< اول سموئیل 20 >
داوود از نایوت رامه فرار کرد و پیش یوناتان رفت و به او گفت: «مگر من چه گناهی کردهام و چه بدی در حق پدرت انجام دادهام که میخواهد مرا بکشد؟» | 1 |
౧తరువాత దావీదు రమాలోని నాయోతు నుండి పారిపోయి యోనాతాను దగ్గరకు వచ్చి “నేనేం చేశాను? నా తప్పు ఏంటి? నా ప్రాణం తీసేందుకు వెతికేలా మీ నాన్న దృష్టిలో నేను ఏం పాపం చేశాను?” అని అడిగాడు,
یوناتان جواب داد: «تو اشتباه میکنی. پدرم هرگز چنین قصدی ندارد، چون هر کاری بخواهد بکند، هر چند جزئی باشد، همیشه با من در میان میگذارد. اگر او قصد کشتن تو را میداشت، به من میگفت.» | 2 |
౨యోనాతాను “నువ్వు ఎన్నటికీ అలా అనుకోవద్దు, నువ్వు చనిపోవు. నాకు చెప్పకుండా మా తండ్రి చిన్న పనైనా, పెద్ద పనైనా చెయ్యడు. అతడు ఈ విషయం నాకు చెప్పకుండా ఎందుకు ఉంటాడు?” అన్నాడు.
داوود گفت: «پدرت میداند که تو مرا دوست داری، به همین دلیل این موضوع را با تو در میان نگذاشته است تا ناراحت نشوی. به خداوند زنده و به جان تو قسم که من با مرگ یک قدم بیشتر فاصله ندارم.» | 3 |
౩దావీదు “నేను నీకు అనుకూలంగా ఉన్న విషయం మీ తండ్రికి బాగా తెలుసు కాబట్టి నీకు బాధ కలిగించడం ఇష్టంలేక నీకు చెప్పడం లేదు. యెహోవా మీద ఒట్టు, నీ మీద ఒట్టు, నిజంగా నాకూ, మరణానికి ఒక్క అడుగు దూరం మాత్రమే ఉంది” అని ప్రమాణపూర్తిగా చెప్పాడు.
یوناتان با ناراحتی گفت: «حال میگویی من چه کنم؟» | 4 |
౪యోనాతాను “నువ్వు ఎలా చేయమంటే నీ తరపున అలా చేస్తాను” అన్నాడు.
داوود پاسخ داد: «فردا جشن اول ماه است و من مثل همیشه در این موقع باید با پدرت سر سفره بنشینم. ولی اجازه بده تا عصر روز سوم، خود را در صحرا پنهان کنم. | 5 |
౫అప్పుడు దావీదు “రేపు అమావాస్య. అప్పుడు నేను తప్పక రాజుతో కలసి కూర్చుని భోజనం చెయ్యాలి. ఎల్లుండి సాయంత్రం వరకూ పొలంలో దాక్కోడానికి నాకు అనుమతి ఇవ్వు.
اگر پدرت سراغ مرا گرفت، بگو که داوود از من اجازه گرفته است تا برای شرکت در مراسم قربانی سالیانهٔ خانوادهٔ خود به بیتلحم برود. | 6 |
౬నేను లేకపోవడం మీ తండ్రి గమనించినప్పుడు నువ్వు ఈ మాట చెప్పాలి, ‘దావీదు ఇంటివారు ప్రతి ఏడూ బలి చెల్లించడం వారి ఆనవాయితీ. అందువల్ల అతడు బేత్లెహేమనే తన ఊరు వెళ్ళాలని నన్ను బతిమాలి నా దగ్గర అనుమతి తీసుకున్నాడు.’
