< 1 Tessalonikerne 2 >
1 For selv vet I, brødre, om den inngang vi fikk hos eder, at den ikke er blitt uten frukt;
౧సోదరులారా, మీ దగ్గరికి మేము రావడం వ్యర్థం కాలేదని మీకు తెలుసు.
2 men enda vi forut hadde lidt og var blitt mishandlet i Filippi, som I vet, fikk vi dog frimodighet i vår Gud til å tale Guds evangelium til eder under megen strid.
౨మేము ఫిలిప్పీలో ముందుగా హింసనూ అవమానాన్నీ అనుభవించాం అని కూడా మీకు తెలుసు. పోరాటాల మధ్య దేవునిలో ధైర్యం తెచ్చుకుని దేవుని సువార్తను మీకు ఉపదేశించాము.
3 For vår forkynnelse kommer ikke av villfarelse eller av urenhet eller med svik;
౩ఎందుకంటే మా ఉపదేశం తప్పు దారి పట్టించేదీ అపవిత్రమైనదీ ద్రోహపూరితమైనదీ కాదు.
4 men likesom vi av Gud er aktet verdige til at evangeliet blev oss betrodd, således taler vi, ikke som de som vil tekkes mennesker, men Gud, som prøver våre hjerter.
౪దేవుడు మమ్మల్ని యోగ్యులుగా ఎంచి సువార్తను మాకు అప్పగించాడు. కాబట్టి మేము మనుషులను సంతోషపరచడానికి కాకుండా హృదయాలను పరిశీలించే దేవుణ్ణి సంతోషపరచడానికే మాట్లాడుతున్నాము.
5 For hverken kom vi nogensinne med smigrende ord, som I vet, eller med skalkeskjul for havesyke, Gud er vårt vidne,
౫మేము ముఖస్తుతి మాటలు ఏనాడూ పలకలేదని మీకు తెలుసు. అలాగే అత్యాశను కప్పిపెట్టే వేషాన్ని ఎప్పుడూ వేసుకోలేదు. దీనికి దేవుడే సాక్షి.
6 heller ikke søkte vi ære av mennesker, hverken av eder eller av andre, enda vi hadde kunnet kreve ære som Kristi apostler;
౬ఇంకా మేము యేసుక్రీస్తు అపొస్తలులం కాబట్టి ఆధిక్యతలు ప్రదర్శించడానికి అవకాశం ఉన్నా మీ వల్ల కానీ, ఇతరుల వల్ల కానీ, మనుషుల వల్ల కలిగే ఏ ఘనతనూ మేము ఆశించలేదు.
7 men vi var milde iblandt eder: likesom en mor varmer sine barn ved sitt bryst,
౭పాలిచ్చే తల్లి తన పసిపిల్లలను సాకినట్టు మేము మీతో మృదువుగా వ్యవహరించాం.
8 således vilde vi gjerne i inderlig kjærlighet til eder gi eder ikke bare Guds evangelium, men og vårt eget liv, fordi I var blitt oss kjære.
౮మీరు మాకు ఎంతో ఇష్టమైనవారు కాబట్టి మీ పట్ల ప్రీతితో దేవుని సువార్త మాత్రమే కాదు, మీ కోసం మా ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం.
9 I minnes jo, brødre, vårt strev og vår møie: under arbeid natt og dag, for ikke å falle nogen av eder til byrde, forkynte vi Guds evangelium for eder.
౯సోదరులారా, మా ప్రయాస, కష్టం మీకు జ్ఞాపకముంది కదా! మీకు దేవుని సువార్త ప్రకటించేటప్పుడు మేము మీలో ఎవరికీ భారంగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టపడి పని చేశాం.
10 I er vidner, og Gud med, hvor hellig og rettferdig og ulastelig vi ferdedes iblandt eder, I troende,
౧౦విశ్వాసులైన మీ ముందు మేము ఎంత పవిత్రంగా, నీతిగా, నిందారహితంగా నడచుకున్నామో దానికి మీరే సాక్షులు. దేవుడు కూడా సాక్షి.
