< Salomos Ordsprog 22 >
1 Et godt navn er mere verdt enn stor rikdom; å være godt likt er bedre enn sølv og gull.
౧గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు, వెండి బంగారాలకంటే దయ మరింత అభిలషించ దగినవి.
2 Rik og fattig møtes; Herren har skapt dem begge.
౨ఐశ్వర్యవంతులు, దరిద్రులు వీరిద్దరినీ సృష్టించింది యెహోవాయే.
3 Den kloke ser ulykken og skjuler sig, men de uerfarne går videre og må bøte.
౩బుద్ధిమంతుడు అపాయం రావడం చూసి దాక్కుంటాడు. ఆజ్ఞానులు అనాలోచనగా పోయి బాధలు కొని తెచ్చుకుంటారు.
4 Lønn for saktmodighet og gudsfrykt er rikdom og ære og liv.
౪యెహోవా పట్ల భయభక్తులు వినయాన్ని, ఐశ్వర్యాన్ని, ఘనతను, జీవాన్ని తెస్తాయి.
5 Torner og snarer er der på den falskes vei; den som varer sitt liv, holder sig borte fra dem.
౫ముళ్ళు, ఉచ్చులు మూర్ఖుల దారిలో ఉన్నాయి. తనను కాపాడుకొనేవాడు వాటికి దూరంగా ఉంటాడు.
6 Lær den unge den vei han skal gå! Så viker han ikke fra den, selv når han blir gammel.
౬పసివాడు నడవాల్సిన మార్గమేదో వాడికి నేర్పించు. వయసు పైబడినా వాడు అందులోనుండి తొలగడు.
7 Den rike hersker over de fattige, og låntageren blir långiverens træl.
౭ఐశ్వర్యవంతుడు పేదలపై పెత్తనం చేస్తాడు. అప్పుచేసిన వాడు అప్పిచ్చిన వాడికి బానిస.
8 Den som sår urett, skal høste ondt, og med hans vredes ris skal det være forbi.
౮దుర్మార్గాన్ని విత్తనంగా చల్లేవాడు కీడు అనే పంట కోసుకుంటాడు. వాడి క్రోధమనే కర్ర నిరర్థకమై పోతుంది.
9 Den som har et godt hjerte, blir velsignet fordi han gav den fattige av sitt brød.
౯ఉదార గుణం గలవాడికి దీవెన. ఎందుకంటే అతడు తన ఆహారంలో కొంత పేదవాడికి ఇస్తాడు.
10 Jag spotteren bort! Så går tretten med, og kiv og skam hører op.
౧౦తిరస్కారబుద్ధి గలవాణ్ణి వెళ్ళగొట్టు. కలహాలు, పోరాటాలు, అవమానాలు వాటంతట అవే సద్దు మణుగుతాయి.
11 Den som elsker hjertets renhet, og hvis tale er tekkelig, han har kongen til venn.
౧౧శుద్ధ హృదయాన్ని ప్రేమిస్తూ ఇంపైన మాటలు పలికే వాడికి రాజు స్నేహితుడౌతాడు.
12 Herrens øine verner den forstandige, men han gjør den troløses ord til intet.
౧౨జ్ఞానం గలవాడిపై యెహోవా చూపు నిలుపుకుని అతణ్ణి కాపాడతాడు. విశ్వాస ఘాతకుల మాటలు ఆయన కొట్టి పారేస్తాడు.
13 Den late sier: Det er en løve der ute, jeg kunde bli drept midt på gaten.
౧౩సోమరి “బయట సింహం ఉంది, బయటికి వెళ్తే చచ్చిపోతాను” అంటాడు.
14 Fremmed kvinnes munn er en dyp grav; den Herren er vred på, faller i den.
౧౪వేశ్య నోరు లోతైన గొయ్యి. యెహోవా శాపాన్ని మూటగట్టుకున్నవాడు దానిలో పడతాడు.
15 Dårskap er bundet fast til den unges hjerte; tuktens ris driver den bort.
౧౫పిల్లవాడి హృదయంలో మూఢత్వం సహజంగానే ఉంటుంది. బెత్తంతో విధించే శిక్ష దాన్ని వాడిలోనుండి తోలివేస్తుంది.
