< Jobs 18 >
1 Då tok Bildad frå Suah til ords og sagde:
౧అప్పుడు షూహీయుడు బిల్దదు ఇలా జవాబిచ్చాడు.
2 «Kor lenge driv de jagt på ord? Gjev gaum, lat oss so talast ved!
౨ఎంతసేపు మాటలు వెదుక్కుంటూ నన్ను చిక్కుల్లో పడేయాలని చూస్తావు? నువ్వు ఆలోచించుకో. తరువాత నేను మాట్లాడతాను.
3 Kvi skal me reknast liksom fe, som ureine i dykkar augo?
౩నువ్వెందుకు మమ్మల్ని మూర్ఖులుగా, పశువులుగా ఎంచుతున్నావు?
4 Å, du som riv deg sund i sinne, skal jordi øydast for di skuld? Skal fjellet flytjast frå sin stad?
౪అమితమైన కోపంతో నిన్ను నువ్వే చీల్చుకొంటున్నావు. నీ కోసం భూమి అంతా పాడైపోవాలా? నువ్వు కోరుకున్నావని కొండ తన స్థానం మార్చుకుంటుందా?
5 Men sløkt vert ljoset for den vonde, og hans åre-eld skal ikkje skina.
౫భక్తిహీనుల దీపం తప్పక ఆరిపోతుంది. వాళ్ళ ఇళ్ళల్లో దీపాలు వెలగకుండా పోతాయి.
6 I tjeldet hans vert ljoset myrkt, og lampa sloknar yver han.
౬వాళ్ళ నివాసాల్లో ఉన్న వెలుగు చీకటిగా మారిపోతుంది. వాళ్ళ దగ్గర ఉన్న దీపం ఆరిపోతుంది.
7 Hans sterke stig vert snævra inn; han snåvar yver sine planar.
౭వాళ్ళ బలమైన అడుగులు మార్గం తప్పుతాయి. వాళ్ళ సొంత ఆలోచనలు పతనానికి నడిపిస్తాయి.
8 Hans fot vert fløkt i garnet inn, og upp i netet ferdast han;
౮వాళ్ళు బోనుల్లోకి నడుస్తూ వెళ్ళే వాళ్ళు. వాళ్ళ పాదాలు వాళ్ళను వలలో పడేలా నడిపిస్తాయి.
9 og snara triv um hælen hans, og gildra tek på honom fat.
౯వాళ్ళ మడిమెలు బోనులో ఇరుక్కుంటాయి. వాళ్ళు ఉచ్చులో చిక్కుకుంటారు.
10 I jordi løynde gildror lurer, og fellor ventar på hans veg.
౧౦వాళ్ళ కోసం ఉరి నేలపై సిద్ధంగా ఉంది. వాళ్ళను పట్టుకోవడానికి దారిలో ఉచ్చు బిగించి ఉంది.
11 Og rædslor trugar rundt ikring og skræmer han for kvart eit stig.
౧౧అన్నివైపుల నుండి భయం కలిగించే విషయాలు వాళ్ళను చుట్టుముడతాయి. భయాలు అన్నివైపులకు వాళ్ళను వెంటాడి తరుముతాయి.
12 Ulukka hungrar etter han, og vondt vil føra han til fall,
౧౨వాళ్ళ బలం క్షీణించిపోతుంది. వాళ్ళను కూల్చడానికి సిద్ధంగా ఆపద ఉంటుంది.
13 vil eta kvar ein led og lem, ja, det vil daudens eldste son.
౧౩అది వాళ్ళ అవయవాలను తినివేస్తుంది. మరణకరమైన రోగం వాళ్ళ శరీరాన్ని క్షీణింపజేస్తుంది.
14 Hans trygd er rivi frå hans tjeld; du sender han til rædsle-kongen.
౧౪వాళ్ళు నిర్భయంగా తమ గుడారాల్లో ఉన్నప్పుడు వారిని బయటకు ఈడ్చివేస్తారు. వారిని క్రూరుడైన రాజు దగ్గరికి బందీలుగా కొనిపోతారు.
15 I huset hans bur framande, det vert strått svåvel på hans bustad.
౧౫వాళ్లకు సంబంధంలేని ఇతరులు వాళ్ళ గుడారాల్లో కాపురం ఉంటారు. వాళ్ళ నివాసస్థలాల మీద గంధకం చల్లడం జరుగుతుంది.
16 Hans rot i grunnen turkar ut; den høge kruna visnar burt.
౧౬వాళ్ళ వేళ్లు కింద ఉన్నవి కిందనే ఎండిపోతాయి. పైన ఉన్న వాళ్ళ కొమ్మలు నరకబడతాయి.
17 Hans minne kverv frå jordi burt, og namnlaus vert han vidt og breidt.
౧౭భూమి మీద వాళ్ళ ఆనవాళ్ళు తుడిచి పెట్టుకు పోతాయి. భూతలంపై వాళ్ళను జ్ఞాపకం ఉంచుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు.
18 Frå ljos til myrker driv dei honom og jagar han frå landi burt.
౧౮వాళ్ళను వెలుగులో నుండి చీకటిలోకి తోలివేస్తారు. భూమిపై లేకుండా వాళ్ళను తరుముతారు.
19 Han barnlaus vert i eige folk; i heimen hans slepp ingen undan.
౧౯వాళ్లకు కొడుకులు, మనవలు ఎవ్వరూ మిగలరు. వాళ్ళ ఇంట సజీవంగా ఉండే వాళ్ళు ఎవ్వరూ ఉండరు.
20 Og vestmenn støkk for dagen hans, og austmenn vert av rædsla slegne.
౨౦వాళ్లకు పట్టిన దుర్గతిని చూసి తరువాత వచ్చిన పశ్చిమ దేశస్తులు ఆశ్చర్యపోతారు. తూర్పున ఉన్న వాళ్ళు భయభ్రాంతులకు లోనౌతారు.
21 Just soleis gjeng det nidings hus, den heim der ingen kjenner Gud.»
౨౧భక్తిహీనుల నివాసాలకు, దేవుణ్ణి ఎరగని ప్రజల స్థలాలకు ఇలాంటి గతి తప్పకుండా పడుతుంది.