اگر بگوید: بسیار خوب، آنگاه معلوم میشود قصد کشتن مرا ندارد. ولی اگر خشمگین شود، آنگاه میفهمیم که نقشه کشیده مرا بکشد. | 7 |
౭మీ తండ్రి అలాగేనని సమ్మతించిన పక్షంలో నీ దాసుడనైన నాకు క్షేమమే. అతడు బాగా కోపగించి మనసులో నాకు కీడు చేయాలని సంకల్పిస్తే నువ్వు తెలుసుకుని
به خاطر آن عهد دوستیای که در حضور خداوند با هم بستیم، این لطف را در حق من بکن و اگر فکر میکنی من مقصرم، خودت مرا بکش، ولی مرا به دست پدرت تسلیم نکن!» | 8 |
౮నీ దాసుడనైన నాకు ఒక మేలు చెయ్యాలి. ఏమిటంటే యెహోవా పేరట నీతో నిబంధన చేయడానికి నువ్వు నీ దాసుడనైన నన్ను రప్పించావు. నాలో ఏమైనా తప్పు ఉంటే మీ నాన్న దగ్గరికి నన్నెందుకు తీసుకువెళ్తావు? నువ్వే నన్ను చంపెయ్యి” అని యోనాతానును కోరాడు.
یوناتان جواب داد: «این حرف را نزن! اگر بدانم پدرم قصد کشتن تو را دارد، بدان که به تو اطلاع خواهم داد!» | 9 |
౯యోనాతాను “అలాంటి మాటలు ఎప్పటికీ అనవద్దు. మా తండ్రి నీకు కీడు చేయడానికి నిర్ణయించుకున్నాడని నాకు తెలిస్తే నీతో చెబుతాను గదా” అన్నాడు.
آنگاه داوود پرسید: «چگونه بدانم پدرت با عصبانیت جواب تو را داده است یا نه؟» | 10 |
౧౦దావీదు “మీ తండ్రి నన్నుగూర్చి నీతో కఠినంగా మాట్లాడినప్పుడు దాన్ని నాకు ఎవరు తెలియచేస్తారు?” అని యోనాతానును అడిగాడు.
یوناتان پاسخ داد: «بیا به صحرا برویم.» پس آنها با هم به صحرا رفتند. | 11 |
౧౧అప్పుడు యోనాతాను “పొలంలోకి వెళ్దాం రా” అంటే, ఇద్దరూ పొలంలోకి వెళ్లారు.
سپس یوناتان به داوود گفت: «به خداوند، خدای اسرائیل قسم میخورم که پس فردا همین موقع راجع به تو با پدرم صحبت میکنم و تو را در جریان میگذارم. | 12 |
౧౨అప్పుడు యోనాతాను “ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవాయే సాక్ష్యం. రేపైనా, ఎల్లుండైనా, ఈ రోజైనా మా తండ్రిని అడుగుతాను, అప్పుడు దావీదుకు క్షేమం కలుగుతుందని నేను తెలుసుకొన్నప్పుడు ఆ సమాచారం పంపిస్తాను.
اگر او خشمگین باشد و قصد کشتن تو را داشته باشد، من به تو خبر میدهم تا فرار کنی. اگر این کار را نکنم، خداوند خودش مرا بکشد. دعا میکنم که هر جا میروی، خداوند با تو باشد، همانطور که با پدرم بود. | 13 |
౧౩అయితే నా తండ్రి నీకు కీడు చేయాలని ఉద్దేశిస్తున్నాడని నాకు తెలిస్తే అది నీకు తెలియజేసి నీవు క్షేమంగా వెళ్ళేలా నిన్ను పంపించకపోతే యెహోవా నాకు గొప్ప కీడు కలుగచేస్తాడు గాక. యెహోవా నా తండ్రికి తోడుగా ఉండినట్లు నీకూ తోడుగా ఉంటాడు గాక.
به من قول بده که نه فقط نسبت به من خوبی کنی، بلکه بعد از من نیز وقتی خداوند تمام دشمنانت را نابود کرد لطف تو هرگز از سر فرزندانم کم نشود.» | 14 |
౧౪అయితే నేనింకా బతికి ఉంటే నేను చావకుండా యెహోవా నిబంధన విశ్వాస్యతను నువ్వు నా పట్ల చూపిస్తావు కదా?
౧౫నేను మరణించిన తరువాత యెహోవా దావీదు శత్రువుల్లో ఒక్కడైనా భూమిపై లేకుండా నాశనం చేసిన తరువాత నువ్వు నా సంతతి పట్ల దయ చూపించకపోతే యెహోవా నిన్ను విసర్జిస్తాడు గాక.”
پس یوناتان با خاندان داوود عهد بست و گفت: «خداوند از دشمنان تو انتقام گیرد.» | 16 |
౧౬ఇలా యోనాతాను దావీదు వంశంతో నిబంధన చేశాడు. “ఈ విధంగా యెహోవా దావీదు శత్రువులు లెక్క అప్పగించేలా చేస్తాడు గాక” అని అతడు అన్నాడు.
