< Isambulo 12 >
1 Kwasekubonakala isibonakaliso esikhulu ezulwini, owesifazana embethe ilanga, lenyanga ingaphansi kwenyawo zakhe, njalo kukhona ekhanda lakhe umqhele wenkanyezi ezilitshumi lambili;
౧అప్పుడు పరలోకంలో ఒక గొప్ప సంకేతం కనిపించింది. సూర్యుణ్ణి ధరించుకున్న ఒక స్త్రీ ఉంది. ఆమె కాళ్ళ కింద చంద్ర బింబం ఉంది. ఆమె తలపై పన్నెండు నక్షత్రాల కిరీటం ఉంది.
2 njalo ekhulelwe, wakhala ngobuhlungu bomhelo, futhi wayesebuhlungwini bokubeletha.
౨ఆమె నిండు చూలాలు. పురిటి నొప్పులకు తీవ్ర వేదన పడుతూ కేకలు వేస్తూ ఉంది.
3 Kwasekubonakala esinye isibonakaliso ezulwini, khangela-ke umgobho omkhulu obomvu, olamakhanda ayisikhombisa lempondo ezilitshumi, lemiqhele eyisikhombisa emakhanda awo.
౩ఇంతలో పరలోకంలో మరో సంకేతం కనిపించింది. అది రెక్కలున్న మహా సర్పం. వాడికి ఏడు తలలున్నాయి. పది కొమ్ములున్నాయి. వాడి ఏడు తలలపై ఏడు కిరీటాలున్నాయి.
4 Lomsila wawo wadonsa ingxenye yesithathu yenkanyezi zezulu, waziphosela emhlabeni; njalo umgobho wema phambi kowesifazana obesezabeletha, ukuze kuthi, esebelethile, umimilize umntwana wakhe.
౪వాడు తన తోకతో ఆకాశంలో ఉన్న నక్షత్రాల్లో మూడవ భాగాన్ని ఈడ్చి వాటిని భూమి మీదికి విసిరికొట్టాడు. ఆ మహాసర్పం కనడానికి నొప్పులు పడుతున్న స్త్రీకి ఎదురుగా నిలబడ్డాడు. ఆ స్త్రీ బిడ్డకు జన్మ నివ్వగానే ఆ బిడ్డను మింగివేయాలన్నది వాడి ఉద్దేశం.
5 Wasebeletha indodana, isilisa, ezabusa izizwe zonke ngentonga yensimbi; lomntanakhe wahluthulelwa kuNkulunkulu lesihlalweni sakhe sobukhosi.
౫ఆమె ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ శిశువు ఇనప దండం పట్టుకుని జాతులన్నిటిపై పరిపాలన చేయాల్సి ఉంది. ఆమె బిడ్డను ఆమె దగ్గరనుంచి లాక్కుని దేవుని దగ్గరకూ, ఆయన సింహాసనం దగ్గరకూ తీసుకు వెళ్ళారు.
6 Lowesifazana wabalekela enkangala, lapho ayelendawo eyayilungiswe nguNkulunkulu, ukuze bamondle khona insuku eziyinkulungwane lamakhulu amabili lamatshumi ayisithupha.
౬ఆ స్త్రీ అరణ్యంలోకి పారిపోయింది. అక్కడ ఆమెను 1, 260 రోజులు ఉంచి పోషించడానికి దేవుడు ఒక స్థలాన్ని సిద్ధం చేసి ఉంచాడు.
7 Kwasekusiba lempi ezulwini; uMikayeli lengilosi zakhe balwa bemelene lomgobho; lomgobho walwa ulengilosi zawo,
౭అప్పుడు పరలోకంలో యుద్ధం జరిగింది. మిఖాయేలూ అతని దూతలూ ఆ మహాసర్పంతో యుద్ధం చేశారు. ఆ మహా సర్పం తన దూతలతో కలసి పోరాటం చేశాడు.
8 njalo babengelakunqoba, lendawo yawo kayabe isatholakala ezulwini.
౮కానీ గెలవడానికి వాడి బలం చాలలేదు. కాబట్టి పరలోకంలో ఆ మహా సర్పానికీ వాడి అనుచర దూతలకూ స్థానం లేకపోయింది.
9 Umgobho omkhulu wasuphoswa, inyoka endala, ebizwa ngokuthi nguDiyabhola njalo uSathane, okhohlisa umhlaba wonke; waphoselwa emhlabeni, lengilosi zakhe zaphoswa kanye laye.
౯ఈ మహా సర్పానికి అపవాది అనీ, సాతాను అనీ పేర్లున్నాయి. వాడు లోకాన్నంతా మోసం చేసే ప్రాచీన సర్పం. వాణ్ణీ వాడితో పాటు వాడి అనుచర దూతలనూ భూమి మీదికి తోసి వేశారు.
