< مزامیر 25 >
مزمور داود ای خداوند بسوی تو جان خود رابرمی افرازم. ای خدای من بر تو توکل میدارم. | ۱ 1 |
౧దావీదు కీర్తన. యెహోవా, నీ కోసం నా ప్రాణం పైకెత్తుతున్నాను.
پس مگذار که خجل بشوم و دشمنانم بر من فخر نمایند. | ۲ 2 |
౨నా దేవా, నీలో నా నమ్మకం ఉంచాను. నన్ను సిగ్గుపడనివ్వకు. నా మీద నా శత్రువులకు జయోత్సాహం కలగనివ్వకు.
بلی هرکه انتظار تو میکشدخجل نخواهد شد. آنانی که بیسبب خیانت میکنند خجل خواهند گردید. | ۳ 3 |
౩నీ కోసం నమ్మకంతో ఎదురు చూసే వాళ్ళు ఎవ్వరూ అవమానం పొందరు. అకారణంగా ద్రోహం చేసే వాళ్ళే సిగ్గు పడతారు.
ای خداوندطریق های خود را به من بیاموز و راههای خویش را به من تعلیم ده. | ۴ 4 |
౪యెహోవా, నీ మార్గాలు నాకు తెలియజెయ్యి. నీ త్రోవలు నాకు నేర్పించు.
مرا به راستی خود سالک گردان و مرا تعلیم ده زیرا تو خدای نجات من هستی. تمامی روز منتظر تو بودهام. | ۵ 5 |
౫నీ సత్యంలోకి నన్ను నడిపించి నాకు బోధించు, ఎందుకంటే నువ్వే నా రక్షణకర్తవైన దేవుడివి. రోజంతా నేను నీ కోసం కనిపెడతాను.
ای خداونداحسانات و رحمت های خود را بیاد آور چونکه آنها از ازل بوده است. | ۶ 6 |
౬యెహోవా, నీ కరుణతో, నిబంధన నమ్మకత్వంతో నువ్వు చేసిన పనులు గుర్తు చేసుకో. ఎందుకంటే అవి ఎప్పుడూ నిలిచి ఉన్నాయి.
خطایای جوانی وعصیانم را بیاد میاور. ای خداوند به رحمت خودو بهخاطر نیکویی خویش مرا یاد کن. | ۷ 7 |
౭బాల్యంలో నేను చేసిన పాపాలు, నా తిరుగుబాటుతనం గుర్తు చేసుకోవద్దు. యెహోవా, నీ మంచితనంతో, నీ నిబంధన నమ్మకత్వంతో నన్ను గుర్తు చేసుకో.
خداوندنیکو و عادل است. پس به گناه کاران طریق راخواهد آموخت. | ۸ 8 |
౮యెహోవా మంచివాడు, ఆయన న్యాయవంతుడు. కాబట్టి పాపులకు తన మార్గం బోధిస్తాడు.
مسکینان را به انصاف رهبری خواهد کرد و به مسکینان طریق خود را تعلیم خواهد داد. | ۹ 9 |
౯దీనులను న్యాయంగా నడిపిస్తాడు, దీనులకు తన మార్గం బోధిస్తాడు.
همه راههای خداوند رحمت وحق است برای آنانی که عهد و شهادات او را نگاه میدارند. | ۱۰ 10 |
౧౦ఆయన చేసిన నిబంధన, ఆయన నియమించిన శాసనాలు పాటించిన వాళ్లకు యెహోవా త్రోవలన్నీ నిబంధన నమ్మకత్వంతోనూ, విశ్వసనీయతతోనూ నిర్మాణం అయ్యాయి.
ای خداوند بهخاطر اسم خود، گناه مرابیامرز زیرا که بزرگ است. | ۱۱ 11 |
౧౧యెహోవా, నీ నామాన్నిబట్టి నా పాపం క్షమించు. ఎందుకంటే అది చాలా ఘోరం.
کیست آن آدمی که از خداوند میترسد؟ او را بطریقی که اختیار کرده است خواهد آموخت. | ۱۲ 12 |
౧౨యెహోవా పట్ల భయభక్తులు కలిగినవాడు ఎవరు? అతడు కోరుకోవలసిన మార్గం ఆయన అతనికి నిర్దేశిస్తాడు.
جان او در نیکویی شب را بسر خواهد برد. و ذریت او وارث زمین خواهند شد. | ۱۳ 13 |
౧౩అతని ప్రాణం సంతోషంగా ఉంటుంది. అతని సంతానం దేశానికి వారసులవుతారు.
سر خداوند با ترسندگان او است و عهد او تا ایشان را تعلیم دهد. | ۱۴ 14 |
౧౪ఆయనపట్ల భయభక్తులు గల వారికి యెహోవా ఆలోచన తెలుస్తుంది, ఆయన తన నిబంధన వాళ్లకు తెలియజేస్తాడు.
چشمان من دائم بسوی خداوند است زیرا که او پایهای مرااز دام بیرون میآورد. | ۱۵ 15 |
౧౫నా కళ్ళు ఎప్పుడూ యెహోవా మీదే ఉన్నాయి, ఎందుకంటే ఆయన నా పాదాలను వలలోనుంచి విడిపిస్తాడు.
بر من ملتفت شده، رحمت بفرما زیرا که منفرد و مسکین هستم. | ۱۶ 16 |
౧౬నా వైపు తిరిగి నన్ను కరుణించు, ఎందుకంటే నేను ఒంటరివాణ్ణి, బాధ పొందినవాణ్ణి.
تنگیهای دل من زیاد شده است. مرا ازمشقت های من بیرون آور. | ۱۷ 17 |
౧౭నా హృదయవేదనలు అతి విస్తారం. అమితమైన బాధ నుంచి నన్ను బయటకు లాగు.
بر مسکنت و رنج من نظر افکن و جمیع خطایایم را بیامرز. | ۱۸ 18 |
౧౮నా బాధ, నా కష్టం చూడు. నా పాపాలన్నీ క్షమించు.
بردشمنانم نظر کن زیرا که بسیارند و به کینه تلخ به من کینه میورزند. | ۱۹ 19 |
౧౯నా శత్రువులను చూడు, వాళ్ళు చాలా మంది ఉన్నారు. క్రూరమైన ద్వేషంతో వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నారు.
جانم را حفظ کن و مرارهایی ده تا خجل نشوم زیرا بر تو توکل دارم. | ۲۰ 20 |
౨౦నా ప్రాణం కాపాడి నన్ను రక్షించు. నేను సిగ్గుపడను. ఎందుకంటే నేను నీ ఆశ్రయం కోరుతున్నాను.
کمال و راستی حافظ من باشند زیرا که منتظرتو هستم. | ۲۱ 21 |
౨౧నీ కోసం నేను కనిపెడుతున్నాను గనక యథార్థత, నిర్దోషత్వం నన్ను సంరక్షిస్తాయి గాక.
ای خدا اسرائیل را خلاصی ده، ازجمیع مشقتهای وی. | ۲۲ 22 |
౨౨దేవా, తన బాధలన్నిటిలో నుంచి ఇశ్రాయేలును రక్షించు.