< حبقوق 2 >
بر دیده بانگاه خود میایستم و بر برج برپامی شوم. و مراقب خواهم شد تا ببینم که اوبه من چه خواهد گفت و درباره شکایتم چه جواب خواهد داد. | ۱ 1 |
౧ఆయన నాకు ఏమి సెలవిస్తాడో, నా వాదం విషయమై నేనేమి చెబుతానో చూడడానికి నేను నా కావలి స్థలంపైనా గోపురంపైనా కనిపెట్టుకుని ఉంటాననుకున్నాను.
پس خداوند مرا جواب دادو گفت: رویا را بنویس و آن را بر لوحها چنان نقش نما که دونده آن را بتواند خواند. | ۲ 2 |
౨యెహోవా నాకు ఇలా చెప్పాడు. చదివేవాడు పరిగెత్తేలా, నీవు ఆ దర్శన విషయాన్ని పలక మీద స్పష్టంగా రాయి.
زیرا که رویا هنوز برای وقت معین است و به مقصدمی شتابد و دروغ نمی گوید. اگرچه تاخیر نمایدبرایش منتظر باش زیرا که البته خواهد آمد ودرنگ نخواهد نمود. | ۳ 3 |
౩ఆ దర్శన విషయం రాబోయే కాలంలో జరుగుతుంది. అది ఎంత మాత్రం విఫలం కాదు. అది ఆలస్యమైనా తప్పక నెరవేరుతుంది. దాని కోసం కనిపెట్టు. అది ఆలస్యం చేయక వస్తుంది.
اینک جان مرد متکبر در اوراست نمی باشد، اما مرد عادل به ایمان خودزیست خواهد نمود. | ۴ 4 |
౪మనిషి ఆత్మ తనలో తాను ఉప్పొంగుతుంది. అది యథార్థంగా ఉండదు. అయితే నీతిమంతుడు తన విశ్వాసమూలంగా బ్రదుకుతాడు.
به درستی که شراب فریبنده است و مرد مغرور آرامی نمی پذیرد، که شهوت خود را مثل عالم اموات میافزاید وخودش مثل موت، سیر نمی شود. بلکه جمیع امتها را نزد خود جمع میکند و تمامی قومها رابرای خویشتن فراهم میآورد. (Sheol ) | ۵ 5 |
౫ద్రాక్షారసం గర్విష్టి యువకుణ్ణి మోసం చేసి నిలవననీయకుండా చేస్తుంది. అతని ఆశలను పాతాళమంతగా విస్తరింప జేస్తుంది. మరణం లాగా అది తృప్తినొందదు. అతడు సకలజనాలను వశపరచుకుంటాడు. ప్రజలందరినీ తన కోసం సమకూర్చుకుంటాడు. (Sheol )
پس آیا جمیع ایشان بر وی مثلی نخواهند زد و معمای طعن آمیز بر وی (نخواهندآورد)؟ و نخواهندگفت: وای بر کسیکه آنچه را که از آن وی نیست میافزاید؟ تا به کی؟ و خویشتن را زیر بار رهنهامی نهد. | ۶ 6 |
౬తనది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి పొందిన వాడికి బాధ. తాకట్టు సొమ్మును నీవు ఎంతకాలం పట్టుకుంటావు? వాడు ఎన్నాళ్లు నిలుచును అని చెప్పుకుంటూ వీరంతా ఇతని విషయం ఉపమానరీతిగా అపహాస్యపు సామెత ఎత్తుతారు గదా.
آیا گزندگان بر تو ناگهان برنخواهندخاست و آزارندگانت بیدار نخواهند شد و تو راتاراج نخواهند نمود؟ | ۷ 7 |
౭పళ్ళు కొరికే వారు హటాత్తుగా వస్తారు. నిన్ను హింస పెట్టబోయేవారు లేస్తారు. నీవు వారికి దోపుడు సొమ్ముగా ఉంటావు.
چونکه تو امت های بسیاری را غارت کردهای، تمامی بقیه قومها تو راغارت خواهند نمود، بهسبب خون مردمان وظلمی که بر زمین و شهر و جمیع ساکنانش نمودهای. | ۸ 8 |
౮నువ్వు అనేక రాజ్యాలను దోచుకున్నావు కాబట్టి మిగిలిన ప్రజలంతా నిన్ను దోచుకుంటారు. పట్టణాలకు వాటిలోని నివాసులకు నీవు చేసిన హింసాకాండను బట్టి, బలాత్కారాన్ని బట్టి, నిన్ను కొల్లగొడతారు.
وای بر کسیکه برای خانه خود بدی راکسب نموده است تا آشیانه خود را بر جای بلندساخته، خویشتن را از دست بلا برهاند. | ۹ 9 |
౯తనకు అపాయం రాకుండా తన నివాసాన్ని ఎత్తుగా చేసుకుని, తన యింటివారి కోసం అన్యాయంగా లాభం సంపాదించుకొనే వాడికి బాధ.
