< 1 Timoteus 5 >
1 Tal ikke hårdt til en gammel mann, men forman ham som en far, unge menn som brødre,
౧వయసులో పెద్దవాణ్ణి కఠినంగా మందలించ వద్దు. అతనిని తండ్రిగా భావించి హెచ్చరించు.
2 gamle kvinner som mødre, unge som søstre, i all renhet!
౨యువకులను సోదరులుగా, వయసు పైబడిన స్త్రీలను తల్లులుగా, యువతులను సోదరీలుగా ఎంచి పూర్ణ పవిత్రతతో హెచ్చరించు.
3 Hedre enker som virkelig er enker!
౩నిజమైన వితంతువులను గౌరవించు.
4 Men har en enke barn eller barnebarn, da skal disse først lære å vise sin gudsfrykt mot sin egen slekt og gi sine foreldre vederlag; for dette er tekkelig i Guds øine.
౪అయితే ఏ వితంతువుకైనా పిల్లలు గాని, మనవలు గాని ఉంటే, వీరు మొదట తమ ఇంటివారి పట్ల తమ బాధ్యతలు నిర్వర్తిస్తూ, తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయడం నేర్చుకోవాలి. ఇది దేవునికి ఎంతో ఇష్టం.
5 Men den som virkelig er enke og står alene, hun har satt sitt håp til Gud og blir ved i bønn og påkallelse natt og dag;
౫నిజంగా వితంతువు ఒక్కతే ఉండి, దేవుని మీదనే తన నమ్మకం పెట్టుకుని, ఆయన సాయం కోసం రేయింబగళ్ళు ప్రార్ధిస్తూ, విన్నపాలు చేస్తూ ఉంటుంది.
6 men den som lever efter sine lyster, er levende død.
౬అయితే విలాసాల్లో బతికే వితంతువు బతికి ఉన్నా చచ్చినట్టే.
7 Og dette skal du byde, forat de kan være ulastelige.
౭వారు నింద పాలు కాకుండేలా వీటిని కూడా బోధించు.
8 Men dersom nogen ikke har omsorg for sine egne, og mest for sine husfolk, han har fornektet troen og er verre enn en vantro.
౮ఎవడైనా తన బంధువులను, మరి ముఖ్యంగా తన స్వంత ఇంటివారిని పోషించకపోతే వాడు విశ్వాసాన్ని వదులుకున్న వాడు. అలాటివాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడు.
9 En enke kan velges dersom hun ikke er yngre enn seksti år, dersom hun har vært én manns hustru,
౯అరవై ఏళ్ళ కంటే ఎక్కువ వయస్సు ఉండి, గతంలో ఒక్క పురుషుడికే భార్యగా ఉన్న స్త్రీని మాత్రమే విధవరాలిగా నమోదు చెయ్యి.
10 har vidnesbyrd om gode gjerninger, har opfostret barn, har vært gjestfri, har vasket de helliges føtter, er kommet de nødlidende til hjelp, har lagt vinn på all god gjerning.
౧౦ఆమె మంచి పనుల్లో పేరు పొంది ఉండాలి. అంటే, పిల్లలను పెంచడం, ఆతిథ్యం ఇవ్వడం, పవిత్రుల పాదాలు కడగడం, కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడం, లేదా ప్రతి మంచి పనీ చేయడానికి పూనుకుని ఉండడం. అలాటి వారిని విధవరాళ్ళ జాబితాలో చేర్చవచ్చు.
11 Men yngre enker skal du avvise; for når de i kjødelig lyst sviker Kristus, vil de gifte sig,
౧౧పడుచు వితంతువులను లెక్కలో చేర్చవద్దు. క్రీస్తుకు విరోధంగా వారి వాంఛలు ఎక్కువైపోతే పెళ్ళి చేసుకోవాలనుకుంటారు.
12 og dermed har de den dom at de har brutt sin første tro.
౧౨ఇలా వారు తమ మొదటి నిర్ణయాన్ని వదిలేసి తమ మీదికి అపరాధం తెచ్చుకుంటారు.
13 Tilmed lærer de og å gå ørkesløse, idet de farer omkring i husene, og ikke alene ørkesløse, men også med sladder og uvedkommende ting, så de taler det som utilbørlig er.