11 likesom I vet hvorledes vi formante hver og en av eder, som en far sine barn, og la eder på hjerte
౧౧తన రాజ్యానికీ, మహిమకూ మిమ్మల్ని పిలుస్తున్న దేవునికి తగినట్టుగా మీరు ఉండాలని మేము మీలో ప్రతి ఒక్కరినీ హెచ్చరిస్తూ ప్రోత్సహిస్తూ సాక్ష్యం ఇస్తూ
12 og bad eder inderlig å vandre verdig for Gud, som har kalt eder til sitt rike og sin herlighet.
౧౨తండ్రి తన పిల్లలతో వ్యవహరించే విధంగా మేము మీ పట్ల వ్యవహరించామని మీకు తెలుసు.
13 Og derfor takker også vi Gud uavlatelig for at da I fikk det Guds ord vi forkynte, tok I imot det, ikke som et menneske-ord, men, som det i sannhet er, som et Guds ord, som og viser sig virksomt i eder som tror.
౧౩మీరు మొదట మా నుండి దేవుని వాక్కు అయిన సందేశాన్ని స్వీకరించినప్పుడు దాన్ని మనుషుల మాటగా కాక దేవుని వాక్కుగా అంగీకరించారు. ఆ కారణం చేత మేము ఎప్పుడూ దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాము. మీరు స్వీకరించిన ఆ సందేశం నిజంగా దేవుని వాక్కే. అది విశ్వసించిన మీలో పని చేస్తూ ఉంది కూడా.
14 For I, brødre, er blitt efterfølgere av de Guds menigheter som er i Kristus Jesus i Judea, idet og I har lidt det samme av eders egne landsmenn som de har lidt av jødene,
౧౪ఎలాగంటే సోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసులో ఉన్న దేవుని సంఘాలను పోలి నడుచుకుంటున్నారు. వారు యూదుల వలన అనుభవించిన హింసలే ఇప్పుడు మీరు కూడా మీ స్వదేశీయుల వలన అనుభవిస్తున్నారు.
15 som og slo den Herre Jesus og profetene ihjel og forfulgte oss og ikke tekkes Gud og står alle mennesker imot,
౧౫వారు ప్రభువైన యేసునూ ప్రవక్తలనూ చంపారు. మమ్మల్ని తరిమివేశారు. వారు దేవుణ్ణి సంతోషపెట్టేవారు కాదు. మనుషులందరికీ విరోధులు.
16 idet de hindrer oss fra å tale til hedningene, så de kan bli frelst, forat de alltid må fylle sine synders mål. Dog, vreden har endelig nådd dem!
౧౬యూదేతరులకు రక్షణ కలిగించే సువార్తను ప్రకటించకుండా వారు మమ్మల్ని అడ్డుకున్నారు. తమ పాపాలను పెంచుకుంటూ ఉన్నారు. చివరికి దేవుని తీవ్ర కోపం వారి మీదికి వచ్చింది.
17 Men da vi, brødre, hadde vært skilt fra eder en kort stund, med vårt åsyn, ikke med hjertet, gjorde vi oss i vår store lengsel så meget mere umak for å få se eders åsyn,
౧౭సోదరులారా, మేము కొంతకాలం హృదయం విషయంలో కాకున్నా శరీర రీతిగా దూరంగా ఉన్నాము. అందుచేత మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని గొప్ప ఆశతో ఉన్నాం.
18 fordi vi gjerne vilde komme til eder - jeg, Paulus, både én gang og to ganger - men Satan hindret oss.
౧౮కాబట్టి మేము మీ దగ్గరికి రావాలనుకున్నాం. పౌలు అనే నేను ఎన్నోసార్లు రావాలనుకున్నాను గానీ సాతాను మమ్మల్ని ఆటంకపరిచాడు.
19 For hvem er vel vårt håp eller vår glede eller vår hederskrans? er ikke også I det for vår Herre Jesu åsyn ved hans komme?
౧౯ఎందుకంటే భవిష్యత్తు కొరకైన మా ఆశా, ఆనందమూ, మా అతిశయ కిరీటం ఏది? మన ప్రభువైన యేసు రాకడ సమయంలో ఆయన సన్నిధిలో నిలిచే మీరే కదా!
20 I er jo vår ære og vår glede.
౨౦నిజంగా మా మహిమా ఆనందమూ మీరే.