< Apostlenes-gjerninge 1 >
1 Den fyrste boki skreiv eg, Teofilus, um alt det som Jesus tok til med både å gjera og læra,
౧తియొఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపొస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత
2 alt til den dagen då han vart uppteken, etter at han ved den Heilage Ande hadde gjeve sine bod til apostlarne som han hadde valt seg ut,
౨ఆయన పరలోకానికి ఆరోహణమైన రోజు వరకూ ఆయన చేసిన, బోధించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథాన్ని రచించాను.
3 deim som han og steig livande fram for med mange yvertydande teikn, etter han hadde lide, med di han i fyrti dagar synte seg for deim og tala um det som høyrer til Guds rike.
౩ఆయన హింసలు పొందిన తరువాత నలభై రోజులపాటు వారికి కనబడుతూ, దేవుని రాజ్య విషయాలను బోధిస్తూ, అనేక రుజువులను చూపించి వారికి తనను తాను సజీవునిగా కనపరచుకున్నాడు.
4 Og då han var saman med deim, baud han deim at dei ikkje skulde vika frå Jerusalem, men venta på det som Faderen hadde lova, «som de, » sagde han, «hev høyrt av meg.
౪ఆయన వారిని కలుసుకుని ఈ విధంగా ఆజ్ఞాపించాడు, “మీరు యెరూషలేమును విడిచి పోవద్దు. నా ద్వారా విన్న తండ్రి వాగ్దానం కోసం కనిపెట్టండి.
5 For Johannes døypte med vatn, men de skal verta døypte med den Heilage Ande um ikkje mange dagar.»
౫యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాడు గానీ కొద్ది రోజుల్లో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు.”
6 Då dei no var saman, spurde dei honom og sagde: «Herre, reiser du på den tidi riket upp att for Israel?»
౬వారు సమకూడినప్పుడు, “ప్రభూ, ఇప్పుడు ఇశ్రాయేలు రాజ్యాన్ని పునరుద్ధరిస్తావా?” అని శిష్యులు అడగగా ఆయన,
7 Han sagde til deim: «Det er ikkje dykkar sak å vita tid eller stund som Faderen hev sett i si eigi magt.
౭“కాలాలూ సమయాలూ తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. వాటిని తెలుసుకోవడం మీ పని కాదు.
8 Men de skal få kraft når den Heilage Ande kjem yver dykk; og de skal vera mine vitne i Jerusalem og i heile Judæa og Samaria og til ytste enden av jordi.»
౮“అయితే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. కాబట్టి, మీరు యెరూషలేములో, యూదయ సమరయ దేశాల్లో, ప్రపంచమంతటా నాకు సాక్షులుగా ఉంటారు” అన్నాడు.
9 Og då han hadde sagt dette, for han upp so dei såg på; og ei sky tok honom burt for augo deira.
౯ఈ మాటలు చెప్పి, వారు చూస్తూ ఉండగా ఆయన ఆరోహణమయ్యాడు. అప్పుడు ఒక మేఘం వచ్చి వారికి కనబడకుండా ఆయనను తీసుకు వెళ్ళిపోయింది.
10 Og som dei no stod og stirde mot himmelen då han for burt, sjå, då stod det tvo menner hjå deim i kvite klæde,
౧౦ఆయన వెళుతూ ఉండగా వారు ఆకాశం వైపు అదే పనిగా చూస్తున్నారు. అప్పుడు తెల్లని బట్టలు ధరించిన ఇద్దరు వ్యక్తులు వారి దగ్గర నిలబడి,
11 og dei sagde: «Menner frå Galilæa, kvi stend de og ser upp mot himmelen? Denne Jesus som er teken upp frå dykk til himmelen, han skal koma att på same måten som de såg honom fara til himmels.»
౧౧“గలిలయ నివాసులారా, మీరెందుకు ఆకాశం వైపు చూస్తున్నారు? మీ దగ్గర్నుండి పరలోకానికి ఆరోహణమైన ఈ యేసు ఏ విధంగా పరలోకానికి వెళ్ళడం మీరు చూశారో ఆ విధంగానే తిరిగి వస్తాడు” అని వారితో చెప్పారు.
12 Då vende dei um til Jerusalem frå det berget som er kalla Oljeberget, og som er nær Jerusalem, ein kviledagsveg derifrå.
౧౨అప్పుడు వారు ఒలీవ కొండ నుండి యెరూషలేముకు తిరిగి వెళ్ళారు. ఆ కొండ యెరూషలేముకు విశ్రాంతి దినాన నడవదగినంత దూరంలో ఉంది.
13 Og då dei kom inn der, gjekk dei upp på salen der dei heldt til - både Peter og Johannes og Jakob og Andreas, Filip og Tomas, Bartolomæus og Mattæus, Jakob, Alfæus’ son, og Simon Selotes og Judas, Jakobs bror.