یوناتان داوود را مثل جان خودش دوست میداشت و بار دیگر او را به دوستیای که با هم داشتند قسم داد. | 17 |
౧౭యోనాతాను దావీదును తన ప్రాణస్నేహితుడిగా ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమను బట్టి దావీదు చేత తిరిగి ప్రమాణం చేయించాడు.
آنگاه یوناتان گفت: «فردا جشن ماه نو است و سر سفره جای تو خالی خواهد بود. | 18 |
౧౮యోనాతాను దావీదుతో ఇలా అన్నాడు. “రేపు అమావాస్య. నువ్వుండే స్థలం ఖాళీగా కనబడుతుంది గదా నీవు లేని విషయం తెలిసిపోతుంది.
پس فردا، سراغ تو را خواهند گرفت. بنابراین تو به همان جای قبلی برو و پشت سنگی که در آنجاست بنشین. | 19 |
౧౯నువ్వు మూడు రోజులు ఆగి, ఈ పని జరుగుతుండగా నువ్వు దాక్కొన్న స్థలానికి త్వరగా వెళ్లి ఏసెలు అనే బండ దగ్గర ఉండు.
من میآیم و سه تیر به طرف آن میاندازم و چنین وانمود میکنم که برای تمرین تیراندازی، سنگ را هدف قرار دادهام. | 20 |
౨౦గురి చూసి వేసినట్టు నేను మూడు బాణాలు పక్కగా వేసి,
بعد نوکرم را میفرستم تا تیرها را بیاورد. اگر شنیدی که من به او گفتم: تیرها این طرف است آنها را بردار. به خداوند زنده قسم که خطری متوجه تو نیست؛ | 21 |
౨౧‘నీవు వెళ్లి బాణాలు వెతుకు’ అని ఒక పనివాడితో చెబుతాను, ‘బాణాలు నీకు ఈ వైపున ఉన్నాయి, వాటిని తీసుకురా’ అని అతనితో చెబితే నువ్వు బయటికి రావచ్చు. యెహోవాపై ఒట్టు, నీకు ఎలాంటి ప్రమాదం జరగదు, క్షేమమే కలుతుంది.
ولی اگر گفتم: جلوتر برو، تیرها آن طرف است، باید هر چه زودتر فرار کنی چون خداوند چنین میخواهد. | 22 |
౨౨అయితే, ‘బాణాలు నీకు అవతల వైపు ఉన్నాయి’ అని నేను సేవకునితో చెప్పినప్పుడు పారిపొమ్మని యెహోవా సెలవిస్తున్నాడని గ్రహించి నువ్వు ప్రయాణమైపోవాలి.
در ضمن در مورد عهدی که با هم بستیم، یادت باشد که خداوند تا ابد شاهد آن است.» | 23 |
౨౩అయితే మనమిద్దరం మాట్లాడుకొన్న విషయాలను జ్ఞాపకం ఉంచుకో. సదాకాలం యెహోవాయే మనకు సాక్షి.”
پس داوود در صحرا پنهان شد. وقتی جشن اول ماه شروع شد، پادشاه برای خوردن غذا در جای همیشگی خود کنار دیوار نشست. یوناتان در مقابل او و اَبنیر هم کنار شائول نشستند، ولی جای داوود خالی بود. | 24 |
౨౪అప్పుడు దావీదు పొలంలో దాక్కున్నాడు. అమావాస్యనాడు రాజు భోజనం బల్ల దగ్గర కూర్చున్నప్పుడు
౨౫ఎప్పటిలాగానే రాజు గోడ దగ్గర ఉన్న స్థలం లో తన ఆసనంపై కూర్చుని ఉన్నాడు. యోనాతాను లేచినపుడు అబ్నేరు సౌలు దగ్గర కూర్చున్నాడు. అయితే దావీదు కూర్చునే స్థలం ఖాళీగా ఉంది.
آن روز شائول در این مورد چیزی نگفت چون پیش خود فکر کرد: «لابد اتفاقی برای داوود افتاده که او را نجس کرده و به همین دلیل نتوانسته است در جشن شرکت کند. بله، بدون شک او طاهر نیست.» | 26 |
౨౬“ఏదో జరిగి అతడు మైలబడ్డాడు. అతడు తప్పక అపవిత్రుడై ఉంటాడు” అని సౌలు అనుకున్నాడు. ఆ రోజు అతడు ఏమీ మాట్లాడలేదు.
