< Jobs 26 >

1 Då svara Job og sagde:
అప్పుడు యోబు ఇలా జవాబు ఇచ్చాడు.
2 Kvar helst hev du den veike hjelpt? Når studde du den trøytte arm?
శక్తి లేని వాడికి నువ్వు ఎంత బాగా సహాయం చేశావు! బలం లేని చేతిని ఎంత బాగా రక్షించావు!
3 Kvar gav du uklok mann ei råd? Kor ovleg visdom hev du synt?
జ్ఞానం లేని వాడికి నీ వెంత చక్కగా ఆలోచన చెప్పావు! సంగతిని ఎంత చక్కగా వివరించావు!
4 Kven hev du bore melding til? Kva ånd hev tala gjenom deg?
నువ్వు ఎవరి ఎదుట మాటలు పలికావు? ఎవరి ఆత్మ నీలోనుండి బయలుదేరింది?
5 Skuggarne i angest skjelva, vatsdjup og dei som deri bur.
బిల్దదు ఇలా అన్నాడు. జలాల కింద నివసించే వారు, మృతులు, నీడలు వణికిపోతారు.
6 Helheimen open ligg for honom, avgrunnen utan noko dekkje. (Sheol h7585)
దేవుని దృష్టికి పాతాళం తెరిచి ఉంది. నాశనకూపం ఆయన ఎదుట బట్టబయలుగా ఉంది. (Sheol h7585)
7 Nordheimen han i audni spana, og hengde jordi yver inkje.
ఉత్తర దిక్కున శూన్యమండలం మీద ఆకాశ విశాలాన్ని ఆయన పరిచాడు. శూన్యంపై భూమిని వేలాడదీశాడు.
8 Han vatnet inn i skyer bind; og skyi brest ei under det.
ఆయన తన కారు మేఘాల్లో నీళ్లను బంధించాడు. అయినా అవి పిగిలి పోవడం లేదు.
9 Kongsstolen sin han gøymer burt og breider skyer yver honom.
దాని మీద మేఘాన్ని వ్యాపింపజేసి ఆయన తన సింహాసన కాంతిని కప్పి ఉంచాడు.
10 Kring vatni han ei grensa set, der som ljos og myrker byta skal.
౧౦వెలుగు చీకటుల మధ్య సరిహద్దుల దాకా ఆయన జలాలకు హద్దు నియమించాడు.
11 Stolparne under himmelen skjelv, og rædde vert dei for hans trugsmål.
౧౧ఆయన గద్దించగా ఆకాశ విశాల స్తంభాలు ఆశ్చర్యపడి అదిరిపోతాయి.
12 Han rører havet upp med velde, og med sit vit han krasar ubeist.
౧౨తన బలం వలన ఆయన సముద్రాన్ని రేపుతాడు. తన వివేకం వలన రాహాబును నలగగొడతాడు.
13 Og himmelen klårnar ved hans ande; hans hand den snøgge ormen drap.
౧౩ఆయన ఊపిరి వదలగా ఆకాశ విశాలాలకు అందం వస్తుంది. ఆయన హస్తం పారిపోతున్న మహా సర్పాన్ని పొడిచింది.
14 Sjå her utkanten av hans veg; det berre kviskring er me høyrer. Kven skynar, når hans allmagt torar?
౧౪ఇవి ఆయన కార్యాల్లో స్వల్పమైనవి. ఆయన్ను గూర్చి మనకు వినబడుతున్నది ఎంతో మెల్లనైన గుసగుస శబ్దం పాటిదే గదా. గర్జనలు చేసే ఆయన మహాబలం ఎంతో గ్రహించగలవాడెవడు?

< Jobs 26 >