< 5 Mosebok 3 >
1 Så tok vi på en annen kant og drog op på veien til Basan; da drog Og, kongen i Basan, og hele hans folk ut mot oss til strid, til Edre'i.
౧మనం తిరిగి బాషాను దారిలో వెళ్తుండగా బాషాను రాజు ఓగు, అతని ప్రజలంతా ఎద్రెయీలో మనతో యుద్ధం చేయడానికి ఎదురుగా వచ్చారు.
2 Og Herren sa til mig: Frykt ikke for ham! For jeg har gitt ham og hele hans folk og hans land i din hånd, og du skal gjøre med ham som du gjorde med Sihon, amorittenes konge, som bodde i Hesbon.
౨యెహోవా నాతో ఇలా అన్నాడు. “అతనికి భయపడ వద్దు. అతన్నీ అతని ప్రజలనూ అతని దేశాన్నీ నీ చేతికి అప్పగించాను. హెష్బోనులో అమోరీయుల రాజు సీహోనుకు చేసినట్టే ఇతనికి కూడా చేయాలి.”
3 Så gav Herren vår Gud også Og, kongen i Basan, og hele hans folk i vår hånd; og vi slo ham så vi ikke lot nogen bli tilbake eller slippe unda.
౩ఆ విధంగా మన దేవుడు యెహోవా బాషాను రాజు ఓగును, అతని ప్రజలందరినీ మన చేతికి అప్పగించాడు. అతనికి ఎవ్వరూ మిగలకుండా అందరినీ హతం చేశాం.
4 Og vi inntok dengang alle hans byer; der var ikke en by uten at vi tok den fra dem, seksti byer, hele Argob-landet, Ogs rike i Basan.
౪ఆ కాలంలో అతని పట్టణాలన్నీ స్వాధీనం చేసుకున్నాం. మన స్వాధీనంలోకి రాని పట్టణం ఒక్కటీ లేదు. బాషానులో ఓగు రాజ్యం అర్గోబు ప్రాంతంలో ఉన్న 60 పట్టణాలు ఆక్రమించుకున్నాం.
5 Alle disse var faste byer med høie murer, dobbelte porter og bommer, foruten en stor mengde landsbyer.
౫ఆ పట్టణాలన్నీ గొప్ప ప్రాకారాలు, ద్వారాలు, గడియలతో ఉన్న దుర్గాలు. అవిగాక ప్రాకారాలు లేని ఇంకా చాలా పట్టణాలు స్వాధీనం చేసుకున్నాం.
6 Og vi slo dem med bann, som vi hadde gjort med Sihon, kongen i Hesbon; hver by slo vi med bann, menn, kvinner og barn.
౬మనం హెష్బోను రాజు సీహోనుకు చేసినట్టు వాటిని నిర్మూలం చేశాం. ప్రతి పట్టణంలోని స్త్రీ పురుషులనూ పిల్లలనూ నాశనం చేశాం.
7 Men alt feet og hærfanget fra byene tok vi til bytte.
౭వారి పశువులనూ ఆ పట్టణాల ఆస్తినీ దోచుకున్నాం.
8 Således tok vi dengang landet fra begge amoritterkongene på denne side av Jordan, fra Arnon-åen like til fjellet Hermon -
౮ఆ కాలంలో అర్నోను లోయ నుండి హెర్మోను కొండ వరకూ, యొర్దాను అవతల ఉన్న దేశాన్ని ఇద్దరు అమోరీయుల రాజుల దగ్గర నుండి స్వాధీనం చేసుకున్నాం.
9 sidonierne kaller Hermon Sirjon, og amorittene kaller det Senir -
౯సీదోనీయులు హెర్మోనును “షిర్యోను” అనేవారు. అమోరీయులు దాన్ని “శెనీరు” అనేవారు.
10 alle byene på sletten og hele Gilead og hele Basan like til byene Salka og Edre'i i Ogs rike i Basan;
౧౦మైదానంలోని పట్టాణాలన్నిటిని, బాషానులోని ఓగు రాజ్య పట్టణాలైన సల్కా, ఎద్రెయీ అనేవాటి వరకూ గిలాదు అంతటినీ బాషానునూ ఆక్రమించాం.
11 for Og, kongen i Basan, var den siste som var tilbake av refa'ittene; hans seng, som er av jern, står, som alle vet, i ammonitterbyen Rabba; den er ni alen lang og fire alen bred, alnen regnet efter lengden av en manns underarm.
