< Salmenes 145 >
1 En lovsang av David. Jeg vil ophøie dig, min Gud, du som er kongen, og jeg vil love ditt navn evindelig og alltid.
౧దావీదు రాసిన స్తుతి కీర్తన నా రాజా, నా దేవా, నిన్ను ఘనపరుస్తాను. నీ నామాన్ని అన్నివేళలా కీర్తిస్తాను.
2 Hver dag vil jeg love dig, og jeg vil prise ditt navn evindelig og alltid.
౨అనుదినం నిన్ను స్తుతిస్తాను. శాశ్వతకాలం నీ నామాన్ని కీర్తిస్తాను.
3 Herren er stor og høilovet, og hans storhet er uransakelig.
౩యెహోవా ఘనత వహించినవాడు. ఆయన అధిక స్తుతులకు పాత్రుడు. ఆయన గొప్పతనాన్ని గ్రహించడం ఎవరి తరం కాదు.
4 En slekt skal lovprise for den annen dine gjerninger, og dine veldige gjerninger skal de forkynne.
౪ఒక తరం వారు మరో తరం వారి ఎదుట కార్యాలు తెలియజేసి నిన్ను కొనియాడతారు. నీ పరాక్రమ కార్యాలను నెమరు వేసుకుంటారు.
5 På din majestets herlighet og ære og på dine undergjerninger vil jeg grunde.
౫వారు నీ మహిమ వైభవాన్ని ధ్యానిస్తారు. నేను నీ అద్భుత క్రియలను తలపోసుకుంటాను.
6 Og om dine sterke og forferdelige gjerninger skal de tale, og dine store gjerninger vil jeg fortelle.
౬వారు నీ ఆశ్చర్య కార్యాల్లోని ప్రభావాన్ని వర్ణిస్తారు. నేను నీ ప్రతాపాన్ని వివరిస్తాను.
7 Minneord om din store godhet skal de la strømme ut og synge med fryd om din rettferdighet.
౭నువ్వు కనపరిచే కరుణ ఉన్నతిని వాళ్ళు చాటిస్తారు. నీ నీతి క్రియలను వాళ్ళు ఆలపిస్తారు.
8 Herren er nådig og barmhjertig, langmodig og stor i miskunnhet.
౮యెహోవా దయ, వాత్సల్యం గలవాడు. ఆయన కోపం విషయంలో నిదానించే వాడు. నిబంధన విశ్వసనీయత ఆయనలో పొంగి పొరలుతూ ఉంది.
9 Herren er god imot alle, og hans barmhjertighet er over alle hans gjerninger.
౯యెహోవా అందరికీ మేలు చేస్తాడు. సృష్టి అంతటి మీదా ఆయన వాత్సల్యం చూపుతాడు.
10 Alle dine gjerninger skal prise dig, Herre, og dine fromme skal love dig.
౧౦యెహోవా నీ క్రియలన్నిటిని బట్టి నువ్వు స్తుతి ప్రశంసలకు పాత్రుడవు. నీ భక్తులు నిన్ను సన్నుతిస్తారు.
11 Om ditt rikes herlighet skal de tale og fortelle om ditt velde,
౧౧నీ భక్తులు నీ రాజ్యవైభవాన్ని గురించి, నీ ప్రభావాన్ని గురించి మాట్లాడుకుంటారు.
12 for å kunngjøre for menneskenes barn dine veldige gjerninger og ditt rikes herlighet og ære.
౧౨మహోన్నతమైన నీ రాజ్య ప్రాభవాన్ని, నీ శక్తి సామర్ధ్యాలను ప్రజలకు తెలపడానికి నీ బలప్రభావాలను గూర్చి మాట్లాడతారు.
13 Ditt rike er et rike for alle evigheter, og ditt herredømme varer gjennem alle slekter.
౧౩నీ రాజ్యం కలకాలం ఉంటుంది. నీ రాజ్య పరిపాలన తరతరాలు నిలిచి ఉంటుంది.
14 Herren støtter alle dem som faller, og opreiser alle nedbøiede.
౧౪కూలిపోతున్న వాళ్ళను యెహోవా స్థిరపరుస్తాడు. కృంగిన వాళ్ళను లేవనెత్తుతాడు.
15 Alles øine vokter på dig, og du gir dem deres føde i sin tid.
౧౫జీవులన్నిటి కళ్ళు నీవైపే చూస్తున్నాయి. తగిన కాలంలో నువ్వు వాటికి ఆహారం పెడుతున్నావు.
16 Du oplater din hånd og metter alt levende med velbehag.
౧౬నీ గుప్పిలి విప్పి ప్రతి ప్రాణి ఆకలి తీరుస్తున్నావు.
17 Herren er rettferdig i alle sine veier og miskunnelig i alle sine gjerninger.
౧౭యెహోవా తన విధానాలన్నిటిలో నిజాయితీగా ప్రవర్తిస్తాడు. ఆయన తన కృప ద్వారా పనులు సఫలం చేస్తాడు.
18 Herren er nær hos alle dem som kaller på ham, hos alle som kaller på ham i sannhet.
౧౮ఆయన తనను వేడుకునే వాళ్ళందరికీ, తనకు యథార్ధంగా ప్రార్థన చేసే వాళ్ళందరికీ చేరువగా ఉన్నాడు.
19 Han gjør efter deres velbehag som frykter ham, og han hører deres rop og frelser dem.
౧౯తన భక్తుల కోరికలు ఆయన నెరవేరుస్తాడు. వాళ్ళ ప్రార్థన విని వాళ్ళను కాపాడతాడు.
20 Herren bevarer alle dem som elsker ham; men alle de ugudelige ødelegger han.
౨౦తనను ప్రేమించే వాళ్ళందరినీ యెహోవా కాపాడతాడు. అదే సమయంలో దుష్టులంతా నశించిపోయేలా చేస్తాడు.
21 Min munn skal uttale Herrens pris, og alt kjød skal love hans hellige navn evindelig og alltid.
౨౧నా నోరు యెహోవాకు స్తుతి గీతాలు పాడుతుంది. శరీరం ఉన్నవాళ్ళంతా ఆయన పవిత్ర నామాన్ని సదాకాలం స్తుతిస్తారు గాక.