< لاویان 2 >
«و هرگاه کسی قربانی هدیه آردی بجهت خداوند بگذراند، پس قربانی او از آرد نرم باشد، و روغن بر آن بریزد و کندر بر آن بنهد. | ۱ 1 |
౧ఎవరైనా ఒక వ్యక్తి యెహోవాకు ధాన్య నైవేద్యం అర్పించాలంటే ఆ అర్పణ సన్నని గోదుమ పిండి అయి ఉండాలి. అతడు దాని మీద నూనె పోసి, సాంబ్రాణి వేయాలి.
وآن را نزد پسران هارون کهنه بیاورد، و یک مشت از آن بگیرد یعنی از آرد نرمش و روغنش باتمامی کندرش و کاهن آن را برای یادگاری بسوزاند، تا هدیه آتشین و عطر خوشبو بجهت خداوند باشد. | ۲ 2 |
౨అతడు దాన్ని యాజకులైన అహరోను కొడుకుల దగ్గరికి తీసుకు రావాలి. అప్పుడు యాజకుడు తన చేతి నిండుగా నూనే, సాంబ్రాణీ కలిసిన సన్నని పిండిని తీసుకుంటాడు. అప్పుడు యాజకుడు యెహోవా మంచితనం గూర్చి కృతజ్ఞతాపూర్వకంగా స్మరించడానికై ఆ అర్పణని బలిపీఠం పైన వేసి కాల్చాలి. అది యెహోవా కోసం కమ్మని సువాసనను కలుగజేస్తుంది.
و بقیه هدیه آردی از آن هارون وپسرانش باشد. این از هدایای آتشین خداوند قدس اقداس است. | ۳ 3 |
౩ఆ నైవేద్యంలో మిగిలింది అహరోనుకూ, అతని కొడుకులకూ చెందుతుంది. యెహోవాకి అర్పించే దహన బలులన్నిటిలో ఇది అతి పరిశుద్ధం.
و هرگاه قربانی هدیه آردی پخته شدهای در تنور بگذرانی، پس قرصهای فطیر از آرد نرم سرشته شده به روغن، یا گرده های فطیر مالیده شده به روغن باشد. | ۴ 4 |
౪మీరు పొయ్యిలో కాల్చిన నైవేద్యం అర్పించాలంటే పొంగజేసే పదార్ధం లేకుండా సన్నని పిండితో, నూనె కలిపి చేసిన మెత్తని చపాతీ అయి ఉండాలి. లేదా సన్నని పిండితో, నూనె రాసి చేసిన అప్పడంలా గట్టిగా ఉండాలి.
و اگر قربانی توهدیه آردی بر ساج باشد، پس از آرد نرم فطیرسرشته شده به روغن باشد. | ۵ 5 |
౫ఒకవేళ నీ అర్పణ పెనం మీద కాల్చిన నైవేద్యమైతే అది పొంగజేసే పదార్ధం లేకుండా సన్నని పిండితో, నూనె రాసి చేసినదై ఉండాలి.
و آن را پاره پاره کرده، روغن بر آن بریز. این هدیه آردی است. | ۶ 6 |
౬అది నైవేద్యం, కాబట్టి దాన్ని నువ్వు ముక్కలు చేసి వాటి పైన నూనె పోయాలి.
واگر قربانی تو هدیه آردی تابه باشد از آرد نرم باروغن ساخته شود. | ۷ 7 |
౭ఒకవేళ నీ నైవేద్యం వంట పాత్రలో వండినదైతే దాన్ని సన్నని పిండీ, నూనే కలిపి తయారు చేయాలి.
و هدیه آردی را که از این چیزها ساخته شود نزد خداوند بیاور، و آن راپیش کاهن بگذار، و او آن را نزد مذبح خواهدآورد. | ۸ 8 |
౮ఈ పదార్ధాలతో చేసిన నైవేద్యాన్ని యెహోవా దగ్గరికి తీసుకురావాలి. దాన్ని యాజకుడికి అందించాలి. అతడు దాన్ని బలిపీఠం దగ్గరికి తీసుకు వస్తాడు.
