< اعداد 34 >

و خداوند موسی را خطاب کرده، گفت: ۱ 1
యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. “నువ్వు ఇశ్రాయేలీయులతో చెప్పు,
«بنی‌اسرائیل را امر فرموده، به ایشان بگو: چون شما به زمین کنعان داخل شوید، این است زمینی که به شما به ملکیت خواهد رسید، یعنی زمین کنعان با حدودش. ۲ 2
‘కనాను దేశంలో, అంటే ఏ దేశాన్ని మీరు చీట్లు వేసి వారసత్వంగా పంచుకోబోతున్నారో ఆ దేశంలో మీరు ప్రవేశిస్తున్నారు.
آنگاه حد جنوبی شما از بیابان سین بر جانب ادوم خواهد بود، و سرحد جنوبی شما از آخر بحرالملح به طرف مشرق خواهد بود. ۳ 3
మీ దక్షిణపు సరిహద్దు సీను అరణ్యం మొదలు ఎదోము సరిహద్దు వరకూ, అంటే, ఉప్పు సముద్రం తూర్పు తీరం వరకూ ఉంటుంది.
و حد شما از جانب جنوب گردنه عقربیم دور خواهد زد و به سوی سین خواهدگذشت، و انتهای آن به طرف جنوب قادش برنیع خواهد بود، و نزد حصرادار بیرون رفته، تاعصمون خواهد گذشت. ۴ 4
మీ సరిహద్దు దక్షిణం మొదలు అక్రబ్బీము కనుమ దగ్గర తిరిగి సీను వరకూ వ్యాపిస్తుంది. అది దక్షిణం నుండి కాదేషు బర్నేయ వరకూ వ్యాపించి, అక్కడ నుండి హసరద్దారు వరకూ పోయి, అక్కడ నుండి అస్మోను వరకూ కొనసాగుతుంది.
و این حد از عصمون تاوادی مصر دور زده، انتهایش نزد دریا خواهدبود. ۵ 5
అస్మోను నుండి ఐగుప్తు నది వరకూ సరిహద్దు తిరిగి సముద్రం వరకూ వ్యాపిస్తుంది.
و اما حد غربی. دریای بزرگ حد شماخواهد بود. این است حد غربی شما. ۶ 6
మీకు పడమటి సరిహద్దుగా మహాసముద్రం ఉంటుంది.
و حد شمالی شما این باشد، از دریای بزرگ برای خود جبل هور را نشان گیرید. ۷ 7
మీ ఉత్తరపు సరిహద్దును మహాసముద్రం నుండి హోరు కొండ దాకా,
و از جبل هور تا مدخل حمات را نشان گیرید. و انتهای این حد نزد صدد باشد. ۸ 8
హోరు కొండ నుండి హమాతుకు వెళ్ళే దారి వరకూ ఏర్పాటు చేసుకోవాలి. ఆ సరిహద్దు సెదాదు వరకూ,
و این حد نزد زفرون بیرون رود و انتهایش نزد حصر عینان باشد، این حدشمالی شما خواهد بود. ۹ 9
అక్కడ నుండి జిప్రోను వరకూ వ్యాపిస్తుంది. దాని అంచు హసరేనాను దగ్గర ఉంటుంది. అది మీకు ఉత్తరపు సరిహద్దు.
و برای حد مشرقی خود از حصر عینان تاشفام را نشان گیرید. ۱۰ 10
౧౦తూర్పు సరిహద్దు హసరేనాను నుండి షెపాము వరకూ మీరు లెక్కించుకోవాలి.
و این حد از شفام تا ربله به طرف شرقی عین برود، پس این حد کشیده شده به‌جانب دریای کنرت به طرف مشرق برسد. ۱۱ 11
౧౧అది షెపాము నుండి అయీనుకు తూర్పున రిబ్లా వరకూ ఉంటుంది. ఆ సరిహద్దు దిగి తూర్పున కిన్నెరెతు సముద్రపు ఒడ్డును తాకుతూ ఉంటుంది.
واین حد تا به اردن برسد و انتهایش نزد بحرالملح باشد. این زمین برحسب حدودش به هر طرف زمین شما خواهد بود.» ۱۲ 12
౧౨అది యొర్దాను నది వరకూ దిగి ఉప్పు సముద్రం వరకూ వ్యాపిస్తుంది. ఆ దేశం చుట్టూ ఉన్న సరిహద్దుల మధ్య ఉన్న ప్రాంతమంతా మీ దేశం’ అని వారితో చెప్పు.”
