< ایّوب 21 >
౧అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు.
«بشنوید، کلام مرا بشنوید. و این، تسلی شماباشد. | ۲ 2 |
౨మీరు నా మాటలు శ్రద్ధగా వినండి. నా మాటలు విని నన్ను ఆదరించకపోయినా సరే నా మాటలు వింటే చాలు.
با من تحمل نمایید تا بگویم، و بعد ازگفتنم استهزا نمایید. | ۳ 3 |
౩నాకు అనుమతి ఇస్తే నేను మాట్లాడతాను. నా మాటలు విన్న తరువాత మీరు నన్ను ఎగతాళి చేస్తారేమో.
و اما من، آیا شکایتم نزدانسان است؟ پس چرا بیصبر نباشم؟ | ۴ 4 |
౪నేను మనుషులకు విన్నపం చేయడం లేదు. నేనెందుకు ఆత్రుత చెందకూడదు?
به من توجه کنید و تعجب نمایید، و دست به دهان بگذارید. | ۵ 5 |
౫మీ నోళ్ళపై చేతులు ఉంచుకుని నన్ను పరిశీలించి చూసి ఆశ్చర్యపడండి.
هرگاه به یاد میآورم، حیران میشوم. و لرزه جسد مرا میگیرد. | ۶ 6 |
౬ఈ విషయాలను గురించి తలుచుకుంటే నాకేమీ తోచడం లేదు. నా శరీరమంతా వణికిపోతుంది.
چرا شریران زنده میمانند، پیر میشوند و در توانایی قوی میگردند؟ | ۷ 7 |
౭భక్తిహీనులు ఇంకా ఎలా బతికి ఉన్నారు? వాళ్ళు ముసలివాళ్ళు అవుతున్నా ఇంకా బలంగా ఉంటున్నారెందుకు?
ذریت ایشان به حضور ایشان، با ایشان استوار میشوند و اولاد ایشان در نظرایشان. | ۸ 8 |
౮వాళ్ళు బతికి ఉండగానే వాళ్ళ సంతానం, వాళ్ళు చూస్తూ ఉండగానే వాళ్ళ కుటుంబాలు చక్కబడుతున్నాయి.
خانه های ایشان، از ترس ایمن میباشد وعصای خدا بر ایشان نمی آید. | ۹ 9 |
౯వాళ్ళ సంతానానికి ఎలాంటి ఆపదా కలగడం లేదు. వాళ్ళు క్షేమం ఉన్నారు. దేవుని కాపుదల వాళ్ళపై ఉంటుంది.
گاو نر ایشان جماع میکند و خطا نمی کند و گاو ایشان میزایدو سقط نمی نماید. | ۱۰ 10 |
౧౦వాళ్ళ పశువులు దాటితే తప్పకుండా చూలు కలుగుతుంది. ఆవులు తేలికగా ఈనుతున్నాయి, వాటి దూడలు పుట్టగానే చనిపోవడం లేదు.
بچه های خود را مثل گله بیرون میفرستند و اطفال ایشان رقص میکنند. | ۱۱ 11 |
౧౧వాళ్ళ పిల్లలు గుంపులు గుంపులుగా బయటికి వస్తారు. వాళ్ళు ఎగురుతూ గంతులు వేస్తారు.
با دف وعود میسرایند، و با صدای نای شادی مینمایند. | ۱۲ 12 |
౧౨వాళ్ళు తంబుర, తంతివాద్యం వాయిస్తూ గొంతెత్తి పాటలు పాడుతూ సంతోషిస్తారు.
روزهای خود را در سعادتمندی صرف میکنند، و به لحظهای به هاویه فرودمی روند. (Sheol ) | ۱۳ 13 |
౧౩వాళ్ళు సుఖంగా తమ రోజులు గడుపుతారు. అయితే ఒక్క క్షణంలోనే పాతాళానికి దిగిపోతారు. (Sheol )
و به خدا میگویند: از ما دور شو زیراکه معرفت طریق تو را نمی خواهیم. | ۱۴ 14 |
౧౪వాళ్ళు “నువ్వు మాకు అక్కరలేదు, నువ్వు బోధించే జ్ఞానయుక్తమైన సంగతులు మేము వినం” అని దేవునితో చెబుతారు.
قادرمطلق کیست که او را عبادت نماییم، و ما را چه فایده که از او استدعا نماییم. | ۱۵ 15 |
౧౫“మేము సేవించడానికి సర్వశక్తుడైన ఆయన ఎంతటి వాడు? మేము ఆయనను వేడుకుంటే మాకు ఒరిగే దేమిటి?” అని వాళ్ళు అడుగుతారు.
اینک سعادتمندی ایشان در دست ایشان نیست. کاش که مشورت شریران از من دور باشد. | ۱۶ 16 |
౧౬వారి ఎదుగుదల వాళ్ళ చేతుల్లో లేదు. భక్తిహీనుల తలంపులు నాకు దూరంగా ఉండుగాక.
«بسا چراغ شریران خاموش میشود وذلت ایشان به ایشان میرسد، و خدا در غضب خود دردها را نصیب ایشان میکند. | ۱۷ 17 |
౧౭భక్తిహీనుల దీపం ఆరిపోవడం తరచుగా జరుగుతుందా? వాళ్ళ మీదికి విపత్తులు రావడం చాలా అరుదు గదా.
مثل سفال پیش روی باد میشوند و مثل کاه که گردبادپراکنده میکند. | ۱۸ 18 |
౧౮ఆయన వాళ్ళపై కోపం తెచ్చుకుని వాళ్లకు ఆపదలు కలిగించడం, వాళ్ళను తుఫానుకు కొట్టుకుపోయే చెత్తలాగా, గాలికి ఎగిరిపోయే పొట్టులాగా చేయడం తరచూ జరగదు గదా.
