< تثنیه 5 >
و موسی تمامی بنیاسرائیل را خوانده، به ایشان گفت: ای اسرائیل فرایض و احکامی را که من امروز به گوش شما میگویم بشنوید، تاآنها را یاد گرفته، متوجه باشید که آنها را بجاآورید. | ۱ 1 |
౧మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ పిలిపించి ఇలా చెప్పాడు, “ఇశ్రాయేలు ప్రజలారా, నేను మీకు ఈ రోజు చెబుతున్న కట్టడలను, విధులను విని నేర్చుకుని వాటిని పాటించండి.
یهوه خدای ما با ما در حوریب عهدبست. | ۲ 2 |
౨మన దేవుడు యెహోవా హోరేబులో మనతో ఒప్పందం చేశాడు.
خداوند این عهد را با پدران ما نبست، بلکه با ما که جمیع امروز در اینجا زنده هستیم. | ۳ 3 |
౩ఆయన మన పూర్వీకులతో కాదు, ఈ రోజు, ఇక్కడ జీవించి ఉన్న మనతోనే ఈ ఒప్పందం చేశాడు.
خداوند در کوه از میان آتش با شما روبرومتکلم شد. | ۴ 4 |
౪యెహోవా ఆ కొండ మీద అగ్నిలో నుండి ముఖాముఖిగా మీతో మాటలాడినప్పుడు మీరు ఆ అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు.
(من در آن وقت میان خداوند و شماایستاده بودم، تا کلام خداوند را برای شما بیان کنم، زیرا که شما بهسبب آتش میترسیدید و به فراز کوه برنیامدید) و گفت: | ۵ 5 |
౫కాబట్టి యెహోవా మాట మీకు తెలపడానికి నేను యెహోవాకూ మీకూ మధ్య నిలబడి ఉన్నప్పుడు యెహోవా ఇలా చెప్పాడు.
«من هستم یهوه، خدای تو، که تو را از زمین مصر از خانه بندگی بیرون آوردم. | ۶ 6 |
౬‘బానిసల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనైన యెహోవాను నేనే.
تو را به حضور من خدایان دیگر نباشند. | ۷ 7 |
౭నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు.
«به جهت خود صورت تراشیده یا هیچ تمثالی از آنچه بالا در آسمان، یا از آنچه پایین درزمین، یا از آنچه در آبهای زیر زمین است مساز. | ۸ 8 |
౮పైన ఉన్న ఆకాశంలో గాని, కింద ఉన్న భూమిపైనే గాని, భూమి కింద ఉన్న నీళ్లలోనే గాని ఉండే దేని పోలికలోనైనా విగ్రహాన్ని చేసుకోకూడదు.
آنها را سجده و عبادت منما. زیرا من که یهوه خدای تو هستم، خدای غیورم، و گناه پدران را برپسران تا پشت سوم و چهارم از آنانی که مرادشمن دارند، میرسانم. | ۹ 9 |
౯వాటికి నమస్కరించకూడదు, వాటిని పూజింపకూడదు. మీ దేవుడైన యెహోవా అనే నేను రోషం గల దేవుణ్ణి. నన్ను ద్వేషించేవారి విషయంలో మూడు నాలుగు తరాల వరకూ తండ్రులు చేసిన దోషాన్ని కొడుకులపైకి రప్పిస్తాను.
و رحمت میکنم تاهزار پشت برآنانی که مرا دوست دارند و احکام مرا نگاه دارند. | ۱۰ 10 |
౧౦నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు పాటించే వారి విషయంలో వెయ్యి తరాల వరకూ కరుణిస్తాను.
«نام یهوه خدای خود را به باطل مبر، زیراخداوند کسی را که نام او را به باطل برد، بیگناه نخواهد شمرد. | ۱۱ 11 |
౧౧మీ దేవుడు యెహోవా పేరును అనవసరంగా పలకకూడదు, యెహోవా తన పేరును అనవసరంగా పలికేవాణ్ణి దోషిగా ఎంచుతాడు.
«روز سبت را نگاه دار و آن را تقدیس نما، چنانکه یهوه خدایت به تو امر فرموده است. | ۱۲ 12 |
౧౨మీ యెహోవా దేవుడు మీకు ఆజ్ఞాపించినట్టు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించండి.
شش روز مشغول باش و هرکار خود را بکن. | ۱۳ 13 |
౧౩ఆరు రోజులు మీరు కష్టపడి మీ పని చేయాలి.
