< امثال 15 >

جواب نرم خشم را برمی گرداند، اماسخن تلخ غیظ را به هیجان می‌آورد. ۱ 1
సున్నితమైన మాట కోపాన్ని తగ్గిస్తుంది. నొప్పించే మాట కోపం రేపుతుంది.
زبان حکیمان علم را زینت می‌بخشد، امادهان احمقان به حماقت تنطق می‌نماید. ۲ 2
జ్ఞానుల నోరు మనోహరమైన జ్ఞానాంశాలు పలుకుతుంది. మూర్ఖుల నోరు తెలివి తక్కువతనాన్ని కుమ్మరిస్తుంది.
چشمان خداوند در همه جاست، و بر بدان ونیکان می‌نگرد. ۳ 3
యెహోవా కళ్ళు లోకమంతా చూస్తూ ఉంటాయి. చెడ్డవాళ్ళని, మంచివాళ్ళని అవి చూస్తూ ఉంటాయి.
زبان ملایم، درخت حیات‌است و کجی آن، شکستگی روح است. ۴ 4
మృదువైన మాటలు పలికే నాలుక జీవవృక్షం వంటిది. కుటిలమైన మాటలు ఆత్మను క్రుంగదీస్తాయి.
احمق تادیب پدر خود را خوار می‌شمارد، اما هر‌که تنبیه را نگاه دارد زیرک می‌باشد. ۵ 5
మూర్ఖుడు తన తండ్రి చేసే క్రమశిక్షణను ధిక్కరిస్తాడు. బుద్ధిమంతుడు దిద్దుబాటును స్వీకరిస్తాడు.
در خانه مرد عادل گنج عظیم است، امامحصول شریران، کدورت است. ۶ 6
నీతిమంతుల ఇల్లు గొప్ప ధనాగారం వంటిది. మూర్ఖునికి కలిగే సంపద బాధలపాలు చేస్తుంది.
لبهای حکیمان معرفت را منتشر می‌سازد، اما دل احمقان، مستحکم نیست. ۷ 7
జ్ఞానుల మాటలు తెలివిని వ్యాప్తి చేస్తాయి. మూర్ఖుల మనస్సు స్థిరంగా ఉండదు.
قربانی شریران نزد خداوند مکروه است، امادعای راستان پسندیده اوست. ۸ 8
భక్తిహీనులు అర్పించే బలులంటే యెహోవాకు అసహ్యం. నీతిమంతుల ప్రార్థన ఆయనకు ఎంతో ఇష్టం.
راه شریران نزد خداوند مکروه است، اماپیروان عدالت را دوست می‌دارد. ۹ 9
దుర్మార్గుల మార్గాలు యెహోవాకు హేయమైనవి. నీతిని అనుసరించి నడుచుకునే వారిని ఆయన ప్రేమిస్తాడు.
برای هر‌که طریق را ترک نماید تادیب سخت است، و هر‌که از تنبیه نفرت کند خواهدمرد. ۱۰ 10
౧౦సన్మార్గం విడిచిపెట్టిన వాడు తీవ్ర కష్టాలపాలౌతాడు. దిద్దుబాటును వ్యతిరేకించే వారు మరణిస్తారు.
هاویه و ابدون در حضور خداوند است، پس چند مرتبه زیاده دلهای بنی آدم. (Sheol h7585) ۱۱ 11
౧౧మృత్యులోకం, నాశనకరమైన అగాధం యెహోవాకు తేటగా కనబడుతున్నాయి. మనుషుల హృదయాలు ఆయనకు మరింత తేటగా కనబడతాయి గదా? (Sheol h7585)
استهزاکننده تنبیه را دوست ندارد، و نزدحکیمان نخواهد رفت. ۱۲ 12
౧౨అపహాసకుడు తనకు బుద్ధి చెప్పే వాళ్ళను ప్రేమించడు. వాడు జ్ఞానుల మంచి మాటల కోసం వారి దగ్గరికి వెళ్లడు.
دل‌شادمان چهره را زینت می‌دهد، اما ازتلخی دل روح منکسر می‌شود. ۱۳ 13
౧౩ఆనందంగా ఉండే హృదయం వదనాన్ని వికసించేలా చేస్తుంది. మనోవేదన ఆత్మను కృంగదీస్తుంది.
دل مرد فهیم معرفت را می‌طلبد، اما دهان احمقان حماقت را می‌چرد. ۱۴ 14
౧౪తెలివి గలవారి మనస్సు జ్ఞానం కోసం వెదుకుతుంది. మూర్ఖులు మూఢత్వంతోనే తమ జీవనం సాగిస్తారు.
تمامی روزهای مصیبت کشان بد است، اماخوشی دل ضیافت دائمی است. ۱۵ 15
౧౫దీనస్థితిలో ఉన్నవారి కాలమంతా దుర్భరం. మానసిక ఆనందం గల వారికి నిత్యం విందే.
اموال اندک با ترس خداوند بهتر است ازگنج عظیم با اضطراب. ۱۶ 16
౧౬విస్తారమైన సంపద కలిగి నెమ్మది లేకుండా ఉండడం కంటే యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉన్నదానితో జీవించడం ఉత్తమం.
خوان بقول در جایی که محبت باشد بهتراست، از گاو پرواری که با آن عداوت باشد. ۱۷ 17
౧౭ద్వేషం నిండిన ఇంట్లో కొవ్విన ఎద్దు మాంసం తినడం కంటే ప్రేమ ఉన్న చోట ఆకుకూరల భోజనం తినడం మేలు.
