< اول سموئیل 2 >
حنا چنین دعا کرد: «خداوند قلب مرا از شادی لبریز ساخته است، او به من قدرت بخشیده و مرا تقویت نموده است. بر دشمنانم میخندم و خوشحالم، چون خداوند مرا یاری کرده است! | 1 |
౧హన్నా ప్రార్థన చేస్తూ ఇలా అంది, “నా హృదయం యెహోవాలో సంతోషిస్తూ ఉంది. యెహోవాలో నాకు ఎంతో బలం కలిగింది. నీ ద్వారా కలిగిన రక్షణను బట్టి సంతోషిస్తున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడతాను.
«هیچکس مثل خداوند مقدّس نیست، غیر از او خدایی نیست، مثل خدای ما صخرهای نیست. | 2 |
౨యెహోవా లాంటి పరిశుద్ధ దేవుడు ఎవరూ లేరు. నువ్వు కాకుండా ఇంక ఏ దేవుడూ లేడు మన దేవుడిలాంటి ఆశ్రయం ఎక్కడా లేదు.
«از سخنان و رفتار متکبرانه دست بردارید، زیرا یهوه، خدای دانا است؛ اوست که کارهای مردم را داوری میکند. | 3 |
౩యెహోవా దేవుని జ్ఞానం అనంతమైంది. మన కార్యాలను పరిశీలించేవాడు ఆయనే. కాబట్టి ఇకపై ఎవరూ గర్వంగా మాట్లాడవద్దు. అహంకారమైన మాటలు మీ నోట నుంచి రానియ్యవద్దు.
کمان جنگاوران شکسته شد، اما افتادگان قوت یافتند. | 4 |
౪పేరుగాంచిన విలుకాళ్ళు ఓడిపోతారు. తొట్రిల్లి పడిపోయినవారు బలం పొందుతారు.
آنانی که سیر بودند برای نان، خود را اجیر کردند، ولی کسانی که گرسنه بودند سیر و راحت شدند. زن نازا هفت فرزند زاییده است، اما آنکه فرزندان زیاد داشت، بیاولاد شده است. | 5 |
౫తృప్తిగా భోజనం చేసినవారు అన్నం కోసం కూలి పనికి వెళ్తారు. ఆకలి వేసినవారు కడుపునిండా తింటారు. గొడ్రాలు ఏడుగురు పిల్లలను కంటుంది. ఎక్కువమంది పిల్లలను కనిన స్త్రీ కృశించిపోతుంది.
«خداوند میمیراند و زنده میکند، به گور فرو میبرد و بر میخیزاند. (Sheol ) | 6 |
౬మనుషులను సజీవులుగానూ, మృతులుగానూ చేసేవాడు యెహోవాయే. పాతాళానికి పంపిస్తూ అక్కడినుండి రప్పించే వాడూ ఆయనే. (Sheol )
خداوند فقیر میکند و غنی میسازد، پست میکند و بلند میگرداند. | 7 |
౭యెహోవా దరిద్రతను, ఐశ్వర్యాన్ని కలుగ జేసేవాడు. కుంగిపోయేలా చేసేవాడూ, లేవనెత్తేవాడూ ఆయనే.
فقیر را از خاک بر میافرازد، محتاج را از بدبختی بیرون میکشد، و ایشان را چون شاهزادگان بر تخت عزت مینشاند. ستونهای زمین از آن خداوند است، او بر آنها زمین را استوار کرده است. | 8 |
౮దరిద్రులను అధికారులతో కలసి కూర్చోబెట్టేవాడూ, మహిమగల సింహాసనంపై కూర్చునేలా చేసేవాడూ వారిని మట్టిలోనుండి పైకి ఎత్తే వాడు ఆయనే. పేదవారిని పెంటకుప్పపై నుండి పైకి లేపేవాడు ఆయనే. భూమి ఆధార స్తంభాలు యెహోవా ఆధీనంలో ఉన్నాయి. ఆయన లోకాన్ని వాటిపై నిలిపి ఉంచాడు.
