< اول سموئیل 28 >
و واقع شد در آن ایام که فلسطینیان لشکرهای خود را برای جنگ فراهم آوردند تا با اسرائیل مقاتله نمایند، و اخیش به داود گفت: «یقین بدان که تو و کسانت همراه من به اردو بیرون خواهید آمد.» | ۱ 1 |
౧ఆ రోజుల్లో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయాలని సైన్యాలను సమకూర్చుకుని యుద్ధానికి సిద్ధమయ్యారు. ఆకీషు దావీదును పిలిచి “నువ్వు, నీ మనుషులు నాతో కలసి యుద్ధానికి బయలుదేరాలని జ్ఞాపకం ఉంచుకో” అన్నాడు.
داود به اخیش گفت: «به تحقیق خواهی دانست که بنده تو چه خواهدکرد.» اخیش به داود گفت: «از این جهت تو راهمیشه اوقات نگاهبان سرم خواهم ساخت.» | ۲ 2 |
౨దావీదు “నీ దాసుడనైన నేను నీకు చేయబోయే సహాయం ఏమిటో అది నువ్వు ఇప్పుడు తెలుసుకుంటావు” అన్నాడు. ఆకీషు “ఆలాగైతే నిన్ను ఎప్పటికీ నా సొంత సంరక్షకుడుగా నియమించుకుంటాను” అన్నాడు.
و سموئیل وفات نموده بود، و جمیع اسرائیل به جهت او نوحه گری نموده، او را درشهرش رامه دفن کرده بودند، و شاول تمامی اصحاب اجنه و فالگیران را از زمین بیرون کرده بود. | ۳ 3 |
౩సమూయేలు చనిపోయినపుడు ఇశ్రాయేలు ప్రజలంతా అతని కోసం ఏడ్చి, అతని సొంత పట్టణమైన రమాలో అతణ్ణి పాతిపెట్టారు. సౌలు, చచ్చినవాళ్ళతో, ఆత్మలతో మాట్లాడేవారిని తన దేశం నుండి వెళ్లగొట్టాడు.
و فلسطینیان جمع شده، آمدند و در شونیم اردو زدند، و شاول تمامی اسرائیل را جمع کرده، در جلبوع اردو زدند. | ۴ 4 |
౪ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి షూనేములో శిబిరం వేసుకున్నప్పుడు, సౌలు ఇశ్రాయేలీయులందరినీ సమకూర్చాడు. వారు గిల్బోవ లోయలో మకాం వేసారు.
و چون شاول لشکرفلسطینیان را دید، بترسید و دلش بسیار مضطرب شد. | ۵ 5 |
౫సౌలు ఫిలిష్తీయుల సైన్యాన్ని చూసినపుడు మనస్సులో విపరీతమైన భయం పెంచుకుని
و شاول از خداوند سوال نمود و خداوند اورا جواب نداد، نه به خوابها و نه به اوریم و نه به انبیا. | ۶ 6 |
౬యెహోవా దగ్గర విచారణ చేసాడు. యెహోవా కల ద్వారా గానీ, ఊరీం ద్వారా గానీ, ప్రవక్తల ద్వారా గానీ ఏమీ జవాబివ్వలేదు.
و شاول به خادمان خود گفت: «زنی را که صاحب اجنه باشد، برای من بطلبید تا نزد او رفته، از او مسالت نمایم.» خادمانش وی را گفتند: «اینک زنی صاحب اجنه در عین دور میباشد.» | ۷ 7 |
౭అప్పుడు సౌలు “నా కోసం మీరు మృతులతో మాట్లాడే ఒక స్త్రీని వెదకండి. నేను వెళ్ళి ఆమె ద్వారా విచారణ చేస్తాను” అని తన సేవకులకు ఆజ్ఞ ఇస్తే, వారు “అలాగే, ఏన్దోరులో మృతులతో మాట్లాడే ఒక స్త్రీ ఉంది” అని అతనితో చెప్పారు.
و شاول صورت خویش را تبدیل نموده، لباس دیگر پوشید و دو نفر همراه خود برداشته، رفت و شبانگاه نزد آن زن آمده، گفت: «تمنا اینکه به واسطه جن برای من فالگیری نمایی و کسی راکه به تو بگویم از برایم برآوری.» | ۸ 8 |
౮సౌలు మారువేషం వేసుకుని వేరే దుస్తులు ధరించి ఇద్దరు సహాయకులను వెంట తీసుకుని వెళ్ళి, రాత్రి సమయంలో ఆ స్త్రీతో “మృతులతో మాట్లాడి నాకు శకునం చెప్పి, నాతో మాట్లాడడానికి నేను నీతో చెప్పే వ్యక్తిని రప్పించు” అని కోరాడు.
