< دانیال 12 >
آن فرستادهٔ آسمانی که لباس کتان بر تن داشت، در ادامهٔ سخنانش گفت: «در آن زمان، فرشتهٔ اعظم، میکائیل، به حمایت از قوم تو برخواهد خاست. سپس چنان دوران سختی پیش خواهد آمد که در تاریخ بشر بیسابقه بوده است، اما هر که از قوم تو نامش در کتاب خدا نوشته شده باشد، رستگار خواهد شد. | 1 |
౧“ఆ కాలంలో నీ ప్రజల పక్షాన నిలిచే మహా అధిపతి మిఖాయేలు వస్తాడు. అప్పుడు నీ ప్రజలు రాజ్యంగా కూడిన కాలం మొదలుకుని ఈ కాలం వరకూ ఎప్పుడూ కలగనంత ఆపద కలుగుతుంది. అయితే నీ ప్రజల్లో గ్రంథంలో పేరున్న వారు తప్పించుకుంటారు.
«تمام مردگان زنده خواهند شد بعضی برای زندگی جاودانی و برخی برای شرمساری و خواری جاودانی. | 2 |
౨సమాధుల్లో నిద్రించే చాలా మంది మేలుకుంటారు. కొందరు నిత్యజీవం అనుభవించడానికి, కొందరు నిందపాలు కావడానికి నిత్యంగా అసహ్యులై పోవడానికి మేలుకుంటారు.
«حکیمان همچون آفتاب خواهند درخشید و کسانی که بسیاری را به راه راست هدایت کردهاند، چون ستارگان تا ابد درخشان خواهند بود.» | 3 |
౩బుద్ధిమంతులైతే ఆకాశమండలం లోని జ్యోతులను పోలి ప్రకాశిస్తారు. నీతిమార్గం అనుసరించి నడుచుకొనేలా ఎవరు అనేకమందిని తిప్పుతారో వారు నక్షత్రాల వలె నిరంతరం ప్రకాశిస్తారు.
سپس به من گفت: «اما تو ای دانیال، این پیشگویی را مثل یک راز نگه دار؛ آن را مهر کن تا وقتی که زمان آخر فرا رسد. بسیاری به سرعت حرکت خواهند کرد و عِلم خواهد افزود.» | 4 |
౪దానియేలూ, నీవు ఈ మాటలను దాచి అంత్యకాలం వరకూ ఈ గ్రంథానికి సీలు వెయ్యి. చాలామంది నలుదిశల సంచరించినందువల్ల తెలివి అధికమవుతుంది.”
آنگاه من، دانیال، نگاه کردم و دو نفر دیگر را نیز دیدم که یکی در این سوی رودخانه و دیگری در آن سوی آن ایستاده بودند. | 5 |
౫దానియేలు అనే నేను చూస్తుండగా మరి ఇద్దరు మనుషులు ఏటి అవతలి ఒడ్డున ఒకడు, ఇవతలి ఒడ్డున ఒకడు నిలబడ్డారు.
یکی از آنها از آن فرستادهٔ آسمانی که لباس کتان بر تن داشت و در این هنگام بالای رودخانه ایستاده بود، پرسید: «چقدر طول خواهد کشید تا این وقایع عجیب به پایان برسد؟» | 6 |
౬ఆ యిద్దరిలో ఒకడు నార బట్టలు వేసుకుని ఏటి ఎగువ భాగాన ఉన్న వ్యక్తిని చూసి ఈ ఆశ్చర్యకరమైనవి ఎప్పుడు పూర్తి అవుతాయని అడిగాడు.
او در جواب، دو دست خود را به سوی آسمان بلند کرد و به خدایی که تا ابد باقی است قسم خورد و گفت: «این وضع تا سه سال و نیم طول خواهد کشید. وقتی ظلم و ستمی که بر قوم خدا میشود پایان یابد، این وقایع نیز به پایان خواهد رسید.» | 7 |
౭నారబట్టలు వేసుకుని ఏటి ఎగువన ఉన్న మనిషి మాట నేను విన్నాను. అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశం వైపుకు ఎత్తి నిత్యజీవి అయిన ఆయన నామంలో ఒట్టు పెట్టుకుని “ఒక కాలం కాలాలు అర్థకాలం పరిశుద్ధ జనం బలాన్ని కొట్టివేయడం అయిపోయాక వ్యవహారాలన్నీ సమాప్తమై పోతాయి” అన్నాడు.
آنچه را که او گفت شنیدم، ولی آن را درک نکردم. پس گفتم: «ای سرورم، آخر این وقایع چه خواهد شد.» | 8 |
౮నేను విన్నాను గాని గ్రహింపలేకపోయాను. “స్వామీ, వీటికి అంతమేమిటి?” అని అడిగాను.
او جواب داد: «ای دانیال، تو راه خود را ادامه بده، زیرا آنچه گفتهام مهر خواهد شد و مخفی خواهد ماند تا زمان آخر فرا رسد. | 9 |
౯అతడు “ఈ సంగతులు అంత్యకాలం వరకూ అగోచరంగా ఉండేలా సీలు చేసి ఉన్నాయి గనక, దానియేలూ, నీవు ఊరుకో” అని చెప్పాడు.
عدهٔ زیادی پاک و طاهر خواهند شد، ولی بدکاران به کارهای بدشان ادامه خواهند داد. از بدکاران هیچکدام چیزی نخواهند فهمید، اما حکیمان همه چیز را درک خواهند کرد. | 10 |
౧౦చాలా మంది తమను శుద్ధిపరచుకుని ప్రకాశవంతులు, నిర్మలులు అవుతారు. దుష్టులు దుష్ట కార్యాలు చేస్తారు గనక అలాంటివాడు ఎవడూ ఈ సంగతులు గ్రహించలేడు. బుద్ధిమంతులు మాత్రమే గ్రహిస్తారు.
«از وقتی که تقدیم قربانیهای روزانه منع شود و مکروه ویرانگر در خانهٔ خدا بر پا گردد، یک دورهٔ هزار و دویست و نود روزه سپری خواهد شد. | 11 |
౧౧అనుదిన బలి నిలుపు చేయబడిన కాలం మొదలు నాశనం కలగజేసే హేయమైన దాన్ని నిలబెట్టే వరకూ 1, 290 దినాలౌతాయి.
خوشا به حال آن که صبر میکند تا به پایان دورهٔ هزار و سیصد و سی و پنج روزه برسد! | 12 |
౧౨1, 335 దినాలు గడిచే వరకూ ఎదురు చూసేవాడు ధన్యుడు.
«اما ای دانیال، تو راه خود را ادامه بده تا پایان زندگیات فرا رسد و بیارامی. اما بدان که در زمان آخر زنده خواهی شد تا پاداش خود را بگیری.» | 13 |
౧౩నీవు కడవరకూ నిలకడగా ఉంటే విశ్రాంతి నొంది కాలం అంతమయ్యేటప్పుడు నీకు నియమించిన పదవి పొందుతావు.