«خدا مقدّسین خود را حفظ میکند، اما بدکاران در تاریکی محو میشوند؛ انسان با قدرت خود نیست که موفق میشود. | 9 |
౯తన భక్తుల పాదాలు తొట్రుపడకుండా ఆయన వారిని కాపాడతాడు. దుర్మార్గులు చీకటిలో దాక్కొంటారు. బలం వలన ఎవరూ విజయం సాధించలేరు.
کسانی که با خداوند مخالفت کنند نابود میگردند. خدا بر آنها از آسمان صاعقه خواهد فرستاد؛ خداوند بر تمام دنیا داوری خواهد کرد. او به پادشاه خود قدرت میبخشد، و برگزیدهٔ خود را پیروز میگرداند.» | 10 |
౧౦యెహోవాతో వాదులాడేవారు నాశనమైపోతారు. పరలోకం నుండి ఆయన వారి మీద ఉరుములాగా గర్జిస్తాడు. భూదిగంతాల ప్రజలకు ఆయన తీర్పు తీరుస్తాడు. తాను నిలబెట్టిన రాజుకు ఆయన బలమిస్తాడు. తాను అభిషేకించిన రాజుకు అధికమైన బలం కలిగిస్తాడు.”
آنگاه القانه به خانهٔ خود در رامه برگشت، ولی سموئیل در شیلوه ماند و زیر نظر عیلی به خدمت خداوند مشغول شد. | 11 |
౧౧తరువాత ఎల్కానా రమాలోని తన ఇంటికి వెళ్లిపోయాడు. అయితే ఆ పిల్లవాడు యాజకుడైన ఏలీ సమక్షంలో యెహోవాకు సేవ చేస్తున్నాడు.
اما پسران خود عیلی بسیار فاسد بودند و خداوند را نمیشناختند. | 12 |
౧౨ఏలీ కుమారులు యెహోవా మార్గాలు తెలియని దుర్మార్గులు.
وقتی کسی قربانی میکرد و گوشت قربانی را در دیگ میگذاشت تا بپزد، آنها یکی از نوکران خود را با چنگال سه دندانهای میفرستادند تا آن را به داخل دیگ فرو برد و از گوشتی که در حال پختن بود هر قدر بیرون میآمد برای ایشان ببرد. پسران عیلی به همین طریق با تمام بنیاسرائیل که برای عبادت به شیلوه میآمدند، رفتار میکردند. | 13 |
౧౩ప్రజల విషయంలో యాజకులు చేస్తున్న పని ఏమిటంటే, ఎవరైనా బలిగా అర్పించిన తరువాత మాంసం ఉడుకుతూ ఉన్నపుడు యాజకుని మనుషులు మూడుముళ్ళు ఉన్న కొంకిని తీసుకు వచ్చి
౧౪డేక్సాలో గాని తపేలాలో గాని గుండిగలో గాని కుండలో గాని గుచ్చినపుడు ఆ కొంకికి గుచ్చుకుని బయటకు వచ్చేదంతా యాజకుడు తన కోసం తీసుకొంటాడు. షిలోహుకు వచ్చే ఇశ్రాయేలీయులు అందరికీ వీరు ఇలాగే చేస్తూ వచ్చారు.
گاهی نوکر ایشان پیش کسانی که میخواستند قربانی کنند میآمد و پیش از سوزاندن چربی قربانی، از آنها گوشت مطالبه میکرد؛ او به جای گوشت پخته، گوشت خام میخواست تا برای پسران عیلی کباب کند. | 15 |
౧౫అంతేకాక, వారు కొవ్వును దహించక ముందు యాజకుని పనివాడు వచ్చి బలిపశువును వధించేవాడితో “యాజకుని కోసం వండడానికి మాంసం ఇవ్వు. ఉడకబెట్టిన మాంసం అతడు తీసుకోడు, పచ్చిమాంసమే కావాలి” అనేవాడు.
اگر کسی اعتراض مینمود و میگفت: «اول بگذار چربی آن بر مذبح سوزانده شود، بعد هر قدر گوشت میخواهی بردار.» آن نوکر میگفت: «نه، گوشت را حالا به من بده، و گرنه خودم به زور میگیرم.» | 16 |
౧౬“అలా కాదు, ముందు కొవ్వును దహించాలి, తరువాత నీకు కావలసినంత తీసికోవచ్చు” అని అతనితో చెబితే, వాడు “అలా వద్దు, ఇప్పుడే ఇవ్వాలి, లేకపోతే బలవంతంగా తీసుకుంటాం” అనేవాడు.
