< Josvas 3 >
1 Morgenen efter stod Josva tidlig op og tok ut fra Sittim med alle Israels barn og kom til Jordan; der blev de en tid før de gikk over.
౧యెహోషువ వేకువనే లేచి అతడూ ఇశ్రాయేలీయులంతా షిత్తీము నుండి బయలుదేరి యొర్దానుకు వచ్చి దాన్ని దాటే ముందు అక్కడ బస చేశారు.
2 Og da tre dager var til ende, gikk tilsynsmennene gjennem leiren,
౨మూడు రోజుల తరువాత నాయకులు శిబిరంలో తిరుగుతూ ప్రజలకు ఇలా ఆజ్ఞాపించారు,
3 og de bød folket og sa: Når I ser Herrens, eders Guds pakts-ark og de levittiske prester i ferd med å bære den, så skal I bryte op fra eders sted og følge efter den
౩“మీరు మీ యెహోవా దేవుని నిబంధన మందసాన్ని యాజకులుగా ఉన్న లేవీయులు మోసుకుని వెళ్తున్నప్పుడు మీరున్న స్థలం లో నుండి బయలుదేరి దాని వెంటే వెళ్ళాలి.
4 - dog skal det være en avstand mellem eder og den, omkring to tusen alen; I må ikke komme den for nær - så I kan vite hvad vei I skal gå; for I har ikke draget den vei før.
౪మీకూ దానికీ దాదాపు రెండువేల మూరల దూరం ఉండాలి. ఆ మందసానికి సమీపంగా మీరు నడవకూడదు. ఎందుకంటే మీరు వెళ్ళే దారి మీరింతకు ముందు వెళ్ళింది కాదు, మీరు ఆ దారి గుర్తుపట్టాలి.”
5 Da sa Josva til folket: Hellige eder! For imorgen vil Herren gjøre underfulle ting iblandt eder.
౫యెహోషువ ప్రజలతో “రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యాలు చేయబోతున్నాడు కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి” అన్నాడు.
6 Og til prestene sa Josva: Ta paktens ark og gå frem foran folket! Og de tok paktens ark og gikk frem foran folket.
౬అతడు యాజకులతో “మీరు నిబంధన మందసాన్ని ఎత్తుకుని ప్రజల ముందు నడవండి” అని చెప్పాడు. వారు నిబంధన మందసాన్ని ఎత్తుకుని ప్రజల ముందు నడిచారు.
7 Og Herren sa til Josva: På denne dag vil jeg begynne å gjøre dig stor for hele Israels øine, forat de skal vite at likesom jeg var med Moses, vil jeg og være med dig.
౭అప్పుడు యెహోవా యెహోషువతో ఇలా చెప్పాడు. “నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకూ తోడై ఉంటానని ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొనేలా ఈ రోజు వారి కళ్ళ ముందు నిన్ను గొప్ప వాడిగా చేస్తాను.
8 Og du skal byde prestene som bærer paktens ark, og si: Når I kommer til randen av Jordans vann, så skal I bli stående der ved Jordan.
౮మీరు యొర్దాను నది దగ్గరికి వచ్చి యొర్దాను నీళ్ళలో నిలబడండని నిబంధన మందసాన్ని మోసే యాజకులకు ఆజ్ఞాపించు.”
9 Og Josva sa til Israels barn: Kom hit og hør Herrens, eders Guds ord!
౯కాబట్టి యెహోషువ “మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినండి” అని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి,
10 Og Josva sa: På dette skal I kjenne at den levende Gud er midt iblandt eder og visselig skal drive bort for eder kana'anittene og hetittene og hevittene og ferisittene og girgasittene og amorittene og jebusittene.
౧౦వారితో ఇలా చెప్పాడు. “సర్వలోక నాధుని నిబంధన మందసం మీకు ముందుగా యొర్దానుని దాటబోతుంది కాబట్టి
11 Se, han som er all jordens Herre, hans pakts-ark går foran eder ut i Jordan.
౧౧జీవం గల దేవుడు మీ మధ్య ఉన్నాడనీ, ఆయన కచ్చితంగా మీ దగ్గరనుండి కనానీయులనూ హిత్తీయులనూ హివ్వీయులనూ పెరిజ్జీయులనూ గిర్గాషీయులనూ అమోరీయులనూ యెబూసీయులనూ వెళ్ళగొడతాడని దీని వల్ల మీరు తెలుసుకుంటారు.
12 Så velg nu ut tolv menn av Israels stammer, én mann for hver stamme!
౧౨కాబట్టి గోత్రానికి ఒక మనిషి చొప్పున ఇశ్రాయేలీయుల గోత్రాల్లో నుండి పన్నెండుమంది మనుషులను ఏర్పరచుకోండి.
13 Og så snart prestene som bærer Herrens, all jordens Herres ark, står stille med sine føtter i Jordans vann, da skal Jordans vann - det vann som kommer ovenfra - demmes op, så det står som en vegg.
౧౩సర్వలోకనాధుడైన యెహోవా నిబంధన మందసాన్ని మోసే యాజకుల అరికాళ్లు యొర్దాను నీళ్లను తాకగానే యొర్దాను నీళ్లు, అంటే పై నుండి పారే నీళ్లు ఆగి ఏకరాశిగా నిలిచిపోతాయి.”
14 Da nu folket brøt op fra sine telt for å gå over Jordan, og prestene bar paktens ark foran folket,
౧౪కోతకాలమంతా యొర్దాను దాని గట్లన్నిటి మీదా పొర్లి పారుతుంది. నిబంధన మందసాన్ని మోసే యాజకులు ప్రజలకు ముందు వెళ్లగా యొర్దాను దాటడానికి ప్రజలు తమ గుడారాల్లో నుండి బయలుదేరారు.
15 og de som bar arken, kom til Jordan, og de prester som bar arken, rørte med sine føtter ved den ytterste rand av vannet - men Jordan gikk over alle sine bredder hele høsttiden igjennem -
౧౫అప్పుడు ఆ మందసాన్ని మోసే యాజకులు యొర్దానులో దిగిన తరువాత వారి కాళ్లు నీటి అంచున మునగగానే
16 da stanset det vann som kom ovenfra, og stod som en vegg langt borte, ved byen Adam, som ligger tett ved Sartan, og det vann som rant ned til ødemarkens hav - Salthavet - løp helt bort, og folket gikk over midt imot Jeriko.
౧౬పై నుండి పారే నీళ్లు చాలా దూరంగా సారెతాను దగ్గర ఉన్న ఆదాము అనే పట్టణం దగ్గర ఏకరాశిగా నిలిచిపోయాయి. ఉప్పు సముద్రం అనే అరాబా సముద్రానికి ప్రవహించే నీళ్ళు పూర్తిగా ఆగిపోయాయి. ప్రజలు యెరికో దగ్గర ఆవలి తీరం చేరారు.
17 Men prestene som bar Herrens pakts-ark, stod på tørr grunn midt i Jordan uten å røre sig; og hele Israel gikk tørrskodd over, inntil hele folket var kommet vel over Jordan.
౧౭ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేల మీద యొర్దాను దాటడం అయ్యే వరకూ యెహోవా నిబంధన మందసాన్ని మోసే యాజకులు యొర్దాను నది మధ్యలో ఆరిన నేల మీద నిలబడ్డారు.