< 1 Kongebok 6 >
1 I det fire hundre og åttiende år efter Israels barns utgang av Egyptens land, i måneden siv - det er den annen måned - i det fjerde år efterat Salomo var blitt konge over Israel, begynte han å bygge huset for Herren.
౧ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చిన 480 వ సంవత్సరంలో, అంటే సొలొమోను పాలనలో నాలుగో సంవత్సరం, జీప్ అనే రెండో నెలలో అతడు యెహోవా మందిర నిర్మాణం ప్రారంభించాడు.
2 Huset som kong Salomo bygget for Herren, var seksti alen langt og tyve alen bredt og tretti alen høit.
౨సొలొమోను రాజు యెహోవాకు కట్టించిన మందిరం పొడవు 60 మూరలు, వెడల్పు 20 మూరలు, ఎత్తు 30 మూరలు.
3 Og forhallen foran det Hellige var tyve alen, svarende til bredden av huset, og ti alen bred målt ut fra huset.
౩పరిశుద్ధ స్థలం ఎదుట ఉన్న ముఖమంటపం పొడవు మందిరం వెడల్పుతో సమానంగా 20 మూరలు. మందిరం ఎదుట ఆ మంటపం వెడల్పు 10 మూరలు.
4 På huset gjorde han vinduer med fast gitterverk.
౪అతడు మందిరానికి నగిషీ పని చేసిన అల్లిక కిటికీలు చేయించాడు.
5 Op til husets vegg bygget han en tilbygning rundt omkring - langs med veggene på huset, både det Hellige og koret, og således gjorde han sidekammer rundt omkring.
౫మందిరం గోడ చుట్టూ గదులు కట్టించాడు. మందిరం గోడలకు పరిశుద్ధ స్థలం బయటి గోడల వరకూ ఆ గదులు గర్భాలయానికి చుట్టూ నాలుగు వైపులా అతడు కట్టించాడు.
6 Det nederste stokkverk var fem alen bredt og det mellemste seks alen bredt og det tredje syv alen bredt; for han hadde gjort avsatser på huset rundt omkring på utsiden, så ikke bjelkene skulde gå inn i husets vegger.
౬కింది అంతస్తు గది 5 మూరల వెడల్పు, మధ్య అంతస్తు గది 6 మూరల వెడల్పు, మూడవ అంతస్తు గది 7 మూరల వెడల్పు. ఎలా అంటే దూలాలు మందిరం గోడ లోపల ఆనకుండా మందిరం గోడ చుట్టూ బయటి వైపున చిమ్ము రాళ్లు ఉంచారు.
7 Da huset blev reist, blev det bygget av hele stener fra stenbruddet; en hørte hverken hammer eller øks eller noget slags jernredskap i huset da det blev bygget.
౭అయితే మందిరం కట్టే సమయంలో ముందుగా సిద్ధపరచి తెచ్చిన రాళ్లతో కట్టారు. మందిరం కట్టే స్థలం లో సుత్తె, గొడ్డలి మొదలైన ఇనప పనిముట్ల శబ్దం ఎంత మాత్రం వినబడలేదు.
8 Døren til det mellemste sidekammer var på husets høire side, og på en vindeltrapp kom en op i det mellemste stokkverk, og fra det mellemste op i det tredje.
౮మందిరం కుడి పక్కన మధ్య అంతస్తుకు తలుపు ఉంది. మధ్య అంతస్తు గదికీ మధ్య అంతస్తు గదిలో నుండి మూడవ అంతస్తు గదికీ ఎక్కి వెళ్ళడానికి చుట్టూ మెట్ల చట్రాలున్నాయి.
9 Således bygget han huset, og da han hadde gjort det ferdig, tekte han det med bjelker og med sederplanker i rader.
౯ఈ విధంగా అతడు మందిర నిర్మాణం ముగించి మందిరాన్ని దేవదారు దూలాలతో, పలకలతో కప్పించాడు.
10 Tilbygningen som han bygget rundt om hele huset, var fem alen høi for hvert stokkverk og var festet til huset ved sederbjelker.
౧౦మందిరానికి చుట్టూ గదులు కట్టించాడు. ఇవి ఐదు మూరల ఎత్తు కలిగి దేవదారు దూలాల చేత మందిరంతో గట్టిగా సంధించి ఉన్నాయి.
11 Da kom Herrens ord til Salomo, og det lød således:
౧౧అంతలో యెహోవా వాక్కు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు.
12 Nu bygger du dette hus - hvis du da vandrer efter mine forskrifter og holder mine lover og tar vare på alle mine bud, så du følger dem, da vil jeg opfylle på dig det ord jeg talte til din far David,
౧౨“ఈ మందిరాన్ని నీవు కట్టిస్తున్నావు కదా, నీవు నా చట్టాలు, న్యాయవిధులు పాటిస్తూ, నా ఆజ్ఞలన్నిటికీ విధేయత చూపితే నీ తండ్రి దావీదుతో నేను చేసిన వాగ్దానాన్ని నీ విషయంలో స్థిరపరుస్తాను.
