< یوشع 15 >

و قرعه به جهت سبط بنی یهودا، به حسب قبایل ایشان، به طرف جنوب به‌سر حد ادوم، یعنی صحرای صین به اقصای تیمان رسید. ۱ 1
యూదాగోత్రం వారికి వారి వంశాల ప్రకారం చీట్ల వల్ల వచ్చిన వంతు, ఎదోం దేశ సరిహద్దు వరకూ అంటే దక్షిణ దిక్కున సీను ఎడారి చిట్టచివరి దక్షిణ భాగం వరకూ ఉంది.
و حد جنوبی ایشان از آخر بحرالملح، از خلیجی که متوجه به سمت جنوب است، بود. ۲ 2
వారి దక్షిణ సరిహద్దు, ఉప్పు సముద్రపు ఒడ్డు నుండి అంటే దక్షిణంగా ఉన్న అఖాతం నుండి వ్యాపించింది.
و به طرف جنوب، فراز عکربیم بیرون آمده، به صین گذشت، و به جنوب قادش برنیع برآمده، به حصرون گذشت، و به اداربرآمده، به سوی قرقع برگشت. ۳ 3
వారి సరిహద్దు అక్రబ్బీము కొండకు దక్షిణంగా ఎక్కి, సీను వరకూ పోయి కాదేషు బర్నేయకు దక్షిణంగా ఎక్కి హెస్రోను మీదుగా అద్దారు ఎక్కి కర్కాయు వైపు తిరిగి
و از عصمون گذشته، به وادی مصر بیرون آمد، و انتهای این حدتا به دریا بود. این حد جنوبی شما خواهد بود. ۴ 4
అస్మోను గుండా ఐగుప్తు వాగు పక్కగా వెళ్ళింది. ఇది సముద్రం ఒడ్డు వరకూ ఉంది. ఇది వారి దక్షిణ సరిహద్దు.
وحد شرقی، بحرالملح تا آخر اردن بود، و حدطرف شمال، از خلیج دریا تا آخر اردن بود. ۵ 5
దాని తూర్పు సరిహద్దు యొర్దాను చివరివరకూ ఉన్న ఉప్పు సముద్రం. ఉత్తరదిక్కు సరిహద్దు యొర్దాను చివర ఉన్న సముద్రాఖాతం మొదలుకొని వ్యాపించింది.
واین حد تا بیت حجله برآمده، به طرف شمالی بیت عربه گذشت، و این حد نزد سنگ بهن پسر روبین برآمد. ۶ 6
ఆ సరిహద్దు బేత్‌హోగ్లా వరకూ వెళ్లి బేత్ అరాబాకు ఉత్తరంగా వ్యాపించింది. అక్కడనుండి ఆ సరిహద్దు రూబేనీయుడైన బోహను రాయి వరకూ వ్యాపించింది.
و این حد از وادی عخور نزد دبیر برآمد، و به طرف شمال به سوی جلجال که مقابل فرازادمیم است، که در جنوب وادی است، متوجه می‌شود، و این حد نزد آبهای عین شمس گذشت، و انتهایش نزد عین روجل بود. ۷ 7
ఆ సరిహద్దు ఆకోరు లోయ నుండి దెబీరు వరకూ వాగుకి దక్షిణ తీరాన ఉన్న అదుమ్మీము కొండ ఎదురుగా ఉన్న గిల్గాలుకు ఉత్తరంగా వ్యాపించింది. ఆ సరిహద్దు ఏన్‌షేమెషు నీళ్లవరకూ వ్యాపించింది. దాని కొన ఏన్‌రోగేలు దగ్గర ఉంది.
و این حد ازوادی پسر هنوم به‌جانب یبوسی، به طرف جنوب که همان اورشلیم باشد، برآمد. پس این حد به سوی قله کوهی که به طرف مغرب مقابل وادی هنوم، و به طرف شمال به آخر وادی رفائیم است، گذشت. ۸ 8
ఆ సరిహద్దు పడమట బెన్‌ హిన్నోము లోయ గుండా దక్షిణాన యెబూసీయుల పట్టణం వరకూ, అంటే యెరూషలేం వరకూ వెళ్ళింది. ఆ సరిహద్దు పడమట హిన్నోము లోయకు ఎదురుగా ఉన్న కొండ శిఖరం వరకూ వ్యాపించింది. అది ఉత్తర దిక్కున రెఫాయీయుల లోయ చివర ఉంది.
