< Salmenes 54 >

1 Til sangmesteren, med strengelek; en læresalme av David, da sifittene kom og sa til Saul: David holder sig skjult hos oss. Gud, frels mig ved ditt navn, og hjelp mig til min rett ved din kraft!
ప్రధాన సంగీతకారుని కోసం. తీగె వాయిద్యాలమీద పాడేది. జీఫీయులు వచ్చి దావీదు మా దగ్గర దాక్కున్నాడు, అని సౌలుతో చెప్పినప్పుడు దావీదు రాసిన దైవధ్యానం. దేవా, నీ నామాన్నిబట్టి నన్ను రక్షించు. నీ వీరత్వాన్ని బట్టి నాకు న్యాయం తీర్చు.
2 Gud, hør min bønn, vend øret til min munns ord!
దేవా, నా ప్రార్థన ఆలకించు. నా నోటి మాటలు నీకు వినబడనియ్యి.
3 For fremmede har reist sig imot mig, og voldsmenn står mig efter livet; de har ikke Gud for øie. (Sela)
గర్వికులు నాకు వ్యతిరేకంగా లేచారు. జాలిలేని వారు నా ప్రాణం తీయాలని చూస్తున్నారు. వారికి దేవుడంటే లెక్కలేదు.
4 Se, Gud hjelper mig, Herren er den som opholder mitt liv.
ఇదిగో, దేవుడే నా సహాయం. ప్రభువే నా ప్రాణాన్ని నిలబెట్టేవాడు.
5 Det onde skal falle tilbake på mine fiender; utrydd dem i din trofasthet!
నా శత్రువులు చేసే కీడును ఆయన వారి మీదకే రప్పిస్తాడు. నీ నమ్మకత్వాన్ని బట్టి వారిని నాశనం చెయ్యి.
6 Med villig hjerte vil jeg ofre til dig; jeg vil prise ditt navn, Herre, fordi det er godt.
సేచ్చార్పణ బలులు నేను నీకు అర్పిస్తాను. యెహోవా, నీ నామం ఉత్తమం. నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.
7 For av all nød frir han mig ut, og på mine fiender ser mitt øie med lyst.
ప్రతి ఆపద నుండి ఆయన నన్ను విడిపించాడు. నా శత్రువుల ఓటమిని నా కన్ను సంతోషంగా చూస్తున్నది.

< Salmenes 54 >