< 4 Mosebok 6 >
1 Og Herren talte til Moses og sa:
౧తరువాత యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు.
2 Tal til Israels barn og si til dem: Når en mann eller kvinne gjør et hellig løfte om å ville være nasireer og vie sig til Herren,
౨“ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడి ఇలా చెప్పు. ఎవరన్నా స్త్రీ గానీ పురుషుడు గానీ తనను యెహోవా కోసం ప్రత్యేకపరచుకుని నాజీరు కావడానికి మొక్కుకుంటే ఆ వ్యక్తి ద్రాక్షారసాన్ని గానీ మత్తు కలిగించే పానీయాలు గానీ తీసుకోకూడదు. పులిసిన ద్రాక్షారసం గానీ మద్యాన్ని గానీ తీసుకోకూడదు.
3 så skal han holde sig fra vin og sterk drikk; eddik av vin eller annen sterk eddik skal han ikke drikke og heller ikke nogen saft som er tillaget av druer; hverken friske eller tørre druer skal han ete.
౩ఎలాంటి ద్రాక్షారసాన్నీ తాగకూడదు. ద్రాక్షాపళ్ళు పండినవైనా, ఎండినవైనా తినకూడదు.
4 Så lenge hans innvielse varer, skal han ikke ete noget av det som tillages av vintreet, like fra kjerne til skall.
౪నా కోసం అతడు ప్రత్యేకంగా ఉన్న రోజుల్లో ద్రాక్ష తీగల నుండి తీసిన దేనినీ తినకూడదు. అవి పచ్చి కాయలైనా, పైన ఉండే తోలు అయినా తినకూడదు.
5 Så lenge hans innvielses-løfte gjelder, skal der ikke gå rakekniv over hans hode; inntil hans innvielses-tid er til ende, skal han være hellig, han skal la sitt hodehår vokse fritt.
౫అతడు ప్రత్యేకంగా ఉండాలని మొక్కుకున్న రోజుల్లో మంగలి కత్తి అతడి తలని తాకకూడదు. యెహోవాకు ప్రత్యేకంగా ఉండాలని మొక్కుకున్న రోజులు పూర్తయే వరకూ జుట్టు పెరగనియ్యాలి. దేవుని కోసం అతడు ప్రత్యేకంగా ఉండాలి. తలపై జుట్టు పొడుగ్గా పెరగనియ్యాలి.
6 Så lenge han er innvidd til Herren, skal han ikke komme nær noget lik.
౬అతడు తనను యెహోవాకు ప్రత్యేకించుకున్న రోజుల్లో మృతదేహాన్ని సమీపించకూడదు.
7 Ikke engang om hans far eller mor eller bror eller søster dør, må han føre urenhet over sig for deres skyld; for han bærer på sitt hode tegnet på innvielsen til sin Gud.
౭తన తండ్రి, తల్లి, సోదరుడు, సోదరి, వీరిలో ఎవరు మరణించినా అతడు వారిని తాకి తనను అపవిత్రం చేసుకోకూడదు.
8 Hele sin innvielses-tid er han hellig for Herren.
౮అతడు ప్రత్యేకంగా ఉన్న రోజుల్లో పవిత్రంగా ఉంటాడు. యెహోవా కోసం ప్రత్యేకంగా ఉంటాడు.
9 Men dør der nogen hos ham uventet og brått og fører urenhet over hans innvidde hode, da skal han rake sitt hode den dag han blir ren; den syvende dag skal han rake det.
౯ఎవరైనా అతని పక్కనే అకస్మాత్తుగా పడి చనిపోతే, దానివల్ల ప్రత్యేకంగా ఉండే వ్యక్తి అపవిత్రుడైతే అతడు తాను పవిత్రం అయ్యాక అంటే ఏడు రోజుల తరువాత తన తల జుట్టుని కత్తిరించుకోవాలి. అంటే ఏడో రోజున కత్తిరించుకోవాలన్నమాట.
10 Og på den åttende dag skal han komme til presten med to turtelduer eller to dueunger, til inngangen til sammenkomstens telt.