و این حد از قله کوه به چشمه آبهای نفتوح کشیده شد، و نزد شهرهای کوه عفرون بیرون آمد، و تا بعله که قریه یعاریم باشد، کشیده شد. ۹ 9
ఆ సరిహద్దు ఆ కొండ శిఖరం నుండి నెఫ్తోయ నీళ్ల ఊట వరకూ వెళ్ళింది. అక్కడ నుండి ఏఫ్రోనుకొండ పట్టణాల వరకూ వ్యాపించింది. ఆ సరిహద్దు కిర్యత్యారీం అనే బాలా వరకూ వెళ్ళింది.
و این حد از بعله به طرف مغرب به کوه سعیر برگشت، و به طرف شمال از جانب کوه یعاریم که کسالون باشد گذشت، و نزد بیت شمس بزیر آمده، از تمنه گذشت. ۱۰ 10
౧౦ఆ సరిహద్దు పడమరగా బాలా నుండి శేయీరు కొండకు వంపుగా సాగి కెసాలోను అనే యారీము కొండ ఉత్తరపు వైపు దాటి బేత్షెమెషు వరకూ దిగి తిమ్నా వైపుకు వ్యాపించింది.
و این حد به سوی شمال از جانب عقرون بیرون آمد، و تا شکرون کشیده شد، و از کوه بعله گذشته، نزد یبنئیل بیرون آمد، و انتهای این حد دریا بود. ۱۱ 11
౧౧ఆ సరిహద్దు ఎక్రోనుకు ఉత్తరంగా సాగింది. అక్కడ నుండి షిక్రోనుకు చుట్టి వెళ్లి బాలా కొండ దాటి యబ్నెయేలుకు వెళ్ళింది. ఆ సరిహద్దు సముద్రం వరకూ వ్యాపించింది.
و حد غربی دریای بزرگ و کناره آن بود، این است حدودبنی یهودا از هر طرف به حسب قبایل ایشان. ۱۲ 12
౧౨పడమటి సరిహద్దు మహాసముద్రం. వారి వారి వంశాల ప్రకారం యూదా గోత్రంవారి సరిహద్దులివి.
و به کالیب بن یفنه به حسب آنچه خداوند به یوشع فرموده بود، در میان بنی یهودا قسمتی داد، یعنی قریه اربع پدر عناق که حبرون باشد. ۱۳ 13
౧౩యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం యూదా గోత్రం సరిహద్దు లోపల యెఫున్నె కుమారుడు కాలేబుకు ఒక వంతు, అంటే అనాకీయుల వంశకర్త అర్బా పట్టణాన్ని ఇచ్చాడు. అది హెబ్రోను.
وکالیب سه پسر عناق یعنی شیشی و اخیمان وتلمی اولاد عناق را از آنجا بیرون کرد. ۱۴ 14
౧౪షెషయి అహీమాను తల్మయి అనే అనాకు ముగ్గురు సంతతి వాళ్ళను కాలేబు అక్కడనుండి వెళ్ళగొట్టాడు.
و ازآنجا به ساکنان دبیر برآمد و اسم دبیر قبل از آن قریه سفر بود. ۱۵ 15
౧౫అక్కడనుండి అతడు దెబీరు నివాసుల మీదికి వెళ్ళాడు. అంతకుముందు దెబీరు పేరు కిర్యత్ సేఫరు.
و کالیب گفت: «هر‌که قریه سفررا بزند و آن را بگیرد، دختر خود عکسه را به زنی به او خواهم داد. ۱۶ 16
౧౬కిర్యత్సేఫెరును పట్టుకుని దాన్ని కొల్లపెట్టిన వాడికి నా కుమార్తె అక్సాతో పెళ్లి చేస్తాను అని కాలేబు చెబితే
و عتنئیل پسر قناز برادرکالیب آن را گرفت، و دختر خود عکسه را به او به زنی داد. ۱۷ 17
౧౭కాలేబు సోదరుడు కనజు కుమారుడు ఒత్నీయేలు దాని పట్టుకున్నాడు కాబట్టి అతడు తన కుమార్తె అక్సాను అతనికి భార్యగా ఇచ్చాడు.
و چون او نزد وی آمد او را ترغیب کرد که از پدر خود زمینی طلب نماید، و دختر ازالاغ خود پایین آمد، و کالیب وی را گفت: «چه می‌خواهی؟» ۱۸ 18
౧౮ఆమె తన దగ్గరికి వచ్చినప్పుడు తన తండ్రిని కొంత భూమి అడగమని అతనిని ప్రేరేపించింది. ఆమె గాడిదె దిగగానే కాలేబు ఆమెతో “నీకేం కావాలి” అని అడిగాడు.
