریختی بر تو ظاهر شد، عبادت نما.» 1
దేవుడు యాకోబుతో “నువ్వు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించు. నీ సోదరుడైన ఏశావు నుండి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ ఒక బలిపీఠం కట్టు” అని చెప్పాడు.
آنگاه یعقوب به تمامی اهل خانهٔ خود دستور داد که بُتهایی را که با خود آورده بودند، دور بیندازند و غسل بگیرند و لباسهایشان را عوض کنند. 2
యాకోబు తన ఇంటివారితో, తన దగ్గర ఉన్న వారందరితో “మీ దగ్గర ఉన్న అన్యదేవుళ్ళను పారవేసి, మిమ్మల్ని మీరు పవిత్ర పరచుకుని, మీ వస్త్రాలు మార్చుకోండి.
او به ایشان گفت: «به بیت‌ئیل می‌رویم تا در آنجا برای خدایی که به هنگام سختی، دعاهایم را اجابت فرمود و هر جا می‌رفتم با من بود، مذبحی بسازم.» 3
మనం బేతేలుకు బయలుదేరి వెళ్దాం. నా కష్ట సమయంలో నాకు సహాయం చేసి, నేను వెళ్ళిన అన్ని చోట్లా నాకు తోడై ఉన్న దేవునికి అక్కడ ఒక బలిపీఠం కడతాను” అని చెప్పాడు.
پس همگی، بُتهای خود و گوشواره‌هایی را که در گوش داشتند به یعقوب دادند و او آنها را زیر درخت بلوطی در شکیم دفن کرد. 4
వారు తమ దగ్గర ఉన్న అన్యదేవుళ్ళన్నిటినీ తమ చెవి పోగులనూ యాకోబుకు అప్పగించారు. యాకోబు వాటిని షెకెము దగ్గర ఉన్న సింధూర వృక్షం కింద పాతిపెట్టాడు.
سپس آنها بار دیگر کوچ کردند. و ترس خدا بر تمامی شهرهایی که یعقوب از آنها عبور می‌کرد قرار گرفت تا به وی حمله نکنند. 5
వారు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు, వారి చుట్టూ ఉన్న పట్టణాల వారికి దేవుడు భయం పుట్టించాడు కాబట్టి వారు యాకోబు కుటుంబాన్ని తరమ లేదు.
سرانجام به لوز که همان بیت‌ئیل باشد و در سرزمین کنعان واقع است، رسیدند. 6
యాకోబు, అతడితో ఉన్నవారంతా కనానులో లూజుకు, అంటే బేతేలుకు వచ్చారు.
یعقوب در آنجا مذبحی بنا کرد و آن را مذبح خدای بیت‌ئیل نامید (چون هنگام فرار از دست عیسو، در بیت‌ئیل بود که خدا بر او ظاهر شد.) 7
అతడు తన అన్న దగ్గర నుండి పారిపోయినప్పుడు దేవుడక్కడ అతడికి ప్రత్యక్షమయ్యాడు కాబట్టి వారు అక్కడ ఒక బలిపీఠం కట్టి ఆ ప్రదేశానికి ఏల్‌ బేతేలు అని పేరు పెట్టారు.
چند روز پس از آن، دبوره دایهٔ پیر ربکا مُرد و او را زیر درخت بلوطی در درهٔ پایین بیت‌ئیل به خاک سپردند. از آن پس، درخت مذکور را بلوط گریه نامیدند. 8
రిబ్కా దాది దెబోరా చనిపోయినప్పుడు ఆమెను బేతేలుకు దిగువన ఉన్న సింధూర వృక్షం కింద పాతిపెట్టి, దానికి అల్లోన్ బాకూత్‌ అనే పేరు పెట్టారు.
پس از آنکه یعقوب از فَدّان‌اَرام وارد بیت‌ئیل شد، خدا بار دیگر بر وی ظاهر شد و او را برکت داد 9
యాకోబు పద్దనరాము నుండి వస్తూ ఉండగా దేవుడు అతడికి మళ్ళీ ప్రత్యక్షమై అతణ్ణి ఆశీర్వదించాడు.
و به او فرمود: «بعد از این دیگر نام تو یعقوب خوانده نشود، بلکه نام تو اسرائیل خواهد بود. 10
౧౦అప్పుడు దేవుడు అతనితో “నీ పేరు యాకోబు. కానీ ఇప్పటినుండి అది యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు” అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు.
من هستم خدای قادر مطلق. بارور و زیاد شو! قومهای زیاد و پادشاهان بسیار از نسل تو پدید خواهند آمد. 11
౧౧దేవుడు “నేను సర్వశక్తిగల దేవుణ్ణి. నువ్వు ఫలించి అభివృద్ధి పొందు. ఒక జనాంగం, జాతుల గుంపు నీనుండి కలుగుతాయి. రాజులు నీ సంతానంలో నుండి వస్తారు.
سرزمینی را که به ابراهیم و اسحاق دادم، به تو و به نسل تو نیز خواهم داد.» 12
౧౨నేను అబ్రాహాముకు, ఇస్సాకుకు ఇచ్చిన దేశాన్ని నీకిస్తాను. నీ తరువాత నీ సంతానానికి కూడా ఈ దేశాన్ని ఇస్తాను” అని అతనితో చెప్పాడు.
سپس خدا از نزد او به آسمان صعود کرد. 13
౧౩దేవుడు అతనితో మాట్లాడిన ఆ స్థలం నుండి పరలోకానికి వెళ్ళాడు.