౧౦ఎనిమిదో రోజున అతడు రెండు గువ్వలను గానీ లేదా రెండు పావురం పిల్లలను గానీ పట్టుకుని వాటిని సన్నిధి గుడారం ద్వారం దగ్గర ఉన్న యాజకుడి దగ్గరికి తీసుకురావాలి.
11 Og presten skal ofre den ene til syndoffer og den andre til brennoffer og gjøre soning for ham og rense ham for den synd han har ført over sig ved å komme nær liket. Så skal han samme dag hellige sitt hode,
౧౧అప్పుడు యాజకుడు ఒకదాన్ని పాపం కోసం చేసే బలిగా. రెండో దాన్ని దహనబలిగా అర్పించాలి. ఆ వ్యక్తి మృతదేహాన్ని తాకి పాపం చేసాడు కాబట్టి ఇవి అతని కోసం పరిహారం అవుతాయి. ఆ రోజునే అతడు తనను తను పవిత్రం చేసుకోవాలి.
12 og på ny vie sig til Herren for like sa lang tid som han først hadde lovt, og føre frem et årsgammelt lam til skyldoffer; den første tid gjelder ikke mere, fordi hans innvielse blev utskjemt.
౧౨తరువాత అతడు తిరిగి నాజీరుగా ఉండే కాలాన్ని ప్రతిష్టించాలి. అతడు అపరాధ బలిగా ఒక ఏడాది వయసున్న మగ గొర్రె పిల్లని తీసుకురావాలి. అతడు అపవిత్రుడు కాకముందు మొక్కుకున్న రోజులు లెక్కలోకి రాకూడదు. ఎందుకంటే అతడు యెహోవా కోసం ప్రత్యేకంగా ఉండి అపవిత్రం అయ్యాడు.
13 Dette er loven for nasireeren: Den dag hans innvielses-tid er til ende, skal han føres frem til inngangen til sammenkomstens telt,
౧౩నాజీరుగా ఉండటానికి మొక్కుకుని ఆ నాజీరుగా ఉండే సమయం ముగిసిన తరువాత అతడు చేయాల్సిన దాని గురించిన చట్టం ఇది. అతణ్ణి సన్నిధి గుడారం ద్వారం దగ్గరకి తీసుకురావాలి.
14 og han skal bære frem for Herren sitt offer, et årsgammelt værlam uten lyte til brennoffer og et årsgammelt hunlam uten lyte til syndoffer og en vær uten lyte til takkoffer
౧౪అతడు తన అర్పణ యెహోవాకు అర్పించాలి. ఒక ఏడాది వయసున్న లోపరహితమైన ఒక మగ గొర్రెపిల్లని దహనబలిగా అర్పించాలి. అలాగే ఒక ఏడాది వయసున్న లోపరహితమైన ఆడ గొర్రెపిల్లను పాపం కోసం చేసే అర్పణగా తీసుకురావాలి. అతడింకా లోపరహితమైన ఒక పొట్టేలును శాంతి బలిగా తీసుకురావాలి.
15 og en kurv med usyrede kaker av fint mel, kaker med olje i, og usyrede brødleiver smurt med olje, og matofferet og drikkofferne som hører til.
౧౫అలాగే అతడు తన నైవేద్య అర్పణ, పానార్పణలతో పాటు పొంగజేసే పదార్ధం లేకుండా చేసిన గంపెడు రొట్టెలూ, సన్నని గోదుమ పిండితో నూనె రాసి చేసిన వంటకాలూ, పొంగజేసే పదార్ధం లేకుండా నూనె రాసి చేసిన అప్పడాలూ యెహోవా దగ్గరకి తీసుకురావాలి.
16 Og presten skal bære det frem for Herrens åsyn og ofre hans syndoffer og hans brennoffer.
౧౬అప్పుడు యాజకుడు యెహోవా సమక్షంలోకి వాటిని తెచ్చి అతడి కోసం దహనబలినీ, పాపం కోసం చేసే బలినీ అర్పించాలి.
17 Og væren skal han ofre som takkoffer til Herren sammen med kurven med de usyrede kaker, og så skal presten ofre hans matoffer og hans drikkoffer.
