< 1 Mosebok 43 >
1 Men hungersnøden var hård i landet.
౧కనాను దేశంలో కరువు తీవ్రంగా ఉంది.
2 Og da de hadde brukt op det korn de hadde hentet fra Egypten, sa deres far til dem: Dra atter avsted og kjøp oss litt korn!
౨వారు ఐగుప్తునుండి తెచ్చిన ధాన్యం తినివేసిన తరువాత వారి తండ్రి “మీరు మళ్ళీ వెళ్ళి మన కోసం కొంచెం ఆహారం కొనండి” అని వారితో అన్నాడు.
3 Men Juda sa til ham: Mannen sa så alvorlig til oss: I skal ikke komme for mine øine uten eders bror er med.
౩యూదా “అతడు మీ తమ్ముడు మీతో ఉంటేనే గాని మీరు నా ముఖం చూడకూడదు, అని మాతో గట్టిగా చెప్పాడు.
4 Dersom du vil sende vår bror med oss, vil vi dra ned og kjøpe korn til dig.
౪కాబట్టి నువ్వు మా తమ్ముణ్ణి మాతో పంపితే మేము వెళ్ళి నీ కోసం ఆహారం కొంటాము.
5 Men dersom du ikke vil sende ham, vil vi ikke dra ned; for mannen sa til oss: I skal ikke komme for mine øine uten eders bror er med.
౫నువ్వు వాణ్ణి పంపకపోతే మేము వెళ్ళం. మీ తమ్ముడు మీతో లేకపోతే మీరు నా ముఖం చూడకూడదని అతడు మాతో చెప్పాడు” అన్నాడు.
6 Da sa Israel: Hvorfor har I gjort så ille mot mig og fortalt mannen at I har ennu en bror?
౬అందుకు ఇశ్రాయేలు “మీకు ఇంకొక తమ్ముడు ఉన్నాడని మీరు అతనితో చెప్పి నాకు ఇంత కీడు ఎందుకు తెచ్చిపెట్టారు?” అన్నాడు.
7 De svarte: Mannen spurte oss nøie ut både om oss og om vår ætt og sa: Lever eders far ennu? Har I nogen bror? Og vi svarte ham efter som han spurte; kunde vi vel vite at han vilde si: Kom her ned med eders bror?
౭వారు “అతడు ‘మీ తండ్రి ఇంకా బతికే ఉన్నాడా? మీకు ఇంకో తమ్ముడు ఉన్నాడా?’ అని మా గురించి, మన కుటుంబం గురించిన వివరాలు అడిగాడు. మేము ఆ ప్రశ్నలకు తగినట్టు జవాబిచ్చాము. ‘మీ తమ్ముణ్ణి తీసుకు రండి’ అని అతడు అడుగుతాడని మాకెలా తెలుస్తుంది?” అన్నారు.
8 Og Juda sa til Israel, sin far: Send gutten med mig I Så vil vi gjøre oss rede og dra avsted, så vi kan leve og ikke skal dø, både vi og du og våre små barn.
౮యూదా తన తండ్రి ఇశ్రాయేలుతో “ఆ చిన్నవాణ్ని నాతో పంపు. మేము వెళతాము. అప్పుడు మేమే కాదు, నువ్వూ మా పిల్లలూ చావకుండా బతుకుతాం.
9 Jeg skal svare for ham, av mig kan du kreve ham; dersom jeg ikke har ham med tilbake til dig og stiller ham for ditt ansikt, da vil jeg være din skyldner alle mine dager;
౯నేను అతనికి జామీను ఉంటాను. నువ్వు నన్ను బాధ్యుడుగా ఎంచవచ్చు. నేను అతణ్ణి తిరిగి నీ దగ్గరికి తీసుకువచ్చి నీముందు నిలబెట్టకపోతే నా జీవితమంతా ఆ నింద భరిస్తాను.
10 for dersom vi ikke hadde dryget så lenge, da kunde vi nu to ganger vært her igjen.
౧౦మాకు ఆలస్యం కాకపోతే ఈపాటికి రెండవ సారి వెళ్లి మళ్ళీ వచ్చి ఉండేవాళ్ళమే” అన్నాడు.
11 Da sa Israel, deres far, til dem: Skal det nu så være, så gjør som jeg sier: Ta i eders sekker av alt det ypperste landet eier, og ha det med til mannen som gave, litt balsam og litt honning, krydderier og ladanum, pistasienøtter og mandler,
౧౧వారి తండ్రి ఇశ్రాయేలు, వారితో “అలాగైతే మీరిలా చేయండి. ఈ దేశంలోని మేలైన వస్తువులను మీ సంచుల్లో వేసుకుని తీసుకెళ్ళండి. కొంచెం సుగంధ ద్రవ్యాలు, కొంచెం తేనె, మసాలా దినుసులు, బోళం, పిస్తా కాయలు, బాదం కాయలు మీ సంచుల్లో వేసుకుని అతనికి కానుకగా తీసుకెళ్లండి.