گفت: «مرا برکت ده. چونکه زمین جنوبی را به من داده‌ای، چشمه های آب نیزبه من بده. پس چشمه های بالا و چشمه های پایین را به او بخشید. ۱۹ 19
౧౯“నాకు అనుగ్రహం చూపండి. నీవు నాకు నెగెబు ప్రాంతాన్ని ఇచ్చావు. నీటి మడుగులు కూడా ఇవ్వండి” అంది. కాలేబు ఆమెకు ఎగువనున్న మడుగులూ పల్లపు మడుగులూ ఇచ్చాడు.
این است ملک سبط بنی یهودا به حسب قبایل ایشان. ۲۰ 20
౨౦యూదా వంశస్థుల గోత్రానికి వారి వంశాల ప్రకారం వచ్చిన స్వాస్థ్యం ఇది.
و شهرهای انتهایی سبطبنی یهودا به سمت جنوب بر سرحد ادوم قبصئیل و عیدر و یاجور بود، ۲۱ 21
౨౧యూదా గోత్రం వారికి దక్షిణంగా ఎదోం దేశ సరిహద్దు వైపు వచ్చిన పట్టణాలు: కబ్సెయేలు, ఏదెరు, యాగూరు,
و قینه و دیمونه وعدعده، ۲۲ 22
౨౨కీనా, దిమోనా, అదాదా,
و قادش و حاصور و یتنان، ۲۳ 23
౨౩కెదెషు, హాసోరు, ఇత్నాను,
و زیف و طالم و بعلوت، ۲۴ 24
౨౪జీఫు, తెలెము, బెయాలోతు,
و حاصور حدته و قریوت حصرون که حاصور باشد. ۲۵ 25
౨౫హాసోరు, హదత్తా, కెరీయోతు, హెస్రోను అనే హాసోరు,
امام و شماع ومولاده، ۲۶ 26
౨౬అమాము, షేమ, మోలాదా,
و حصرجده و حشمون و بیت فالط، ۲۷ 27
౨౭హసర్ గద్దా, హెష్మోను, బేత్పెలెతు,
و حصر شوعال و بیرشبع و بزیوتیه، ۲۸ 28
౨౮హసర్ షువలు, బెయేర్షెబా, బిజియోతియా,
و بعاله و عییم و عاصم، ۲۹ 29
౨౯బాలా, ఈయ్యె, ఎజెము,
و التولد و کسیل و حرمه، ۳۰ 30
౩౦ఎల్తోలదు, కెసీలు, హోర్మా,
وصقلج و مدمنه و سنسنه، ۳۱ 31
౩౧సిక్లగు, మద్మన్నా, సన్సన్నా,
و لباوت و سلخیم و عین و رمون، جمیع این شهرها با دهات آنهابیست و نه می‌باشد. ۳۲ 32
౩౨లెబాయోతు, షిల్హిము, అయీను, రిమ్మోను అనేవి. వాటి పల్లెలు పోగా ఈ పట్టాణాలన్నీ ఇరవై తొమ్మిది.
و در هامون اشتاول وصرعه و اشنه، ۳۳ 33
౩౩మైదానం లో పడమరగా, ఎష్తాయోలు, జొర్యా, అష్నా,
و زانوح و عین جنیم و تفوح وعینام، ۳۴ 34
౩౪జానోహ ఏన్ గన్నీము, తప్పూయ, ఏనాము,
و یرموت و عدلام و سوکوه و عزیقه، ۳۵ 35
౩౫యర్మూతు, అదుల్లాము, శోకో, అజేకా,
و شعرایم و عدیتایم و الجدیره و جدیرتایم، چهارده شهر با دهات آنها. ۳۶ 36
౩౬షరాయిము, అదీతాయిము, గెదెరోతాయిము అనే గెదేరా అనేవి. వాటి పల్లెలు పోగా పద్నాలుగు పట్టణాలు.
صنان و حداشاه و مجدل جاد. ۳۷ 37
౩౭సెనాను, హదాషా, మిగ్దోల్గాదు,
و دلعان و المصفه و یقتئیل. ۳۸ 38
౩౮దిలాను, మిజ్పా, యొక్తయేలు,
و لاخیش و بصقه وعجلون. ۳۹ 39
౩౯లాకీషు, బొస్కతు, ఎగ్లోను,
و کبون و لحمان و کتلیش. ۴۰ 40
౪౦కబ్బోను, లహ్మాసు, కిత్లిషు,
وجدیروت و بیت داجون و نعمه و مقیده. شانزده شهر با دهات آنها. ۴۱ 41
౪౧గెదెరోతు, బేత్ దాగోను, నయమా, మక్కేదా అనేవి. వాటి పల్లెలు పోగా పదహారు పట్టణాలు.
