< حزقیال 9 >
و او به آواز بلند به گوش من ندا کرده، گفت: «وکلای شهر را نزدیک بیاور و هرکس آلت خراب کننده خود را در دست خود بدارد.» | ۱ 1 |
౧నేను వింటుండగా దేవుడు పెద్ద స్వరంతో ఇలా ప్రకటించాడు. “పట్టణాన్ని కాపలా కాసే వాళ్ళంతా ఇక్కడికి రండి. ప్రతి ఒక్కడూ నిర్మూలం చేసే తన ఆయుధాన్ని చేతిలో పట్టుకుని రావాలి”
و اینک شش مرد از راه دروازه بالایی که بطرف شمال متوجه است آمدند و هرکس تبرخود را در دستش داشت. و در میان ایشان یک مرد ملبس شده به کتان بود و دوات کاتب درکمرش. و ایشان داخل شده، نزد مذبح برنجین ایستادند. | ۲ 2 |
౨ఇదిగో చూడండి! ఉత్తరం వైపున ఉన్న ముఖద్వారం నుండి ఉన్న దారిలో ఆరుగురు వ్యక్తులు వచ్చారు. ప్రతి ఒక్కరి చేతిలోనూ సంహారం చేసే ఆయుధం ఉంది. వారి మధ్యలో నారతో నేసిన బట్టలు వేసుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు. అతని నడుముకి లేఖకుడి వ్రాత సామాను ఉంది. వాళ్ళు లోపలికి వెళ్ళి ఇత్తడి బలిపీఠం దగ్గర నిలబడ్డారు.
و جلال خدای اسرائیل از روی آن کروبی که بالای آن بود به آستانه خانه برآمد و به آن مردی که به کتان ملبس بود و دوات کاتب را درکمر داشت خطاب کرد. | ۳ 3 |
౩ఇశ్రాయేలు దేవుని మహిమ తానున్న కెరూబు నుండి పైకి వెళ్ళి మందిరం గడప దగ్గరికి వచ్చి నిలిచింది. ఆయన నార బట్టలు వేసుకున్న లేఖకుడి సామానుతో ఉన్న వ్యక్తిని పిలిచాడు.
و خداوند به او گفت: «از میان شهر یعنی از میان اورشلیم بگذر و برپیشانی کسانی که بهسبب همه رجاساتی که در آن کرده میشود آه و ناله میکنند نشانی بگذار. | ۴ 4 |
౪యెహోవా అతనితో ఇలా చెప్పాడు. “యెరూషలేము పట్టణంలో ప్రవేశించి అక్కడ తిరుగు. పట్టణంలో జరుగుతున్న అసహ్యమైన పనులను గూర్చి మూలుగుతూ, నిట్టూర్పులు విడుస్తూ ఉన్న వాళ్ళ నుదుటిపై ఒక గుర్తు పెట్టు.”
و به آنان به سمع من گفت که در عقب او از شهربگذرید و هلاک سازید و چشمان شما شفقت نکند و ترحم منمایید. | ۵ 5 |
౫అప్పుడు నేను వింటూ ఉండగా ఆయన మిగిలిన వాళ్ళకి ఇలా అజ్ఞాపించాడు. “మీరు అతని వెనకే పట్టణంలో సంచరించండి. హతమార్చండి! ఎలాంటి కనికరమూ లేకుండా అందరినీ చంపండి.
پیران و جوانان و دختران و اطفال و زنان را تمام به قتل رسانید، اما به هرکسیکه این نشان را دارد نزدیک مشوید و ازقدس من شروع کنید.» پس از مردان پیری که پیش خانه بودند شروع کردند. | ۶ 6 |
౬ముసలి వాళ్ళైనా, యువకులైనా, కన్యలైనా, చిన్న పిల్లలైనా, స్త్రీలైనా అందరినీ చంపండి! కానీ నుదుటిపై గుర్తు ఉన్న వాళ్ళ జోలికి వెళ్ళవద్దు. నా మందిరం దగ్గరనుండే ప్రారంభం చేయండి.” కాబట్టి వాళ్ళు మందిరం ఎదుట ఉన్న పెద్దవాళ్ళతో మొదలు పెట్టారు.
و به ایشان فرمود: «خانه را نجس سازید وصحنها را از کشتگان پر ساخته، بیرون آیید.» پس بیرون آمدند و در شهر به کشتن شروع کردند. | ۷ 7 |
౭ఆయన ఇంకా ఇలా అన్నాడు. “మందిరాన్ని అపవిత్రం చేయండి. దాని ఆవరణాలను శవాలతో నింపండి. మొదలు పెట్టండి.” వాళ్ళు వెళ్ళి పట్టణంపై దాడి చేసి చంపడం ప్రారంభించారు.
وچون ایشان میکشتند و من باقیمانده بودم به روی خود درافتاده، استغاثه نمودم و گفتم: «آهای خداوند یهوه آیا چون غضب خود را براورشلیم میریزی تمامی بقیه اسرائیل را هلاک خواهی ساخت؟» | ۸ 8 |
౮వాళ్ళు చంపడం మొదలు పెట్టిన తరువాత నన్ను తప్ప వాళ్ళు అందరినీ చంపడం చూశాను. నేను ఒంటరిగా ఉండటం చూసి నేను సాష్టాంగ పడ్డాను. గట్టిగా వేడుకున్నాను. “అయ్యో! ప్రభూ! యెహోవా, యెరూషలేముపై నీ క్రోధాన్ని కుమ్మరించి ఇశ్రాయేలు ప్రజల్లో మిగిలిన వాళ్ళందరినీ నాశనం చేస్తావా?” అన్నాను.
او مرا جواب داد: «گناه خاندان اسرائیل و یهودا بینهایت عظیم است وزمین از خون مملو و شهر از ستم پر است. زیرامی گویند: خداوند زمین را ترک کرده است وخداوند نمی بیند. | ۹ 9 |
౯ఆయన నాకిలా చెప్పాడు. “ఇశ్రాయేలు ప్రజల, యూదా ప్రజల అతిక్రమాలు చాలా అధికమయ్యాయి. వాళ్ళు యెహోవా మనలను విడిచి పెట్టాడనీ, యెహోవా మనలను చూడటం లేదనీ చెప్పుకుంటున్నారు. కాబట్టి దేశం రక్త పాతంతోనూ పట్టణం భ్రష్టత్వంతోనూ నిండి పోయాయి.
پس چشم من نیز شفقت نخواهد کرد و من رحمت نخواهم فرمود، بلکه رفتار ایشان را بر سر ایشان خواهم آورد.» | ۱۰ 10 |
౧౦కాబట్టి నా దృష్టిలో వారి కోసం ఎలాంటి కనికరమూ లేదు. నేను వాళ్ళని వదలను. వీటన్నిటి ఫలితాన్ని వాళ్ళ తలల పైకి తెస్తాను.”
واینک آن مردی که به کتان ملبس بود و دوات را درکمر داشت، جواب داد و گفت: «به نهجی که مراامر فرمودی عمل نمودم.» | ۱۱ 11 |
౧౧అప్పుడు నార బట్టలు వేసుకుని లేఖకుడి సామానుతో ఉన్న వ్యక్తి వచ్చాడు. అతడు “నీ ఆదేశాల ప్రకారం నేను అంతా చేశాను” అని చెప్పాడు.