౧౧రెఫాయీయులలో బాషాను రాజు ఓగు మాత్రం మిగిలాడు. అతనిది ఇనుప మంచం. అది అమ్మోనీయుల రబ్బాలో ఉంది గదా? దాని పొడవు తొమ్మిది మూరలు, వెడల్పు నాలుగు మూరలు.
12 Dette land inntok vi dengang: Bygdene fra Aroer, som ligger ved Arnon-åen, og halvdelen av Gileadfjellene med byene der gav jeg til rubenittene og gadittene,
౧౨అర్నోను లోయలో ఉన్న అరోయేరు పట్టణం నుండి గిలాదు కొండ ప్రాంతంలో సగమూ మనం అప్పుడు స్వాధీనం చేసుకొన్న దేశమూ దాని పట్టణాలూ రూబేనీయులకు, గాదీయులకు ఇచ్చాను.
13 og resten av Gilead og hele Basan, Ogs rike, gav jeg til den halve Manasse stamme, hele Argob-landet, hele Basan; det er det som kalles refa'ittenes land.
౧౩ఓగు రాజుకు చెందిన బాషాను అంతటినీ, గిలాదులో మిగిలిన రెఫాయీయుల దేశమని పిలిచే బాషానునూ, అర్గోబు ప్రాంతమంతా మనష్షే అర్థ గోత్రానికి ఇచ్చాను.
14 Ja'ir, Manasses sønn, inntok hele Argob-landet like til gesurittenes og ma'akatittenes landemerker, og dette land - Basan-landet - kalte han efter sitt eget navn Ja'irs byer, og så har det hett til denne dag.
౧౪మనష్షే కొడుకు యాయీరు గెషూరీయుల, మాయాకాతీయుల సరిహద్దుల వరకూ అర్గోబు ప్రాంతాన్ని పట్టుకుని, తన పేరును బట్టి వాటికి యాయీరు బాషాను గ్రామాలు అని పేరు పెట్టాడు. ఈ రోజు వరకూ వాటి పేరు అదే.
15 Og til Makir gav jeg Gilead.
౧౫మాకీరీయులకు గిలాదును ఇచ్చాను.
16 Og til rubenittene og gadittene gav jeg landet fra Gilead til Arnon-åen, til midt i åen, og landet langsmed den, og til Jabbok-åen, Ammons barns grense,
౧౬గిలాదు నుండి అర్నోను లోయ మధ్య వరకూ, యబ్బోకు నది వరకూ, అమ్మోనీయుల పడమటి సరిహద్దు వరకూ రూబేనీయులకూ గాదీయులకూ ఇచ్చాను.
17 og ødemarken og Jordan og landet langsmed den, fra Kinnerets sjø til Ødemarks-havet - Salthavet - nedenfor Pisga-liene, mot øst.
౧౭ఇవి కాక, కిన్నెరెతు నుండి తూర్పున పిస్గా కొండ వాలుల కింద, ఉప్పు సముద్రం అని పిలిచే అరాబా సముద్రం దాకా వ్యాపించిన అరాబా ప్రాంతాన్ని, యొర్దాను లోయ మధ్యభూమిని, రూబేనీయులకూ గాదీయులకూ ఇచ్చాను.
18 Dengang bød jeg eder og sa: Herren eders Gud har gitt eder dette land til eie; væbnet skal I, alle som er krigsdyktige menn, dra frem foran eders brødre, Israels barn.
౧౮అప్పుడు నేను మీతో “మీరు స్వాధీనం చేసుకోడానికి మీ దేవుడు యెహోవా ఈ దేశాన్ని మీకిచ్చాడు. మీలో యుద్ధవీరులంతా సిద్ధపడి మీ సోదరులైన ఇశ్రాయేలు ప్రజలతో కలిసి నది దాటి రావాలి.
19 Bare eders hustruer og barn og eders fe - jeg vet at I har meget fe - skal bli igjen i de byer jeg har gitt eder,
౧౯యెహోవా మీకు విశ్రాంతినిచ్చినట్టు మీ సోదరులకు కూడా విశ్రాంతినిచ్చే వరకూ నేను మీకిచ్చిన పట్టణాల్లో నివసించాలి.