آن زن وی راگفت: «اینک آنچه شاول کرده است میدانی که چگونه اصحاب اجنه و فالگیران را از زمین منقطع نموده است، پس تو چرا برای جانم دام میگذاری تا مرا به قتل رسانی؟» | ۹ 9 |
౯ఆ స్త్రీ, అలాగే “సౌలు ఏం చేయించాడో నీకు తెలియదా? అతడు చచ్చినవాళ్ళతో, ఆత్మలతో మాట్లాడే వారిని దేశంలో లేకుండా తరిమివేశాడు కదా. నువ్వు నా ప్రాణం కోసం ఉరివేసి నాకు చావు వచ్చేలా చేస్తావు” అని అతనితో అంది.
و شاول برای وی به یهوه قسم خورده، گفت: «به حیات یهوه قسم که از این امر به تو هیچ بدی نخواهد رسید.» | ۱۰ 10 |
౧౦అప్పుడు సౌలు “దేవుని తోడు, దీన్ని బట్టి నీకు శిక్ష ఎంతమాత్రం రాదు” అని యెహోవా పేరున ఒట్టు పెట్టుకొంటే,
آن زن گفت: «از برایت که را برآورم؟» او گفت: «سموئیل را برای من برآور.» | ۱۱ 11 |
౧౧ఆ స్త్రీ “నీతో మాట్లాడడం కోసం ఎవరిని రప్పించాలి” అని అడిగింది. అతడు “సమూయేలును రప్పించాలి” అని కోరాడు.
و چون آن زن سموئیل را دید به آواز بلند صدا زد و زن، شاول را خطاب کرده، گفت: «برای چه مرا فریب دادی زیرا تو شاول هستی.» | ۱۲ 12 |
౧౨ఆ స్త్రీ సమూయేలును చూసి గట్టిగా కేకవేసి “నీవు సౌలువి గదా, నీవు నన్నెందుకు మోసం చేశావు” అని సౌలును అడిగితే,
پادشاه وی را گفت: «مترس! چه دیدی؟» آن زن در جواب شاول گفت: «خدایی را میبینم که از زمین بر میآید.» | ۱۳ 13 |
౧౩రాజు “నువ్వు భయపడవద్దు. నీకు ఏమి కనబడిందో చెప్పు” అని ఆమెను అడిగితే “దేవుళ్ళలో ఒకడు భూమిలోనుండి పైకి రావడం నేను చూస్తున్నాను” అని చెప్పింది.
او وی را گفت: «صورت او چگونه است؟» زن گفت: «مردی پیر بر میآید و به ردایی ملبس است.» پس شاول دانست که سموئیل است و روبه زمین خم شده، تعظیم کرد. | ۱۴ 14 |
౧౪రాజు “అతడు ఏ రూపంలో ఉన్నాడు” అని అడిగాడు. ఆమె “దుప్పటి కప్పుకుని ఉన్న ఒక ముసలివాడు పైకి వస్తున్నాడు” అని చెబితే, సౌలు, అతడు సమూయేలు అని గ్రహించి సాగిలపడి నమస్కారం చేశాడు.
و سموئیل به شاول گفت: «چرا مرابرآورده، مضطرب ساختی؟» شاول گفت: «درشدت تنگی هستم چونکه فلسطینیان با من جنگ مینمایند و خدا از من دور شده، مرا نه به واسطه انبیا و نه به خوابها دیگر جواب میدهد، لهذا تو راخواندم تا مرا اعلام نمایی که چه باید بکنم.» | ۱۵ 15 |
౧౫“నన్ను రమ్మని నువ్వెందుకు తొందరపెట్టావు” అని సమూయేలు సౌలును అడిగాడు. సౌలు “నేను తీవ్రమైన బాధల్లో ఉన్నాను. ఫిలిష్తీయులు నా మీదికి దండెత్తి వస్తే దేవుడు నన్ను పక్కన పెట్టి ప్రవక్తల ద్వారా గానీ, కలల ద్వారా గానీ నాకేమీ జవాబివ్వలేదు. కాబట్టి నేను ఏమి చేయాలో నాకు తెలియజేయడానికి నిన్ను పిలిపించాను” అన్నాడు.
سموئیل گفت: «پس چرا از من سوال مینمایی و حال آنکه خداوند از تو دور شده، دشمنت گردیده است. | ۱۶ 16 |
౧౬అప్పుడు సమూయేలు “యెహోవా నిన్ను పక్కన పెట్టి నీకు విరోధి అయ్యాడు. ఇప్పుడు నన్ను అడగడం వల్ల ప్రయోజనం ఏంటి?
