< یوشع 5 >
و واقع شد که چون تمامی ملوک اموریانی که به آن طرف اردن به سمت مغرب بودند، و تمامی ملوک کنعانیانی که به کناره دریا بودند، شنیدند که خداوند آب اردن را پیش روی بنیاسرائیل خشکانیده بود تا ما عبور کردیم، دلهای ایشان گداخته شد و از ترس بنیاسرائیل، دیگر جان در ایشان نماند. | ۱ 1 |
౧వారు యొర్దానును దాటినంతసేపూ యెహోవా ఇశ్రాయేలీయుల ముందు ఉండి ఆ నదిలో నీళ్లను ఆరిపోయేలా చేసిన సంగతి యొర్దానుకు పశ్చిమాన ఉన్న అమోరీయుల రాజులూ, మహాసముద్రం తీరాన ఉన్న కనానీయుల రాజులూ విన్నప్పుడు, వారి గుండెలు అదిరిపోయాయి. ఇశ్రాయేలీయుల భయంతో వారు అధైర్యపడ్డారు.
در آن وقت، خداوند به یوشع گفت: «کاردها از سنگ چخماق برای خود بساز، و بنیاسرائیل را بار دیگر مختون ساز.» | ۲ 2 |
౨ఆ సమయంలో యెహోవా “రాతికత్తులు చేయించి మళ్లీ ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించు” అని యెహోషువకు ఆజ్ఞాపించాడు.
و یوشع کاردها ازسنگ چخماق ساخته، بنیاسرائیل را بر تل غلفه ختنه کرد. | ۳ 3 |
౩యెహోషువ రాతి కత్తులు చేయించి “గిబియత్ హరాలోత్” అనే స్థలం దగ్గర ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించాడు.
و سبب ختنه کردن یوشع این بود که تمام ذکوران قوم، یعنی تمام مردان جنگی که ازمصر بیرون آمدند بهسر راه در صحرا مردند. | ۴ 4 |
౪యెహోషువ సున్నతి చేయించటానికి కారణం, ఐగుప్తులో నుండి బయలుదేరిన వారందరిలో యుద్ధసన్నద్ధులైన వారందరూ ఐగుప్తు మార్గంలో అరణ్యంలోనే చనిపోయారు.
اماتمامی قوم که بیرون آمدند مختون بودند، وتمامی قوم که در صحرا بعد از بیرون آمدن ایشان از مصر بهسر راه مولود شدند، مختون نگشتند. | ۵ 5 |
౫బయలుదేరిన పురుషులందరూ సున్నతి పొందినవారే కాని ఐగుప్తులో నుండి బయలుదేరిన తరువాత అరణ్యమార్గంలో పుట్టిన వారిలో ఎవ్వరూ సున్నతి పొందలేదు.
زیرا بنیاسرائیل چهل سال در بیابان راه میرفتند، تا تمامی آن طایفه، یعنی آن مردان جنگی که از مصر بیرون آمده بودند، تمام شدند. زانرو که آواز خداوند را نشنیدند و خداوند به ایشان قسم خورده، گفت: «شما را نمی گذارم که آن زمین را ببینید که خداوند برای پدران ایشان قسم خورده بود که آن را به ما بدهد، زمینی که به شیر و شهد جاری است.» | ۶ 6 |
౬యెహోవా మాట వినకపోవడం వల్ల వారికి ఏ దేశాన్ని ఇస్తానని వారి పితరులతో యెహోవా ప్రమాణం చేశాడో, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తాను వారికి ఇంక చూపించనని ప్రమాణం చేసినందువల్ల ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ నశించే వరకూ ఇశ్రాయేలీయులు నలభై సంవత్సరాలు అరణ్యంలో సంచరిస్తూ ఉండిపోయారు.
و اما پسران ایشان که در جای آنها برخیزانیده بود یوشع ایشان رامختون ساخت، زیرا نامختون بودند چونکه ایشان را در راه ختنه نکرده بودند. | ۷ 7 |
౭ఆయన వారికి స్థానంలో పుట్టించిన వారి కుమారులు సున్నతి పొందలేదు కాబట్టి వారికి ఇప్పుడు సున్నతి చేయించాడు, ఎందుకంటే మార్గంలో వారికి సున్నతి జరగలేదు.
