< زکریا 8 >
و کلام یهوه صبایوت بر من نازل شده، گفت: | ۱ 1 |
౧సేనల ప్రభువు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు.
«یهوه صبایوت چنین میفرماید: برای صهیون غیرت عظیمی دارم و با غضب سخت برایش غیور هستم. | ۲ 2 |
౨సేనల ప్రభువు యెహోవా ఆజ్ఞ ఇచ్చేదేమిటంటే “తీవ్రమైన ఆసక్తితో నేను సీయోను విషయంలో రోషం వహించాను. రౌద్రుడినై దాని విషయం నేను పట్టించుకున్నాను.”
خداوند چنین میگوید: به صهیون مراجعت نمودهام و در میان اورشلیم ساکن خواهم شد و اورشلیم به شهر حق و کوه یهوه صبایوت به کوه مقدس مسمی خواهدشد. | ۳ 3 |
౩యెహోవా చెప్పేదేమిటంటే “నేను సీయోను దగ్గరికి మళ్ళీ వచ్చి, యెరూషలేములో నివాసం చేస్తాను. సత్య పురమనీ, సేనల ప్రభువు యెహోవా కొండ అనీ, పరిశుద్ధ పర్వతమనీ దానికి పేర్లు పెడతారు.
یهوه صبایوت چنین میگوید: مردان پیر وزنان پیر باز در کوچه های اورشلیم خواهندنشست و هر یکی از ایشان بهسبب زیادتی عمرعصای خود را در دست خود خواهد داشت. | ۴ 4 |
౪సేనల ప్రభువు యెహోవా సెలవిచ్చేదేమంటే వృద్ధాప్యం వల్ల కర్ర పట్టుకుని, వృద్ధ స్త్రీపురుషులూ ఇంకా యెరూషలేము వీధుల్లో కూర్చుంటారు.
وکوچه های شهر از پسران و دختران که درکوچه هایش بازی میکنند پر خواهد شد. | ۵ 5 |
౫ఆ పట్టణం వీధులు ఆటలాడుకునే బాలబాలికలతో నిండి ఉంటాయి.
یهوه صبایوت چنین میگوید: اگر این امر در اینروزها به نظر بقیه این قوم عجیب نماید آیا در نظر من عجیب خواهد نمود؟ قول یهوه صبایوت این است. | ۶ 6 |
౬సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే ఆ దినాల్లో మిగిలి ఉన్న ప్రజలకు ఇది ఆశ్చర్యంగా ఉన్నా నాకు కూడా ఆశ్చర్యంగా ఉంటుందా? ఇదే యెహోవా వాక్కు.
«یهوه صبایوت چنین میگوید: اینک من قوم خود را از زمین مشرق و از زمین مغرب آفتاب خواهم رهانید. | ۷ 7 |
౭సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే తూర్పు దేశంలో నుండి, పడమటి దేశంలో నుండి నేను నా ప్రజలను రప్పించి రక్షించి,
و ایشان را خواهم آورد که دراورشلیم سکونت نمایند و ایشان قوم من خواهندبود و من براستی و عدالت خدای ایشان خواهم بود. | ۸ 8 |
౮యెరూషలేములో నివసించడానికి వారిని తీసుకు వస్తాను. వారు నా జనులుగా ఉంటారు., నేను వారికి దేవుడనై ఉంటాను. ఇది నీతి సత్యాలను బట్టి జరుగుతుంది.
یهوه صبایوت چنین میگوید: دستهای شما قوی شودای کسانی که در این ایام این کلام را از زبان انبیا شنیدید که آن در روزی که بنیادخانه یهوه صبایوت را برای بنا نمودن هیکل نهادند واقع شد. | ۹ 9 |
౯సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే సేనల ప్రభువు యెహోవా మందిరాన్ని కట్టడానికి దాని పునాది వేసిన దినాన ప్రవక్తల నోట పలకబడిన మాటలు ఈ కాలంలో వినే మీరంతా ధైర్యం తెచ్చుకోండి.
زیرا قبل از این ایام مزدی برای انسان نبود و نه مزدی به جهت حیوان؛ و بهسبب دشمن برای هرکه خروج و دخول میکردهیچ سلامتی نبود و من همه کسان را به ضدیکدیگر واداشتم. | ۱۰ 10 |
౧౦ఆ దినాలకు ముందు మనుష్యులకు కూలి దొరికేది కాదు. పశువుల పనికి బాడుగ దొరికేది కాదు. తన పనిమీద పోయే వాడికి శత్రుభయం చేత నెమ్మది ఉండేది కాదు. ఎందుకంటే ఒకరి మీదికి ఒకరిని నేను ఉసి గొలిపాను.
اما الان یهوه صبایوت میگوید: من برای بقیه این قوم مثل ایام سابق نخواهم بود. | ۱۱ 11 |
౧౧అయితే పూర్వదినాల్లో నేను ఈ ప్రజల్లో శేషించిన వారికి విరోధినైనట్టు ఇప్పుడు విరోధిగా ఉండను.
زیرا که زرع سلامتی خواهد بودو مو میوه خود را خواهد داد و زمین محصول خود را خواهد آورد و آسمان شبنم خویش راخواهد بخشید و من بقیه این قوم را مالک جمیع این چیزها خواهم گردانید. | ۱۲ 12 |
౧౨సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు కాపు కాస్తాయి. భూమి పంటలనిస్తుంది. ఆకాశం నుండి మంచు కురుస్తుంది. ఈ ప్రజల్లో శేషించిన వారికి వీటన్నిటిని నేను ఆస్తిగా ఇస్తాను. ఇదే సేనల ప్రభువు యెహోవా వాక్కు.