20 inntil Herren gir eders brødre ro likesom eder, og de og har tatt det land i eie som Herren eders Gud gir dem på hin side Jordan; da kan I vende tilbake, hver til den eiendom jeg har gitt eder.
౨౦అంటే మీ యెహోవా దేవుడు యొర్దాను అవతల వారికి ఇస్తున్న దేశాన్ని వారు స్వాధీనం చేసుకునే వరకూ, మీ భార్యలు, మీ పిల్లలు, మీ మందలు నేను మీకిచ్చిన పట్టణాల్లో నివసించాలి. ఆ తరువాత మీరు మీ స్వాస్థ్యాలకు తిరిగి రావాలి అని మీకు ఆజ్ఞాపించాను. మీ మందలు చాలా ఎక్కువని నాకు తెలుసు” అన్నాను.
21 På samme tid bød jeg Josva og sa: Du har med egne øine sett alt det Herren eders Gud har gjort med disse to konger; således vil Herren gjøre med alle de riker du drar over til.
౨౧ఆ సమయంలో నేను యెహోషువకు ఇలా ఆజ్ఞాపించాను. “మీ యెహోవా దేవుడు ఈ ఇద్దరు రాజులకు చేసినదంతా నువ్వు కళ్ళారా చూశావు గదా. నువ్వు వెళ్తున్న రాజ్యాలన్నిటికీ యెహోవా అదే విధంగా చేస్తాడు.
22 I skal ikke være redde for dem; for Herren eders Gud vil selv stride for eder.
౨౨మీ యెహోవా దేవుడు మీ పక్షంగా యుద్ధం చేస్తాడు కాబట్టి వారికి భయపడ వద్దు.”
23 For jeg bønnfalt dengang Herren og sa:
౨౩ఆ రోజుల్లో నేను “యెహోవా, ప్రభూ, నీ మహిమనూ, నీ బాహుబలాన్నీ నీ దాసునికి చూపించడం ప్రారంభించావు.
24 Herre, Herre! Du har begynt å la din tjener se din storhet og din sterke hånd; for hvor er det en gud i himmelen og på jorden som kan gjøre sådanne gjerninger og storverk som du?
౨౪ఆకాశంలో గాని, భూమిపై గాని నువ్వు చేసే పనులు చేయగల దేవుడెవడు? నీ అంత పరాక్రమం చూపగల దేవుడెవడు?
25 La mig nu få dra over og se det gode land på hin side Jordan, dette gode fjell-land og Libanon!
౨౫నేను అవతలికి వెళ్లి యొర్దాను అవతల ఉన్న ఈ మంచి దేశాన్ని, ఆ మంచి కొండ ప్రాంతాన్ని, ఆ లెబానోనును చూసేలా అనుగ్రహించు” అని యెహోవాను బతిమాలుకున్నాను.
26 Men Herren var vred på mig for eders skyld, og han hørte ikke på mig, men han sa til mig: La det nu være nok, tal ikke mere til mig om dette!
౨౬యెహోవా మీ కారణంగా నా మీద కోపపడి నా మనవి వినలేదు. ఆయన నాతో ఇలా అన్నాడు. “చాలు. ఇంక ఈ సంగతిని గూర్చి నాతో మాట్లాడవద్దు.
27 Gå op på Pisgas topp og løft dine øine mot vest og mot nord og mot syd og mot øst, og se vidt omkring dig! For over Jordan her skal du ikke komme.
౨౭నువ్వు ఈ యొర్దాను దాటకూడదు. అయితే, పిస్గా కొండ ఎక్కి పడమటి వైపు, ఉత్తరం వైపు, దక్షిణం వైపు, తూర్పు వైపు తేరి చూడు.
28 Og gi Josva befaling og gjør ham frimodig og sterk! For han skal føre dette folk over, og han skal gi dem til arv det land du skal skue.
౨౮నీకు బదులుగా యెహోషువకు ఆజ్ఞాపించి, అతణ్ణి ప్రోత్సహించి, బలపరచు. అతడు ఈ ప్రజలను నడిపించి, నది దాటి, నువ్వు చూడబోయే దేశాన్ని వారు స్వాధీనపరచుకొనేలా చేస్తాడు.”
29 Så blev vi da i dalen midt imot Bet-Peor.
౨౯ఆ సమయంలో మనం బేత్పయోరు ఎదుట ఉన్న లోయలో ఉన్నాం.