مرد تندخو نزاع را برمی انگیزد، اما شخص دیرغضب خصومت را ساکن می‌گرداند. ۱۸ 18
౧౮ముక్కోపి కలహాలు రేపుతాడు. ఓర్పు గలవాడు వివాదాలు శాంతింపజేస్తాడు.
راه کاهلان مثل خاربست است، اما طریق راستان شاهراه است. ۱۹ 19
౧౯సోమరిపోతుల బాట ముళ్లకంచె వంటిది. నీతిమంతులు రాజమార్గంలో పయనిస్తారు.
پسر حکیم پدر را شادمان می‌سازد، اما مرداحمق مادر خویش را حقیر می‌شمارد. ۲۰ 20
౨౦జ్ఞానం ఉన్న కుమారుడు తండ్రికి సంతోషం కలిగిస్తాడు. మూర్ఖుడు తన తల్లిని తిరస్కరిస్తాడు.
حماقت در نظر شخص ناقص العقل خوشی است، اما مرد فهیم به راستی سلوک می‌نماید. ۲۱ 21
౨౧బుద్ధిలేని వాడు తన మూర్ఖత్వాన్ని బట్టి ఆనందం పొందుతాడు. వివేకవంతుడు ఋజుమార్గంలో నడుస్తాడు.
از عدم مشورت، تدبیرها باطل می‌شود، اما از کثرت مشورت دهندگان برقرار می‌ماند. ۲۲ 22
౨౨సలహా చెప్పే వారు లేని చోట కార్యం వ్యర్థమైపోతుంది. ఎక్కువమంది సలహాలతో కొనసాగించే కార్యం స్థిరంగా ఉంటుంది.
برای انسان از جواب دهانش شادی حاصل می‌شود، و سخنی که در محلش گفته شودچه بسیار نیکو است. ۲۳ 23
౨౩సరియైన సమాధానం ఇచ్చినప్పుడు సంతోషం కలుగుతుంది. సమయోచితమైన మాట ఎంత మనోహరం!
طریق حیات برای عاقلان به سوی بالااست، تا از هاویه اسفل دور شود. (Sheol h7585) ۲۴ 24
౨౪వివేకం గల వాడు కింద ఉన్న మృత్యులోకంలో పడకుండా ఉండాలని పైకి వెళ్ళే జీవమార్గం వైపు చూస్తాడు. (Sheol h7585)
خداوند خانه متکبران را منهدم می‌سازد، اما حدود بیوه‌زن را استوار می‌نماید. ۲۵ 25
౨౫గర్విష్టుల ఇల్లు యెహోవా కూల్చి వేస్తాడు. విధవరాలి సరిహద్దును ఆయన స్థిరపరుస్తాడు.
تدبیرهای فاسد نزد خداوند مکروه است، اما سخنان پسندیده برای طاهران است. ۲۶ 26
౨౬దుష్టుల తలంపులు యెహోవాకు అసహ్యం. దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రమైనవి.
کسی‌که حریص سود باشد خانه خود رامکدر می‌سازد، اما هر‌که از هدیه‌ها نفرت داردخواهد زیست. ۲۷ 27
౨౭లోభి పిసినారితనంతో తన కుటుంబాన్ని కష్టపెడతాడు. లంచాన్ని అసహ్యించుకొనే వాడు బ్రతుకుతాడు.
دل مرد عادل در جواب دادن تفکر می‌کند، اما دهان شریران، چیزهای بد را جاری می‌سازد. ۲۸ 28
౨౮నీతిమంతుని మనస్సు జ్ఞానంతో కూడిన జవాబు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. మూర్ఖుల నోటి వెంట చెడ్డ మాటలే వస్తాయి.
خداوند از شریران دور است، اما دعای عادلان را می‌شنود. ۲۹ 29
౨౯భక్తిహీనులకు యెహోవా దూరంగా ఉంటాడు. నీతిమంతుల ప్రార్థన ఆయన వింటాడు.
نور چشمان دل را شادمان می‌سازد، و خبرنیکو استخوانها را پر مغز می‌نماید. ۳۰ 30
౩౦కన్నుల్లో కాంతి చూసి హృదయం సంతోషిస్తుంది. క్షేమకరమైన వార్తలు ఎముకలకు బలం కలిగిస్తాయి.
گوشی که تنبیه حیات را بشنود، در میان حکیمان ساکن خواهد شد. ۳۱ 31
౩౧జీవప్రదమైన బోధ అంగీకరించేవాడు జ్ఞానుల మధ్య నివసిస్తాడు.
هر‌که تادیب را ترک نماید، جان خود راحقیر می‌شمارد، اما هر‌که تنبیه را بشنود عقل راتحصیل می‌نماید. ۳۲ 32
౩౨క్రమశిక్షణ అంగీకరించని వాడు తనను తాను ద్వేషించు కుంటున్నాడు. దిద్దుబాటును స్వీకరించేవాడు వివేకం గలవాడు.
ترس خداوند ادیب حکمت است، وتواضع پیشرو حرمت می‌باشد. ۳۳ 33
౩౩యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానం వృద్ది చేసుకునే సాధనం. వినయం కలిగి ఉంటే గౌరవ ప్రతిష్టలు కలుగుతాయి.

< امثال 15 >