13 og jeg vil bo midt iblandt Israels barn, og jeg vil ikke forlate mitt folk Israel.
౧౩ఇశ్రాయేలీయులనే నా ప్రజలను విడిచి పెట్టక నేను వారి మధ్య నివాసం చేస్తాను.”
14 Så bygget da Salomo huset og gjorde det ferdig.
౧౪ఈ విధంగా సొలొమోను మందిర నిర్మాణాన్ని ముగించాడు.
15 Han klædde husets vegger innentil med sederbord; fra gulvet og helt op til loftsbjelkene klædde han huset innentil med tre, og gulvet klædde han med cypressbord.
౧౫అతడు మందిరం లోపలి గోడలను దేవదారు పలకలతో కట్టించాడు. అడుగు నుండి పైకప్పు వరకూ గోడలను దేవదారు పలకలతో కప్పించాడు. మందిరం నేలను సరళ మాను పలకలతో కప్పించాడు.
16 Tyve alen fra husets bakside satte han en vegg av sederbord fra gulvet og op til loftsbjelkene, og rummet innenfor innredet han til kor - det var det Aller-helligste.
౧౬మందిరం పక్కలను కింది నుండి గోడల పై భాగం వరకూ దేవదారు పలకలతో 20 మూరల ఎత్తు కట్టించాడు. అతడు దాన్ని గర్భాలయం కోసం, అంటే అతి పరిశుద్ధ స్థలం కోసం కట్టించాడు.
17 Og huset - det Hellige foran koret - var firti alen langt.
౧౭అయితే దాని ఎదుట ఉన్న పరిశుద్ధ స్థలం పొడవు 40 మూరలు.
18 Innvendig var huset prydet med utskjæringer i sedertre - kolokvinter og utsprungne blomster; alt sammen var sedertre, der var ingen sten å se.
౧౮మందిరం లోపల ఉన్న దేవదారు పలకల మీద గుబ్బలు, వికసించిన పువ్వులు చెక్కి ఉన్నాయి. అంతా దేవదారు కర్ర పనే, రాయి ఒక్కటి కూడా కనిపించ లేదు.
19 Innerst i huset innredet han et kor til å sette Herrens pakts-ark i.
౧౯యెహోవా నిబంధన మందసాన్ని ఉంచడానికి మందిరం లోపల అతి పరిశుద్ధ స్థలాన్ని సిద్ధపరిచాడు.
20 Og foran koret, som var tyve alen langt og tyve alen bredt og tyve alen høit, og som han klædde med fint gull, satte han et alter og klædde det med sedertre.
౨౦అతి పరిశుద్ధ స్థలం లోపల 20 మూరల పొడవు, 20 మూరల వెడల్పు, 20 మూరల ఎత్తు ఉంది. దీన్ని మేలిమి బంగారంతో పొదిగించాడు. దేవదారు చెక్కతో చేసిన బలిపీఠాన్ని కూడా ఇదే విధంగా పొదిగించాడు.
21 Og Salomo klædde huset innentil med fint gull og hengte gullkjeder bortefter veggen foran koret og klædde den med gull.
౨౧ఈ విధంగా సొలొమోను మందిరం లోపల అంతా మేలిమి బంగారంతో పొదిగించి అతి పరిశుద్ధ స్థలం ఎదుట బంగారు గొలుసులు ఉన్న తెర చేయించి బంగారంతో దాన్ని పొదిగించాడు.
22 Hele huset klædde han med gull fra ende til annen; og hele alteret som hørte til koret, klædde han med gull.
౨౨ఏ భాగాన్నీ విడిచి పెట్టకుండా మందిరమంతా బంగారంతో పొదిగించాడు. అతి పరిశుద్ధ స్థలం దగ్గర ఉన్న బలిపీఠాన్ని బంగారంతో పొదిగించాడు.
23 I koret gjorde han to kjeruber av oljetre; de var ti alen høie.
౨౩అతడు అతి పరిశుద్ధ స్థలం లో 10 మూరల ఎత్తున్న రెండు కెరూబులను ఒలీవ కర్రతో చేయించాడు.
24 Kjerubens ene vinge var fem alen og kjerubens andre vinge fem alen - det var ti alen fra vingespiss til vingespiss.
౨౪ఒక్కొక్క కెరూబుకు 5 మూరల పొడవైన రెక్కలున్నాయి. ఒక రెక్క చివరి నుండి రెండవ రెక్క చివరి వరకూ 10 మూరలు పొడవు.
25 Den andre kjerub var og ti alen; begge kjerubene hadde samme mål og samme skikkelse.
౨౫రెండవ కెరూబు రెక్కలు కూడా 10 మూరలు ఉంది. కెరూబులు రెండింటికీ ఒకే కొలతలు, ఒకే ఆకారం ఉన్నాయి.
