< اول تواریخ 7 >

پسران یساکار: تولاع، فوه، یاشوب، شمرون. 1
ఇశ్శాఖారుకి నలుగురు కొడుకులున్నారు. వాళ్ళు, తోలా, పువ్వా, యాషూబూ, షిమ్రోనూ అనేవాళ్ళు.
پسران تولاع که هر یک از آنها رئیس یک طایفه بود: عزی، رفایا، یری‌ئیل، یحمای، یبسام و سموئیل. در زمان داوود پادشاه، تعداد کل مردان جنگی این طایفه‌ها ۲۲٬۶۰۰ نفر بود. 2
తోలాకి ఉజ్జీ, రెఫాయా, యెరీయేలూ, యహ్మయీ, యిబ్శామూ, షెమూయేలూ పుట్టారు. తోలా కొడుకులైన వీళ్ళు తమ పూర్వీకుల కుటుంబాలకు పెద్దలు. వీళ్ళు బలిష్టులు. ధైర్యవంతులు. దావీదు పరిపాలించిన కాలంలో వీళ్ళ సంఖ్య ఇరవై రెండు వేల ఆరు వందలు.
یزرحیا پسر عزی بود. یزرحیا و چهار پسرش به نامهای میکائیل، عوبدیا، یوئیل و یشیا، هر یک رئیس طایفه‌ای بودند. 3
ఉజ్జీ కొడుకుల్లో ఒకడి పేరు ఇజ్రహయా. ఇజ్రహయా కొడుకుల పేర్లు, మిఖాయేలు ఓబద్యా, యోవేలూ, ఇష్షీయా అనేవాళ్ళు. వీళ్ళు ఐదు గురూ తమ తెగల నాయకులు.
آنها زنان و پسران زیادی داشتند به طوری که توانستند ۳۶٬۰۰۰ مرد برای خدمت سربازی بفرستند. 4
వాళ్ళకి అనేకమంది భార్యలూ, పిల్లలూ ఉన్నారు. అందుచేత వాళ్ళ వంశావళి లెక్కల ప్రకారం వాళ్ళ వంశాల నుండి సైన్యంలో ముప్ఫై ఆరు వేల మంది ఉన్నారు.
تعداد کل مردانی که از قبیلهٔ یساکار برای خدمت سربازی آمادگی داشتند ۸۷٬۰۰۰ جنگجوی زبده بود که نام تمام آنها در نسب نامه نوشته شد. 5
ఇశ్శాఖారు వంశాల్లో వాళ్ళ బంధువుల నుండి తమ వంశావళి లెక్కల ప్రకారం యుద్ధం చేయగలిగిన వాళ్ళు ఎనభై ఏడువేలమంది ఉన్నారు.
پسران بنیامین اینها بودند: بالع، باکر و یدی‌ئیل. 6
బెన్యామీనుకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. వాళ్ళు బెలా, బేకరు, యెదీయవేలూ అనేవాళ్ళు.
پسران بالع: اصبون، عزی، عزی‌ئیل، یریموت، عیری. این پنج نفر رئیس طایفه بودند. تعداد سربازان این طوایف به ۲۲٬۰۳۴ نفر می‌رسید که نام آنها در نسب نامه نوشته شد. 7
బెలకు ఐదుగురు కొడుకులున్నారు. వాళ్ళు, ఎస్బోనూ, ఉజ్జీ, ఉజ్జీయేలూ, యెరీమోతూ, ఈరీ అనేవాళ్ళు. వీళ్ళు తమ పూర్వీకుల కుటుంబాలకు నాయకులు. వాళ్ళ వంశావళి లెక్కల ప్రకారం వీళ్ళలో ఇరవై రెండు వేల ముప్ఫై నల్గురు యుద్ధం చేసే వాళ్ళున్నారు.
پسران باکر: زمیره، یوعاش، الیعازار، الیوعینای، عمری، یریموت، ابیا، عناتوت و علمت. 8
బేకరు కొడుకులు జెమీరా, యోవాషు, ఎలీయెజెరు, ఎల్యోయేనై, ఒమ్రీ, యెరీమోతు, అబీయా, అనాతోతు, ఆలెమెతు అనేవాళ్ళు. వీళ్ళంతా బేకరు కొడుకులు.