16 Å undertrykke den fattige tjener bare til å øke hans gods; å gi til den rike volder ham bare tap.
౧౬తన ఆస్తిపాస్తులు పెంచుకోవాలని పేదలను పీడించే వారికి, ధనవంతులకే ఇచ్చే వాడికి నష్టమే కలుగుతుంది.
17 Bøi ditt øre til og hør på vismenns ord og vend ditt hjerte til min kunnskap!
౧౭శ్రద్ధగా జ్ఞానుల ఉపదేశం ఆలకించు. నేనిచ్చే తెలివిని పొందడానికి మనసు లగ్నం చెయ్యి.
18 For det er godt at du bevarer dem i ditt indre, og at de alle henger fast ved dine leber.
౧౮నీ అంతరంగంలో వాటిని నిలుపుకోవడం, అవన్నీ నీ పెదవులపై ఉండడం ఎంతో రమ్యం.
19 Forat du skal sette din lit til Herren, lærer jeg dig idag, nettop dig.
౧౯నీవు యెహోవాను ఆశ్రయించేలా నీకు, అవును, నీకే గదా నేను ఈ రోజున వీటిని ఉపదేశించాను?
20 Har jeg ikke skrevet for dig kjernesprog med råd og kunnskap
౨౦వివేకం, విచక్షణ గల శ్రేష్ఠమైన సూక్తులు నేను నీకోసం రాయలేదా?
21 for å kunngjøre dig det som rett er, sannhets ord, så du kan svare dem som sender dig, med sanne ord?
౨౧నిన్ను పంపేవారికి నీవు యథార్థంగా జవాబులిచ్చేలా, నమ్మదగిన సత్యవాక్కులు నీకు నేర్పించ లేదా?
22 Røv ikke fra en fattig, fordi han er fattig, og tred ikke armingen ned i byporten!
౨౨పేదవాడు గదా అని పేదవాణ్ణి దోచుకోవద్దు. పట్టణ ద్వారాల దగ్గర నిస్సహాయులను నలగ గొట్టవద్దు.
23 For Herren skal føre deres sak, og han skal ta deres liv som tar noget fra dem.
౨౩యెహోవా వారి పక్షంగా వాదిస్తాడు. వారిని దోచుకొనేవారి ప్రాణాలు ఆయన దోచుకుంటాడు.
24 Hold dig ikke til venns med en som er snar til vrede, og gi dig ikke i lag med en hastig mann,
౨౪కోపం అదుపులో ఉంచుకోలేని వాడితో స్నేహం చెయ్య వద్దు. క్రోధంతో రంకెలు వేసే వాడి దగ్గరికి వెళ్ల వద్దు.
25 forat du ikke skal lære dig til å gå på hans veier og få satt en snare for ditt liv!
౨౫నువ్వు కూడా వాడి ధోరణి నేర్చుకుని నీ ప్రాణానికి ఉరి తెచ్చుకుంటావేమో జాగ్రత్త.
26 Vær ikke blandt dem som gir håndslag, dem som borger for gjeld!
౨౬అప్పులకు హామీ ఉండకు. ఇతరుల బాకీలకు పూచీ తీసుకోకు.
27 Når du intet har å betale med, hvorfor skal de da ta din seng bort under dig?
౨౭ఆ అప్పు తీర్చడానికి నీ దగ్గర ఏమీ లేకపోతే వాడు నువ్వు పడుకునే పరుపు తీసుకు పోకుండా ఆపడం ఎలా?
28 Flytt ikke det gamle grenseskjell som dine fedre har satt!
౨౮నీ పూర్వీకులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు.
29 Ser du en mann som er duelig i sin gjerning - han kan komme til å tjene konger; han kommer ikke til å tjene småfolk.
౨౯తన పనిలో నిపుణతగల వాణ్ణి చూసావా? వాడు రాజుల సమక్షంలోనే నిలబడతాడు, మామూలు వాళ్ళ ఎదుట కాదు.