< Salmenes 87 >

1 Av Korahs born; ein salme, ein song. Det som han hev grunnfest på dei heilage fjelli,
కోరహు వారసుల కీర్తన. ఒక పాట. పవిత్ర పర్వతాలపై ప్రభువు పట్టణపు పునాది ఉంది.
2 Sions portar elskar Herren mest av alle Jakobs bustader.
యాకోబు గుడారాలన్నిటికంటే సీయోను ద్వారాలు యెహోవాకు ఇష్టం.
3 Herlege ting er sagde um deg, du Guds by. (Sela)
దేవుని పట్టణమా, నీ గురించి చాలా గొప్ప విషయాలు చెప్పుకున్నారు. (సెలా)
4 «Eg vil nemna Rahab og Babel millom deim som kjenner meg; sjå Filistaren, Tyrus og Kusj: Denne er fødd der.»
రాహాబును, బబులోనును నా అనుచరులకు గుర్తు చేస్తాను. చూడండి, ఫిలిష్తీయ, తూరు, ఇతియోపియా ఉన్నాయి గదా, ఇది అక్కడే పుట్టింది.
5 Og um Sion skal det verta sagt: «Kvar ein er fødd der», og han, den Høgste, gjer det fast.
సీయోను గురించి ఇలా అంటారు, వీళ్ళంతా ఆమెకే పుట్టారు. సర్వోన్నతుడు తానే ఆమెను సుస్థిరం చేస్తాడు.
6 Herren skal telja soleis, når folki vert uppskrivne: «Denne er fødd der.» (Sela)
యెహోవా జనాభా లెక్కలు రాయించేటప్పుడు, ఈ ప్రజ అక్కడే పుట్టింది అంటాడు. (సెలా)
7 Og dei som syng og dei som dansar, skal segja: «Alle mine kjeldor er i deg.»
గాయకులు, నర్తకులు, మా ఊటలన్నీ నీలోనే ఉన్నాయి అంటారు.

< Salmenes 87 >