< Salmenes 150 >
1 Halleluja! Lov Gud i hans helligdom, lov ham i hans mektige hvelving!
౧యెహోవాను కీర్తించండి. ఆయన పరిశుద్ధ ఆలయంలో దేవుణ్ణి స్తుతించండి. ఆయన ప్రభావాన్ని గొప్పచేసే ఆకాశవిశాలాల్లో ఆయనను స్తుతించండి.
2 Lov ham for hans veldige gjerninger, lov ham efter hans storhets fylde!
౨ఆయన బలమైన కార్యాలను బట్టి ఆయనను స్తుతించండి. ఆయనకున్న గొప్ప బలప్రభావాలను బట్టి ఆయనను స్తుతించండి.
3 Lov ham med basunklang, lov ham med harpe og citar!
౩బాకాలు ఊదుతూ ఆయనను స్తుతించండి. సితారాతో, శ్రావ్యమైన స్వరాలతో ఆయనను స్తుతించండి.
4 Lov ham med pauke og dans, lov ham med strengelek og fløite!
౪తంబుర వాయిస్తూ, నాట్యం చేస్తూ ఆయనను స్తుతించండి. తంతివాద్యం మీటుతూ, వేణువు మోగిస్తూ ఆయనను స్తుతించండి.
5 Lov ham med tonende bekkener, lov ham med høit klingende bekkener!
౫తాళాలు మోగిస్తూ ఆయనను స్తుతించండి. గంభీరమైన ధ్వనులు చేసే తాళాలు వాయిస్తూ ఆయనను స్తుతించండి.
6 Alt som har ånde, love Herren! Halleluja!
౬ప్రాణం ఉన్న ప్రతి జీవీ యెహోవాను స్తుతిస్తుంది గాక. యెహోవాను కీర్తించండి.