12 og ta dobbelt så mange penger med eder, for de penger som kom igjen og lå øverst i eders sekker, må I ha med tilbake; kanskje det var en feiltagelse.
౧౨రెండింతల డబ్బు తీసుకు వెళ్ళండి. మీ సంచుల మూతిలో వాళ్ళు ఉంచిన డబ్బు కూడా మళ్ళీ చేత పట్టుకుని వెళ్ళండి. బహుశా అది పొరబాటు కావచ్చు.
13 Ta så eders bror med, og gjør eder rede og dra tilbake til mannen!
౧౩మీ తమ్ముణ్ణి వెంటబెట్టుకుని అతని దగ్గరికి తిరిగి వెళ్ళండి.
14 Og den allmektige Gud la eder finne barmhjertighet hos mannen, så han lar eders andre bror og Benjamin dra hjem igjen med eder; og jeg - skal jeg være barnløs, så får jeg være barnløs!
౧౪అతడు మీ అన్ననూ బెన్యామీనును మీకు అప్పగించేలా సర్వశక్తుడైన దేవుడు, అతని ముందు మిమ్మల్ని కరుణించు గాక. నేను సంతానాన్ని పోగొట్టుకోవలసి ఉంటే పోగొట్టుకుంటాను” అని వారితో చెప్పాడు.
15 Så tok mennene denne gave, og de tok dobbelte penger med sig, og Benjamin; og de gjorde sig rede og drog ned til Egypten og trådte frem for Josef.
౧౫వాళ్ళు ఆ కానుక తీసికుని, చేతుల్లో రెండింతల డబ్బు, తమవెంట బెన్యామీనును తీసుకు ఐగుప్తుకు వెళ్ళి యోసేపు ముందు నిలబడ్డారు.
16 Da Josef så Benjamin sammen med dem, sa han til den som forestod hans hus: Før mennene inn i huset og la slakte og lage til; for mennene skal ete til middag hos mig.
౧౬యోసేపు వారితో ఉన్న బెన్యామీనును చూసి తన గృహనిర్వాహకునితో “వీరిని ఇంట్లోకి తీసికెళ్ళి ఒక జంతువును కోసి వంట సిద్ధం చేయించు. మధ్యాహ్నం వీరు నాతో భోజనం చేస్తారు” అని చెప్పాడు.
17 Og mannen gjorde som Josef sa, og førte mennene inn i Josefs hus.
౧౭యోసేపు చెప్పినట్లు అతడు చేసి వారిని యోసేపు ఇంటికి తీసికెళ్ళాడు.
18 Men mennene blev redde fordi de blev ført inn i Josefs hus, og de sa: Det er vel for de pengers skyld som forrige gang kom tilbake i våre sekker, vi føres inn her, forat han kan velte sig inn på oss og kaste sig over oss og gjøre oss til træler og ta våre asener.
౧౮తమను యోసేపు ఇంటికి తీసుకువెళ్ళినందుకు వారు భయపడి “మొదట మన సంచుల్లో తిరిగి ఇచ్చేసిన డబ్బు కోసం అతడు మన మీద దాడి చేసే అవకాశం ఉంది. మనలను బంధించి, దాసులుగా చెరపట్టి, మన గాడిదలను తీసుకోవచ్చు” అనుకున్నారు.
19 De gikk derfor til mannen som forestod Josefs hus, og talte til ham ved inngangen til huset
౧౯వారు యోసేపు గృహనిర్వాహకుని దగ్గరికి వచ్చి, ఇంటి గుమ్మం ముందు అతనితో మాట్లాడి,
20 og sa: Hør, herre! Vi kom forrige gang ned her for å kjøpe korn;
౨౦“అయ్యగారూ, మొదట మేము ఆహారం కొనడానికి మొదటిసారి వచ్చాము.
21 men da vi kom til herberget og åpnet våre sekker, se, da lå enhvers penger øverst i hans sekk, våre penger med sin fulle vekt, og nu har vi dem med oss igjen,
౨౧అయితే, మేము దిగిన చోటికి చేరి మా సంచులు విప్పితే, చూడండి, మా అందరి డబ్బు మొత్తం, ఎవరి డబ్బు వారి సంచి మూతిలో ఉంది. అదంతా పట్టుకొచ్చాము.
22 og vi har tatt andre penger ned med oss til å kjøpe korn for; vi vet ikke hvem som har lagt våre penger i våre sekker.
౨౨ఆహారం కొనడానికి వేరే డబ్బు కూడా తెచ్చాము. మా డబ్బు మా సంచుల్లో ఎవరు వేశారో మాకు తెలియదు” అని చెప్పారు.
23 Da sa han: I kan være rolige, frykt ikke! Eders Gud og eders fars Gud har gitt eder en skatt i eders sekker; eders penger har jeg fått. Så førte han Simeon ut til dem.
