< لاویان 18 >
و خداوند موسی را خطاب کرده، گفت: | ۱ 1 |
౧యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు.
«بنیاسرائیل را خطاب کرده، به ایشان بگو: من یهوه خدای شما هستم. | ۲ 2 |
౨“నేను మీ దేవుడైన యెహోవాను అని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పు.
مثل اعمال زمین مصر که در آن ساکن میبودید عمل منمایید، و مثل اعمال زمین کنعان که من شما را به آنجا داخل خواهم کرد عمل منمایید، و برحسب فرایض ایشان رفتار مکنید. | ۳ 3 |
౩మీరు నివసించిన ఐగుప్తు దేశాచారాల ప్రకారం మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పిస్తున్న కనాను దేశాచారాల ప్రకారం మీరు చేయకూడదు. వారి మతాచారాలను అనుసరించ కూడదు.
احکام مرا بجاآورید و فرایض مرا نگاه دارید تا در آنها رفتارنمایید، من یهوه خدای شما هستم. | ۴ 4 |
౪మీరు నా విధులను పాటించాలి. నా చట్టాల ప్రకారం నడుచుకుంటూ వాటిని ఆచరించాలి. నేను మీ దేవుడైన యెహోవాను.
پس فرایض و احکام مرا نگاه دارید، که هر آدمی که آنها را بجاآورد در آنها زیست خواهد کرد، من یهوه هستم. | ۵ 5 |
౫మీరు నా చట్టాలను నా విధులను ఆచరించాలి. వాటిని పాటించే వాడు వాటి వలన జీవిస్తాడు. నేను యెహోవాను.
هیچکس به احدی از اقربای خویش نزدیکی ننماید تا کشف عورت او بکند. من یهوه هستم. | ۶ 6 |
౬మీలో ఎవరూ తమ రక్తసంబంధులతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. నేను యెహోవాను.
عورت پدر خود یعنی مادر خود را کشف منما؛ او مادر توست. کشف عورت او مکن. | ۷ 7 |
౭నీ తండ్రికి గౌరవదాయకం గా ఉన్న నీ తల్లితో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు ఆమె నీ తల్లి. ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు.
عورت زن پدر خود را کشف مکن. آن عورت پدر تو است. | ۸ 8 |
౮నీ తండ్రి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. అలా చేసి నీ తండ్రిని అగౌరవ పరచకూడదు.
عورت خواهر خود، خواه دختر پدرت، خواه دختر مادرت چه مولود در خانه، چه مولودبیرون، عورت ایشان را کشف منما. | ۹ 9 |
౯నీ సోదరితో అంటే ఇంట్లో పుట్టినా బయట పుట్టినా నీ తండ్రి కుమార్తెతోనైనా నీ తల్లి కుమార్తెతోనైనా లైంగిక సంబంధం పెట్టుకోకూడదు.
عورت دختر پسرت و دختر دخترت، عورت ایشان را کشف مکن، زیرا که اینها عورت تو است. | ۱۰ 10 |
౧౦నీ కుమారుడి కుమార్తెతో గానీ కుమార్తె కుమార్తెతోగానీ లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. అది నీ గౌరవమే.
عورت دختر زن پدرت که از پدر تو زاییده شده باشد، او خواهر تو است کشف عورت او رامکن. | ۱۱ 11 |
౧౧నీ తండ్రికి పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సోదరి. ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు.
عورت خواهر پدر خود را کشف مکن، او از اقربای پدر تو است. | ۱۲ 12 |
౧౨నీ తండ్రి సోదరితో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. ఆమె నీ తండ్రి రక్తసంబంధి.
عورت خواهرمادر خود را کشف مکن، او از اقربای مادر تواست. | ۱۳ 13 |
౧౩నీ తల్లి సోదరితో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. ఆమె నీ తల్లి రక్తసంబంధి.
عورت برادر پدر خود را کشف مکن، وبه زن او نزدیکی منما. او (به منزله ) عمه تو است. | ۱۴ 14 |
౧౪నీ తండ్రి సోదరుని భార్యతో లైంగిక సంబంధం పెట్టుకోవడం ద్వారా అతనిని అగౌరవ పరచ కూడదు. అంటే అతని భార్యను ఆ ఉద్దేశంతో సమీపించ కూడదు. ఆమె నీ పినతల్లి.
عورت عروس خود را کشف مکن، او زن پسرتو است. عورت او را کشف مکن. | ۱۵ 15 |
౧౫నీ కోడలితో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. ఆమె నీ కుమారుడి భార్య. ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు.
عورت زن برادر خود را کشف مکن. آن عورت برادر تواست. | ۱۶ 16 |
౧౬నీ సోదరుని భార్యతో లైంగిక సంబంధం పెట్టుకో కూడదు. అది నీ సోదరుని గౌరవం.
عورت زنی را با دخترش کشف مکن. ودختر پسر او یا دختر دختر او را مگیر، تا عورت او را کشف کنی. اینان از اقربای او میباشند و این فجور است. | ۱۷ 17 |
౧౭ఒక స్త్రీతోనూ ఆమె కూతురితోనూ లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. నీకు లైంగిక సంబంధం ఉన్న స్త్రీ కుమారుడి కూతురుతోగానీ ఆమె కూతురు కూతురుతో గానీ లైంగిక సంబంధం పెట్టుకునేందుకు వారిని చేర దీయకూడదు. వారు ఆమె రక్తసంబంధులు. అది దుర్మార్గం.