رسوایی را به جهت خانه خویش تدبیرکردهای به اینکه قوم های بسیار را قطع نموده و برضد جان خویش گناه ورزیدهای. | ۱۰ 10 |
౧౦నీవు చాలా మంది జనాలను నాశనం చేస్తూ నీ మీద నీవే అవమానం తెచ్చుకున్నావు. నీ దురాలోచన వలన నీకు వ్యతిరేకంగా నీవే పాపం చేశావు.
زیراکه سنگ از دیوار فریاد برخواهد آورد و تیر از میان چوبها آن را جواب خواهد داد. | ۱۱ 11 |
౧౧గోడల్లోని రాళ్లు మొర్ర పెడుతున్నాయి. దూలాలు వాటికి జవాబిస్తాయి.
وای بر کسیکه شهری به خون بنا میکند و قریهای به بیانصافی استوار مینماید. | ۱۲ 12 |
౧౨రక్తపాతం మూలంగా పట్టణం కట్టించే వారికి బాధ. దుష్టత్వం మూలంగా ఊరిని స్థాపించే వారికి బాధ.
آیا این از جانب یهوه صبایوت نیست که قومها برای آتش مشقت میکشند و طوایف برای بطالت خویشتن راخسته مینمایند؟ | ۱۳ 13 |
౧౩జాతులు ప్రయాసపడతారు గాని అగ్ని పాలవుతారు. వ్యర్థమైన దాని కోసం కష్టపడి ప్రజలు క్షీణించిపోతారు. ఇది సేనల ప్రభువు యెహోవా చేతనే అవుతుంది.
زیرا که جهان از معرفت جلال خداوند مملو خواهد شد به نحوی که آبهادریا را مستور میسازد. | ۱۴ 14 |
౧౪ఎందుకంటే సముద్రం జలాలతో నిండి ఉన్నట్టు భూమి యెహోవా మహాత్మ్యాన్ని గూర్చిన జ్ఞానంతో నిండి ఉంటుంది.
وای بر کسیکه همسایه خود را مینوشاندو بر تو که زهر خویش را ریخته، او را نیز مست میسازی تا برهنگی او را بنگری. | ۱۵ 15 |
౧౫తమ పొరుగు వాణ్ణి నగ్నంగా చూడాలని విషం కలిపి వారికి తాగించి వారిని మత్తులుగా చేసేవారికి బాధ.
تو ازرسوایی به عوض جلال سیر خواهی شد. تو نیزبنوش و غلفه خویش را منکشف ساز. کاسه دست راست خداوند بر تو وارد خواهد آمد و قی رسوایی بر جلال تو خواهد بود. | ۱۶ 16 |
౧౬ఘనతకు మారుగా అవమానంతో నిండిపోతావు. నీవు కూడా తాగి నీ నగ్నత కనపరచుకుంటావు. యెహోవా కుడిచేతిలోని పాత్ర నీ చేతికి వస్తుంది. అవమానకరమైన వాంతి నీ ఘనత మీద పడుతుంది.
زیرا ظلمی که بر لبنان نمودی و هلاکت حیوانات که آنها راترسانیده بود، تو را خواهد پوشانید. بهسبب خون مردمان و ظلمی که بر زمین و شهر و بر جمیع ساکنانش رسانیدی. | ۱۷ 17 |
౧౭లెబానోనునకు నీవు చేసిన బలాత్కారం నీ మీదికే వస్తుంది. నీవు పశువులను చేసిన నాశనం నీ మీదే పడుతుంది. దేశాలకు, పట్టణాలకు, వాటి నివాసులకు, నీవు చేసిన హింసాకాండను బట్టి, ఇది సంభవిస్తుంది.
از بت تراشیده چه فایده است که سازنده آن، آن را بتراشد یا از بت ریخته شده و معلم دروغ، که سازنده آن بر صنعت خودتوکل بنماید و بتهای گنگ را بسازد. | ۱۸ 18 |
౧౮చెక్కిన విగ్రహం వల్ల నీకు ప్రయోజనమేమిటి? బొమ్మను చెక్కిన శిల్పి, పోత పోసిన వాడు కేవలం అబద్ధాలు బోధించే వాడు. తాను చేసిన పోత విగ్రహాలపై నమ్మిక ఉంచడం వలన ప్రయోజనమేమిటి?
وای برکسیکه به چوب بگوید بیدار شو و به سنگ گنگ که برخیز! آیا میشود که آن تعلیم دهد؟ اینک به طلا و نقره پوشیده میشود لکن در اندرونش مطلق روح نیست. | ۱۹ 19 |
౧౯కర్ర విగ్రహాలను చూసి మేలుకో అనీ, మూగరాతి ప్రతిమలను చూసి లే అనీ చెప్పేవాడికి బాధ. అవి ఏమైనా బోధించగలవా? దానికి బంగారంతో, వెండితో పూత పూశారు గానీ దానిలో శ్వాస ఎంత మాత్రం లేదు.
اما خداوند در هیکل قدس خویش است پس تمامی جهان به حضور وی خاموش باشد. | ۲۰ 20 |
౨౦అయితే యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. లోకమంతా ఆయన సన్నిధిలో మౌనంగా ఉండు గాక.