خدا گناهش را برای فرزندانش ذخیره میکند، و او را مکافات میرساند و خواهد دانست. | ۱۹ 19 |
౧౯“వాళ్ళ పాపాలన్నీ వాళ్ళ సంతానం మీద మోపడానికి ఆయన వాటిని దాచి ఉండవచ్చు” అని మీరు అంటున్నారు. పాపం చేసిన వాళ్లే వాటిని అనుభవించేలా ఆయన వారికే ప్రతిఫలమివ్వాలి.
چشمانش هلاکت او را خواهد دید، و از خشم قادر مطلق خواهدنوشید. | ۲۰ 20 |
౨౦తమ నాశనాన్ని వాళ్ళు స్వయంగా చూడాలి. సర్వశక్తుడైన దేవుని కోపాగ్నిని వారు అనుభవించాలి.
زیرا که بعد از او در خانهاش او را چه شادی خواهد بود، چون عدد ماههایش منقطع شود؟ | ۲۱ 21 |
౨౧వాళ్ళ జీవితకాలం ముగిసిపోయి, చనిపోయిన తరువాత ఇంటి విషయాల మీద వాళ్లకు శ్రద్ధ ఎలా ఉంటుంది?
آیا خدا را علم توان آموخت؟ چونکه اوبر اعلی علیین داوری میکند. | ۲۲ 22 |
౨౨దేవునికి జ్ఞాన వివేకాలు నేర్పించేవాడు ఎవరైనా ఉన్నారా? ఆయన పరలోకంలో ఉండే నీతిమంతులకు తీర్పు తీర్చేవాడు గదా.
یکی در عین قوت خود میمیرد، در حالی که بالکل در امنیت وسلامتی است. | ۲۳ 23 |
౨౩ఒకడు సమస్త సుఖాలు అనుభవించి, మంచి ఆరోగ్యం, నెమ్మది కలిగి జీవించి చనిపోతాడు.
قدحهای او پر از شیر است، ومغز استخوانش تر و تازه است. | ۲۴ 24 |
౨౪అతడి కుండ నిండా పాలు పొర్లుతాయి. అతడి ఎముకలు సత్తువ కలిగి ఉంటాయి.
و دیگری درتلخی جان میمیرد و از نیکویی هیچ لذت نمی برد. | ۲۵ 25 |
౨౫మరొకడు ఎన్నడూ సుఖ సంతోషాలు అనేవి తెలియకుండా మనోవేదన గలవాడై చనిపోతాడు.
اینها باهم در خاک میخوابند و کرمها ایشان را میپوشانند. | ۲۶ 26 |
౨౬ఇద్దరినీ సమానంగా ఒకే వరసలో మట్టిలో పాతిపెడతారు. ఇద్దరినీ పురుగులు కప్పివేస్తాయి.
اینک افکار شما رامی دانم و تدبیراتی که ناحق بر من میاندیشید. | ۲۷ 27 |
౨౭నాకు వ్యతిరేకంగా మీరు పన్నుతున్న కుట్రలు నాకు తెలుసు. మీ మనసులోని ఆలోచనలు నేను గ్రహించాను.
زیرا میگویید کجاست خانه امیر، و خیمه های مسکن شریران؟ | ۲۸ 28 |
౨౮“ఉన్నత వంశస్థుల గృహాలు ఎక్కడ ఉన్నాయి? దుర్మార్గుల నివాసాలు ఎక్కడ ఉన్నాయి?” అని మీరు అడుగుతున్నారు గదా.
آیا از راه گذریان نپرسیدید؟ ودلایل ایشان را انکار نمی توانید نمود، | ۲۹ 29 |
౨౯దేశంలో ప్రయాణాలు చేసే యాత్రికులను మీరు అడగలేకపోయారా? వాళ్ళు చెప్పిన విషయాలు మీరు అర్థం చేసుకోలేకపోయారా?
که شریران برای روز ذلت نگاه داشته میشوند و درروز غضب، بیرون برده میگردند. | ۳۰ 30 |
౩౦ఆ విషయాలేమిటంటే, ఆపద కలిగిన రోజున దుర్మార్గులు తప్పించుకుంటారు. ఉగ్రత దిగి వచ్చే రోజున వాళ్ళు దాని నుండి పక్కకు తొలగించబడతారు.
کیست که راهش را پیش رویش بیان کند، و جزای آنچه راکه کرده است به او برساند؟ | ۳۱ 31 |
౩౧వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళకు ఎదురు నిలిచి మాట్లాడగలిగేది ఎవరు? వారు చేసిన పనులను బట్టి వారికి శిక్ష విధించేవాడు ఎవరు?
که آخر او را به قبرخواهند برد، و بر مزار او نگاهبانی خواهند کرد. | ۳۲ 32 |
౩౨వాళ్ళు చనిపోతే సమాధి అవుతారు. ఆ సమాధికి కాపలా ఉంటుంది.
کلوخهای وادی برایش شیرین میشود وجمیع آدمیان در عقب او خواهند رفت، چنانکه قبل از او بیشماره رفتهاند. | ۳۳ 33 |
౩౩పళ్ళెంలో మట్టి పెంకులు వారికి సుఖం ఇస్తాయి. మనుషులంతా వాళ్ళనే అనుసరిస్తారు. గతంలో లెక్కలేనంతమంది వాళ్లకు ముందు ఇలాగే చేశారు.
پس چگونه مراتسلی باطل میدهید که در جوابهای شما محض خیانت میماند!» | ۳۴ 34 |
౩౪మీరు చెప్పే జవాబులు నమ్మదగినవిగా లేవు. ఇలాంటి వ్యర్ధమైన మాటలతో మీరు నన్నెలా ఓదార్చాలని చూస్తున్నారు?