گناه آن مردان جوان در نظر خداوند بسیار عظیم بود، زیرا به قربانیهایی که مردم به خداوند تقدیم میکردند، بیاحترامی مینمودند. | 17 |
౧౭అందువల్ల ప్రజలు యెహోవాకు నైవేద్యం అర్పించడం మానివేసి దాని విషయం అసహ్యపడడానికి ఆ యువకులు కారణమయ్యారు. కాబట్టి వారు చేస్తున్న పాపం యెహోవా దృష్టికి మితి మీరింది.
سموئیل هر چند بچهای بیش نبود، ولی جلیقهٔ مخصوص کاهنان را میپوشید و خداوند را خدمت مینمود. | 18 |
౧౮బాల సమూయేలు నారతో నేసిన ఏఫోదు ధరించుకుని యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు.
مادرش هر سال یک ردای کوچک برای سموئیل میدوخت و هنگامی که با شوهرش برای قربانی کردن میآمد، آن را به سموئیل میداد. | 19 |
౧౯అతని తల్లి అతనికి చిన్న అంగీ ఒకటి కుట్టి ప్రతి సంవత్సరం బలి అర్పించడానికి తన భర్తతో కలసి వచ్చినప్పుడు దాన్ని తెచ్చి అతనికి ఇస్తూ వచ్చింది.
پیش از بازگشت به خانه، عیلی کاهن، القانه و زنش را برکت میداد و برای ایشان دعا میکرد که خداوند فرزندان دیگر نیز به آنها بدهد تا جای سموئیل را که در خدمت خداوند بود، بگیرند. | 20 |
౨౦“యెహోవా సన్నిధిలో వేడుకొన్నప్పుడు నీకు కలిగిన ఈ సంతానానికి బదులుగా యెహోవా నీకు మరెక్కువ సంతానం ఇస్తాడు” అని ఏలీ ఎల్కానాను, అతని భార్యను దీవించిన తరువాత వారు ఇంటికి వెళ్ళారు.
پس خداوند سه پسر و دو دختر دیگر به حنا بخشید. در ضمن، سموئیل در حضور خداوند رشد میکرد. | 21 |
౨౧యెహోవా హన్నాకు మళ్లీ సహాయం చేయగా ఆమె మళ్లీ గర్భం దాల్చి ముగ్గురు కొడుకులను, ఇద్దరు కూతుళ్ళను కన్నది. అయితే బాల సమూయేలు యెహోవా సన్నిధిలో ఉండి పెరుగుతూ ఉన్నాడు.
عیلی خیلی پیر شده بود. او از رفتار پسرانش با قوم اسرائیل اطلاع داشت و میدانست که پسرانش با زنانی که کنار مدخل خیمهٔ ملاقات خدمت میکنند همخواب میشوند. | 22 |
౨౨ఏలీ చాలా ముసలివాడయ్యాడు. ఇశ్రాయేలీయుల పట్ల తన కొడుకులు చేసిన పనులన్నిటి విషయం, వారు ప్రత్యక్షపు గుడారం ద్వారం దగ్గర సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో వ్యభిచరిస్తున్నారు అనే విషయం విన్నప్పుడు వారిని పిలిచి ఇలా అన్నాడు,
پس به پسرانش گفت: «چرا چنین میکنید؟ دربارهٔ کارهای بد شما از تمام قوم میشنوم. | 23 |
౨౩“ఈ ప్రజల ముందు మీరు చేస్తున్న చెడ్డ పనులు నాకు తెలిశాయి. ఇలాటి పనులు మీరెందుకు చేస్తున్నారు?
ای پسرانم، از این کارها دست بردارید. آنچه از قوم خداوند دربارهٔ شما میشنوم، خوب نیست. | 24 |
౨౪నా కుమారులారా, ఇలా చేయవద్దు. నేను విన్నది మంచిది కాదు. మీరు యెహోవా ప్రజల చేత పాపం చేయిస్తున్నారు.
