< رومیان 10 >

ای برادران خوشی دل من و دعای من نزد خدا بجهت اسرائیل برای نجات ایشان است. ۱ 1
సోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలనేదే నా హృదయవాంఛ, వారి గురించిన నా ప్రార్థన.
زیرا بجهت ایشان شهادت می‌دهم که برای خدا غیرت دارند لکن نه از روی معرفت. ۲ 2
దేవుని విషయంలో వారు బహు ఆసక్తి గలవారని వారి గురించి సాక్షమిస్తున్నాను. అయితే వారి ఆసక్తి జ్ఞానయుక్తమైంది కాదు.
زیرا که چون عدالت خدا را نشناخته، می‌خواستند عدالت خود را ثابت کنند، مطیع عدالت خدا نگشتند. ۳ 3
అయితే వారికి దేవుని నీతి విషయంలో అవగాహన లేదు. కాబట్టి తమ స్వనీతిని స్థాపించాలని చూస్తూ దేవుని నీతికి విధేయత చూపలేదు.
زیرا که مسیح است انجام شریعت بجهت عدالت برای هر کس که ایمان آورد. ۴ 4
విశ్వసించే ప్రతివాడికీ నీతి కలగడానికి క్రీస్తు ధర్మశాస్త్రానికి ముగింపు పలికాడు.
زیرا موسی عدالت شریعت را بیان می‌کندکه «هر‌که به این عمل کند، در این خواهدزیست.» ۵ 5
ధర్మశాస్త్ర మూలమైన నీతిని నెరవేర్చేవాడు దాని వల్లనే జీవిస్తాడని మోషే రాస్తున్నాడు.
لکن عدالت ایمان بدینطور سخن می‌گوید که «در خاطر خود مگو کیست که به آسمان صعود کند یعنی تا مسیح را فرود آورد، ۶ 6
అయితే విశ్వాసమూలమైన నీతి ఇలా చెబుతున్నది, “పరలోకానికి ఎవడు ఎక్కిపోతాడు? (అంటే క్రీస్తును కిందకి తేవడానికి).
یا کیست که به هاویه نزول کند یعنی تا مسیح رااز مردگان برآورد.» (Abyssos g12) ۷ 7
లేక అగాధంలోకి ఎవడు దిగిపోతాడు? (అంటే క్రీస్తును చనిపోయిన వారిలో నుండి పైకి తేవడానికి) అని నీ హృదయంలో అనుకోవద్దు.” (Abyssos g12)
لکن چه می‌گوید؟ اینکه «کلام نزد تو و در دهانت و در قلب تو است یعنی‌این کلام ایمان که به آن وعظ می‌کنیم.» ۸ 8
కానీ ఆ నీతి ఏమి చెబుతున్నదో చూడండి, “దేవుని వాక్కు మీకు దగ్గరగా, మీ నోటిలో, మీ హృదయంలో ఉంది.” మేము ప్రకటించే విశ్వాస సంబంధమైన వాక్కు కూడా ఇదే.
زیرا اگربه زبان خود عیسی خداوند را اعتراف کنی و دردل خود ایمان آوری که خدا او را از مردگان برخیزانید، نجات خواهی یافت. ۹ 9
అదేమంటే యేసును ప్రభువుగా నీ నోటితో ఒప్పుకుని, దేవుడు ఆయనను చనిపోయిన వారిలో నుండి సజీవంగా లేపాడని నీ హృదయంలో నమ్మితే, నీకు రక్షణ కలుగుతుంది.
چونکه به دل ایمان آورده می‌شود برای عدالت و به زبان اعتراف می‌شود بجهت نجات. ۱۰ 10
౧౦ఎలాగంటే మనిషి నీతి కోసం హృదయంలో నమ్ముతాడు, పాప విమోచన కోసం నోటితో ఒప్పుకుంటాడు.
و کتاب می‌گوید «هر‌که به او ایمان آورد خجل نخواهدشد.» ۱۱ 11
౧౧“ఆయనలో నమ్మకం ఉంచిన వారెవరూ సిగ్గుపడరు” అని దేవుని వాక్కు చెబుతున్నది.
زیرا که در یهود و یونانی تفاوتی نیست که همان خداوند، خداوند همه است و دولتمنداست برای همه که نام او را می‌خوانند. ۱۲ 12
౧౨ఇందులో యూదులూ, గ్రీకులూ అనే వ్యత్యాసం లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువు. ఆయన తనకు ప్రార్థన చేసే వారందరికీ కృప చూపగల సంపన్నుడు.
