< Markus 13 >

1 Då han gjekk ut or templet, sagde ein av læresveinarne til honom: «Meister, sjå for steinar og for bygningar!»
యేసు దేవాలయంలో నుండి వస్తూ ఉండగా ఆయన శిష్యుల్లో ఒకడు, “బోధకా! ఈ రాళ్ళు, కట్టడాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూశావా!” అన్నాడు.
2 «Ja, ser du desse store bygningarne!» svara Jesus. «Her ligg ikkje stein på stein som ikkje skal rivast laus.»
యేసు అతనితో, “ఈ గొప్ప కట్టడాలు చూస్తున్నావు కదా! రాయి మీద రాయి నిలవకుండా ఈ రాళ్ళన్నీ కూలిపోతాయి” అన్నాడు.
3 Sidan, då han sat på Oljeberget midt imot templet, og det ikkje var nokon innmed, kom Peter og Jakob og Johannes og Andreas og spurde honom:
యేసు దేవాలయానికి ఎదురుగా ఉన్న ఒలీవల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు పేతురు, యాకోబు, యోహాను, అంద్రెయ ఏకాంతంగా ఆయనను ఇలా అడిగారు.
4 «Seg oss: Når skal dette henda, og kva er teiknet me fær når alt dette er åt og skal koma?»
“ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇవి జరగడానికి ముందు సూచన ఏమైనా కనబడుతుందా?”
5 Då tok Jesus soleis til ords: «Sjå dykk fyre, so ingen forvillar dykk!
యేసు వారితో, “మిమ్మల్ని ఎవ్వరూ మోసం చేయకుండా, తప్పుదోవ పట్టించకుండా జాగ్రత పడండి.
6 Mange skal taka mitt namn og segja: «Det er eg!» og føra mange på avveg.
చాలా మంది నా పేరుతో వచ్చి ‘నేనే ఆయనను’ అంటూ చాలా మందిని మోసం చేస్తారు.
7 Men når de høyrer um ufred og tidend um ufred, so vert ikkje rædde! Dette lyt henda; men enden kjem ikkje endå.
మీరు యుద్ధాల గురించిన వార్తలు, వదంతులు విన్నప్పుడు ఆందోళన చెందకండి. అవి తప్పక సంభవిస్తాయి. కాని అంతం అప్పుడే రాదు.
8 Folk skal reisa seg imot folk, og rike mot rike; det skal vera jordskjelv kring i landi, det skal vera uår og upprør. Det er det fyrste av føderiderne.
జనం మీదికి జనం, దేశం మీదికి దేశం లేస్తాయి. అనేక ప్రాంతాల్లో భూకంపాలు, కరువులు వస్తాయి. ఇవి ప్రసవించే ముందు కలిగే నొప్పుల్లాంటివి మాత్రమే.
9 Men sjå dykk fyre! Dei kjem til å draga dykk for domstolarne og piska dykk i synagogorne, og for landshovdingar og kongar skal de førast fram for mi skuld, so de kann vitna for deim.
మీరు జాగ్రతగా ఉండండి! కొందరు మిమ్మల్ని చట్టసభలకు అప్పగిస్తారు. సమాజ మందిరాల్లో మీరు దెబ్బలు తినవలసి వస్తుంది. నా కారణంగా మీరు అధికారుల ముందు, రాజుల ముందు నిలబడి సాక్ష్యం చెప్పవలసి వస్తుంది.
10 Og fyrst lyt evangeliet berast ut til alle folkeslag.
౧౦అంతానికి ముందు అన్ని జాతులకూ సువార్త ప్రకటించడం జరగాలి.
11 Men når dei fører dykk burt og gjev dykk yver til retten, so syt ikkje for kva de skal tala! Det som vert gjeve dykk i same stundi, det skal de tala; for det er ikkje de som talar, men den Heilage Ande.
౧౧వారు మిమ్మల్ని పట్టుకుని తీర్పుకు అప్పగించేటప్పుడు మీరు ఏమి మాట్లాడాలో అని కంగారుపడకండి. ఏమి మాట్లాడాలో ముందుగా ఆలోచన చేసుకోవద్దు. ఆ గడియలో మీకేది ఇయ్యబడుతుందో అదే చెప్పండి. ఎందుకంటే ఆ సమయంలో మాట్లాడేది మీరు కాదు, పరిశుద్ధాత్మ.