اما روز هفتمین سبت یهوه خدای توست، درآن هیچکاری مکن، تو و پسرت و دخترت وغلامت و کنیزت و گاوت و الاغت و همه بهایمت و مهمانت که در اندرون دروازه های تو باشد، تاغلامت و کنیزت مثل تو آرام گیرند. | ۱۴ 14 |
౧౪ఏడో రోజు మీ యెహోవా దేవునికి విశ్రాంతి దినం. ఆ రోజు మీరు, మీ కొడుకు, కూతురు, దాసుడు లేక దాసి, మీ ఎద్దు లేక గాడిద, మీ పశువుల్లో ఏదైనా సరే, మీ ఇంట్లో ఉన్న పరదేశితో సహా, ఏ పనీ చేయకూడదు. ఎందుకంటే మీకులాగా మీ దాసుడు, మీ దాసి కూడా విశ్రాంతి తీసుకోవాలి.
و بیاد آورکه در زمین مصر غلام بودی، و یهوه خدایت تو رابهدست قوی و بازوی دراز از آنجا بیرون آورد، بنابراین یهوه، خدایت، تو را امر فرموده است که روز سبت را نگاه داری. | ۱۵ 15 |
౧౫మీరు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు మీ దేవుడు యెహోవా తన బాహుబలంతో, చాచిన చేతితో మిమ్మల్ని అక్కడ నుండి రప్పించాడని జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి, విశ్రాంతి దినాన్ని పాటించాలని ఆయన మీకు ఆజ్ఞాపించాడు.
«پدر و مادر خود را حرمت دار، چنانکه یهوه خدایت تو را امر فرموده است، تا روزهایت دراز شود و تو را در زمینی که یهوه خدایت به تومی بخشد، نیکویی باشد. | ۱۶ 16 |
౧౬మీ దేవుడు యెహోవా మీకిచ్చే దేశంలో మీరు దీర్ఘాయువుతో, సుఖశాంతులు కలిగి ఉండేలా ఆయన మీకు ఆజ్ఞాపించినట్టు మీ తల్లి తండ్రులను గౌరవించండి.
و بر همسایه خود شهادت دروغ مده. | ۲۰ 20 |
౨౦మీ సాటి మనిషికి వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు.
وبرزن هسمایه ات طمع مورز، و به خانه همسایه ات و به مزرعه او و به غلامش و کنیزش وگاوش و الاغش و به هرچه از آن همسایه توباشد، طمع مکن.» | ۲۱ 21 |
౨౧మీ పొరుగువాడి భార్యపై ఆశపడకూడదు. మీ పొరుగువాడి ఇంటిని, పొలాన్ని, పనివాణ్ణి, పనికత్తెని, ఎద్దును, గాడిదను, ఇంకా అతనికి చెందిన దేనినీ ఆశించకూడదు.’
این سخنان را خداوند به تمامی جماعت شما در کوه از میان آتش و ابر و ظلمت غلیظ به آواز بلند گفت، و بر آنها چیزی نیفزود و آنها را بردو لوح سنگ نوشته، به من داد. | ۲۲ 22 |
౨౨యెహోవా ఆ కొండ మీద అగ్ని, మేఘం, గాఢాంధకారాల మధ్య నుండి గొప్ప స్వరంతో మీ సమాజమంతటితో ఈ మాటలు చెప్పి, రెండు రాతి పలకల మీద వాటిని రాసి నాకిచ్చాడు. ఇంతకు మించి ఆయన మరేమీ చెప్పలేదు.
و چون شما آن آواز را از میان تاریکی شنیدید، و کوه به آتش میسوخت، شما با جمیع روسای اسباط ومشایخ خود نزد من آمده، | ۲۳ 23 |
౨౩ఆ కొండ అగ్నితో మండుతున్నప్పుడు మీరు ఆ చీకటి మధ్య నుండి ఆ స్వరం విని, అంటే మీ గోత్రాల ప్రధానులు, పెద్దలు నా దగ్గరికి వచ్చి,
گفتید: اینک یهوه، خدای ما، جلال و عظمت خود را بر ما ظاهرکرده است، و آواز او را از میان آتش شنیدیم، پس امروز دیدیم که خدا با انسان سخن میگوید وزنده است. | ۲۴ 24 |
౨౪‘మన యెహోవా దేవుడు తన మహిమని గొప్పతనాన్ని మాకు చూపించాడు. అగ్నిలో నుండి ఆయన స్వరాన్ని విన్నాం. దేవుడు మానవులతో మాట్లాడినప్పటికీ వారు బతికి ఉండగలరని ఈ రోజు గ్రహించాం.