و واقع خواهد شد چنانکه شماای خاندان یهودا وای خاندان اسرائیل در میان امتها (مورد)لعنت شدهاید، همچنان شما را نجات خواهم داد تا (مورد) برکت بشوید؛ پس مترسید ودستهای شما قوی باشد. | ۱۳ 13 |
౧౩యూదాప్రజలారా, ఇశ్రాయేలుప్రజలారా, మీరు అన్యప్రజల్లో ఏ విధంగా శాపానికి గురి అయి ఉన్నారో ఆలాగే మీరు ఆశీర్వాదానికి నోచుకునే వారుగా నేను మిమ్మల్ని రక్షిస్తాను. భయపడక ధైర్యం తెచ్చుకోండి.
زیرا که یهوه صبایوت چنین میگوید: چنانکه قصد نمودم که به شما بدی برسانم حینی که پدران شماخشم مرا به هیجان آوردند و یهوه صبایوت میگوید که از آن پشیمان نشدم. | ۱۴ 14 |
౧౪సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే మీ పితరులు నాకు కోపం పుట్టించగా, దయ తలచక నేను మీకు కీడు చేయనుద్దేశించినట్టు
همچنین در اینروزها رجوع نموده، قصد خواهم نمود که به اورشلیم و خاندان یهودا احسان نمایم. پس ترسان مباشید. | ۱۵ 15 |
౧౫ఈ కాలంలో యెరూషలేముకు, యూదావారికి మేలు చేయనుద్దేశిస్తున్నాను గనక భయపడకండి.
و این است کارهایی که بایدبکنید: با یکدیگر راست گویید و در دروازه های خود انصاف و داوری سلامتی را اجرا دارید. | ۱۶ 16 |
౧౬మీరు చేయవలసిన వేమిటంటే ప్రతివాడూ తన పొరుగు వాడితో సత్యమే మాటలాడాలి. సత్యాన్ని బట్టి శాంతికరమైన న్యాయాన్నిబట్టి మీ గుమ్మాల్లో తీర్పు తీర్చాలి.
و در دلهای خود برای یکدیگر بدی میندیشید و قسم دروغ را دوست مدارید، زیراخداوند میگوید از همه این کارها نفرت دارم.» | ۱۷ 17 |
౧౭తన పొరుగువాని మీద ఎవరూ చెడు ఆలోచనలు పెట్టుకోకూడదు. అబద్ధ ప్రమాణం చేయడానికి ఇష్టపడకూడదు. ఇలాటివన్నీ నాకు అసహ్యం.” ఇదే యెహోవా వాక్కు.
و کلام یهوه صبایوت بر من نازل شده، گفت: | ۱۸ 18 |
౧౮సేనల ప్రభువు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు.
«یهوه صبایوت چنین میگوید: روزه ماه چهارم و روزه ماه پنجم و روزه ماه هفتم و روزه ماه دهم برای خاندان یهودا به شادمانی و سرور وعیدهای خوش مبدل خواهد شد پس راستی وسلامتی را دوست بدارید. | ۱۹ 19 |
౧౯“సేనల ప్రభువు యెహోవా ఆజ్ఞ ఇస్తున్నదేమిటంటే నాలుగవ నెల ఉపవాసం, ఐదవ నెల ఉపవాసం, ఏడవ నెల ఉపవాసం, పదవ నెల ఉపవాసం, యూదా యింటివారికి సంతోషం ఉత్సాహం పుట్టించే మనోహరమైన పండగలౌతాయి. కాబట్టి సత్యాన్ని, శాంతిసమాధానాలును ప్రేమించండి.”
یهوه صبایوت چنین میگوید: بار دیگر واقع خواهد شد که قومها و ساکنان شهرهای بسیار خواهند آمد. | ۲۰ 20 |
౨౦సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే “జాతులు, అనేక పట్టణాల నివాసులు ఇంకా వస్తారు.
و ساکنان یک شهر به شهر دیگر رفته، خواهندگفت: بیایید برویم تا از خداوند مسالت نماییم ویهوه صبایوت را بطلبیم و من نیز خواهم آمد. | ۲۱ 21 |
౨౧ఒక పట్టణంవారు మరొక పట్టణం వారి దగ్గరికి వచ్చి ‘ఆలస్యం లేకుండా యెహొవాను శాంతింప జేయడానికి, సేనల ప్రభువు యెహోవాను వెదకడానికి మనం పోదాం రండి’ అని చెప్పగా వారు ‘మేము కూడా వస్తాము’ అంటారు.”
و قوم های بسیار و امت های عظیم خواهندآمد تا یهوه صبایوت را در اورشلیم بطلبند و ازخداوند مسالت نمایند. | ۲۲ 22 |
౨౨అనేక జాతులు, బలం గల ప్రజలు యెరూషలేములో సేనల ప్రభువు యెహోవాను వెదకడానికి, యెహోవా అనుగ్రహం పొందడానికి వస్తారు.
یهوه صبایوت چنین میگوید در آن روزها ده نفر از همه زبانهای امتها به دامن شخص یهودی چنگ زده، متمسک خواهند شد و خواهند گفت همراه شما میآییم زیرا شنیدهایم که خدا با شمااست.» | ۲۳ 23 |
౨౩సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే ఆ దినాల్లో వివిధ భాషలు మాట్లాడే అన్యప్రజల్లో పదేసిమంది ఒక యూదుడి చెంగు పట్టుకుని “దేవుడు మీకు తోడుగా ఉన్నాడనే సంగతి మాకు వినబడింది గనక మేము మీతో కూడా వస్తాము” అని చెబుతారు.