زیرا هرکه نام خداوند را بخواند نجات خواهد یافت. ۱۳ 13
౧౩ఎందుకంటే ప్రభువు నామంలో ప్రార్థన చేసే వారందరికీ పాపవిమోచన కలుగుతుంది.
پس چگونه بخوانند کسی را که به او ایمان نیاورده‌اند؟ و چگونه ایمان آورند به کسی‌که خبراو را نشنیده‌اند؟ و چگونه بشنوند بدون واعظ؟ ۱۴ 14
౧౪నమ్మని వాడికి వారు ఎలా ప్రార్థన చేస్తారు? తాము వినని వాడిపై ఎలా నమ్మకం పెట్టుకుంటారు? ఆయన్ని గురించి ప్రకటించేవాడు లేకుండా వారెలా వింటారు?
و چگونه وعظ کنند جز اینکه فرستاده شوند؟ چنانکه مکتوب است که «چه زیبا است پایهای آنانی که به سلامتی بشارت می‌دهند و به چیزهای نیکو مژده می‌دهند.» ۱۵ 15
౧౫ప్రకటించే వారిని పంపకపోతే ఎలా ప్రకటిస్తారు? దీన్ని గురించి, “శ్రేష్ఠమైన వాటిని గురించిన శుభ సమాచారం అందించే వారి పాదాలు ఎంతో అందమైనవి” అని రాసి ఉంది.
لکن همه بشارت را گوش نگرفتند زیرا اشعیا می‌گوید «خداوندا کیست که اخبار ما را باور کرد؟» ۱۶ 16
౧౬అయితే అందరూ సువార్తకు లోబడలేదు. “ప్రభూ, మా సందేశాన్ని ఎవరు నమ్మారు?” అని యెషయా చెబుతున్నాడు కదా?
لهذا ایمان از شنیدن است و شنیدن از کلام خدا. ۱۷ 17
౧౭కాబట్టి వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది. వినడం క్రీస్తు గురించిన మాట ద్వారా కలుగుతుంది.
لکن می‌گویم آیانشنیدند؟ البته شنیدند: «صوت ایشان در تمام جهان منتشر گردید و کلام ایشان تا اقصای ربع مسکون رسید.» ۱۸ 18
౧౮అయినా, నేను చెప్పేదేమంటే, “వారు వినలేదా? విన్నారు గదా? వారి స్వరం భూలోకమంతటిలోకీ, వారి మాటలు భూదిగంతాలకు చేరాయి.”
و می‌گویم آیا اسرائیل ندانسته‌اند؟ اول موسی می‌گوید: «من شما را به غیرت می‌آورم به آن که امتی نیست و بر قوم بی‌فهم شما را خشمگین خواهم ساخت.» ۱۹ 19
౧౯నేనింకా చెప్పేదేమంటే, “ఇశ్రాయేలు ప్రజలకు ఇది తెలియలేదా? మోషే ముందుగా మాట్లాడుతూ, “అసలు జాతి అని పిలవడానికి వీలు లేని వారి వలన మీలో రోషం పుట్టిస్తాను. తెలివి లేని ప్రజల వలన మీకు కోపం కలిగేలా చేస్తాను” అని అన్నాడు.
واشعیا نیز جرات کرده، می‌گوید: آنانی که طالب من نبودند مرا یافتند و به کسانی که مرا نطلبیدندظاهر گردیدم.» ۲۰ 20
౨౦తరువాత యెషయా ధైర్యంగా ఇలా అన్నాడు, “నన్ను వెదకనివారు నన్ను కనుగొన్నారు. నా గురించి అడగని వారికి నేను ప్రత్యక్షమయ్యాను.”
اما در حق اسرائیل می‌گوید: «تمام روز دستهای خود را دراز کردم به سوی قومی نامطیع و مخالف.» ۲۱ 21
౨౧ఇశ్రాయేలు విషయమైతే అతడు, “అవిధేయులై ఎదురు తిరిగి మాట్లాడుతున్న ప్రజలవైపు నేను రోజంతా నా చేతులు చాస్తూనే ఉన్నాను” అని చెబుతున్నాడు.

< رومیان 10 >