< Esaias 36 >
1 I kong Esekias' fjortende år drog kongen i Assyria Sankerib op imot alle Judas faste byer og inntok dem.
౧హిజ్కియా రాజు పరిపాలన 14 వ సంవత్సరంలో అష్షూరురాజు సన్హెరీబు యూదా దేశంలో సరిహద్దు గోడలు ఉన్న పట్టణాలన్నిటిపై దండెత్తి వాటిని ఆక్రమించాడు.
2 ongen i Assyria sendte Rabsake med en stor hær fra Lakis til Jerusalem mot kong Esekias; han stanset ved vannledningen fra den øvre dam, ved allfarveien til Vaskervollen.
౨తరువాత అతడు రబ్షాకేను లాకీషు పట్టణం నుండి యెరూషలేములో ఉన్న హిజ్కియా రాజు పైకి పెద్ద సైన్యాన్ని ఇచ్చి పంపాడు. అతడు చాకిరేవు దారిలో ఉన్న మెరక కొలను కాలవ దగ్గరికి వచ్చాడు.
3 Da gikk slottshøvdingen Eljakim, Hilkias' sønn, ut til ham sammen med statsskriveren Sebna og historieskriveren Joah, Asafs sønn.
౩అప్పుడు హిల్కీయా కొడుకు, రాజు గృహనిర్వాహకుడు ఎల్యాకీము, శాస్త్రి షెబ్నా, రాజ్యం దస్తావేజుల అధికారి, ఆసాపు కొడుకు యోవాహు వారి దగ్గరికి వెళ్ళారు.
4 Og Rabsake sa til dem: Si til Esekias: Så sier den store konge, kongen i Assyria: Hvad er det for en trygghet som er kommet over dig?
౪అప్పుడు రబ్షాకే వారితో ఇలా అన్నాడు. “హిజ్కియాతో ఈ మాట చెప్పండి, మహారాజైన అష్షూరురాజు నన్నిలా చెప్పమన్నాడు, దేనిపైన నువ్వు నమ్మకం పెట్టుకున్నావు?
5 Jeg sier: Bare tomme ord er det du sier: Her er innsikt og styrke nok til krig. Til hvem setter du da din lit, siden du har gjort oprør mot mig?
౫యుద్ధం విషయంలో నీ ఆలోచన, నీ బలం వ్యర్ధం. ఎవరి భరోసాతో నా మీద తిరగబడుతున్నావు?
6 Vel, du setter din lit til Egypten, denne knekkede rørstav, som når en støtter sig på den, går inn i hans hånd og gjennemborer den; således er kongen i Egypten Farao for alle dem som setter sin lit til ham.
౬నలిగిపోయిన గడ్డిపరక లాంటి ఐగుప్తుపై ఆధారపడుతున్నావు గదా! ఎవరైనా దాని మీద ఆనుకుంటే అది అతని చేతికి గుచ్చుకుంటుంది. ఐగుప్తు రాజు ఫరో కూడా అలాంటివాడే.
7 Men sier du til mig: Vi setter vår lit til Herren vår Gud - er det da ikke hans offerhauger og altere Esekias har tatt bort, da han sa til Juda og Jerusalem: For dette alter skal I tilbede?
౭మా దేవుడైన యెహోవాను నమ్ముకుంటున్నాం అని అంటారా? ఆ యెహోవా ఉన్నత స్థలాలను, బలిపీఠాలనే కదా హిజ్కియా పడగొట్టి యెరూషలేములో ఉన్న ఈ బలిపీఠం దగ్గర మాత్రమే మీరు పూజలు చేయాలి అని యూదావారికి, యెరూషలేము వారికి ఆజ్ఞ ఇచ్చింది?
8 Men gjør nu et veddemål med min herre, kongen i Assyria: Jeg vil gi dig to tusen hester om du kan få dig folk til å ride på dem.
౮కాబట్టి నా యజమాని అయిన అష్షూరు రాజుతో పందెం వెయ్యి. రెండు వేల గుర్రాలకు సరిపడిన రౌతులు నీ దగ్గర ఉంటే చెప్పు, నేను వాటిని నీకిస్తాను.
9 Hvorledes skulde du da kunne drive tilbake en eneste stattholder, en av min herres ringeste tjenere? Derfor setter du din lit til Egypten og håper å få vogner og hestfolk derfra.
౯నా యజమాని సేవకుల్లో తక్కువ వాడైన ఒక్క అధిపతిని నువ్వు ఎదిరించగలవా? రథాలను, రౌతులను పంపుతాడని ఐగుప్తురాజు మీద ఆశ పెట్టుకున్నావా?
10 Mener du da at jeg har draget op mot dette land for å ødelegge det, uten at Herren har villet det? Nei, Herren har selv sagt til mig: Dra op mot dette land og ødelegg det!
౧౦అయినా యెహోవా అనుమతి లేకుండానే ఈ దేశాన్ని నాశనం చేయడానికి నేను వచ్చాననుకున్నావా? లేదు, ఈ దేశం పైకి దండెత్తి దీన్ని నాశనం చేయమని యెహోవాయే నాకు ఆజ్ఞాపించాడు.”
11 Da sa Eljakim og Sebna og Joah til Rabsake: Tal til dine tjenere på syrisk, for vi forstår det sprog, og tal ikke til oss på jødisk, så folket som står på muren, hører det!