اما وقتی روز بعد هم جای داوود خالی ماند، شائول از یوناتان پرسید: «پسر یَسا کجاست؟ نه دیروز سر سفره آمد نه امروز!» | 27 |
౨౭అయితే అమావాస్య తరువాతి రోజు, అంటే రెండవ రోజు దావీదు కూర్చునే స్థలం లో ఎవరూ లేకపోవడం చూసి సౌలు “నిన్న, నేడు యెష్షయి కొడుకు భోజనానికి రాకపోవడానికి కారణం ఏంటి?” అని యోనాతానును అడిగితే,
یوناتان پاسخ داد: «داوود از من خیلی خواهش کرد تا اجازه بدهم به بیتلحم برود. به من گفت که برادرش از او خواسته است در مراسم قربانی خانوادهاش شرکت کند. پس من هم به او اجازه دادم برود، به همین دلیل بر سر سفرۀ پادشاه حاضر نشده است.» | 28 |
౨౮యోనాతాను “దావీదు బేత్లెహేముకు వెళ్ళాలని ఆశించి,
౨౯దయచేసి నన్ను వెళ్లనివ్వు, పట్టణంలో మా యింటివారు బలి అర్పించబోతున్నారు, నువ్వు కూడా రావాలని మా అన్న నాకు కబురు పంపాడు. కాబట్టి నాపై దయ చూపించి నేను వెళ్లి నా సోదరులను కలుసుకోనేలా నాకు సెలవిమ్మని బతిమాలుకుని నా దగ్గర సెలవు తీసుకున్నాడు. అందువల్లనే అతడు రాజుగారి భోజనపు బల్ల దగ్గరికి రాలేదు” అని సౌలుతో చెప్పాడు.
شائول خشمگین شد و سر یوناتان فریاد زد: «ای حرامزاده! خیال میکنی من نمیدانم که تو از این پسر یَسا طرفداری میکنی؟ تو با این کار هم خودت و هم مادرت را بیآبرو میکنی! | 30 |
౩౦సౌలు యోనాతానుపై తీవ్రంగా కోపగించి “వక్రబుద్ధి గల తిరుగుబోతుదాని కొడుకా, నీకూ నీ తల్లికీ అవమానం కలిగేలా నువ్వు యెష్షయి కుమారుణ్ణి స్నేహితుడిగా ఎంచుకొన్న సంగతి నాకు తెలియదా?
تا زمانی که او زنده باشد تو به مقام پادشاهی نخواهی رسید. حال برو و او را اینجا بیاور تا کشته شود!» | 31 |
౩౧యెష్షయి కొడుకు భూమిమీద బతికి ఉన్నంత కాలం నువ్వైనా, నీ రాజ్యమైనా స్థిరంగా ఉండవని నీకు తెలుసు గదా. కాబట్టి నువ్వు కబురు పంపి అతణ్ణి నా దగ్గరికి రప్పించు. నిజంగా అతడు చనిపోవలసిందే” అన్నాడు.
اما یوناتان به پدرش گفت: «مگر او چه کرده است؟ چرا میخواهی او را بکشی؟» | 32 |
౩౨అందుకు యోనాతాను “అతడెందుకు మరణశిక్ష పొందాలి? అతడు ఏమి చేశాడు” అని సౌలును అడగగా,
آنگاه شائول نیزهٔ خود را به طرف یوناتان انداخت تا او را بکشد. پس برای یوناتان شکی باقی نماند که پدرش قصد کشتن داوود را دارد. | 33 |
౩౩సౌలు యోనాతానును పొడవాలని ఈటె విసిరాడు. దీన్నిబట్టి తన తండ్రి దావీదును చంపే ఉద్దేశం కలిగి ఉన్నాడని యోనాతాను తెలుసుకుని,
یوناتان با عصبانیت از سر سفره بلند شد و آن روز چیزی نخورد، زیرا رفتار زشت پدرش نسبت به داوود او را ناراحت کرده بود. | 34 |
౩౪అమితమైన కోపం తెచ్చుకుని బల్ల దగ్గర నుండి లేచి, తన తండ్రి దావీదును అవమానపరచినందు వల్ల అతని కోసం దుఃఖపడుతూ అమావాస్య అయిపోయిన మరుసటి రోజు భోజనం మానేశాడు.