10 Ngasengisizwa ilizwi elikhulu ezulwini, lisithi: Khathesi sekufike usindiso lamandla lombuso kaNkulunkulu wethu, lamandla kaKristu wakhe; ngoba uphoselwe phansi ummangaleli wabazalwane bethu, obamangalelayo emini lebusuku phambi kukaNkulunkulu.
౧౦అప్పుడు నేను పరలోకం నుండి బిగ్గరగా వినబడిన స్వరం విన్నాను. “మన సోదరులను నిందించే వాడూ, పగలనీ రాత్రనీ లేకుండా దేవుని ఎదుట మన సోదరులపై నేరం మోపే వాడైన అపవాదిని భూమి మీదికి తోసేశారు. కాబట్టి ఇక మన దేవుని రక్షణా శక్తీ రాజ్యమూ వచ్చేశాయి. ఆయన అభిషిక్తుడైన క్రీస్తు అధికారమూ వచ్చింది.
11 Njalo bona bamnqobile ngegazi leWundlu langelizwi lobufakazi babo, njalo kabathandanga impilo yabo kwaze kwaba sekufeni.
౧౧వారు గొర్రెపిల్ల రక్తం తోనూ, తమ సాక్షాలతోనూ వాణ్ణి జయించారు. మరణం వచ్చినా సరే, తమ ప్రాణాలను ప్రేమించలేదు.
12 Ngalokho thokozani, mazulu lani elihlala kuwo. Maye kulabo abakhileyo emhlabeni lolwandle, ngoba udiyabhola wehlele kini elolaka olukhulu, esazi ukuthi ulesikhathi esifitshane.
౧౨కాబట్టి పరలోకమూ, పరలోకంలో నివసించే వారూ, సంబరాలు చేసుకోండి. భూమీ, సముద్రం, మీకు యాతన. ఎందుకంటే అపవాది మీ దగ్గరికి దిగి వచ్చాడు. వాడు భీకరమైన కోపంతో ఉన్నాడు. ఎందుకంటే తన సమయం కొంచెమే అని వాడు తెలుసుకున్నాడు.
13 Kwathi umgobho usubonile ukuthi uphoselwe emhlabeni, wazingela owesifazana owayezele umntwana wesilisa.
౧౩తనను భూమి పైకి తోసివేయడాన్ని చూసి ఆ రెక్కల సర్పం, మగబిడ్డను ప్రసవించిన ఆ స్త్రీని వెంటాడాడు.
14 Kwasekunikwa owesifazana impiko ezimbili zokhozi olukhulu, ukuze aphaphele enkangala endaweni yakhe, lapho ondliwa khona okwesikhathi, lezikhathi lengxenye yesikhathi, asuke ebusweni benyoka.
౧౪కానీ అరణ్యంలో తనకు సిద్ధం చేసిన చోటుకు వెళ్ళడానికి ఆమె డేగ రెక్కల్లాంటి రెండు రెక్కలు పొందింది. అక్కడ సర్పానికి అందుబాటులో లేకుండా ఒక కాలం, కాలాలు, ఒక అర్థకాలం ఆమెకు పోషణ ఏర్పాటయింది.
15 Lenyoka yakhafula amanzi emlonyeni wayo ngemva kowesifazana kungathi ngumfula, ukuze immukise ngalumfula.
౧౫కాబట్టి ఆ స్త్రీ నీళ్ళలో కొట్టుకుపోవాలని ఆ సర్పం తన నోటి నుండి నీటిని నదీ ప్రవాహంగా వెళ్ళగక్కాడు.
16 Lomhlaba wamsiza owesifazana, umhlaba wasukhamisa umlomo wawo, waginya umfula umgobho owawuwukhafule emlonyeni wawo.
౧౬కానీ భూమి ఆ స్త్రీకి సహాయం చేసింది. అది నోరు తెరచి ఆ మహాసర్పం నోటి నుండి వచ్చిన నదీ ప్రవాహాన్ని మింగివేసింది.
17 Umgobho wasumthukuthelela owesifazana, wasusuka wayakulwa impi labaseleyo benzalo yakhe, labo abagcina imilayo kaNkulunkulu abalobufakazi bukaJesu Kristu.
౧౭అందుచేత తీవ్రమైన ఆగ్రహం తెచ్చుకున్న ఆ మహా సర్పం, దేవుని ఆదేశాలు పాటిస్తూ యేసును గురించి ప్రకటిస్తూ ఉన్న ఆమె సంతానంలో మిగిలిన వారితో యుద్ధం చేయడానికి బయల్దేరాడు.