< مزامیر 11 >
برای سالار مغنیان. مزمور داود بر خداوند توکل میدارم. چرا بهجانم می گویید: «مثل مرغ به کوه خودبگریزید. | ۱ 1 |
౧ప్రధాన సంగీతకారుని కోసం, దావీదు కీర్తన. నేను యెహోవాలో ఆశ్రయం కోరాను. పక్షిలాగా కొండల్లోకి ఎగిరిపో, అని నువ్వు నా ప్రాణంతో ఎందుకు చెబుతావు?
زیرا اینک شریران کمان را میکشند وتیر را به زه نهادهاند، تا بر راست دلان در تاریکی بیندازند. | ۲ 2 |
౨ఎందుకంటే, చూడు! దుర్మార్గులు విల్లెక్కుపెట్టి ఉన్నారు. చీకటిలో యథార్థహృదయుల మీద వెయ్యడానికి తమ బాణాలు వింటి నారికి తగిలించి సిద్ధంగా ఉన్నారు.
زیرا که ارکان منهدم میشوند و مردعادل چه کند؟» | ۳ 3 |
౩పునాదులు పాడైపోతే న్యాయవంతులు ఏం చెయ్యగలరు?
خداوند در هیکل قدس خود است و کرسی خداوند در آسمان. چشمان او مینگرد، پلکهای وی بنی آدم را میآزماید. | ۴ 4 |
౪యెహోవా తన పవిత్రాలయంలో ఉన్నాడు. ఆయన కళ్ళు గమనిస్తున్నాయి. ఆయన కళ్ళు మనుషులను పరిశీలన చేస్తున్నాయి.
خداوند مرد عادل راامتحان میکند؛ و اما از شریر و ظلم دوست، جان او نفرت میدارد. | ۵ 5 |
౫యెహోవా న్యాయవంతులనూ, దుర్మార్గులనూ, ఇద్దరినీ పరిశీలన చేస్తున్నాడు. హింసించడం పనిగా పెట్టుకున్న వాళ్ళను ఆయన ద్వేషిస్తాడు.
بر شریر دامها و آتش وکبریت خواهد بارانید، و باد سموم حصه پیاله ایشان خواهد بود. | ۶ 6 |
౬దుర్మార్గుల మీద ఆయన రగులుతున్న నిప్పు కణికెలు, అగ్నిగంధకం కురిపిస్తాడు. ఆయన గిన్నెలోని వడగాలి వాళ్ళ పానీయభాగం అవుతుంది.
زیرا خداوند عادل است وعدالت را دوست میدارد، و راستان روی او راخواهند دید. | ۷ 7 |
౭ఎందుకంటే యెహోవా న్యాయవంతుడు. ఆయన నీతిన్యాయాలను ప్రేమిస్తాడు. నిజాయితీపరులు ఆయన ముఖం చూస్తారు.