و اما الان چرا بمیریم زیرا که این آتش عظیم ما را خواهد سوخت، اگر آواز یهوه خدای خود را دیگر بشنویم، خواهیم مرد. | ۲۵ 25 |
౨౫కాబట్టి మేము చావడమెందుకు? ఈ గొప్ప అగ్ని మమ్మల్ని కాల్చివేస్తుంది. మేము మన దేవుడు యెహోవా స్వరం ఇంకా వింటే చనిపోతాం.
زیرا از تمامی بشر کیست که مثل ما آوازخدای حی را که از میان آتش سخن گوید، بشنودو زنده ماند؟ | ۲۶ 26 |
౨౬మాలాగా మానవులందరిలో సజీవుడైన దేవుని స్వరం అగ్నిలో నుండి పలకడం విని ఇంకెవరు జీవించి ఉన్నారు?
تو نزدیک برو و هرآنچه یهوه خدای ما بگوید، بشنو و هرآنچه یهوه خدای مابه تو بگوید برای ما بیان کن، پس خواهیم شنید وبه عمل خواهیم آورد. | ۲۷ 27 |
౨౭నువ్వే వెళ్ళి మన దేవుడు యెహోవా చెప్పేదంతా విను. ఆయన నీతో చెప్పిన దానంతటినీ నువ్వే మాతో చెబితే మేము విని దాన్ని పాటిస్తాం అని చెప్పారు.’
و خداوند آواز سخنان شما را که به من گفتید شنید، و خداوند مرا گفت: «آواز سخنان این قوم را که به تو گفتند، شنیدم؛ هرچه گفتندنیکو گفتند. | ۲۸ 28 |
౨౮మీరు నాతో చెప్పిన మాటలు యెహోవా విన్నాడు. అప్పుడు యెహోవా నాతో ఇలా చెప్పాడు. ‘ఈ ప్రజలు నీతో చెప్పిన మాటలు నేను విన్నాను. వారు చెప్పినదంతా మంచిదే.
کاش که دلی را مثل این داشتند تااز من میترسیدند، و تمامی اوامر مرا در هر وقت بجا میآوردند، تا ایشان را و فرزندان ایشان را تابه ابد نیکو باشد. | ۲۹ 29 |
౨౯వారికీ వారి సంతానానికీ ఎప్పుడూ సుఖశాంతులు కలిగేలా వారు నాపట్ల భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని పాటించే మనస్సు వారికి ఉండడం మంచిది.
برو و ایشان را بگو به خیمه های خود برگردید. | ۳۰ 30 |
౩౦“వారి వారి గుడారాల్లోకి తిరిగి వెళ్ళమని” వారితో చెప్పు.
و اما تو در اینجاپیش من بایست، تا جمیع اوامر و فرایض واحکامی را که میباید به ایشان تعلیم دهی به توبگویم، و آنها را در زمینی که من به ایشان میدهم تا در آن تصرف نمایید، بجا آورند.» | ۳۱ 31 |
౩౧నువ్వు మాత్రం ఇక్కడ నా దగ్గర ఉండు. నువ్వు వారికి బోధించాల్సిన కట్టడలనూ విధులనూ నేను నీతో చెబుతాను.’
«پس توجه نمایید تا آنچه یهوه، خدای شما، به شما امر فرموده است، به عمل آورید، وبه راست و چپ انحراف منمایید. | ۳۲ 32 |
౩౨వారు స్వాధీనం చేసుకోడానికి నేను వారికి ఇస్తున్న దేశంలో వారు ఆ విధంగా ప్రవర్తించాలి.
در تمامی آن طریقی که یهوه، خدای شما، به شما امرفرموده است، سلوک نمایید، تا برای شما نیکوباشد و ایام خود را در زمینی که به تصرف خواهیدآورد، طویل نمایید. | ۳۳ 33 |
౩౩మీరు కుడికి ఎడమకి తిరగకుండా మీ దేవుడు యెహోవా ఆజ్ఞాపించిన విధంగా చేయడానికి జాగ్రత్తపడాలి. మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో నివసిస్తూ సుఖశాంతులతో దీర్ఘాయుష్మంతులయ్యేలా మీ దేవుడు యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గాలన్నిటిలో నడుచుకోవాలి.”