و لبنه و عاتر و عاشان. ۴۲ 42
౪౨లిబ్నా, ఎతెరు, ఆషాను,
و یفتاح و اشنه و نصیب. ۴۳ 43
౪౩ఇప్తా, అష్నా, నెసీబు,
و قعیله واکزیب و مریشه. نه شهر با دهات آنها. ۴۴ 44
౪౪కెయీలా, అక్జీబు, మారేషా అనేవీ వాటి పల్లెలు పోగా తొమ్మిది పట్టణాలు.
وعقرون و قصبه‌ها و دهات آن. ۴۵ 45
౪౫ఎక్రోను దాని పట్టణాలు పల్లెలు, ఎక్రోను మొదలుకుని సముద్రం వరకూ అష్డోదు ప్రాంతమంతా,
از عقرون تادریا، همه که به اطراف اشدود بود با دهات آنها. ۴۶ 46
౪౬దాని పట్టణాలు పల్లెలు, ఐగుప్తు వాగు వరకూ మహా సముద్రం వరకూ, అష్డోదు వాటి పల్లెలు.
و اشدود و قصبه‌ها و دهات آن. و غزا وقصبه‌ها و دهات آن تا وادی مصر، و تا دریای بزرگ و کنار آن. ۴۷ 47
౪౭గాజా ప్రాంతం వరకూ, వాటి పట్టణాలు పల్లెలు,
و در کوهستان شامیر و یتیر و سوکوه. ۴۸ 48
౪౮మన్య ప్రదేశంలో షామీరు, యత్తీరు, శోకో,
ودنه و قریه سنه که دبیر باشد. ۴۹ 49
౪౯దన్నా, దెబీర్ అనే కిర్యత్ సన్నా,
و عناب و اشتموه و عانیم. ۵۰ 50
౫౦అనాబు, ఎష్టెమో, ఆనీము,
و جوشن و حولون و جیلوه، یازده شهر با دهات آنها. ۵۱ 51
౫౧గోషెను, హోలోను గిలో అనేవి. వాటి పల్లెలు పోగా పదకొండు పట్టణాలు.
و اراب و دومه و اشعان. ۵۲ 52
౫౨ఆరాబు, దూమా, ఎషాను,
و یانوم و بیت تفوح و افیقه. ۵۳ 53
౫౩యానీము, బేత్ తపూయ, అఫెకా,
و حمطه و قریه اربع که حبرون باشد، و صیعور، نه شهر با دهات آنها. ۵۴ 54
౫౪హుమ్తా, కిర్యతర్బా అనే హెబ్రోను, సీయోరు అనేవి. వాటి పల్లెలు పోగా తొమ్మిది పట్టణాలు.
و معون و کرمل و زیف و یوطه. ۵۵ 55
౫౫మాయోను, కర్మెలు, జీఫు, యుట్టా,
ویزرعیل و یقدعام و زانوح. ۵۶ 56
౫౬యెజ్రెయేలు, యొక్దెయాము, జానోహ,
و القاین و جبعه وتمنه، ده شهر با دهات آنها. ۵۷ 57
౫౭కయీను, గిబియా, తిమ్నా అనేవి. వాటి పల్లెలు పోగా పది పట్టణాలు.
و حلحول و بیت صور و جدور. ۵۸ 58
౫౮హల్హూలు, బేత్సూరు, గెదోరు,
ومعارات و بیت عنوت و التقون، شش شهر با دهات آنها. ۵۹ 59
౫౯మారాతు, బేత్ అనోతు, ఎల్తెకోను అనేవి. వాటి పల్లెలు పోగా ఆరు పట్టణాలు.
و قریه بعل که قریه یعاریم باشد و الربه، دوشهر با دهات آنها. ۶۰ 60
౬౦కిర్యత్యారీం అంటే కిర్యత్ బయలు, రబ్బా అనేవి. వాటి పల్లెలు పోగా రెండు పట్టణాలు.
و در بیابان بیت عربه و مدین و سکاکه. ۶۱ 61
౬౧అరణ్యంలో బేత్ అరాబా మిద్దీను సెకాకా
والنبشان و مدینه الملح و عین جدی، شش شهر بادهات آنها. ۶۲ 62
౬౨ఉప్పు పట్టణం నిబ్షాను, ఈల్మెలహు ఏన్గెదీ అనేవి. వాటి పల్లెలు పోగా ఆరు పట్టణాలు.
و اما یبوسیان که ساکن اورشلیم بودند، بنی یهودا نتوانستند ایشان را بیرون کنند. پس یبوسیان با بنی یهودا تا امروز در اورشلیم ساکنند. ۶۳ 63
౬౩యెరూషలేములో నివసించిన యెబూసీయులను యూదా వంశస్థులు తోలివేయలేకపోయారు కాబట్టి యెబూసీయులు ఈ నాటికీ యెరూషలేములో యూదా వారితో కలిసి నివసిస్తున్నారు.

< یوشع 15 >