౧౧అప్పుడు ఎల్యాకీము, షెబ్నా, యోవాహులు రబ్షాకేతో “మేము నీ దాసులం. మాకు సిరియా భాష తెలుసు కాబట్టి దయచేసి ఆ భాషలో మాట్లాడు. ప్రాకారం మీద ఉన్న ప్రజలకు అర్థమయ్యేలా యూదుల భాషలో మాట్లాడవద్దు” అని అన్నారు.
12 Men Rabsake svarte: Er det til din herre og til dig min herre har sendt mig for å tale disse ord? Er det ikke til de menn som sitter på muren og må ete sitt eget skarn og drikke sitt eget vann likesom I selv?
౧౨అయితే రబ్షాకే “ఈ మాటలు చెప్పడానికేనా, నా యజమాని నన్ను నీ యజమాని దగ్గరకీ నీ దగ్గరకీ పంపింది? నీతో కలిసి తమ స్వంత మలాన్ని తిని, తమ మూత్రాన్ని తాగబోతున్న ప్రాకారం మీద ఉన్న వారి దగ్గరకి కూడా పంపాడు కదా” అన్నాడు.
13 Og Rabsake trådte frem og ropte med høi røst på jødisk og sa: Hør den store konges, den assyriske konges ord!
౧౩యూదుల భాషతో అతడు బిగ్గరగా ఇలా అన్నాడు. “మహారాజైన అష్షూరు రాజు చెబుతున్న మాటలు వినండి.
14 Så sier kongen: La ikke Esekias få narret eder! For han makter ikke å redde eder.
౧౪హిజ్కియా చేతిలో మోసపోకండి. మిమ్మల్ని విడిపించడానికి అతని శక్తి సరిపోదు.
15 Og la ikke Esekias få eder til å sette eders lit til Herren, idet han sier: Herren vil redde oss, denne by skal ikke gis i kongen av Assyrias hånd.
౧౫‘యెహోవా మనలను విడిపిస్తాడు, ఈ పట్టణం అష్షూరు రాజు చేతిలో చిక్కదు’ అని చెబుతూ హిజ్కియా మిమ్మల్ని నమ్మిస్తున్నాడు.
16 Hør ikke på Esekias! For så sier kongen i Assyria: Gjør fred med mig og kom ut til mig, så skal I få ete hver av sitt vintre og av sitt fikentre og drikke hver av vannet i sin brønn,
౧౬హిజ్కియా చెప్పిన ఆ మాట మీరు అంగీకరించవద్దు. అష్షూరు రాజు చెబుతున్నదేమిటంటే, మీరు బయటికి వచ్చి, నాతో సంధి చేసుకోండి. అప్పుడు మీలో ప్రతి ఒక్కరూ తన ద్రాక్ష, అంజూరు చెట్ల పండ్లు తింటూ తన బావిలో నీళ్లు తాగుతూ ఉంటారు.
17 til jeg kommer og henter eder til et land som ligner eders land, et land med korn og most, et land med brød og vingårder.
౧౭ఆ తరవాత నేను వచ్చి మీ దేశంలాంటి దేశానికి, అంటే గోదుమలు, ద్రాక్షరసం దొరికే దేశానికి, ఆహారం, ద్రాక్షచెట్లు ఉన్న దేశానికి మిమ్మల్ని తీసుకుపోతాను. యెహోవా మిమ్మల్ని విడిపిస్తాడని చెప్పి హిజ్కియా మిమ్మల్ని మోసం చేస్తున్నాడు.
18 La ikke Esekias forføre eder og si: Herren vil redde oss! Har vel nogen av folkenes guder reddet sitt land av kongen i Assyrias hånd?
౧౮వివిధ ప్రజల దేవుళ్ళలో ఎవరైనా తన దేశాన్ని అష్షూరు రాజు చేతిలో నుండి విడిపించాడా? హమాతు దేవుళ్ళేమయ్యారు?
19 Hvor er Hamats og Arpads guder? Hvor er Sefarva'ims guder? Har vel Samarias guder reddet det av min hånd?
౧౯అర్పాదు దేవుళ్ళేమయ్యారు? సెపర్వయీము దేవుళ్ళేమయ్యారు? షోమ్రోను దేశపు దేవుడు నా చేతిలో నుండి షోమ్రోనును విడిపించాడా?
20 Hvem er det blandt alle disse lands guder som har reddet sitt land av min hånd, så Herren skulde redde Jerusalem av min hånd?
౨౦ఈ దేవుళ్ళలో ఎవరైనా తన దేశాన్ని నా చేతిలో నుండి విడిపించి ఉంటేనే కదా యెహోవా యెరూషలేమును విడిపిస్తాడు అనుకోడానికి?” అన్నాడు.
21 Men de tidde og svarte ham ikke et ord; for kongens bud lød så: I skal ikke svare ham.
౨౧అయితే అతనికి జవాబు చెప్పవద్దని రాజు ఆజ్ఞాపించడం వలన వారు బదులు పలకలేదు.
22 Så kom slottshøvdingen Eljakim, Hilkias' sønn, og statsskriveren Sebna og historieskriveren Joah, Asafs sønn, til Esekias med sønderrevne klær og meldte ham hvad Rabsake hadde sagt.
౨౨రాజ గృహనిర్వాహకుడు, హిల్కీయా కొడుకు అయిన ఎల్యాకీము, శాస్త్రి షెబ్నా, రాజ్యందస్తావేజుల మీద అధికారి, ఆసాపు కొడుకు యోవాహు తమ బట్టలు చింపుకుని హిజ్కియా దగ్గరికి వచ్చి రబ్షాకే పలికిన మాటలన్నిటినీ తెలియజేశారు.