< यर्मिया 39 >
1 यहूदाका राजाको नवौँ वर्षको दसौँ महिनामा बेबिलोनका राजा नबूकदनेसर यरूशलेमका विरुद्धमा आफ्ना सबै सेना लिएर आए, र यसलाई घेराबन्दी गरे ।
౧యూదా రాజైన సిద్కియా పరిపాలనలో తొమ్మిదో సంవత్సరం పదో నెలలో బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యం అంతటితో యెరూషలేమును ముట్టడి వేశాడు.
2 सिदकियाहको एघारौं वर्षको चौथो महिनाको नवौँ दिनमा सहरको पर्खाल भत्काइयो ।
౨సిద్కియా పరిపాలనలో 11 వ సంవత్సరం నాలుగో నెల తొమ్మిదో రోజున ప్రాకారాలను కూల్చి పట్టణాన్ని ఆక్రమించారు.
3 तब बेबिलोनका राजाका सबै अधिकारी अर्थात् नेबो-सर्सेकिम, सम्गर-नेबो र एक उच्च अधिकारी सर्सेचिम आएर मध्य ढोकामा बसे । नेबो-सर्सेकिम बेबिलोनका राजाका विशिष्ट अधिकारी थिए, र अरू बाँकी सबै अधिकारीहरू थिए ।
౩అప్పుడు బబులోను రాజు అధికారులు నేర్గల్ షరేజరు, సమ్గర్ నెబో, ముఖ్య అధికారి శర్సెకీము లోపలికి వచ్చి సింహద్వారంలో కూర్చున్నారు. నేర్గల్ షరేజరు ఒక ఉన్నత అధికారి. మిగిలిన వాళ్ళు బబులోను రాజుకు చెందిన అధికారులు.
4 जब यहूदाका राजा सिदकियाह र सबै योद्धाले तिनीहरूलाई देखे, तिनीहरू भागे । तिनीहरू रातमा दुई पर्खालको बिचमा भएको ढोकाबाट छिरेर राजको बगैँचाको बाटो भएर सहरबाट भागे । राजा अराबा जाने बाटोतिर लागे ।
౪యూదుల రాజైన సిద్కియా, అతని యోధులందరూ వాళ్ళను చూసి పారిపోయారు. వాళ్ళు రాత్రిపూట రాజు తోట మార్గంలో రెండు గోడల మధ్య ఉన్న గుమ్మపు దారిలో నుంచి పట్టణం బయటకు వెళ్ళిపోయారు. రాజు అరాబా మైదానం వైపుగా వెళ్ళాడు.
5 तर कल्दीहरूका सेनाले तिनीहरूलाई खेदे, र यरीहो नजिकै यर्दन नदीको बेँसीको मैदानमा सिदकियाहलाई भेट्टाए । तिनीहरूलाई तिनलाई पक्रे र हमात देशको रिब्ला भन्ने ठाउँमा बेबिलोनका राजा नबूकदनेसरकहाँ ल्याए, जहाँ नबूकदनेसरले तिनलाई दण्डाज्ञा दिए ।
౫అయితే కల్దీయుల సేన వాళ్ళను తరిమి, యెరికో దగ్గర ఉన్న మైదానాల్లో సిద్కియాను కలుసుకుని, అతన్ని పట్టుకుని, హమాతు దేశంలోని రిబ్లా పట్టణం దగ్గర ఉన్న బబులోను రాజైన నెబుకద్నెజరు దగ్గరికి తీసుకొచ్చారు. అక్కడ రాజు అతనికి శిక్ష విధించాడు.
6 रिब्लामा बेबिलोनका राजाले सिदकियाहका आँखाकै सामु तिनका छोराहरूलाई मारे । तिनले यहूदाका सबै कुलीनहरूलाई पनि मारे ।
౬బబులోను రాజు రిబ్లా పట్టణంలో సిద్కియా కొడుకులను అతని కళ్ళముందే చంపాడు. అతడు యూదా ప్రధానులందరినీ చంపాడు.
7 तब तिनले सिदकियाहका आँखा निकाले, र तिनलाई बेबिलोनमा लान काँसाको साङ्लाले बाँधे ।
౭తరువాత అతడు సిద్కియా కళ్ళు పెరికించి అతన్ని బబులోనుకు తీసుకెళ్ళడానికి ఇత్తడి సంకెళ్లతో బంధించాడు.
8 अनि कल्दीहरूले राजदरबार र मानिसका घरहरू जलाए । तिनीहरूले यरूशलेमका पर्खालहरू पनि भत्काए ।
౮కల్దీయులు రాజమందిరాన్ని, ప్రజల ఇళ్ళను, అగ్నితో తగలబెట్టి, యెరూషలేము చుట్టూ ఉన్న గోడలు పడగొట్టారు.
9 राजाको अङ्गरक्षकका सेनापति नबूजरदानले सहरमा बाँकी रहेका मानिसहरूलाई निर्वासनमा लगे । कल्दीहरूकहाँ भागेर गएका र सहरमा छाडिएका बाँकी मानिसहरू सबै नै लगिए ।
౯అప్పుడు రాజదేహ సంరక్షకుల అధిపతి నెబూజరదాను, పట్టణంలో మిగిలి ఉన్న ప్రజలను, ద్రోహులై తమ రాజును విడిచి కల్దీయులతో చేరిన వాళ్ళను, ఇంకా మిగిలిన ప్రజలందరినీ బబులోనుకు తీసుకెళ్ళిపోయాడు.