౧౩వారు ఇంటింటికీ తిరుగుతూ, సోమరులవుతారు. అంతేగాక, వారు పనికిమాలిన మాటలు మాటలాడుతూ, వాగుడుకాయలై ఇతరుల విషయాల్లో తల దూర్చేవారుగా తయారవుతారు.
14 Derfor vil jeg at unge enker skal gifte sig, føde barn, styre sitt hus, ikke gi motstanderen nogen leilighet til baktalelse.
౧౪కాబట్టి యువతులు పెళ్ళి చేసుకుని పిల్లలను కని ఇంటి పనులు చూసుకుంటూ, శత్రువుకు నిందించే అవకాశమివ్వకుండా ఉండాలని నా ఉద్దేశం.
15 For allerede har somme vendt sig bort efter Satan.
౧౫ఇప్పటికే కొంతమంది దారి తప్పి సాతాను వెంట వెళ్ళిపోయారు.
16 Dersom nogen troende mann eller kvinne har enker, da skal de sørge for dem og ikke la dem falle menigheten til byrde, forat den kan sørge for de virkelige enker.
౧౬ఏ విశ్వాసురాలి ఇంట్లోనైనా వితంతువులు ఉంటే, వారి గురించిన భారం సంఘానికి లేకుండా ఆమె తానే వారికి సహాయం చేయాలి.
17 De eldste som er gode forstandere, skal aktes dobbelt ære verd, mest de som arbeider i tale og lære.
౧౭చక్కగా నడిపించే పెద్దలను, ముఖ్యంగా వాక్యోపదేశంలో, బోధలో కష్టపడే వారిని, రెండింతలు గౌరవానికి యోగ్యులుగా పరిగణించాలి.
18 For Skriften sier: Du skal ikke binde munnen på en okse som tresker. Og en arbeider er sin lønn verd.
౧౮ఇందుకు అనుగుణంగా లేఖనంలో, “కళ్ళం నూర్చే ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు” అనీ, “పనివాడు తన జీతానికి అర్హుడు” అనీ ఉంది.
19 Ta ikke imot nogen klage mot en eldste uten efter to eller tre vidner.
౧౯ఇద్దరు ముగ్గురు సాక్షులుంటేనే తప్ప సంఘ పెద్ద మీద నిందారోపణ అంగీకరించ వద్దు.
20 Dem som synder, skal du refse så alle hører på det, forat også de andre må ha frykt.
౨౦మిగతా వారు భయపడేలా పాపం చేసిన వారిని అందరి ఎదుటా గద్దించు.
21 Jeg vidner for Gud og Kristus Jesus og de utvalgte engler at du skal ta vare på dette uten fordom, så du ikke gjør noget av tilbøielighet.
౨౧విరోధ బుద్ధితో గానీ భేద భావంతో గానీ ఏమీ చేయక ఈ నియమాలను పాటించాలని దేవుని ఎదుటా, క్రీస్తు యేసు ఎదుటా, దేవుడు ఎన్నుకున్న దూతల ఎదుటా నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను.
22 Vær ikke snar til å legge hendene på nogen; gjør dig ikke delaktig i fremmede synder; hold dig selv ren!
౨౨ఎవరి మీదా త్వరపడి చేతులుంచవద్దు. ఇతరుల పాపాల్లో భాగం పంచుకోవద్దు. నిన్ను నీవు పవిత్రునిగా ఉండేలా చూసుకో.
23 Drikk ikke lenger bare vann, men nyt litt vin for din mave og dine jevnlige sykdommer.
౨౩ఇక నుండి నీళ్ళు మాత్రమే గాక నీ కడుపులో తరచుగా వచ్చే వ్యాధి కోసం కొద్దిగా ద్రాక్షారసం తాగు.
24 Nogen menneskers synder er åpenbare og går forut for dem til dom; men hos andre følger de efter.
౨౪కొందరి పాపాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. అవి వారి తీర్పుకు ముందే నడుస్తున్నాయి. మరి కొంతమంది పాపాలు వారి వెంటే వెళుతున్నాయి.
25 Likeså er og de gode gjerninger åpenbare, og de som det ikke er således med, kan dog ikke skjules.
౨౫అలాగే కొన్ని మంచి పనులు స్పష్టంగా కనిపిస్తాయి. మిగిలిన వాటిని సైతం దాచి ఉంచడం సాధ్యం కాదు.