< 1 Timotheo 2 >
1 kwayo kabla ga goti, munilobi Dunia na sukrani mwipange kwaajili ya bandu bote.
౧మనం సంపూర్ణ భక్తి, గౌరవాలతో, ప్రశాంతంగా, సుఖంగా బతకడానికై, మనుషులందరి కోసం,
2 kwasababu ya atawala bababile Kati ya utawala linga lupate Tama ga Amani tuliya na utakatifu wote na isima.
౨రాజుల కోసం, అధికారంలో ఉన్న వారందరి కోసం, విన్నపాలూ ప్రార్థనలు, ఇతరుల కోసం విన్నపాలు చేస్తూ కృతజ్ఞతలు చెల్లించాలని అన్నిటికంటే ముఖ్యంగా కోరుతున్నాను.
3 Ali-lina Nnongo na liyikitilwe nnogeya Nnongo na mkochopoli witu.
౩ఇది మన రక్షకుడైన దేవుని దృష్టిలో మంచిది, సమ్మతమైనది.
4 Sapendi babdu boti baokolewe bapate tanga kweli.
౪మానవులంతా రక్షణ పొంది సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు.
5 Kwasababu kwi na Nnongo yumo naywatupatani sayumo Kati ya Nnongo na bandu na ywembe na Kirisitu Yesu.
౫దేవుడొక్కడే, దేవునికీ మనిషికీ మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు అనే మానవుడు.
6 Aipiteye mwene kwalipya boti, kwa ushuhuda wakati woyikelilwe.
౬ఈయన అందరి కోసం విమోచన వెలగా తనను తానే సమర్పించుకున్నాడు. సరైన సమయంలో దేవుడు దీన్ని ధృవీకరించాడు.
7 Kwasababu yene na mwene napangilwe panga na mjumbe kwa Injili na mtume. Nilongela kweli ndongela lii ubusu. Nenga na mwalimu wa bandu ba mataifa katika Imani na kweli.
౭దీన్ని గూర్చి ప్రకటించేవానిగా అపొస్తలునిగా దేవుడు నన్ను నియమించాడు. నిజం చెబుతున్నాను. అబద్ధమాడడం లేదు. నేను యూదులు కాని వారికి విశ్వాస సత్యాలను బోధించేవాణ్ణి.
8 Kwayo, nipala alalome kila kundi balube na nyosa mabokongabe mataifa bila nyongo na yogeba.
౮అందుచేత అన్ని స్థలాల్లోనూ పురుషులు ఆగ్రహం, తర్కవితర్కాలు లేకుండా పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని కోరుతున్నాను.
9 Nyonyonyo nipala alwawa bawale ngubo yaiyeketilwa, kwa isima na kwiyeleya na kana babe na nywili yosuka, ao dhahabu ao Lulu ao ngobo yawe garama ngolo.
౯అలాగే స్త్రీలు కూడా నిరాడంబరమైన, సక్రమమైన వస్త్రాలు ధరించుకోవాలి గానీ జడలతో బంగారంతో ముత్యాలతో చాలా ఖరీదైన వస్త్రాలతో కాకుండా
10 Kae nipala bawale ngobo yestahili alwawa babayikilwe kumcha Nnongo kwapitya maisa mazuri.
౧౦భక్తిపరులమని చెప్పుకొనే స్త్రీలకు తగినట్టుగా మంచి పనులతో తమను తాము అలంకరించుకోవాలి.
11 Nnwawa aijingawe tuliya na kugatii goti.
౧౧స్త్రీలు మౌనంగా ఉండి, సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి.
12 Ninyeketya-lii nnywawafundisa au panga tawala kwa nchengowe ila atame kwa Hari ya tulia.
౧౨ఉపదేశించడానికీ, పురుషుని మీద అధికారం చేయడానికీ స్త్రీకి అనుమతినివ్వను. స్త్రీ మౌనంగా ఉండవలసిందే.
13 Sababu Adamu ngapi wa kwanza umbilwa alafu Eva.
౧౩ఎందుకంటే దేవుడు మొదట ఆదామును తరువాత హవ్వను గదా సృష్టించాడు?
14 Adamu akongwilwe kwaku, ila nnwawa gaywakongilwe sana muasi.
౧౪ఆదాము మోసపోలేదు, స్త్రీయే మోసపోయి అపరాధి అయింది.
15 Hatanyo aluwalopolwa kwopitya kwopapa bana mene balowayendelya mu imani na upendo na musapi na akili inanoga.
౧౫అయినా స్త్రీలు వివేకవతులై, విశ్వాసం, ప్రేమ, పరిశుద్ధతల్లో నిలకడగా ఉంటే ప్రసవం ద్వారా దేవుడు వారిని కాపాడతాడు.