و زنی را با خواهرش مگیر، تاهیوی او بشود، و تا عورت او را با وی مادامی که او زنده است، کشف نمایی. | ۱۸ 18 |
౧౮నీ భార్య బతికి ఉండగానే ఆమెను బాధించాలని ఆమె సోదరితో లైంగిక సంబంధం పెట్టుకోవాలని ఆమెను పెళ్లాడకూడదు.
و به زنی درنجاست حیضش نزدیکی منما، تا عورت او راکشف کنی. | ۱۹ 19 |
౧౯ఋతుస్రావం వలన స్త్రీ బయట ఉన్నప్పుడు ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు.
و با زن همسایه خود همبسترمشو، تا خود را با وی نجس سازی. | ۲۰ 20 |
౨౦నీ పొరుగువాడి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకుని ఆమె మూలంగా అపవిత్రం కాకూడదు.
و کسی ازذریت خود را برای مولک از آتش مگذران و نام خدای خود را بیحرمت مساز. من یهوه هستم. | ۲۱ 21 |
౨౧నీవు నీ సంతానాన్ని మోలెకు దేవుడి కోసం అగ్నిగుండంలో ఎంత మాత్రం అర్పించకూడదు. నీ దేవుని నామాన్ని అపవిత్ర పరచకూడదు. నేను యెహోవాను.
و با ذکور مثل زن جماع مکن، زیرا که این فجور است. | ۲۲ 22 |
౨౨స్త్రీతో లైంగిక సంబంధం ఉన్నట్టు పురుషునితో ఉండకూడదు. అది అసహ్యం.
و با هیچ بهیمهای جماع مکن، تاخود را به آن نجس سازی، و زنی پیش بهیمهای نایستد تا با آن جماع کند، زیرا که این فجوراست. | ۲۳ 23 |
౨౩ఏ జంతువుతోనూ లైంగిక సంబంధం పెట్టుకుని దాని వలన అపవిత్రం కాకూడదు. ఏ స్త్రీ కూడా జంతువుతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. అది భ్రష్టత్వం.
«به هیچ کدام از اینها خویشتن را نجس مسازید، زیرا به همه اینها امتهایی که من پیش روی شما بیرون میکنم، نجس شدهاند. | ۲۴ 24 |
౨౪వీటిలో దేనివలనా మీరు అపవిత్రులు కాకూడదు. నేను మీ ఎదుటి నుండి వెళ్ల గొట్టబోతున్న జాతులు ఇలాంటి పనులు చేసి భ్రష్టులయ్యారు.
وزمین نجس شده است، و انتقام گناهش را از آن خواهم کشید، و زمین ساکنان خود را قی خواهدنمود. | ۲۵ 25 |
౨౫ఆ దేశం అపవిత్రమై పోయింది. గనక నేను దానిపై దాని దోష శిక్షను విధిస్తున్నాను. ఆ దేశం తనలో నివసిస్తున్న వారిని బయటికి కక్కివేస్తున్నది.
پس شما فرایض و احکام مرا نگاه دارید، و هیچ کدام از این فجور را به عمل نیاورید، نه متوطن و نه غریبی که در میان شما ماواگزیند. | ۲۶ 26 |
౨౬కాబట్టి ఆ దేశంలో మీకంటే ముందు అక్కడ నివసించిన ప్రజలను ఆ దేశం కక్కివేసిన ప్రకారం మీ అపవిత్రతను బట్టి మిమ్మల్ని కక్కి వేయకుండేలా
زیرا مردمان آن زمین که قبل از شمابودند، جمیع این فجور را کردند، و زمین نجس شده است. | ۲۷ 27 |
౨౭మీరు గానీ మీలో నివసించే పరదేశి గాని యీ అసహ్యమైన క్రియల్లో దేన్నీ చేయకూడదు.
مبادا زمین شما را نیز قی کند، اگرآن را نجس سازید، چنانکه امتهایی را که قبل ازشما بودند، قی کرده است. | ۲۸ 28 |
౨౮నా చట్టాలను, నా విధులను ఆచరించాలి.
زیرا هر کسیکه یکی از این فجور را بکند، همه کسانی که کرده باشند، از میان قوم خود منقطع خواهند شد. | ۲۹ 29 |
౨౯అలాటి అసహ్యమైన పనుల్లో దేనినైనా చేసేవారు ప్రజల్లో లేకుండా పోతారు.
پس وصیت مرا نگاه دارید، و از این رسوم زشت که قبل از شما به عمل آورده شده است عمل منمایید، و خود را به آنها نجس مسازید. من یهوه خدای شما هستم.» | ۳۰ 30 |
౩౦కాబట్టి మీకంటే ముందుగా అక్కడ నివసించిన వాళ్ళు పాటించిన అసహ్యమైన ఆచారాల్లో దేనినైనా పాటించి అపవిత్రులై పోకుండా నేను మీకు విధించిన నియమాలను అనుసరించి నడుచుకోవాలి. నేను మీ దేవుణ్ణి. యెహోవాను.”