10 तर अङ्गरक्षकका कप्तापन नबूजरदानले केही नभएका सबैभन्दा गरिब मानिसहरूलाई यहूदा देशमा छाडे । त्यही दिन तिनले तिनीहरूलाई दाखाबारी र खेतहरू दिए ।
౧౦అయితే నెబూజరదాను నిరుపేదలను యూదా దేశంలోనే ఉండనిచ్చి, వాళ్లకు ద్రాక్షతోటలు, పొలాలు ఇచ్చాడు.
11 बेबिलोनका राजा नबूकदेनसरले राजाका अङ्गरक्षकका कप्तान नबूजरदानलाई यर्मियाको विषयमा हुकुम दिएका थिए,
౧౧యిర్మీయా గురించి బబులోను రాజైన నెబుకద్నెజరు రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదానుకు ఇలా ఆజ్ఞాపించాడు,
12 “तिनलाई लेजाऊ र तिनको राम्रो हेरचाह गर । तिनलाई कुनै हानि नगर । त्यसले तिमीलाई भनेका हर कुरा गर्नू ।”
౧౨“నువ్వు అతనికి హాని చెయ్యొద్దు. అతన్ని జాగ్రత్తగా చూసుకో. అతడు నీతో ఏది చెప్పినా అది అతని కోసం చెయ్యి.”
13 त्यसैले राजाका अङ्गरक्षकका कप्तान नबूजरदान, उच्च नपुंसक नबुशजबान, उच्च अधिकृत नेर्गल-सरेसर र बेबिलोनका राजाका अरू सबै उच्च अधिकारीहरूले अरू मानिसहरूलाई बाहिर पठाए ।
౧౩కాబట్టి రాజదేహసంరక్షకుల అధిపతి నెబూజరదాను, నపుంసకుల అధిపతి నేర్గల్ షరేజరు, ఉన్నత అధికారి నేర్గల్షరేజరు, ఇంకా బబులోను రాజు ప్రధానులందరూ మనుషులను పంపి,
14 तिनीहरूका मानिसहरूले यर्मियालाई गारदको चोकबाट लिएर गए, र घरमा नै लैजान शापानका नाति, अहीकामका छोरा गदल्याहको हातमा जिम्मा दिए । यसरी यर्मिया मानिसहरूकै बिचमा बसे ।
౧౪చెరసాల ప్రాంగణంలో నుంచి యిర్మీయాను తెప్పించి, అతన్ని ఇంటికి తీసుకెళ్ళడానికి షాఫాను కొడుకైన అహీకాము కొడుకు గెదల్యాకు అతన్ని అప్పగించారు. అప్పుడు యిర్మీయా ప్రజల మధ్య నివాసం చేశాడు.
15 यर्मिया गारदको चोकमा गिरफ्तार भएकै बेलामा परमप्रभुको वचन यसो भनेर तिनीकहाँ आयो,
౧౫యిర్మీయా చెరసాల ప్రాంగణంలో ఉన్నప్పుడు యెహోవా వాక్కు అతనితో ఇలా చెప్పాడు,
16 “कूशी एबेद-मेलेकलाई भन्, 'सर्वशक्तिमान् परमप्रभु इस्राएलका परमेश्वर यसो भन्नुहुन्छः यस सहरको विरुद्धमा भलाई नभई विपत्ति ल्याएर मैले मेरा वचन पुरा गर्नै लागेको छु । त्यस दिन तेरै सामु यी सबै वचन पुरा हुनेछन् ।
౧౬“నువ్వు వెళ్లి కూషీయుడైన ఎబెద్మెలెకుతో ఇలా చెప్పు, ‘ఇశ్రాయేలు దేవుడూ, సేనల ప్రభువు అయిన యెహోవా ఇలా అంటున్నాడు, చూడు, మేలు చెయ్యడం కోసం కాకుండా కీడు చెయ్యడానికి నేను ఈ పట్టణం గురించి చెప్పిన మాటలు నెరవేరుస్తున్నాను. ఆ రోజున నీవు చూస్తూ ఉండగా ఆ మాటలు నెరవేరుతాయి.
17 तर त्यस दिन म तँलाईचाहिं छुटकारा दिनेछु, यो परमप्रभुको घोषणा हो, र तँ जसदेखि डराउँछस्, म तँलाई तिनीहरूको हातमा दिनेछैनँ ।
౧౭ఆ రోజున నేను నిన్ను విడిపిస్తాను. నువ్వు భయపడే మనుషుల చేతికి నిన్ను అప్పగించడం జరగదు’ అని యెహోవా అంటున్నాడు,
18 किनकि म निश्चय नै तँलाई छुटकारा दिनेछु । तँ तरवारले ढालिनेछैनस् । तैंले ममाथि भरोसा गरेको हुनाले तेरो जीवन जोगिनेछ, यो परमप्रभु घोषणा थियो' ।”
౧౮‘కచ్చితంగా నేను నిన్ను తప్పిస్తాను. నువ్వు ఖడ్గంతో చనిపోవు. నువ్వు నన్ను నమ్మావు గనుక, నీ ప్రాణమే నీకు కొల్లసొమ్ము అవుతుంది.’ ఇదే యెహోవా వాక్కు.”