اگر کسی نسبت به همنوع خود گناه ورزد، خدا ممکن است برای او شفاعت کند، اما برای کسی که بر ضد خود خداوند گناه ورزد، کیست که بتواند شفاعت نماید؟» ولی آنها به سخنان پدر خود گوش ندادند، زیرا خداوند میخواست آنها را هلاک کند. | 25 |
౨౫మనిషి పట్ల మనిషి తప్పు చేస్తే న్యాయాధిపతి శిక్షిస్తాడు. అయితే ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేస్తే అతని కోసం ఎవడు వేడుకుంటాడు?” అయితే యెహోవా వారిని చంపాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి వారు తమ తండ్రి చెప్పిన మాటలు వినలేదు.
اما سموئیل کوچک رشد میکرد و خداوند و مردم او را دوست میداشتند. | 26 |
౨౬బాల సమూయేలు యెహోవాకూ, మనుష్యులకూ ఇష్టమైనవాడుగా పెరుగుతూ ఉన్నాడు.
روزی مرد خدایی نزد عیلی آمد و از طرف خداوند برای او این پیغام را آورد: «آیا خود را بر خاندان پدرت ظاهر نساختم، وقتی که قوم در مصر اسیر فرعون بودند؟ | 27 |
౨౭ఆ సమయంలో దేవుని మనిషి ఒకడు ఏలీ దగ్గరకి వచ్చి ఇలా చెప్పాడు. “యెహోవా నిన్ను గూర్చి చెబుతున్నది ఏమిటంటే, ‘నీ పూర్వికులు ఐగుప్తు దేశంలో ఫరో కింద బానిసత్వంలో ఉన్నప్పుడు నేను వారికి ప్రత్యక్షమయ్యాను.
آیا از میان تمام قبایل اسرائیل، جد تو هارون را انتخاب نکردم تا کاهن من باشد و بر مذبح من قربانی کند و بخور بسوزاند و لباس کاهنی را در حضورم بپوشد؟ آیا تمام هدایایی را که قوم اسرائیل بر آتش تقدیم میکنند، برای شما کاهنان تعیین نکردم؟ | 28 |
౨౮అతడు నా సన్నిధానంలో ఏఫోదును ధరించి నా బలిపీఠం మీద అర్పణ, ధూపం అర్పించడానికి నాకు యాజకుడుగా ఉండేందుకు ఇశ్రాయేలు గోత్రాల్లో నుండి నేను అతణ్ణి ఏర్పరచుకొన్నాను. ఇశ్రాయేలీయులు అర్పించిన హోమ వస్తువులన్నిటినీ నీ పూర్వికుని ఇంటివారికి ఇచ్చాను.
پس چرا اینقدر حریص هستید و قربانیها و هدایایی را که برای من میآورند، تحقیر میکنید؟ چرا پسران خود را بیش از من احترام میکنی؟ تو و پسرانت با خوردن بهترین قسمتِ هدایای قوم من، خود را چاق و فربه ساختهاید. | 29 |
౨౯నా సన్నిధి ఉండే స్థలానికి నేను నిర్ణయించిన బలి నైవేద్యాలను మీరు ఎందుకు తిరస్కరిస్తున్నారు? మిమ్మల్ని మీరు కొవ్వబెట్టుకోడానికి నా ప్రజలైన ఇశ్రాయేలీయులు చేసే నైవేద్యాల్లో శ్రేష్ఠమైన భాగాలను మీరే ఉంచుకొంటూ నాకంటే నీ కొడుకులను నీవు గొప్ప చేస్తున్నావు.
بنابراین، من که خداوند، خدای اسرائیل هستم اعلان میکنم که اگرچه گفتم که خاندان تو و خاندان پدرت برای همیشه کاهنان من خواهند بود، اما شما را از این خدمت برکنار میکنم. هر که مرا احترام کند، او را احترام خواهم نمود و هر که مرا تحقیر کند او را تحقیر خواهم کرد. | 30 |
౩౦నీ ఇంటివారు, నీ పూర్వికుని ఇంటివారు నా సన్నిధిలో యాజకత్వం జరిగిస్తారని నేను వాగ్దానం చేశాను. కానీ ఇప్పుడు అలా కొనసాగించడం నాకు దూరం అగు గాక.’ అని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి యెహోవా మాట ఏమిటంటే, ‘నన్ను గొప్ప చేసేవారిని నేను గొప్పచేస్తాను. నన్ను తిరస్కరించేవారిని తోసిపుచ్చుతాను.’
