< مزامیر 28 >
مزمور داود ای خداوند، نزد تو فریاد برمی آورم. ای صخره من، از من خاموش مباش. مبادا اگر از من خاموش شوی، مثل آنانی باشم که به حفره فرو میروند. | ۱ 1 |
౧దావీదు కీర్తన. యెహోవా, నేను నీకు మొరపెడుతున్నాను. నా ఆధారశిలా, నన్ను నిర్లక్ష్యం చెయ్యకు. నువ్వు నన్ను నిర్లక్ష్యం చేస్తే, నేను సమాధిలోకి దిగిపోయిన వాళ్ళలా అవుతాను.
آواز تضرع مرا بشنو چون نزد تو استغاثه میکنم و دست خود را به محراب قدس تو برمی افرازم. | ۲ 2 |
౨నేను నీకు మొరపెట్టినపుడు, నీ పవిత్రాలయం వైపు నా చేతులెత్తినప్పుడు నా విజ్ఞాపన స్వరం ఆలకించు.
مرا با شریران و بدکاران مکش که با همسایگان خود سخن صلحآمیزمی گویند و آزار در دل ایشان است. | ۳ 3 |
౩దుర్మార్గులు, పాపులతోబాటు నన్ను ఈడ్చివేయకు. వాళ్ళు దురాలోచన హృదయంలో ఉంచుకుని తమ పొరుగు వాళ్ళతో శాంతి మాటలు మాట్లాడతారు.
آنها را به حسب کردار ایشان و موافق اعمال زشت ایشان بده آنها را مطابق عمل دست ایشان بده و رفتارایشان را به خود ایشان رد نما. | ۴ 4 |
౪వాళ్ళ పనులను బట్టి, వాళ్ళ దుష్టక్రియలను బట్టి వాళ్లకు ఇవ్వాల్సింది ఇవ్వు. వాళ్ళ చేతి పనిని బట్టి వాళ్లకు చెల్లించు. తగిన సమయంలో వాళ్ళకు ఇవ్వు.
چونکه در اعمال خداوند و صنعت دست وی تفکر نمی کنند. ایشان را منهدم خواهی ساخت و بنا نخواهی نمود. | ۵ 5 |
౫యెహోవా మార్గాలు, ఆయన చేతిపనులు వాళ్ళు అర్థం చేసుకోరు గనక ఆయన వాళ్ళను కూలదోసి, ఇంకెన్నడూ తిరిగి కట్టడు.
خداوند متبارک باد زیرا که آواز تضرع مراشنیده است. | ۶ 6 |
౬యెహోవా నా విజ్ఞాపన స్వరం ఆలకించాడు గనక ఆయనకు స్తుతి కలుగు గాక!
خداوند قوت من و سپر من است. دلم بر او توکل داشت و مدد یافتهام. پس دل من به وجد آمده است و بهسرود خود او را حمدخواهم گفت. | ۷ 7 |
౭యెహోవా నా బలం, నా డాలు. నా హృదయం ఆయనలో నమ్మిక ఉంచుతుంది గనక నాకు సహాయం కలిగింది. కాబట్టి, నా హృదయం ఉప్పొంగి పోతుంది. కీర్తనలతో నేను ఆయనను స్తుతిస్తున్నాను.
خداوند قوت ایشان است و برای مسیح خود قلعه نجات. | ۸ 8 |
౮యెహోవా తన ప్రజలకు బలం, ఆయన తన అభిషిక్తునికి రక్షణాశ్రయం.
قوم خود را نجات ده ومیراث خود را مبارک فرما. ایشان را رعایت کن وبرافراز تا ابدالاباد. | ۹ 9 |
౯నీ ప్రజలను రక్షించు. నీ వారసత్వాన్ని ఆశీర్వదించు. వాళ్లకు కాపరిగా ఉండి, శాశ్వతంగా వాళ్ళను ఎత్తుకుని నడిపించు.