< Salmenes 29 >
1 En salme av David. Gi Herren, I Guds sønner, gi Herren ære og makt!
౧దావీదు కీర్తన. బలవంతులారా, యెహోవాకు మహిమ, ప్రభావం ఉన్నాయని గుర్తించండి!
2 Gi Herren hans navns ære, tilbed Herren i hellig prydelse!
౨యెహోవా నామానికి ఉన్న అర్హతనుబట్టి ఆయనకు మహిమ ఉందని గుర్తించండి. ఆయన మహిమకు తగిన వస్త్రాలు ధరించి ఆయనను ఆరాధించండి.
3 Herrens røst er over vannene, ærens Gud tordner, Herren over de store vann.
౩యెహోవా స్వరం జలాలపై వినిపిస్తూ ఉంది. మహిమగల దేవుడు ఉరుముతున్నాడు. అనేక జలాలపై యెహోవా ఉరుముతున్నాడు.
4 Herrens røst lyder med kraft, Herrens røst med herlighet.
౪యెహోవా స్వరం బలమైనది, యెహోవా స్వరం ప్రభావం గలది.
5 Herrens røst bryter sedrer, Herren sønderbryter Libanons sedrer,
౫యెహోవా స్వరం దేవదారు వృక్షాలను విరిచి వేస్తుంది. యెహోవా లెబానోను దేవదారు వృక్షాలను ముక్కలుగా విరిచేస్తాడు.
6 og han får dem til å hoppe som en kalv, Libanon og Sirjon som en ung villokse.
౬ఆయన లెబానోనును దూడలా గంతులు వేయిస్తాడు. ఆయన షిర్యోనును దున్నపెయ్యలాగా చేస్తాడు.
7 Herrens røst slynger ut kløvede ildsluer.
౭యెహోవా స్వరం అగ్నిజ్వాలల్లాగా దాడి చేస్తుంది.
8 Herrens røst får ørkenen til å beve, Herren får Kades' ørken til å beve.
౮యెహోవా స్వరం అరణ్యాన్ని కదిలిస్తుంది. యెహోవా కాదేషు అరణ్యాన్ని కదిలిస్తాడు.
9 Herrens røst får hindene til å føde og gjør skogene bare, og i hans tempel sier alt: Ære!
౯యెహోవా స్వరం ఆడ జింకలు ఈనేలా చేస్తుంది. అది అడవి బోడి అయిపోయేలా చేస్తుంది. కాని ఆయన ఆలయంలో ఉన్న వాళ్ళందరూ “మహిమ!” అంటారు.
10 Herren tronte på vannflommens tid, og Herren troner som konge evindelig.
౧౦యెహోవా ప్రళయ జలాలపై సింహాసనం వేసుకుని కూర్చున్నాడు. శాశ్వతంగా యెహోవా రాజుగా కూర్చున్నాడు.
11 Herren skal gi sitt folk kraft, Herren skal velsigne sitt folk med fred.
౧౧యెహోవా తన ప్రజలకు బలం ఇస్తాడు, యెహోవా తన ప్రజలకు శాంతిని ఆశీర్వాదంగా ఇస్తాడు.