< 1 Samuels 7 >

1 Da kom Kirjat-Jearims menn og hentet Herrens ark op og bar den inn i Abinadabs hus på haugen, og hans sønn Eleasar vidde de til å ta vare på Herrens ark.
అప్పుడు కిర్యత్యారీము ప్రజలు వచ్చి యెహోవా మందసాన్ని తీసుకువెళ్ళి గిబియాలో కొండపై ఉన్న అబీనాదాబు ఇంటి దగ్గర ఉంచి దాన్ని కాపాడడం కోసం అతని కొడుకు ఎలియాజరును నియమించారు.
2 Fra den dag arken kom til Kirjat-Jearim, gikk det en lang tid - tyve år gikk det; da sukket hele Israels hus efter Herren.
మందసాన్ని కిర్యత్యారీములో ఉంచి ఇరవై ఏళ్లు నిండాయి. ఇశ్రాయేలీయులంతా యెహోవాను అనుసరించాలని కోరుతూ చింతిస్తున్నారు.
3 Og Samuel sa til hele Israels hus: Dersom I vender om til Herren av hele eders hjerte, så ha de fremmede guder og Astarte-billedene bort fra eder og vend eders hjerte til Herren og tjen ham alene! Så skal han fri eder av filistrenes hånd.
సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ సమకూర్చి ఇలా చెప్పాడు. “మీరు మనస్ఫూర్తిగా యెహోవా వైపుకు తిరిగి, ఇతర దేవుళ్ళను, అష్తారోతు దేవుళ్ళను మీ మధ్యనుండి తీసివేసి, పట్టుదల గలిగి యెహోవా వైపు మీ మనస్సులను మళ్ళించి ఆయనను ఆరాధించండి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలోనుండి మిమ్మల్ని విడిపిస్తాడు.”
4 Da skilte Israels barn sig av med Ba'alene og Astarte-billedene og tjente Herren alene.
ఆ తరువాత ఇశ్రాయేలీయులు బయలు దేవుళ్ళను, అష్తారోతు దేవుళ్ళను విడిచిపెట్టి యెహోవాను మాత్రమే సేవించడం మొదలుపెట్టారు.
5 Og Samuel sa: La hele Israel samle sig i Mispa! Så vil jeg bede til Herren for eder.
అప్పుడు సమూయేలు “ఇశ్రాయేలీయులంతా మిస్పా ప్రదేశానికి చేరుకోండి. నేను మీ తరపున యెహోవాకు ప్రార్థన చేస్తాను” అని చెప్పినప్పుడు
6 Så samlet de sig i Mispa, og de øste op vann og helte det ut for Herrens åsyn, og de fastet den dag og bekjente der: Vi har syndet mot Herren. Og Samuel dømte Israels barn i Mispa.
వారు మిస్పాలో సమావేశమై నీళ్లు చేది యెహోవా సన్నిధిలో కుమ్మరించి ఆ రోజంతా ఉపవాసం ఉండి “యెహోవా దృష్టిలో మేమంతా పాపం చేశాం” అని ఒప్పుకున్నారు. సమూయేలు మిస్పాలో ఉంటూ ఇశ్రాయేలీయులకు తీర్పు తీరుస్తూ న్యాయం జరిగిస్తున్నాడు.
7 Da filistrene hørte at Israels barn hadde samlet sig i Mispa, drog filistrenes høvdinger op imot Israel, og da Israels barn hørte det, var de redde for filistrene.
ఇశ్రాయేలీయులు మిస్పాలో సమకూడారని ఫిలిష్తీయులకు తెలిసినప్పుడు ఫిలిష్తీయ దండు వారి మీద దాడికి సిద్ధమయ్యారు. ఈ విషయం ఇశ్రాయేలీయులకు తెలిసినప్పుడు వారు ఫిలిష్తీయులకు భయపడి
8 Og Israels barn sa til Samuel: Hold ikke op med å rope for oss til Herren vår Gud at han vil frelse oss av filistrenes hånd!
“మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలోనుండి మనలను రక్షించేలా మా కోసం ప్రార్థన చేయడం మానవద్దు” అని సమూయేలును వేడుకున్నారు.