صبح روز بعد، یوناتان طبق قولی که به داوود داده بود به صحرا رفت و پسری را با خود برد تا تیرهایش را جمع کند. | 35 |
౩౫ఉదయాన్నే యోనాతాను దావీదుతో ముందుగా అనుకొన్న సమయానికి ఒక పనివాణ్ణి పిలుచుకుని పొలంలోకి వెళ్ళాడు.
یوناتان به آن پسر گفت: «بدو و تیرهایی را که میاندازم پیدا کن.» وقتی آن پسر میدوید، تیر را چنان انداخت که از او رد شد. | 36 |
౩౬“నువ్వు పరుగెత్తుకొంటూ వెళ్ళి నేను వేసే బాణాలను వెతుకు” అని ఆ పనివాడితో చెప్పినప్పుడు వాడు పరుగెత్తుతుంటే అతడు ఒక బాణం వాడి అవతలి పక్కకు వేశాడు.
وقتی آن پسر به تیری که انداخته شده بود نزدیک میشد، یوناتان فریاد زد: «جلوتر برو، تیر آن طرف است. | 37 |
౩౭అయితే వాడు యోనాతాను వేసిన బాణం ఉన్నచోటుకు వస్తే యోనాతాను వాని వెనుక నుండి కేక వేసి “బాణం నీ అవతల ఉంది” అని చెప్పి
زود باش، بدو.» آن پسر همهٔ تیرها را جمع کرده، پیش یوناتان آورد. | 38 |
౩౮“నువ్వు ఆలస్యం చేయకుండా త్వరగా రా” అని కేక వేశాడు. యోనాతాను పనివాడు బాణాలు ఏరుకుని తన యజమాని దగ్గరికి వాటిని తీసుకువచ్చాడు గాని
پسرک از همه جا بیخبر بود، اما یوناتان و داوود میدانستند چه میگذرد. | 39 |
౩౯సంగతి ఏమిటో అతనికి తెలియలేదు. యోనాతానుకు, దావీదుకు మాత్రమే ఆ సంగతి తెలుసు.
یوناتان تیر و کمان خود را به آن پسر داد تا به شهر ببرد. | 40 |
౪౦యోనాతాను తన ఆయుధాలను పనివాడి చేతికి ఇచ్చి “వీటిని పట్టణానికి తీసుకువెళ్ళు” అని చెప్పి అతణ్ణి పంపివేసాడు.
به محض آنکه یوناتان پسر را روانهٔ شهر نمود، داوود از مخفیگاه خود خارج شده، نزد یوناتان آمد و روی زمین افتاده، سه بار جلوی او خم شد. آنها یکدیگر را بوسیده، با هم گریه کردند. داوود نمیتوانست جلوی گریهٔ خود را بگیرد. | 41 |
౪౧పనివాడు వెళ్లిపోగానే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటికి వచ్చి మూడుసార్లు సాష్టాంగ నమస్కారం చేసిన తరవాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకొంటూ ఏడ్చారు. అయితే దావీదు మాత్రం మరింత గట్టిగా ఏడ్చాడు.
سرانجام یوناتان به داوود گفت: «به سلامتی برو، چون ما هر دو با هم در حضور خداوند عهد بستهایم که تا ابد نسبت به هم و اولاد یکدیگر وفادار بمانیم.» پس آنها از همدیگر جدا شدند. داوود از آنجا رفت و یوناتان به شهر برگشت. | 42 |
౪౨అప్పుడు యోనాతాను “యెహోవా నీకూ నాకూ, నీ సంతానానికీ నా సంతానానికీ మధ్య ఎల్లవేళలా సాక్షిగా ఉంటాడు గాక. మనమిద్దరం యెహోవా నామాన్ని బట్టి ఒట్టు పెట్టుకున్నాము కాబట్టి మనసులో నెమ్మది పొంది వెళ్ళు” అని దావీదుతో చెబితే దావీదు లేచి వెళ్లిపోగా, యోనాతాను తిరిగి పట్టణానికి వచ్చాడు.