౨౩అందుకతడు “మీకు అంతా క్షేమమే. భయపడవద్దు. మీ తండ్రి దేవుడూ, మీ దేవుడు, మీ సంచుల్లో మీ డబ్బు పెట్టి ఉంటాడు. మీ డబ్బు నాకు అందింది” అని చెప్పి షిమ్యోనును వారి దగ్గరికి తెచ్చాడు.
24 Derefter førte mannen dem inn i Josefs hus og gav dem vann, og de tvettet sine føtter, og han gav dem fôr til deres asener.
౨౪గృహనిర్వాహకుడు వారిని యోసేపు ఇంట్లోకి తీసికు వచ్చి, వారికి నీళ్ళిస్తే, వారు కాళ్ళు కడుక్కున్నారు. అతడు వారి గాడిదలకు మేత వేయించాడు.
25 Så la de gaven til rette til Josef skulde komme hjem om middagen; for de hadde hørt at de skulde ete der.
౨౫అక్కడ తాము భోజనం చేయాలని వారు విన్నారు కాబట్టి మధ్యాహ్నం, యోసేపు వచ్చే సమయానికి తమ కానుక సిద్ధంగా ఉంచారు.
26 Og da Josef var kommet hjem, bar de inn til ham gaven som de hadde med sig, og kastet sig ned på jorden for ham.
౨౬యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతుల్లో ఉన్న కానుకను ఇంట్లోకి తెచ్చి, అతనికి నేలను వంగి, నమస్కారం చేశారు.
27 Men han spurte dem om det gikk dem vel, og han sa: Går det eders far vel, den gamle som I talte om? Lever han ennu?
౨౭అప్పుడు “మీరు చెప్పిన ముసలివాడైన మీ నాన్న క్షేమంగా ఉన్నాడా? అతడు ఇంకా బతికే ఉన్నాడా?” అని వారి క్షేమ సమాచారం అడిగినప్పుడు వారు,
28 De svarte: Ja! Det går din tjener vår far vel; han lever ennu. Og de bøide sig og kastet sig ned for ham.
౨౮“నీ దాసుడైన మా తండ్రి ఇంకా బతికే ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు” అని చెప్పి వంగి సాగిలపడ్డారు.
29 Og da han så op og fikk øie på Benjamin, sin bror, sin mors sønn, sa han: Er dette eders yngste bror, som I talte til mig om? Og han sa: Gud velsigne dig, min sønn!
౨౯అప్పుడతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడూ తన తమ్ముడు అయిన బెన్యామీనును చూసి “మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా?” అని అడిగి “బాబూ, దేవుడు నీకు దయ చూపుతాడు గాక” అన్నాడు.
30 Og Josef skyndte sig bort, for hans hjerte brente mot hans bror, og han søkte et sted hvor han kunde gråte; og han gikk inn i sitt kammer og gråt der.
౩౦అప్పుడు తన తమ్ముని మీద యోసేపుకు ప్రేమ పొర్లుకుని వచ్చింది కాబట్టి అతడు త్వరగా ఏడవడానికి చోటు వెతికి, లోపలి గదిలోకి వెళ్ళి, అక్కడ ఏడ్చాడు.
31 Så tvettet han sitt ansikt og gikk ut, og han gjorde sig sterk og sa: Sett maten frem!
౩౧అతడు తన ముఖం కడుక్కుని బయటికి వచ్చాడు. అతడు తన్ను తాను సముదాయించుకుని “భోజనం వడ్డించండి” అని చెప్పాడు.
32 Og de satte frem for ham særskilt og for dem særskilt, og for egypterne som åt hos ham, særskilt; for egypterne kan ikke ete sammen med hebreerne, det er en vederstyggelighet for egypterne.
౩౨అతనికీ వారికీ అతనితో భోజనం చేస్తున్న ఐగుప్తీయులకు వేర్వేరుగా వడ్డించారు. ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనం చేయరు. అది ఐగుప్తీయులకు అసహ్యం.
33 Og mennene fikk sine plasser midt imot ham efter alderen, den førstefødte øverst og den yngste nederst, og de så på hverandre og undret sig.
౩౩పెద్దవాడు మొదలుకుని చిన్నవాడి వరకూ వారు అతని ముందు తమ తమ వయసు ప్రకారం కూర్చున్నారు. వారంతా ఆశ్చర్యపోయారు.
34 Og han lot bære til dem av maten på sitt bord, og Benjamin fikk fem ganger så meget som enhver av de andre; og de drakk, og drakk sig glade med ham.
౩౪అతడు తన దగ్గర నుంచి వారికి పళ్ళేల్లో భోజనం వంతులెత్తి పంపాడు. బెన్యామీను వంతు వారందరి వంతులకంటే అయిదంతలు ఎక్కువగా ఉంది. వారంతా తాగి, యోసేపుతో విందారగించి ఉల్లాసంగా గడిపారు.