پس از آن، یعقوب در همان جایی که خدا بر او ظاهر شده بود، ستونی از سنگ بنا کرد و هدیهٔ نوشیدنی برای خداوند بر آن ریخت و آن را با روغن زیتون تدهین کرد. 14
౧౪దేవుడు తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభం, అంటే ఒక రాతి స్తంభం నిలబెట్టి దాని మీద పానార్పణం చేసి దాని మీద నూనె పోశాడు.
یعقوب آن محل را بیت‌ئیل (یعنی «خانۀ خدا») نامید، زیرا خدا در آنجا با وی سخن گفته بود. 15
౧౫తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలు అని పేరు పెట్టాడు.
سپس او و خانواده‌اش بیت‌ئیل را ترک گفتند و به سوی افرات رهسپار شدند. اما هنوز به افرات نرسیده بودند که دردِ زایمانِ راحیل شروع شد. 16
౧౬వారు బేతేలు నుండి ప్రయాణమై వెళ్ళారు. దారిలో ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరం ఉన్నప్పుడు రాహేలుకు కానుపు నొప్పులు మొదలయ్యాయి.
پس از زایمان بسیار سخت، سرانجام قابله گفت: «نترس، یک پسر دیگر به دنیا آوردی!» 17
౧౭ఆమె ప్రసవం వలన తీవ్రంగా ప్రయాసపడుతూ ఉండగా మంత్రసాని ఆమెతో “భయపడ వద్దు, ఈ సారి కూడా నీకు కొడుకే పుడతాడు” అంది.
ولی راحیل در حال مرگ بود. او در حین جان سپردن، پسرش را بِن اونی نام نهاد، ولی بعد پدرش او را بِنیامین نامید. 18
౧౮రాహేలు కొడుకును ప్రసవించి చనిపోయింది. ప్రాణం పోతూ ఉన్న సమయంలో ఆమె “వీడి పేరు బెనోని” అంది. కాని అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టాడు.
پس راحیل وفات یافت و او را در نزدیکی راه افرات که بیت‌لحم هم نامیده می‌شد، دفن کردند. 19
౧౯ఆ విధంగా రాహేలు చనిపోయినప్పుడు ఆమెను బేత్లెహేము అని పిలిచే ఎఫ్రాతా మార్గంలో సమాధి చేశారు.
یعقوب روی قبرش ستونی از سنگ بنا کرد که تا به امروز باقی است. 20
౨౦యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభాన్ని నిలిపాడు. అది ఈ రోజు వరకూ రాహేలు సమాధి స్తంభంగా నిలిచి ఉంది.
آنگاه یعقوب از آنجا کوچ کرد و در آن طرف برج عیدر خیمه زد. 21
౨౧ఇశ్రాయేలు ప్రయాణం కొనసాగించి మిగ్దల్‌ ఏదెరుకు అవతల తన గుడారం వేసుకున్నాడు.
در همین‌جا بود که رئوبین با بلهه کنیز پدرش همبستر شد و یعقوب از این جریان آگاهی یافت. 22
౨౨ఇశ్రాయేలు ఆ దేశంలో నివసిస్తున్నప్పుడు రూబేను తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. ఆ సంగతి ఇశ్రాయేలుకు తెలిసింది.
یعقوب دوازده پسر داشت که اسامی آنها از این قرار است: پسران لیه: رئوبین (بزرگترین فرزند یعقوب)، شمعون، لاوی، یهودا، یساکار و زبولون. 23
౨౩యాకోబు కొడుకులు పన్నెండు మంది. యాకోబు జ్యేష్ఠకుమారుడు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను. వీరు లేయా కొడుకులు.
پسران راحیل: یوسف و بنیامین. 24
౨౪యోసేపు, బెన్యామీను. వీరు రాహేలు కొడుకులు.
پسران بلهه کنیز راحیل: دان و نفتالی. 25
౨౫రాహేలు దాసి అయిన బిల్హా కొడుకులు దాను, నఫ్తాలి.
جاد و اشیر هم از زلفه، کنیز لیه بودند. همه پسران یعقوب در فَدّان‌اَرام متولد شدند. 26
౨౬లేయా దాసి అయిన జిల్పా కొడుకులు గాదు, ఆషేరు. వీరంతా పద్దనరాములో యాకోబుకు పుట్టిన కొడుకులు.
سرانجام یعقوب نزد پدر خود اسحاق به قریهٔ اربع واقع در مِلک ممری آمد. (آن قریه را حبرون نیز می‌گویند. حبرون همان جایی است که ابراهیم و اسحاق در آن در غربت به سر می‌بردند.) 27
౨౭అబ్రాహాము, ఇస్సాకులు నివసించిన మమ్రేలోని కిర్యతర్బాలో తన తండ్రి ఇస్సాకు దగ్గరికి యాకోబు వచ్చాడు. అదే హెబ్రోను.
اسحاق ۱۸۰ سال زندگی کرد. 28
౨౮ఇస్సాకు నూట ఎనభై సంవత్సరాలు బతికాడు.
آنگاه آخرین نفسش را برآورده، در کمال پیری وفات یافت و به اجداد خویش پیوست و پسرانش عیسو و یعقوب او را دفن کردند. 29
౨౯ఇస్సాకు కాలం నిండిన వృద్ధుడై చనిపోయి తన పూర్వికుల దగ్గరికి చేరిపోయాడు. అతని కొడుకులు ఏశావు, యాకోబు అతణ్ణి సమాధి చేశారు.

< پیدایش 35 >