12 Bror skal senda bror i dauden, og faren barnet sitt, og born skal standa fram mot foreldri sine, og valda at dei lyt døy.
౧౨సోదరుడు తన సోదరుడికి ద్రోహం చేసి చావుకు అప్పగిస్తారు. అదే విధంగా తండ్రి తన కుమారుణ్ణి మరణానికి అప్పగిస్తాడు. పిల్లలు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా లేచి వారిని మరణానికి అప్పగిస్తారు.
13 Og alle skal hata dykk for mitt namn skuld; men den som held ut til endes, han skal verta frelst.
౧౩నా కారణంగా అందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు. కాని, చివరి వరకూ సహించిన వారిని దేవుడు రక్షిస్తాడు.
14 Men når de ser at den øydande styggedomen stend der han ikkje skulde» - agte vel på dette, du som les! - «då lyt dei som er i Judaland røma til fjells;
౧౪“వినాశకారి అయిన హేయ వస్తువు నిలబడకూడని స్థలంలో నిలబడడం మీరు చూసినప్పుడు (ఇది చదివేవాడు గ్రహిస్తాడు గాక) యూదయలో ఉన్నవారు కొండల్లోకి పారిపోవాలి.
15 den som er uppå taket, må ikkje stiga ned, og ikkje ganga inn og henta noko i huset sitt,
౧౫మిద్దె మీద ఉన్న వారు కిందికి దిగి ఇళ్ళలోకి వెళ్ళడం గానీ తమ వస్తువులు తెచ్చుకోవడం గానీ చేయకూడదు.
16 og den som er utpå marki, må ikkje ganga heim etter kjolen sin!
౧౬పొలాల్లో ఉన్నవారు పై వస్త్రం తెచ్చుకోడానికి వెనక్కి రాకూడదు.
17 Stakkars deim som gjeng med barn eller gjev brjost i dei dagarne!
౧౭గర్భవతులకూ బాలింతలకూ ఆ రోజుల్లో ఎంతో కష్టం.
18 Men bed at dette ikkje må henda um vinteren!
౧౮ఈ సంభవం చలికాలంలో జరగకుండా ఉండాలని ప్రార్థన చేయండి.
19 For den tidi skal vera so hard at det aldri hev vore so hard ei tid frå upphavet åt skaparverket som Gud hev gjort, og til no, og vert ikkje sidan heller.
౧౯ఎందుకంటే దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించిన రోజు నుండి ఈనాటి వరకూ ఎన్నడూ రాని కష్టాలు ఆ రోజుల్లో వస్తాయి. అవి ఇక ముందు రావు కూడా.
20 Og gjorde’kje Herren den tidi stutt, so vart’kje eit liv berga; men for deira skuld som han valde seg ut, hev han gjort den tidi stutt.
౨౦దేవుడు ఆ రోజుల సంఖ్య తక్కువ చెయ్యకపోతే శరీరం ఉన్న ఎవ్వరూ తప్పించుకోలేరు. కాని, తాను ఎన్నుకున్న ప్రజల కోసం ఆయన ఆ రోజులను తక్కువ చేస్తాడు.
21 Um nokon då segjer med dykk: «Sjå her er Messias - Sjå der!» so må de ikkje tru det!
౨౧ఆ రోజుల్లో ఎవరైనా మీతో, ‘ఇదుగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, ఇదుగో అక్కడ ఉన్నాడు’ అంటే నమ్మకండి.
22 For falske Messias’ar skal standa fram, og falske profetar, og gjera teikn og under for å forvilla dei utvalde, um det er råd.
౨౨కపట క్రీస్తులు, కపట ప్రవక్తలు వస్తారు. అద్భుతాలు, మహత్కార్యాలు ప్రదర్శించి దేవుడు ఎన్నుకున్న వారిని కూడా మోసగించి తప్పు దారి పట్టిస్తారు.
23 So sjå dykk fyre! Eg hev sagt dykk alt fyreåt.
౨౩అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండండి. మీకు అన్ని విషయాలు ముందే చెబుతున్నాను.
24 Men i dei dagarne, etter denne harde tidi, skal soli myrkjast, og månen missa sitt ljos;
౨౪“ఆ కష్టకాలం గడచిన తరువాతి రోజుల్లో, సూర్యుడు చీకటైపోతాడు. చంద్రుడు కాంతినివ్వడు.