تعداد سربازان این طایفه به ۲۰٬۲۰۰ نفر می‌رسید که نام آنها همراه نام رؤسای طوایف در نسب نامه ثبت شد. 9
తమ వంశావళి లెక్కల ప్రకారం వీళ్ళలో ఇరవై వేల రెండు వందలమంది కుటుంబ నాయకులున్నారు. వీళ్ళంతా శూరులు.
بلهان پسر یدیع‌ئیل بود. پسران بلهان اینها بودند: یعیش، بنیامین، ایهود، کنعنه، زیتان، ترشیش و اخیشاحر. 10
౧౦యెదీయవేలు కొడుకుల్లో ఒకడు బిల్హాను. బిల్హాను కొడుకులు యూషు, బెన్యామీను, ఏహూదు, కెనయనా, జేతాను, తర్షీషు, అహీషహరు.
اینها رؤسای طوایف یدیع‌ئیل بودند که ۱۷٬۲۰۰ مرد جنگی داشتند. 11
౧౧యెదీయవేలు కొడుకులైన వీళ్ళంతా తమ పూర్వీకుల కుటుంబాలకు నాయకులు. వీళ్ళలో యుద్ధానికి వెళ్ళగలిగిన శూరులు పదిహేను వేల రెండు వందలమంది ఉన్నారు.
شوفی‌ها و حوفی‌ها از نسل عیر بودند و حوشی‌ها از نسل احیر. 12
౧౨ఈరుకి షుప్పీము, హుప్పీము అనే ఇద్దరు కొడుకులున్నారు. అహేరు కొడుకుల్లో హుషీము ఉన్నాడు.
پسران نفتالی: یحصی‌ئیل، جونی، یصر و شلوم. (اینها نوه‌های بلهه، کنیز یعقوب بودند.) 13
౧౩బిల్హా కొడుకు నఫ్తాలీ. నఫ్తాలీ కొడుకులు యహజియేలు, గూనీ, యేసెరు, షిల్లేము అనేవాళ్ళు.
پسران منسی که از کنیز او که ارامی بود، به دنیا آمدند، اسرئیل و ماخیر (پدر جلعاد) بودند. 14
౧౪మనష్షే కొడుకుల్లో అశ్రీయేలు అనే వాడున్నాడు. వాడు అతని ఉంపుడుగత్తె వల్ల పుట్టాడు. ఈ ఉంపుడుగత్తె ఒక అరామీయురాలు. ఈమే గిలాదుకి నాయకుడైన మాకీరుకి కూడా జన్మనిచ్చింది.
ماخیر از میان شوفی‌ها و حوفی‌ها برای خود زن گرفت. او خواهری به نام معکه داشت. صلفحاد یکی دیگر از فرزندان منسی بود که فقط چند دختر داشت. 15
౧౫మాకీరు హుప్పీము, షుప్పీముల సోదరిని పెళ్ళి చేసుకున్నాడు. ఆమె సోదరి పేరు మయకా. మనష్షే రెండో కొడుకు పేరు సెలోపెహాదు. ఈ సెలోపెహాదుకి కూతుళ్ళు మాత్రమే పుట్టారు.
زن ماخیر که او هم معکه نام داشت پسری زایید و نام او را فارش گذاشتند. اسم برادرش شارش بود و پسرانش اولام و راقم نام داشتند. 16
౧౬మాకీరు భార్య మయకాకి ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు పెరెషు. ఇతని సోదరుడి పేరు షెరెషు. షెరెషు కొడుకులు ఊలాము, రాకెము.
بدان پسر اولام بود. اینها پسران جلعاد، نوه‌های ماخیر و نبیره‌های منسی بودند. 17
౧౭ఊలాము కొడుకు బెదాను. వీరంతా మనష్షే కొడుకు మాకీరుకి పుట్టిన గిలాదు సంతానం.
همولکه (خواهر جلعاد) سه پسر به دنیا آورد به نامهای: ایشهود، ابیعزر و محله. 18
౧౮మాకీరు సోదరి అయిన హమ్మోలెకెతు. ఈ మెకు ఇషోదు, అబీయెజెరు, మహలాలు పుట్టారు.