و خداوند به نحوی که به زبان من گفته بود، برای خود عمل نموده است، زیراخداوند سلطنت را از دست تو دریده، آن را به همسایه ات داود داده است. | ۱۷ 17 |
౧౭యెహోవా తన జవాబును తానే స్వయంగా వెల్లడిస్తున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చినట్టు, నీ చేతిలో నుండి రాజ్యాన్ని తీసివేసి నీ సేవకుడు దావీదుకు దాన్ని ఇచ్చివేశాడు.
چونکه آوازخداوند را نشنیدی و شدت غضب او را برعمالیق به عمل نیاوردی، بنابراین خداوند امروزاین عمل را به تو نموده است. | ۱۸ 18 |
౧౮యెహోవా ఆజ్ఞకు నువ్వు లోబడకుండా, అమాలేకీయుల విషయంలో ఆయన తీక్షణమైన ఉగ్రతను అమలు చేయలేదు కాబట్టి దాన్ని బట్టి యెహోవా నీకు ఈ రోజు ఈ విధంగా జరిగిస్తున్నాడు.
و خداونداسرائیل را نیز با تو بهدست فلسطینیان خواهدداد، و تو و پسرانت فردا نزد من خواهید بود، و خداوند اردوی اسرائیل را نیز بهدست فلسطینیان خواهد داد.» | ۱۹ 19 |
౧౯యెహోవా నిన్నూ, ఇశ్రాయేలీయులనూ ఫిలిష్తీయుల చేతికి అప్పగిస్తాడు. రేపు నువ్వు, నీ కొడుకులు నా దగ్గరికి చేరుకుంటారు. యెహోవా ఇశ్రాయేలీయుల సైన్యాన్ని ఫిలిష్తీయుల చేతికి అప్పగిస్తాడు” అని సౌలుతో చెప్పాడు.
و شاول فور به تمامی قامتش بر زمین افتاد، و از سخنان سموئیل بسیار بترسید. وچونکه تمامی روز و تمامی شب نان نخورده بود، هیچ قوت نداشت. | ۲۰ 20 |
౨౦సమూయేలు చెప్పిన మాటలకు సౌలు తీవ్రమైన భయంతో వెంటనే నేలపై సాష్టాంగపడి రాత్రి అంతా భోజనం ఏమీ తీసుకోకుండా ఉన్నందువల్ల బలహీనుడయ్యాడు.
و چون آن زن نزد شاول آمده، دید که بسیار پریشان حال است وی راگفت: «اینک کنیزت آواز تو را شنید و جانم را بهدست خود گذاشتم و سخنانی را که به من گفتی اطاعت نمودم. | ۲۱ 21 |
౨౧అప్పుడు ఆ స్త్రీ సౌలు దగ్గరికి వచ్చి, అతడు ఎంతో కలవరపడడం చూసి “నా యజమానీ, నీ దాసినైన నేను నీ ఆజ్ఞకు లోబడి నా ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని నువ్వు నాకు చెప్పిన మాటలు విని అలా చేశాను” అని చెప్పింది.
پس حال تمنا اینکه تو نیز آوازکنیز خود را بشنوی تا لقمهای نان به حضورت بگذارم و بخوری تا قوت یافته، به راه خودبروی.» | ۲۲ 22 |
౨౨ఇప్పుడు “నీ దాసినైన నేను చెప్పే మాటలు విను. నేను నీకు కొంత ఆహారం వడ్డిస్తాను, నువ్వు భోజనం చేసి బలం తెచ్చుకుని ప్రయాణమై వెళ్ళు” అని అతనితో అంది.
اما او انکار نموده، گفت: «نمی خورم.» لیکن چون خادمانش و آن زن نیز اصرار نمودند، آواز ایشان را بشنید و از زمین برخاسته، بر بسترنشست. | ۲۳ 23 |
౨౩అతడు భోజనం చేసేందుకు ఒప్పుకోలేదు. అతని సేవకులు ఆ స్త్రీతో కలసి అతనిని బలవంతం చేస్తే అతడు వారు చెప్పిన మాట విని నేలపై నుండి లేచి మంచంపై కూర్చున్నాడు.
و آن زن گوسالهای پرواری در خانه داشت. پس تعجیل نموده، آن را ذبح کرد و آردگرفته، خمیر ساخت و قرصهای نان فطیر پخت. | ۲۴ 24 |
౨౪ఆ స్త్రీ తన ఇంట్లో ఉన్న కొవ్విన దూడ తెచ్చి త్వరగా వధించి, పిండి తెచ్చి పిసికి, పులవని రొట్టెలు కాల్చి
و آنها را نزد شاول و خادمانش گذاشت که خوردند. پس برخاسته، در آن شب روانه شدند. | ۲۵ 25 |
౨౫తీసుకువచ్చి సౌలుకు, అతని సేవకులకు వడ్డిస్తే వారు భోజనం చేసి అక్కడి నుంచి ఆ రాత్రే వెళ్లిపోయారు.