و کاهن از هدیه آردی یادگاری آن رابردارد و بر مذبح بسوزاند. این هدیه آتشین و عطرخوشبو بجهت خداوند است. | ۹ 9 |
౯తరువాత యాజకుడు యెహోవా మంచితనం గూర్చి కృతజ్ఞతాపూర్వకంగా స్మరించుకోడానికి ఆ నైవేద్యంలో కొంత భాగం తీసుకుని బలిపీఠంపై దహించాలి. అది అగ్నితో చేసిన అర్పణ. అది యెహోవా కోసం కమ్మని సువాసనను కలుగజేస్తుంది.
و بقیه هدیه آردی از آن هارون و پسرانش باشد. این ازهدایای آتشین خداوند قدس اقداس است. | ۱۰ 10 |
౧౦ఆ నైవేద్యంలో మిగిలిన భాగం అహరోనుకీ, అతని కొడుకులకీ చెందుతుంది. యెహోవాకి అర్పించే దహన బలులన్నిటిలో ఇది అతి పరిశుద్ధం.
«و هیچ هدیه آردی که بجهت خداوندمی گذرانید با خمیرمایه ساخته نشود، زیرا که هیچ خمیرمایه و عسل را برای هدیه آتشین بجهت خداوند نباید سوزانید. | ۱۱ 11 |
౧౧మీరు యెహోవాకి సమర్పించే ఏ నైవేద్యం లోనూ పొంగజేసే పదార్ధం ఉండకూడదు. ఎందుకంటే తేనెనూ, పొంగజేసే పదార్ధం దేనినైనా నైవేద్యంగా బలిపీఠం పైన దహించకూడదు.
آنها را برای قربانی نوبرها بجهت خداوند بگذرانید، لیکن برای عطر خوشبو به مذبح برنیارند. | ۱۲ 12 |
౧౨వాటిని ప్రథమఫలంగా యెహోవాకి సమర్పించవచ్చు. కానీ బలిపీఠం పైన కమ్మని సువాసన కలగజేయడానికి వాటిని వాడకూడదు.
و هرقربانی هدیه آردی خود را به نمک نمکین کن، ونمک عهد خدای خود را از هدیه آردی خودبازمدار، با هر قربانی خود نمک بگذران. | ۱۳ 13 |
౧౩నువ్వు అర్పించే ప్రతి నైవేద్యానికీ ఉప్పు కలపాలి. నీ దేవుని నిబంధన ఉప్పు లేకుండా నీ నైవేద్యం ఉండకూడదు. నీ నైవేద్యాలన్నిటితో పాటు ఉప్పు కూడా అర్పించాలి.
و اگرهدیه آردی نوبرها بجهت خداوند بگذرانی، پس خوشه های برشته شده به آتش، یعنی بلغورحاصل نیکو بجهت هدیه آردی نوبرهای خودبگذران. | ۱۴ 14 |
౧౪నువ్వు యెహోవాకి ప్రథమ ఫలం నైవేద్యాన్ని అర్పించాలంటే పచ్చని కంకుల్లోని కొత్త ధాన్యాన్ని వేయించి పిండి చేసి అర్పించాలి.
و روغن بر آن بریز و کندر بر آن بنه. این هدیه آردی است. | ۱۵ 15 |
౧౫తరువాత దానిపై నూనె, సాంబ్రాణి పోయాలి. ఇదీ నైవేద్యమే.
و کاهن یادگاری آن رایعنی قدری از بلغور آن و از روغنش با تمامی کندرش بسوزاند. این هدیه آتشین بجهت خداوند است. | ۱۶ 16 |
౧౬తరువాత యాజకుడు యెహోవా మంచితనం గూర్చి కృతజ్ఞతాపూర్వకంగా స్మరించడానికై పిండీ, నూనే, సాంబ్రాణిల్లో కొంత భాగం తీసుకుని వాటిని దహిస్తాడు. అది యెహోవా కోసం అగ్నితో చేసిన అర్పణ.