౧౭పొంగజేసే పదార్ధం లేకుండా చేసిన రొట్టెల గంపతో పాటు ఆ పొట్టేలును యెహోవాకు శాంతి బలిగా అర్పించాలి. అతని నైవేద్యాన్ని పానార్పణతో కలిపి అర్పించాలి.
18 Derefter skal nasireeren rake sitt innvidde hode ved inngangen til sammenkomstens telt, og han skal ta sitt innvidde hodehår og legge det på ilden som er under takkofferet.
౧౮అప్పుడా నాజీరు సన్నిధి గుడారం ద్వారం దగ్గర తన ప్రత్యేకతను సూచించే తల జుట్టు కత్తిరించుకోవాలి. ఆ జుట్టును శాంతిబలి అర్పణ సామగ్రి కింద ఉన్న మంటలో పడవేయాలి.
19 Og presten skal ta en bog av væren, efterat den er kokt, og en usyret kake av kurven og en usyret brødleiv og legge dem i hendene på nasireeren, efterat han har raket av sitt innvielsestegn.
౧౯అప్పుడు యాజకుడు ఉడికిన పొట్టేలు జబ్బనీ గంపలోనుండి పొంగని పదార్ధంతో చేసిన ఒక రొట్టెనూ పొంగని పదార్ధంతో చేసిన ఒక అప్పడాన్నీ తీసుకోవాలి. యాజకుడు వాటిని ప్రత్యేకతను సూచించే తన తల వెండ్రుకలు కత్తిరించుకున్న నాజీరు చేతుల్లో ఉంచాలి.
20 Så skal presten svinge dem for Herrens åsyn; det er helliget presten foruten svinge-brystet og løfte-låret. Siden kan nasireeren drikke vin.
౨౦తరువాత యాజకుడు యెహోవా సమక్షంలో పైకెత్తి కదిల్చే అర్పణ గా వాటిని కదిలించాలి. వాటిని యెహోవాకు అర్పించాలి. అది పవిత్ర ఆహారం. పైకెత్తి కదిలించిన రొమ్ము భాగం, తొడ భాగంతో కలిపి ఇది యాజకునికి చెందుతుంది. దాని తరువాత ఆ నాజీరు ద్రాక్షారసం తాగవచ్చు.
21 Dette er loven for den som gjør et nasireer-løfte, dette er det han skal ofre til Herren på grunn av sin innvielse, foruten det han ellers har råd til; han skal holde sig efter det løfte han har gjort, foruten det loven om hans innvielse krever.
౨౧మొక్కుకున్న నాజీరును గురించిన ఉపదేశం ఇది. తనను యెహోవా కోసం ప్రత్యేకించుకోడానికి అతడు అర్పించాల్సిన వాటిని గురించిన ఉపదేశం ఇది. తాను నాజీరు కావడానికి మొక్కుకున్న దంతా అతడు నెరవేర్చాలి.”
22 Og Herren talte til Moses og sa:
౨౨యెహోవా మళ్ళీ మోషేతో మాట్లాడాడు.
23 Tal til Aron og hans sønner og si: Således skal I si når I velsigner Israels barn:
౨౩“అహరోనుకూ అతని కొడుకులకూ ఇలా చెప్పు. మీరు ఇశ్రాయేలు ప్రజలను ఈ విధంగా దీవించాలి. మీరు వారితో ఇలా చెప్పాలి.
24 Herren velsigne dig og bevare dig!
౨౪యెహోవా మిమ్మల్ని దీవించి సంరక్షిస్తాడు గాక!
25 Herren la sitt åsyn lyse over dig og være dig nådig!
౨౫యెహోవా మీపై తన వెలుగు ప్రకాశింప చేస్తాడు గాక! మిమ్మల్ని కరుణిస్తాడు గాక!
26 Herren løfte sitt åsyn på dig og gi dig fred!
౨౬యెహోవా మిమ్మల్ని కన్నులారా చూసి మీకు శాంతి ప్రసాదించు గాక!
27 Således skal de legge mitt navn på Israels barn, og jeg vil velsigne dem.
౨౭ఈ విధంగా వారు ఇశ్రాయేలు ప్రజలకి నా నామాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి. నేను అప్పుడు వారిని దీవిస్తాను.”