9 Da tok Samuel et diende lam og ofret det helt som brennoffer til Herren, og Samuel ropte til Herren for Israel, og Herren svarte ham.
సమూయేలు ఇంకా పాలు తాగడం మానని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ హోమం అర్పించి, ఇశ్రాయేలీయుల తరఫున యెహోవాకు ప్రార్థించినపుడు యెహోవా అతని ప్రార్థన విన్నాడు.
10 For mens Samuel ofret brennofferet, og filistrene rykket frem til strid mot Israel, da sendte Herren samme dag et sterkt tordenvær over filistrene og forferdet dem, så de blev slått av Israel.
౧౦సమూయేలు దహనబలి అర్పిస్తున్న సమయంలో ఫిలిష్తీయులు యుద్ధం చేయడానికి ఇశ్రాయేలీయుల పైకి వచ్చారు. అయితే యెహోవా ఆ రోజు ఫిలిష్తీయుల మీదికి విపరీతంగా ఉరుములు ఉరిమేలా చేసి వారిని కల్లోలపరచడంతో వారు ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోయారు.
11 Da drog Israels menn ut fra Mispa og forfulgte filistrene og hugg dem ned, like til nedenfor Bet-Kar.
౧౧ఇశ్రాయేలీయులు మిస్పా నుండి మొదలుపెట్టి బేత్కారు వరకూ ఫిలిష్తీయుల వెంటబడి చంపివేశారు.
12 Og Samuel tok en sten og satte den imellem Mispa og Sen; denne sten kalte han Eben-Eser og sa: Hittil har Herren hjulpet oss.
౧౨అప్పుడు సమూయేలు ఒక రాయి తీసుకుని మిస్పాకు, షేనుకు మధ్య దాన్ని నిలబెట్టి “ఇప్పటి వరకూ యెహోవా మనకు సహాయం చేశాడు” అని చెప్పి ఆ రాయికి “ఎబెనెజరు” అని పేరు పెట్టాడు.
13 Således blev filistrene ydmyket og kom ikke mere inn i Israels land; og Herrens hånd var imot filistrene alle Samuels dager.
౧౩ఈ విధంగా ఫిలిష్తీయులు అణగారిపోయి ఇశ్రాయేలు సరిహద్దుల్లోకి మళ్ళీ రాలేకపోయారు. సమూయేలు జీవించిన కాలమంతటిలో యెహోవా హస్తం ఫిలిష్తీయులకి విరోధంగా ఉంది.
14 Og de byer som filistrene hadde tatt fra Israel, kom tilbake til Israel igjen, fra Ekron like til Gat, og alt land som hørte til dem, fridde Israel av filistrenes hånd, og det var fred mellem Israel og amorittene.
౧౪ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల నుండి ఆక్రమించుకొన్న పట్టణాలన్నీ వారికి తిరిగి వచ్చాయి. ఎక్రోను నుండి గాతు వరకూ ఉన్న గ్రామాలనూ వాటిలోని పొలాలనూ ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించుకున్నారు. ఇశ్రాయేలీయులకు, అమోరీయులకు మధ్య శాంతి ఏర్పడింది.
15 Samuel dømte Israel så lenge han levde.
౧౫సమూయేలు జీవించిన కాలమంతా ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నాడు.
16 År efter år drog han omkring til Betel og Gilgal og Mispa og dømte Israel på alle disse steder.
౧౬ప్రతి సంవత్సరమూ అతడు బేతేలుకు, గిల్గాలుకు, మిస్పాకు తిరుగుతూ, వివిధ ప్రాంతాల్లో ఇశ్రాయేలీయులకు న్యాయం జరిగిస్తూ వచ్చాడు.
17 Og hver gang vendte han tilbake til Rama; for der var hans hus, og der dømte han Israel; og han bygget der et alter for Herren.
౧౭అతని నివాసం రమాలో ఉన్నందువల్ల అక్కడికి తిరిగి వచ్చి అక్కడ కూడా న్యాయం జరిగిస్తూ వచ్చాడు. అతడు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠం కట్టాడు.

< 1 Samuels 7 >