౧౩వారు పట్టణంలో ప్రవేశించి, తాము బస చేస్తున్న మేడగదిలోకి వెళ్ళారు. వారెవరంటే, పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, ఉద్యమ కారుడైన సీమోను, యాకోబు కుమారుడు యూదా.
14 Alle desse heldt samstendige ved i bøn saman med nokre kvinnor og Maria, Jesu mor, og brørne hans.
౧౪వీరూ, వీరితో కూడా కొందరు స్త్రీలూ, యేసు తల్లి మరియ, ఆయన తమ్ముళ్ళూ ఏకగ్రీవంగా, నిలకడగా ప్రార్థన చేస్తూ ఉన్నారు.
15 Og i dei dagarne stod Peter upp midt imillom læresveinarne - og der var ein hop saman på umkring hundrad og tjuge - og han sagde:
౧౫ఆ రోజుల్లో సుమారు నూట ఇరవై మంది శిష్యులు సమావేశమై ఉన్నపుడు పేతురు వారి మధ్య నిలబడి,
16 «Brør! Det laut verta uppfyllt det skriftordet som den Heilage Ande fyreåt tala gjenom Davids munn um Judas, som vart vegvisar for deim som greip Jesus;
౧౬“సోదరులారా, యేసును పట్టుకున్నవారికి దారి చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనం నెరవేరవలసి ఉంది.
17 for han var rekna med millom oss og fekk lut i denne tenesta.
౧౭ఇతడు మనలో ఒకడుగా లెక్కలోకి వచ్చి ఈ పరిచర్యలో భాగం పొందాడు.
18 Han kjøpte seg då ein åker av løni for si ugjerning, og då han stupte ned, og sprakk han midt i tvo, og all innvolen i honom valt ut.
౧౮ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన డబ్బుతో ఒక పొలం కొన్నాడు. అతడు తలకిందులుగా పడి శరీరం బద్దలై పేగులన్నీ బయటికి వచ్చాయి.
19 Og det vart kunnigt for alle deim som bur i Jerusalem, so at den åkeren på deira mål fekk namnet Hakeldama, det er: Blodåkeren;
౧౯ఈ విషయం యెరూషలేములో నివసిస్తున్న వారందరికీ తెలిసింది. కాబట్టి వారి భాషలో ఆ పొలాన్ని ‘అకెల్దమ’ అంటున్నారు. దాని అర్థం ‘రక్త భూమి.’ ఇందుకు రుజువుగా,
20 for det stend skrive i Salmeboki: «Hans bustad verte øydd, og ingen mann bu der, » og: «Ein annan take hans embætte!»
౨౦‘అతని ఇల్లు పాడైపోవు గాక, దానిలో ఎవ్వడూ కాపురముండకపోవు గాక, అతని ఉద్యోగం వేరొకడు తీసికొనును గాక,’ అని కీర్తనల గ్రంథంలో రాసి ఉంది.
21 Difor må ein av dei menner som hev vore med oss heile tidi då Herren Jesus gjekk inn og ut millom oss,
౨౧“కాబట్టి యోహాను బాప్తిసమిచ్చింది మొదలు ప్రభువైన యేసు మన దగ్గర నుండి పరలోకానికి వెళ్ళిన రోజు వరకూ,
22 alt frå Johannes-dåpen til den dagen han vart uppteken frå oss - ein av desse må verta vitne saman med oss um hans uppstoda.»
౨౨ఆయన మన మధ్య ఉన్న కాలమంతా మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, మనతో కూడ ఆయన పునరుత్థానం గురించి సాక్షిగా ఉండాలి” అని చెప్పాడు.
23 Og dei stelte fram tvo: Josef som vart kalla Barsabbas med tilnamnet Justus, og Mattias.
౨౩అప్పుడు వారు యూస్తు, బర్సబ్బా అనే మారు పేర్లున్న యోసేపునూ, మత్తీయనూ నిలబెట్టి,
24 Og dei bad og sagde: «Herre, du som kjenner hjarto i alle, syn oss den som du hev valt ut av desse tvo
౨౪ఈ విధంగా ప్రార్థించారు. “అందరి హృదయాలను ఎరిగిన ప్రభూ,
25 til å få lut i denne tenesta og apostelgjerning som Judas gjekk burt ifrå til å fara til sin egen stad!»
౨౫తన చోటికి వెళ్ళడానికి యూదా దారి తప్పి పోగొట్టుకొన్న ఈ పరిచర్యలో, అపొస్తలత్వంలో పాలు పొందడానికి వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొన్న వాణ్ణి చూపించు.”
26 Og dei kasta lut millom deim, og luten fall på Mattias, og han vart rekna saman med dei elleve apostlarne.
౨౬తరువాత శిష్యులు వారిద్దరి మీదా చీట్లు వేస్తే మత్తీయ పేరుతో చీటి వచ్చింది కాబట్టి అతనిని పదకొండుమంది అపొస్తలులతో కలిపి లెక్కించారు.