25 stjernorne skal falla ned frå himmelen, og himmelkrafterne skakast.
౨౫ఆకాశ నక్షత్రాలు రాలిపోతాయి. ఆకాశంలో ఉన్న శక్తులన్నీ కదిలిపోతాయి.
26 Då skal dei sjå Menneskjesonen koma i skyi med stort velde og herlegdom,
౨౬అప్పుడు మనుష్య కుమారుడు గొప్ప శక్తితో ప్రభావంతో మేఘాల మీద రావడం మనుషులు చూస్తారు.
27 og då skal han senda ut englarne, og samla dei utvalde frå heimsens fire hyrno, frå ytste enden av jordi til ytste enden av himmelen.
౨౭అప్పుడాయన భూమి నలువైపుల నుండి ఆకాశం నలువైపుల దాకా తన దూతలను పంపి ఆయన ఎన్నుకున్న ప్రజలను పోగుచేయిస్తాడు.”
28 Lær ei likning av fiketreet: Når sevja hev kome i greinerne, og lauvet sprett, då veit de at sumaren er nær.
౨౮“అంజూరు చెట్టును చూసి ఈ ఉపమానం నేర్చుకోండి. దాని కొమ్మలు చిగురించడం చూసి వసంతకాలం వస్తున్నదని మీరు గ్రహిస్తారు.
29 Like eins når de ser dette hender, då veit de at han er utfor døri.
౨౯అదే విధంగా ఈ సంగతులు జరగడం మీరు చూసినప్పుడు ఆయన దగ్గరలోనే ఉన్నాడనీ, త్వరలో రాబోతున్నాడనీ తెలుసుకోండి.
30 Det segjer eg dykk for visst: Denne ætti skal ikkje forgangast fyrr alt dette hev hendt.
౩౦నేను కచ్చితంగా చెప్పేదేమంటే, ఈ తరం వారు బతికి ఉండగానే ఇవన్నీ జరుగుతాయి.
31 Himmel og jord skal forgangast; men mine ord skal ikkje forgangast.
౩౧ఆకాశం, భూమి గతించిపోతాయి. కాని నా మాటలు ఎన్నటికీ గతించవు.
32 Men den dagen og timen veit ingen, ikkje englarne i himmelen, og ikkje Sonen - ingen utan Faderen.
౩౨అయితే ఆ రోజు, ఆ గంట ఎప్పుడు వస్తుందో పరలోకంలోని దేవదూతలకు గాని, కుమారుడికి గానీ, మరెవ్వరికీ తెలియదు. తండ్రికి మాత్రమే తెలుసు.
33 Sjå dykk fyre, og vak! For de veit ikkje når tidi kjem.
౩౩జాగ్రతగా ఉండండి. సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఆ సమయం ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు.
34 Det er liksom med ein mann som drog utanlands. Då han for heimantil, sette han sveinarne sine til å styra for seg. Kvar fekk sitt å gjera, og til portnaren sagde han at han laut vaka.
౩౪“ఇది తన ఇల్లు విడిచి వేరే దేశం వెళ్ళిన ఒక మనిషిలాగా ఉంటుంది. అతడు తన సేవకులకు అధికారం ఇచ్చి, ఒక్కొక్కడికి ఒక్కొక్క పని అప్పగించి ద్వారం దగ్గర ఉన్నవాడికి మెలకువగా ఉండమని చెప్పాడు.
35 So vak då! For de veit’kje når husbonden kjem - um kvelden, eller midnattsbil, eller i otta, eller i dagrenningi.
౩౫కాబట్టి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఇంటి యజమాని ఎప్పుడు తిరిగి వస్తాడో మీకు తెలియదు. సాయంత్రం వస్తాడో, అర్థరాత్రి వస్తాడో, కోడి కూసే వేళ వస్తాడో, సూర్యోదయం వేళ వస్తాడో మీకు తెలియదు.
36 Lat honom ikkje finna dykk sovande, um han skulde koma uventande på dykk!
౩౬ఆయన హఠాత్తుగా వచ్చి మీరు నిద్రపోతూ ఉండడం చూస్తాడేమో జాగ్రత్త!
37 Men det eg segjer dykk, det segjer eg alle: Ver vakne!»
౩౭నేను మీకు చెబుతున్నది అందరికి చెప్తున్నాను, మెలకువగా ఉండండి.”

< Markus 13 >