اخیان، شکیم، لقحی، انیعام پسران شمیداع بودند. 19
౧౯షెమీదా కొడుకులు అహెయాను, షెకెము, లికీ, అనీయాము.
نسل افرایم به ترتیب عبارت بودند از: شوتالح، بارد، تحت، العادا، تحت، زاباد، شوتالح، عازر و العاد. العاد و عازر قصد داشتند گله‌های جتی‌ها را که در آن سرزمین ساکن بودند غارت کنند، ولی به دست روستایی‌های آنجا کشته شدند. 20
౨౦ఎఫ్రాయిము సంతానం వివరాలు ఇవి. ఎఫ్రాయిము కొడుకు షూతలహు. షూతలహు కొడుకు బెరెదు. బెరెదు కొడుకు తాహతు. తాహతు కొడుకు ఎలాదా. ఎలాదా కొడుకు తాహతు.
21
౨౧తాహతు కొడుకు జాబాదు. ఇతనికి షూతలహూ, ఏజెరూ, ఎల్యాదూ అనేవాళ్ళు పుట్టారు. వాళ్ళు అక్కడ స్థానికులైన గాతు ప్రజల పశువులను దొంగతనం చేయడానికి వెళ్ళారు. దాంతో గాతు ప్రజలు వాళ్ళను పట్టుకుని చంపివేశారు.
پدرشان افرایم مدت زیادی برای آنها ماتم گرفت و اقوامش به دلداری او آمدند. 22
౨౨వాళ్ళ తండ్రియైన ఎఫ్రాయిము చాలా రోజులు దుఃఖించాడు. అప్పుడు అతని సోదరులు వచ్చి అతణ్ణి పరామర్శించారు.
پس از آن، زن افرایم حامله شده پسری زایید و به یاد آن مصیبت نام او را بریعه (یعنی «فاجعه») گذاشتند. 23
౨౩తరువాత అతడు తన భార్యను కూడగా ఆమె గర్భం ధరించి ఒక కొడుక్కి జన్మనిచ్చింది. తన ఇంట్లో కలిగిన విషాదాన్నిబట్టి ఎఫ్రాయిము తన కొడుక్కి బెరీయా అనే పేరు పెట్టాడు.
نام دختر افرایم، شیره بود. شیره، بیت‌حورون پایین و بالا و اوزین شیره را بنا کرد. 24
౨౪అతని కుమార్తె పేరు షెయెరా. ఈమె ఉత్తర బేత్‌ హోరోను, దక్షిణ బేత్‌ హోరోను, ఉజ్జెన్‌ షెయెరా పట్టణాలను నిర్మించింది.
افرایم پسر دیگری داشت به نام رافح که نسل او عبارت بودند از: راشف، تالح، تاحن، 25
౨౫వాని కొడుకులు రెపహూ, రెషెపులు. రెపహు కొడుకు తెలహు, తెలహు కొడుకు తహను,
لعدان، عمیهود، الیشمع، 26
౨౬తహను కొడుకు లద్దాను, లద్దాను కొడుకు అమీహూదు, అమీహూదు కొడుకు ఎలీషామా,
نون و یوشع. 27
౨౭ఎలీషామా కొడుకు నూను, నూను కొడుకు యెహోషువ.
ناحیه‌ای که آنها در آن زندگی می‌کردند شامل بیت‌ئیل و روستاهای اطرافش بود که از طرف شرق تا نعران و از سمت غرب تا جازر و روستاهای حوالی آن امتداد می‌یافت. شهرهای دیگر این ناحیه شکیم و ایه با دهکده‌های اطراف آنها بودند. 28
౨౮వాళ్ళు స్వాస్థ్యంగా పొందిన వారి నివాస స్థలాలు ఏవంటే, బేతేలూ దాని చుట్టూ ఉన్న గ్రామాలు. ఇంకా తూర్పువైపు ఉన్న నహరానూ, పడమటి వైపు ఉన్న గెజెరు, దాని చుట్టూ ఉన్న గ్రామాలు, షెకెము, దాని చుట్టూ ఉన్న గ్రామాలు, గాజా, దాని చుట్టూ ఉన్న గ్రామాల వరకూ వారి నివాస స్థలాలు వ్యాపించాయి.