زمانی میرسد که خاندان تو را برخواهم انداخت به طوری که افراد خانهات همه جوانمرگ شده، به سن پیری نخواهند رسید | 31 |
౩౧జాగ్రత్తగా వినండి, రాబోయే రోజుల్లో నీ బలాన్ని, నీ ఇంటి వంశం బలాన్ని నేను తగ్గిస్తాను. నీ ఇంటి మొత్తంలో ముసలివాడు ఒకడు కూడా ఉండడు.
و چشمان تو مصیبتی را که دامنگیر عبادتگاه من میشود خواهد دید. من به بنیاسرائیل برکت خواهم داد، اما در خاندان تو کسی به سن پیری نخواهد رسید. | 32 |
౩౨నా సన్నిధి స్థలానికి అపాయం సంభవించడం నువ్వు చూస్తావు. యెహోవా ఇశ్రాయేలీయుల కోసం చేయాలనుకొన్న మేలు జరిగిస్తాడు గానీ నీ ఇంట్లో మాత్రం వృద్ధుడు ఎవడూ ఉండడు,
آنانی نیز که از خاندان تو باقی بمانند، باعث غم و رنج تو خواهند شد و تمام نسل تو در جوانی خواهند مرد. | 33 |
౩౩నా బలిపీఠం దగ్గర ఎవరూ లేకుండా నేను అందరినీ నాశనం చేయకుండా విడిచిపెట్టేవాడిని కాదు. కాబట్టి అది నీ కళ్ళు మసకబారడానికి, నువ్వు దుఃఖంతో క్షీణించిపోడానికి కారణమౌతుంది. నీ సంతానమంతా ముసలివాళ్ళు కాకముందే చనిపోతారు.
برای اینکه ثابت شود هر آنچه به تو گفتم واقع خواهد شد، بدان که دو پسرت حُفنی و فینحاس در یک روز خواهند مرد! | 34 |
౩౪నీ ఇద్దరు కొడుకులైన హొఫ్నీకీ, ఫీనెహాసుకూ ఇలా జరుగుతుందని నేను చెప్పిన దానికి నీకు ఒక సూచన, ఒక్కరోజే వారిద్దరూ చనిపోతారు.
«سپس کاهن امینی روی کار خواهم آورد که مطابق میل من خدمت کند و هر آنچه را که به او دستور دهم انجام دهد. به او فرزندان خواهم بخشید و آنها برای پادشاه برگزیدهٔ من تا ابد کاهن خواهند شد. | 35 |
౩౫తరువాత నమ్మకమైన ఒక యాజకుణ్ణి నేను నియమిస్తాను. అతడు నా ఆలోచనను బట్టి నాకు అనుకూలంగా యాజకత్వం జరిగిస్తాడు. అతనికి నేను నమ్మకమైన సంతానం అనుగ్రహిస్తాను. అతడు నా అభిషిక్తుని సన్నిధిలో సదాకాలం యాజకత్వం జరిగిస్తాడు.
آنگاه هر که از خاندان تو باقی مانده باشد برای پول و نان در برابر او زانو زده، تعظیم خواهد کرد و خواهد گفت: التماس میکنم در میان کاهنان خود به من کاری بدهید تا شکم خود را سیر کنم.» | 36 |
౩౬అయితే నీ ఇంటివారిలో మిగిలిన ప్రతి ఒక్కరూ డబ్బుకోసం రొట్టెల కోసం అతని దగ్గరికి వచ్చి వంగి నమస్కరించి, ‘నేను కడుపుకు రొట్టెముక్క తినగలిగేలా దయచేసి యాజకుల సేవల్లో ఒకదానిలో నన్ను పెట్టుకో’ అని అతడిని బతిమాలుకుంటారు.”