و موسی بنی‌اسرائیل را امر کرده، گفت: «این است زمینی که شما آن را به قرعه تقسیم خواهید کرد که خداوند امر فرموده است تا به نه سبط و نصف داده شود. ۱۳ 13
౧౩మోషే ఇశ్రాయేలీయులతో “ఇది మీరు చీట్లు వేసుకుని పొందే దేశం. తొమ్మిది గోత్రాలకు, ఒక అర్థ గోత్రానికి ఇవ్వమని యెహోవా ఆజ్ఞాపించాడు.
زیرا که سبط بنی روبین برحسب خاندان آبای خود و سبط بنی جادبرحسب خاندان آبای خود، و نصف سبط منسی، نصیب خود را گرفته‌اند. ۱۴ 14
౧౪ఎందుకంటే తమ పూర్వీకుల కుటుంబాల ప్రకారం రూబేనీయులు, గాదీయులు తమ వారసత్వాలను పొందారు.
این دو سبط و نصف به آن طرف اردن در مقابل اریحا به‌جانب مشرق به سوی طلوع آفتاب نصیب خود را گرفته‌اند.» ۱۵ 15
౧౫అలాగే మనష్షే అర్థగోత్రం కూడా వారసత్వం పొందింది. ఆ రెండు గోత్రాలు, అర్థ గోత్రం, సూర్యోదయం దిక్కున, అంటే తూర్పున యెరికో దగ్గర యొర్దాను అవతల తమ తమ వారసత్వాలను పొందారు” అని చెప్పాడు.
و خداوند موسی را خطاب کرده، گفت: ۱۶ 16
౧౬అప్పుడు యెహోవా మోషేతో ఇలా చెప్పాడు,
«این است نامهای کسانی که زمین را برای شماتقسیم خواهند نمود. العازار کاهن و یوشع بن نون. ۱۷ 17
౧౭“ఆ దేశాన్నిమీకు వారసత్వంగా పంచి పెట్టాల్సిన వ్యక్తులు ఎవరంటే, యాజకుడు ఎలియాజరు, నూను కొడుకు యెహోషువ.
و یک سرور را از هر سبط برای تقسیم نمودن زمین بگیرید. ۱۸ 18
౧౮వారు కాక ఆ దేశాన్ని మీకు పంచిపెట్టడానికి ప్రతి గోత్రం నుండి ఒక్క నాయకుణ్ణి ఎన్నుకోవాలి.
و این است نامهای ایشان. ازسبط یهودا کالیب بن یفنه. ۱۹ 19
౧౯వారెవరంటే, యూదా గోత్రంలో యెఫున్నె కొడుకు కాలేబు,
و از سبطبنی شمعون شموئیل بن عمیهود. ۲۰ 20
౨౦షిమ్యోను గోత్రంలో అమీహూదు కొడుకు షెమూయేలు,
و از سبطبنیامین الیداد بن کسلون. ۲۱ 21
౨౧బెన్యామీను గోత్రంలో కిస్లోను కొడుకు ఎలీదాదు.
و از سبط بنی دان رئیس بقی ابن یجلی. ۲۲ 22
౨౨దాను గోత్రంలో యొగ్లి కొడుకు బుక్కీ నాయకుడు.
و از بنی یوسف از سبطبنی منسی رئیس حنیئیل بن ایفود. ۲۳ 23
౨౩యోసేపు కొడుకుల్లో ఏఫోదు కొడుకు హన్నీయేలు, మనష్షే గోత్ర నాయకుడు,
و از سبطبنی افرایم رئیس قموئیل بن شفطان. ۲۴ 24
౨౪ఎఫ్రాయిము గోత్రంలో షిప్తాను కొడుకు కెమూయేలు నాయకుడు,
و از سبطبنی زبولون رئیس الیصافان بن فرناک. ۲۵ 25
౨౫జెబూలూను గోత్రంలో పర్నాకు కొడుకు ఎలీషాపాను నాయకుడు,
و از سبطبنی یساکار رئیس فلطیئیل بن عزان. ۲۶ 26
౨౬ఇశ్శాఖారీయుల గోత్రంలో అజాను కొడుకు పల్తీయేలు నాయకుడు,
و از سبطبنی اشیر رئیس اخیهود بن شلومی. ۲۷ 27
౨౭ఆషేరీయుల గోత్రంలో షెలోమి కొడుకు అహీహూదు నాయకుడు.
و از سبطبنی نفتالی رئیس فدهئیل بن عمیهود.» ۲۸ 28
౨౮నఫ్తాలీయుల గోత్రంలో అమీహూదు కొడుకు పెదహేలు నాయకుడు.”
اینانندکه خداوند مامور فرمود که ملک را در زمین کنعان برای بنی‌اسرائیل تقسیم نمایند. ۲۹ 29
౨౯వీరంతా కనాను దేశంలో ఇశ్రాయేలీయులకు వారి వారి వారసత్వాలను పంచిపెట్టడానికి యెహోవా ఆజ్ఞాపించినవారు.

< اعداد 34 >