قبیلهٔ منسی که از نسل یوسف پسر یعقوب بودند، شهرهای زیر و نواحی اطراف آنها را در اختیار داشتند: بیت‌شان، تعناک، مجدو و دُر. 29
౨౯అలాగే మనష్షీయుల సరిహద్దు ప్రాంతాల్లోని బేత్షెయాను, దాని గ్రామాలు, తానాకు, దాని గ్రామాలు, మెగిద్దో, దాని గ్రామాలు, దోరు, దాని గ్రామాలు వాళ్ళకున్నాయి. ఇశ్రాయేలు కొడుకైన యోసేపు వారసులు ఈ ఊళ్ళలోనే నివాసమున్నారు.
پسران اشیر عبارت بودند از: یمنه، یشوه، یشوی و بریعه. اشیر دختری به نام سارح نیز داشت. 30
౩౦ఆషేరు కొడుకులు ఎవరంటే ఇమ్నా, ఇష్వా, ఇష్వీ, బెరీయా అనేవాళ్ళు. వీళ్ళ సోదరి పేరు శెరహు.
پسران بریعه عبارت بودند از: حابر و ملکی‌ئیل (پدر برزاوت). 31
౩౧బెరీయా కొడుకులు హెబెరూ, మల్కీయేలూ. మల్కీయేలు కొడుకు బిర్జాయీతు.
پسران حابر عبارت بودند از: یفلیط، شومیر و حوتام. حابر دختری به نام شوعا نیز داشت. 32
౩౨హెబెరు కొడుకులు యప్లేటు, షోమేరూ, హోతాములు. వీళ్ళ సోదరి పేరు షూయా.
پسران یفلیط عبارت بودند از: فاسک، بمهال و عشوت. 33
౩౩యప్లేటు కొడుకులు ఎవరంటే పాసకు, బింహాలు, అష్వాతు. వీళ్ళు యప్లేటు కొడుకులు.
پسران شومیر برادر یفلیط اینها بودند: روهجه، یحبه و ارام. 34
౩౪అతని సోదరుడైన షోమేరుకు అహీ, రోగా, యెహుబ్బా, అరాము అనే కొడుకులున్నారు.
پسران برادر او هیلام عبارت بودند از: صوفح، یمناع، شالش و عامال. 35
౩౫అతని సోదరుడైన హేలెముకు జోపహు, ఇమ్నా, షెలెశు, ఆమాలు అనే కొడుకులున్నారు.
پسران صوفح عبارت بودند از: سوح، حرنفر، شوعال، بیری، یمره، 36
౩౬జోపహు కొడుకులు సూయా, హర్నెపెరు, షూయాలు, బేరీ, ఇమ్రా,
باصر، هود، شما، شلشه، یتران و بئیرا. 37
౩౭బేసెరు, హోదు, షమ్మా, షిల్షా, ఇత్రాను, బెయేరు అనేవాళ్ళు.
پسران یتر عبارت بودند از: یفنه، فسفا و آرا. 38
౩౮ఎతెరు కొడుకులు యెఫున్నె, పిస్పా, అరా.
پسران علا عبارت بودند از: آرح، حنی‌ئیل و رصیا. 39
౩౯ఉల్లా కొడుకులు ఆరహు, హన్నియేలు, రిజెయాలు.
همهٔ فرزندان اشیر که سران طایفه‌ها بودند، جنگاورانی کارآزموده و رهبرانی برجسته محسوب می‌شدند. تعداد مردان جنگی این طایفه که در نسب نامه ثبت گردید ۲۶٬۰۰۰ نفر بود. 40
౪౦వీళ్ళంతా ఆషేరు సంతానం. వీళ్ళు తమ పూర్వీకుల కుటుంబాలకు నాయకులుగా ఉన్నారు. వీళ్ళు ప్రఖ్యాతి చెందిన శూరులుగానూ, నాయకుల్లో ప్రముఖులుగానూ ఉన్నారు. ఈ వంశానికి చెందిన వాళ్ళలో ఇరవై ఆరు వేలమంది యుద్ధానికి వెళ్లదగిన వాళ్ళున్నారు.

< اول تواریخ 7 >