26 Den ene kjerub var ti alen høi og likeså den andre kjerub.
౨౬ఒక కెరూబు 10 మూరల ఎత్తు, రెండవ కెరూబు కూడా అంతే ఎత్తు.
27 Og han satte kjerubene i det innerste rum i huset, og de strakte kjerubenes vinger ut, så den enes vinge rørte ved den ene vegg, og den andre kjerubs vinge rørte ved den andre vegg, mens deres vinger midt i huset rørte ved hverandre,
౨౭అతడు ఈ కెరూబులను గర్భాలయంలో ఉంచాడు. ఆ కెరూబుల రెక్కలు పూర్తిగా విప్పుకుని ఒకదాని రెక్క ఇవతలి గోడకీ, రెండవదాని రెక్క అవతలి గోడకీ అంటుకుని ఉన్నాయి. అతి పరిశుద్ధ స్థలం లో వీటి రెక్కలు ఒకదానితో ఒకటి అంటుకుని ఉన్నాయి.
28 og han klædde kjerubene med gull.
౨౮ఈ కెరూబులను అతడు బంగారంతో పొదిగించాడు.
29 Alle husets vegger rundt omkring prydet han med utskårne billeder av kjeruber og palmer og utsprungne blomster både i det indre rum og i det ytre.
౨౯మందిరం గోడలన్నిటి మీదా లోపలా బయటా కెరూబు ఆకారాలను, ఖర్జూర చెట్ల ఆకారాలను, వికసించిన పూలను చెక్కించాడు.
30 Og husets gulv klædde han med gull, både i det indre rum og i det ytre.
౩౦లోపలి, బయట గదుల్లో మందిరం నేలంతా బంగారంతో పొదిగించాడు.
31 For inngangen til koret gjorde han en fløidør av oljetre; den øvre dørkarm med dørstolpene utgjorde en femtedel av veggen.
౩౧అతి పరిశుద్ధ స్థలం ద్వారానికి ఒలీవకర్రతో తలుపులు చేయించాడు. ద్వారబంధం మీది కమ్మీ, నిలువు కమ్మీల వెడల్పు, గోడ వెడల్పులో ఐదో భాగం ఉన్నాయి.
32 Og de to dører av oljetre prydet han med utskårne billeder av kjeruber og palmer og utsprungne blomster og klædde dem med gull; han bredte gullet ut over kjerubene og palmene.
౩౨రెండు తలుపులూ ఒలీవ కర్రతో చేసినవి. వాటి మీద కెరూబులు, ఖర్జూర వృక్షాలు, వికసించిన పూవుల ఆకారాలు చెక్కించి వాటిని బంగారంతో పొదిగించాడు. కెరూబుల మీదా ఖర్జూర వృక్షాల మీదా బంగారం పొదిగించాడు.
33 Likeså gjorde han dørstolper av oljetre for inngangen til det Hellige, på fjerdedelen av veggen,
౩౩పరిశుద్ధ స్థలం ద్వారానికి ఒలీవ కర్రతో రెండు నిలువు కమ్ములు చేయించాడు. వీటి వెడల్పు గోడ వెడల్పులో నాలుగో వంతు.
34 og to dørfløier av cypresstre; begge dørfløiene var i to deler, som kunne svinges hver for sig.
౩౪రెండు తలుపులు దేవదారు కలపతో చేసినవి. ఒక్కొక్క తలుపుకు రెండేసి మడత రెక్కలు ఉన్నాయి.
35 Og han prydet dem med utskjæringer: kjeruber og palmer og utsprungne blomster, og han klædde dem med gull som blev lagt jevnt utover utskjæringene.
౩౫వాటి మీద అతడు కెరూబులనూ ఖర్జూర చెట్లనూ వికసించిన పూవులనూ చెక్కించి వాటి మీద బంగారు రేకు పొదిగించాడు.
36 Og han bygget den indre forgård av tre lag huggen sten og ett lag sederbjelker.
౩౬లోపల ఉన్న పెద్ద గదిని మూడు వరసల చెక్కిన రాళ్లతో, ఒక వరుస దేవదారు దూలాలతో కట్టించాడు.
37 I det fjerde år blev grunnvollen lagt til Herrens hus, i måneden siv,
౩౭నాలుగో సంవత్సరం జీప్ నెలలో యెహోవా మందిరం పునాది వేశారు.
38 og i det ellevte år i måneden bul det er den åttende måned var huset ferdig i alle sine deler og i ett og alt som det skulde være. Da hadde han bygget på det i syv år.
౩౮పదకొండవ సంవత్సరం బూలు అనే ఎనిమిదో నెలలో దాని ఏర్పాటు ప్రకారం దాని విభాగాలన్నిటితో మందిరం పూర్తి అయ్యింది. దాన్ని కట్టించడానికి సొలొమోనుకి ఏడు సంవత్సరాలు పట్టింది.