و واقع شد که چون از ختنه کردن تمام قوم فارغ شدند، در جایهای خود در لشکرگاه ماندندتا شفا یافتند. | ۸ 8 |
౮కాబట్టి ప్రజలందరికీ సున్నతి చేయించిన తరువాత వారు బాగుపడే వరకూ శిబిరం లోనే ఉండిపోయారు.
و خداوند به یوشع گفت: «امروزعار مصر را از روی شما غلطانیدم. از این سبب نام آن مکان تا امروز جلجال خوانده میشود.» | ۹ 9 |
౯అప్పుడు యెహోవా “ఈ రోజు నేను ఐగుప్తు అవమానాన్ని మీ మీద నుండి దొర్లించి వేశాను” అని యెహోషువతో అన్నాడు. అప్పటినుండి నేటివరకూ ఆ స్థలానికి “గిల్గాలు” అని పేరు.
و بنیاسرائیل در جلجال اردو زدند و عیدفصح را در شب روز چهاردهم ماه، در صحرای اریحا نگاه داشتند. | ۱۰ 10 |
౧౦ఇశ్రాయేలీయులు గిల్గాలులో దిగి ఆ నెల పద్నాలుగో రోజు సాయంకాలం యెరికో మైదానంలో పస్కా పండగ ఆచరించారు.
و در فردای بعد از فصح درهمان روز، از حاصل کهنه زمین، نازکهای فطیر وخوشه های برشته شده خوردند. | ۱۱ 11 |
౧౧పస్కా పండగ అయిన ఉదయమే వారు ఆ దేశపు పంటను తిన్నారు. ఆ రోజే వారు పొంగని రొట్టెలనూ, వేయించిన ధాన్యాలనూ తిన్నారు.
و در فردای آن روزی که از حاصل زمین خوردند، من موقوف شد و بنیاسرائیل دیگر من نداشتند، و در آن سال از محصول زمین کنعان میخوردند. | ۱۲ 12 |
౧౨ఆ రోజు వారు ఆ దేశపు పంటను తిన్న తరువాత మన్నా ఆగిపోయింది, అప్పటినుండి ఇశ్రాయేలీయులకు ఇక మన్నా దొరకలేదు. ఆ సంవత్సరం వారు కనాను దేశపు పంటను తిన్నారు.
و واقع شد چون یوشع نزد اریحا بود که چشمان خود را بالا انداخته، دید که اینک مردی با شمشیر برهنه در دست خود پیش وی ایستاده بود. و یوشع نزد وی آمده، او را گفت: «آیا تو از ماهستی یا از دشمنان ما؟» | ۱۳ 13 |
౧౩యెహోషువ యెరికో ప్రాంతం దగ్గరలో ఉండి కన్నులెత్తి చూసినప్పుడు కత్తి దూసి చేతిలో పట్టుకున్న ఒక వ్యక్తి అతని ఎదుట నిలబడి ఉన్నాడు. యెహోషువ అతని దగ్గరికి వెళ్లి “నీవు మా పక్షంగా ఉన్నావా లేక మా విరోధుల పక్షంగా ఉన్నావా” అని అడిగాడు.
گفت: «نی، بلکه من سردار لشکر خداوند هستم که الان آمدم.» پس یوشع روی به زمین افتاده، سجده کرد و به وی گفت: «آقایم به بنده خود چه میگوید؟» | ۱۴ 14 |
౧౪అతడు “కాదు, యెహోవా సైన్యానికి సేనాధిపతిగా నేను వచ్చాను” అన్నాడు. యెహోషువ నేలకు సాగిలపడి నమస్కారం చేసి “నా యేలినవాడు తన దాసునికి ఏమి సెలవిస్తాడు” అని అడిగాడు.
سردار لشکر خداوند به یوشع گفت که «نعلین خود را از پایت بیرون کن زیرا جایی که توایستادهای مقدس است.» و یوشع چنین کرد. | ۱۵ 15 |
౧౫అందుకు యెహోవా సేనాధిపతి “నీవు నిలబడి ఉన్న ఈ స్థలం పరిశుద్ధమైనది, నీ చెప్పులు తీసేయి” అని చెప్పగానే యెహోషువ అలా చేశాడు.